నరుడు పరదైసులో జీవితమును ఆనందించవలెనని దేవుడు సంకల్పిస్తున్నాడు.
“మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకును, దాని కాచుటకును దానిలో ఉంచెను.—ఆదికాండము 2:15.
1. విధేయతగల మానవులయెడల సృష్టికర్తయొక్క మొదటి సంకల్పము ఏమైయుండెను?
విధేయతగల మానవులు ఎప్పుడు వృద్ధాప్యమునకెదగని జీవితమును కలిగి, ఉప్పొంగు యవ్వనశక్తిని ఎల్లప్పుడు కలిగి, చికాకు లేకుండ ఎల్లప్పుడు యోగ్యమైన సంకల్పము కలిగి, నిస్వార్థంగా ప్రేమిస్తూ మరియు ప్రేమించబడుతూ, పరిపూర్ణంగా—ఒక పరదైసులో జీవించవలెనని సృష్టికర్త మొదట సంకల్పించెను, ఇప్పుడును అదే సంకల్పమును ఆయన కలిగియున్నాడు!—ఆదికాండము 2:8; లూకా 23:42, 43 పోల్చుము.
2. (ఎ) మొదటి మానవుడు జీవితమును పొందినప్పుడు ఏమి జరిగియుండవచ్చును? (బి) ఆ మొదటి మనుష్యుడు ఎప్పుడు సృష్టించబడెను, ఎక్కడ మరియు ఏ సమయములో?
2 దానిని గుర్తించుటకు క్రొత్తగా సృష్టించబడిన ఆదాము వైపు నీదృష్టిని వెనుదిప్పుము ఎప్పుడైతే ఆదాము జీవమును పొంది, తన శరీరమును మరియు తానుచూచిన వాటిని, విన్నవాటిని మరియు స్పర్శించినవాటిని పరీక్షించాడో, ఎప్పుడైతే అతడు విస్మయముతో తాను జీవిస్తున్నాడని గ్రహించాడో చూడుము. అది 6000 సంవత్సరముల ముందు జరిగెను. సా.శ.పూ. 4026వ సంవత్సరమున, పరిశుద్ధ బైబిలుయొక్క సమయ పట్టిక ప్రకారముగా టర్కీ అని ఈనాడు పిలువబడు భూప్రాంతములో లేక ఆసియా అని పిలువబడుచున్న ప్రాంతముయొక్క నైరృతి భాగములో యూప్రటీసు టైగ్రీసు నదులు ప్రవహించు ప్రాంతములో లేక మన భూమండలముయొక్క ఉత్తర భాగములో ఇది జరిగెను. సమయము అక్టోబరు 1, అయివుండును, ఎందుకనగా మానవజాతియొక్క అతిపురాతనమైన క్యాలెండర్లు సమయమును ఆ తేదినుండి గుణించడం మొదలుపెట్టాయి.
3. (ఎ) ఏ స్థితిలో మొదటి నరుడు జీవితుడాయెను? (బి) ఆ మొదటి నరుని పేరేమైయుండెను, మరియు అది దేనిని సూచించెను?
3 మొదటి నరుడు పూర్తిగాయెదిగి పరిపూర్ణంగా తయారయి పరిపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ నైతికతతో సజీవుడయ్యాడు. బైబిలునందు పలుమార్లు వాడబడిన అతని పేరు ఏ పదార్ధమునుండి అతడు నిర్మించబడ్డాడో మనదృష్టికి తెస్తుంది. అతని పేరు ఆదాముయైయుండెను. (A.dham)a అతని నిర్మించుటకు వాడబడిన భూమి లేక నేలమంటి ‘ఆదామా’ (a·dha·mah) అని పిలువబడెను. కావున ఆతని పేరుయొక్క భావము “మంటివాడైన మానవుడు” అని చెప్పవచ్చును. ఇది—ఆదాము—మొదటి మానవుని వ్యక్తిగత నామమయ్యెను. మేధస్సు గలవ్యక్తిగా జీవముపొందిన ఆదామునకు అది ఎంతగొప్ప అనుభూతియైయుండెను!
4. మొదటి మానవుడు జీవమును పొందినప్పుడు అతడు ఎటువంటి వింత అనుభవము పొందలేదు, కావున అతడు ఎవరి కుమారుడు కానేరడు?
4 ఈ మొదటి నరుడైన ఆదాము జీవమును పొంది, తెలివిగల వివేచనతో మేలుకొనినప్పుడు, రోమములతో నిండియున్న నరవానరమువంటి ప్రాణియొక్క బలమైన చేతులయందుండి దానికన్నులలోనికి అనురాగముతో చూస్తు “అమ్మా” అని పిలిచియుండలేదు. ఆ మొదటి అటువంటి వింతైనఅనుభవముతో జీవమునకు మేల్కొల్పబడలేదు. అతడు తరువాత నరవానరమును చూచినప్పుడుకూడా దానితో శారీరక సంబంధమును భావింపలేదు. అతడు సృష్టింపబడిన దినమున నరవానరమువంటి ప్రాణియొక్క వంశీయుడనుటకు లేక దానియొక్క దూరపుబంధువనుటకు గాని ఏ ఆధారము లేదు. అయితే మొదటి మానవుడైన ఆదాము తాను ఎలాగు జీవితుడాయెనను విషయము అంతుబట్టని మర్మముగా నిలిచియుండెనా? లేదు.
5. తనను గూర్చి మరియు తన ఉద్యానవనమువంటి తోటను గూర్చి ఆదాముకు ఖచ్ఛితముగా ఏమి తెలిసియుండెను?
5 అర్థసహితముగా, తానుచూచు అందమైనవన్నియు అస్తిత్వమునకు ఎలా వచ్చెనని అతడు దిగ్భ్రాంతిచెంది యుండవచ్చును. తాను నిర్మించని, తయారుచేయని మరియు అమర్చని ఒక పరదైసులో, ఒక తోటవంటి ఉద్యానవనములో తన్నుతాను కనుగొనెను. అది ఏవిధముగా సంభవించెను? ఒక పరిపూర్ణమైన, తెలివిగల, తర్కించగల మనుష్యునిగా అతడు తెలిసికొనగోరును. అటుపూర్వము అతనికి ఏ అనుభవము లేకుండెను. తాను స్వయంగా తయారయి స్వయంగా నిర్మింపబడినవాడు కాదని అతడు ఎరిగియుండెను. తానున్న స్థితికి తనస్వంత కృషివలన అతడు రాలేదు.
6. ఆ పరిపూర్ణ భూలోక గృహములో సజీవుడై యుండుటనుబట్టి ఆదాము ఎట్లు ప్రతిస్పందించును?
6 మొదటి నరుడైన ఆదాము, తాను పరిపూర్ణమైన భూలోక గృహమందు సజీవుడైన ఆ ఉల్లసకరమైన మొదటి అనుభవముతో అతి ఉత్తేజితుడై తాను ఎక్కడనుండి వచ్చాడు, ఎలా వచ్చాడు అని ఆలోచించు స్థితిలోలేకుండెను. సంతోషముతో కేకలు వేయలేకుండా ఉండలేకపోయాడు. తననోటినుండి మాటలు వస్తున్నట్టు కనుగొన్నాడు. తాను మనుష్యభాషలో మాట్లాడుతు, తానుచూచిన, విన్న, అందమైన వాటిపై వ్యాఖ్యానించడం తనకుతానుగా విన్నాడు. ఆ పరదైసు తోటలో సజీవుడైయుండుట ఎంతమంచిదైయుండెను! అయితే దృశ్యములు, శబ్దములు, వాసనలు మరియు స్పర్శద్వారా వచ్చే వర్తమానముతో తన్నుతాను ఆనందముతో నింపుకొనుచుండగా, అతడు ఆలోచించుటకు పురికొల్పబడెను. అతని పరిస్థితిలో మనమున్నట్లయిన అంతా ఒకమర్మమువలె ఉండేది. మనము పరిష్కరించలేని మర్మమైయుండేది.
నరుని అస్తిత్వములో మర్మములేదు
7. తాను పరదైసు తోటలో సజీవుడై యుండుటను గూర్చి ఆదాము చాలా సమయము ఎందుకు దిగ్భ్రాంతిచెంది యుండలేదు?
7 మొదటి నరుడైన ఆదాము తాను ఒంటరిగా జీవితుడై ఆ పరదైసు తోటలో తనవంటి వారు ఎవరులేని ఆ స్థితిని గూర్చి ఎక్కువ సమయము దిగ్భ్రాంతి కలిగియుండవలసిన అవసరము లేకుండెను. అతడు మాట్లాడుతున్న ఒక స్వరమును వినెను. అయితే మాట్లాడువాడెక్కడ ఉన్నాడు? ఆ నరుడు ఎవరు మాట్లాడుటను చూడలేదు. ఆ స్వరము అదృశ్యమైన, కనిపించని జగత్తునుండి వచ్చెను, మరియు అది అతనిని ఉద్దేశించి మాట్లాడెను. ఆ స్వరము మానవుని నిర్మాణకుడు, అతని సృష్టికర్తదైయుండెను మరియు ఆ నరుడు అదే భాషలో ప్రత్త్యుత్తరమివ్వగల్గెను. తాను దేవునితో సృష్టికర్తతో సంభాషిస్తున్నట్టు అతడు కనుగొన్నాడు. ఆ దైవస్వరమును వినుటకు అతనికి ఏ ఆధునిక వైజ్ఞానిక రేడియో స్వీకరణ పరికరముయొక్క అవసరము లేకుండెను. తాను సృష్టించినవానితో దేవుడు నేరుగా సంభాషించెను.
8, 9. (ఎ) ఆదాముయొక్క ఏ ప్రశ్నలకు జవాబు దొరికెను, మరియు తండ్రియొక్క ప్రేమాసక్తులు అతనికేలాగు చూపించబడెను? (బి) తన పరలోక తండ్రినుండి ఆదాము ఏ జవాబును పొందెను?
8 ఇప్పుడు నరుడు తాను ఒంటరిగాలేడని తెలుసుకొన్నాడు. అది తెలిసి అతడు సంతోషపడియుండవచ్చును. అతని మనస్సు ప్రశ్నలతో నిండియుండెను. తనతో మాట్లాడుచున్న ఆ అదృశ్యునితో వాటిని అడుగవచ్చును. తనను మరియు ఆ సంతోషమునిచ్చు తోటను ఎవరు చేశారు? అతడు ఎందుకు అక్కడ ఉంచబడ్డాడు, మరియు తన జీవితముతో ఏమి చేయవలెను? జీవించుటలో సంకల్పము గలదా? తండ్రియొక్క ప్రేమ ఈ మొదటి నరునికిచూపించబడెను. ఎందుకనగా అతని ప్రశ్నించు మనస్సును సంతృప్తిపరిచే విధముగా ప్రత్త్యుత్తరములివ్వబడెను. ఆ మానవుడు మాట్లాడుట మొదలుపెట్టి తన మొదటిపదము పలికినప్పుడు అతని నిర్మాణకుడు, జీవనదాత మరియు పరలోకపు తండ్రికి ఎంతో సంతోషమును కలిగించియుండవచ్చును! తనకుమారుడు తనతో మాట్లాడినప్పుడు ఆ పరలోకపుతండ్రికి ఎంత ఆనందము! అతడడిగిన మొదటి ప్రశ్న సహజముగా, “నేను ఎలా వచ్చాను?” అయివుండును. ఆ ప్రశ్నకు ఉత్తరమిచ్చుటకు పరలోకపు తండ్రి సంతోషించియుండును, తద్వారా ఆ మొదటి నరుడు తన కుమారుడని అంగీకరించెను. అతడు “దేవునికుమారుడై”యుండెను. (లూకా 3:38) ఈ మొదటి నరుడైన ఆదాముయొక్క తండ్రి అని యెహోవా తన్నుతాను బయలుపరచెను. ఆ పరలోకపు తండ్రికి వేసిన ప్రశ్నకు ఆదాము స్వీకరించి, తన సంతానమునకు అందజేసిన ఉత్తరమేమనగా:
9 “దేవుడైన యెహోవా నేలమంటితో నరునినిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిననరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతివృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒకనది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.”—ఆదికాండము 2:7-10.b
10, 11. (ఎ) ఏ యథార్థములను ఆదాము తెలిసికొనెను, కాని ఏ ప్రశ్నలకు జవాబు కావలసివచ్చెను? (బి) ఆదాముయొక్క పరలోకపు తండ్రి ఏ జవాబులను ఇచ్చెను?
10 ఆదాముయొక్క ఉజ్వలమైన తేటమనస్సు ఆ సంతృప్తికరమైన వర్తమానమును ఆతురతతో స్వీకరించెను. తనను నిర్మించి తయారుచేసి తనతో మాట్లాడుతున్నవానియొక్క అదృశ్యజగత్తునుండి తానురాలేదని అతడు తెలిసికొనెను. వాస్తవముగా అతడు జీవించుచున్న భూమినుండి నిర్మించబడ్డాడు. కావున అతడు భూసంబంధుడు. అతని జీవదాత మరియు తండ్రి యెహోవా దేవుడైయుండెను. ఆదాము “జీవాత్మ” యైయుండెను. యెహోవా దేవునినుండి జీవమును పొంది, “దేవుని కుమారుడై”యుండెను. ఏదెను తోటలో అతనిచుట్టువున్న చెట్లు ఇచ్చు ఫలములు ఆహారమునకు మంచివికాగా, వాటినితిని అతడు జీవాత్మగా బ్రతికియుండగలడు. అయితే అతడెందుకు బ్రతికియుండవలెను, మరియు ఆయనెందుకు ఈ తోటయగు ఏదెనులో, భూమిమీదయుంచబడెను? అతడు పరిపూర్ణంగా నిర్మించబడిన తెలివిగల మానవుడై శరీరక సామర్థ్యము గలవాడైయుండెను గనుక తెలిసికొన అర్హత కలిగియుండెను. లేనట్లయిన ఎట్లు అతడు తన జీవన సంకల్పమును పూర్తిచేసి తన నిర్మాణకుడు మరియు తండ్రియొక్క దైవీక చిత్తమును నెరవేర్చి ఆయనను సంతోషపరచగలడు? ఈ ప్రశ్నలకు సమాధానములు క్రింద చూపబడిన వర్తమానము ద్వారా ఇవ్వబడెను:
11 “మరియు దేవుడైన యెహోవా నరునితీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలోయుంచెను. మరియు దేవుడైన యెహోవా ‘ఈ తోటలోనున్న ప్రతివృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డలతెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవ’ని నరుని కాజ్ఞాపించెను.”—ఆదికాండము 2:15-17.
12. దేనికొరకు ఆదాము తన సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు అతడు దేవుని ఏవిధంగా మహిమపరచగలడు?
12 ఆ సుందరమైన ఏదెను తోటలో ప్రయోజనకరంగా నిమగ్నుడైయుండుటకిచ్చిన పనికొరకు తన సృష్టికర్తకు ఆదాము కృతజ్ఞత తెలిపియుండవచ్చు. ఇప్పుడతడు తన సృష్టికర్తయొక్క చిత్తము తెలిసికొనెను మరియు ఆయనకొరకు భూమిపై ఏదోకొంత చేయగలిగియుండెను. ఆ ఏదెను తోటను సేద్యపరచి దానిని కాచు బాధ్యత అతనిపై ఉంచబడెను. అయితే అది చేయుట ఆనందకరమైన పనియైయుండెను. అదిచేయుటవలన ఆ తోటను చేసిన యెహోవా దేవునికి మహిమ మరియు స్తుతి తెచ్చేవిధంగా ఉంచగలడు. పనిచేస్తు ఆకలిగొన్నప్పుడు ఆ తోటలోని చెట్లనుండి సంతృప్తికరంగా అతడు తినవచ్చును. ఈవిధంగా నూతనమైన బలమును పొంది తన సంతోషకరమైన జీవితమును నిరంతరముగా కాపాడుకొనగలడు—అంతములేకుండా.—ప్రసంగి 3:10-13తో పోల్చుము.
నిత్యము జీవించు ఉత్తరాపేక్ష
13. ఏ ఉత్తరాపేక్షను ఆ మొదటి మానవుడు కలిగియుండెను, మరియు ఎందుకు అలా అనవచ్చును?
13 అంతము లేకుండా? ఆ పరిపూర్ణ మానవునికి ఇది ఎంత నమ్మశక్యముకాని ఆలోచన అయివుండవచ్చు! అయితే అలా ఎందుకు కాకూడదు? అతని సృష్టికర్తకు అద్భుతంగా నిర్మించిన ఆ ఏదెను తోటను నాశనముచేయవలెనను ఆలోచన లేక ఉద్దేశ్యము లేకుండెను. తన కళాత్మక సృష్టిసామర్థ్యమును ప్రకటించు తన స్వంత పనిని ఆయన ఎందుకు నాశనముచేయును, ముఖ్యముగా అది మంచిగాయున్నప్పుడు? తార్కికంగా ఆయన అలా చేయుదునని సంకల్పించడు. (యెషయా 45:18) దేనితో పోల్చలేని ఈ తోట సేద్యపరచబడవలెను గనుక ఆదామువంటి పరిపూర్ణుడు దానిని సేద్యపరచుటకును, కాచుటకును అవసరమగును. ఆ కాపరియైన మానవుడు నిషేధింపబడిన ఆ మంచిచెడ్డల తెలివినిచ్చు చెట్టుయొక్క ఫలములను తినకుండిన అతడు ఎప్పుడును చావడు. ఆ పరిపూర్ణ మానవుడు నిరంతరము జీవించగలడు!
14. ఏ విధంగా ఆదాము పరదైసులో నిత్యజీవమును పొందగలడు?
14 ఆ పరదైసు తోటలో నిత్యజీవము ఆదాము ముందు ఉంచబడెను! అతడు తన సృష్టికర్తకు పరిపూర్ణ విధేయతను చూపించి ఆ సృష్టికర్త నిషేధించిన ఫలమును తినకుండావున్నట్లయితే అతడు దానిని నిత్యము ఆనందించగలడు. ఆ పరిపూర్ణ మానవుడు విధేయుడైయుండి నిత్యము జీవించవలెనని ఆయన కోరికయైయుండెను. ఆ “మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు” ఫలమును నిషేధించడము ఏ విధంగాకూడా మరణపాత్రమైనది కాకుండెను. అది కేవలము తన తండ్రియెడల నరుని పరిపూర్ణ విధేయతయొక్క పరీక్షయైయుండెను. అది నరునికి తన సృష్టికర్తయెడల ప్రేమను ప్రదర్శించు అవకాశమునిచ్చెను.
15. తన సృష్టికర్తనుండి మంచిని అనుభవిస్తూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఆదాము ఎందుకు ఎదురుచూడగలడు?
15 తాను ఒక అనుకొనని ఆకస్మికమైన సంఘటన వలన కలిగినవాడు కాదు, కాని తనకొక పరలోకపు తండ్రి ఉన్నాడన్న హృదయసంతృప్తితో, విశదపరచబడిన మనస్సుతో తన జీవన సంకల్పమును, ఆ పరదైసులో నిత్యజీవమును దృష్టిలోవుంచుకొని ఆ పరిపూర్ణ మానవుడు ఒక ఉజ్వల భవిష్యత్తును ఎదురుచూచెను. “మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టు”ను విడిచి ఆహారమునకు మంచివైన ఇతరచెట్లనుండి అతడు తినెను. తన సృష్టికర్త మంచిని ఎరుగకోరెను. నశింపజేయునటువంటి పనిగాక, ఆ ఏదెను తోటను సేద్యపరచు పని మంచిదైయుండెను, మరియు ఆ పరిపూర్ణ మానవుడు ఆలాగే పనిచేసెను.
విషయములను వివరించు అవసరత లేకుండెను
16-18. ఏ మర్మములను ఆదాము పరిష్కరించవలెనని తలంచలేదు మరియు ఎందుకు?
16 అతడు ఆకాశమందు చూసిన జ్యోతి కదులుతూ అస్తమించినప్పుడు పగటి వెలుగు క్రమముగా తగ్గెను. చీకటి పడినప్పుడు రాత్రి మరియు చంద్రుణ్ణి అతడు గమనించాడు. అది అతనిని భయముతో నింపలేదు. అది రాత్రిని ఏలు చిన్నజ్యోతియైయుండెను. (ఆదికాండము 1:14-18) మిణుకు మిణుకుమను దీపములవలే తమ చల్లని వెలుగును వెదజల్లుతు మిణుగురు పురుగులు ఆ తోటలో ఎగురుతూ కనిపించియుండవచ్చును.
17 రాత్రిపడి చీకటి కమ్మినప్పుడు అతని చుట్టువున్న జంతువులవలెనే నిద్రించు అవసరతను అతడు చూసెను. మేల్కొనిన తర్వాత ఆకలిగొనినవాడై అనుమతించబడిన చెట్లఫలములను ఉదయకాల భోజనముగా తినెను.
18 రాత్రి విశ్రాంతిలో పునర్వికాసముపొంది, నూతన పరచబడిన శక్తితో తన దృష్టిని ఆ దినపు పనిపై కేంద్రీకరించెను. తనచుట్టువున్న పచ్చదనాన్ని చూచి వేలసంవత్సరముల తర్వాత ఉన్న మనుష్యులు కిరణజన్య సంయోగక్రియ అని పిలిచిన మర్మమును పరీక్షించవలెనని అతడు భావింపలేదు. అర్థముకాని విధంగా చెట్లలోని ఆకుపచ్చని రంగుగల పదార్థము (క్లిరోఫిల్) సూర్యకిరణముల శక్తిని వాడి మనుష్యులు మరియు జంతువులు తినుటకు ఆహారపదార్థములను తయారుచేసి అదే సమయములో మనుష్యులు జంతువులు నిశ్వాసద్వారా వదిలిన బొగ్గుపులుసు (కార్బన్డయాక్సైడ్) వాయువును తీసుకొని వారు పీల్చుకొను ప్రాణవాయువును (ఆక్సిజన్) ఇచ్చును. మనుష్యులు దానిని మర్మము అనవచ్చును కాని ఆదామునకు దానిని ప్రశ్నించు అవసరత లేకుండెను. అది మానవుని సృష్టికర్తయొక్క అద్భుతకార్యము. ఆయన దానిని గ్రహించి భూమిమీది సృష్టినిమిత్తమై వాడెను, కావున ఆ మొదటి నరునికి పరిపూర్ణ మేధస్సునకు దేవుడు సృష్టికర్తగా పెరిగే వాటిని చేశాడని తనకు దేవుడు ఇచ్చిన పని ఆ పెరిగేమొక్కలను, ఆ తోటను కాచుట అని అతడు గ్రహించెను.—ఆదికాండము 1:12 చూడుము.
ఒంటరిగాయుండెను—అయితే ఆనందమునకు కొదువలేదు
19. అతనివంటివారు ఈ భూమిపైలేరని తాను ఒంటరిగావున్నానని తెలిసి ఆదాము ఏమి చేయలేదు?
19 తన పరలోకపు తండ్రిచేతిలో నరుని శిక్షణ ఇంకా పూర్తికాలేదు. తనవంటివారు తనతో కలియుటకు లేక సహాయముచేయుటకు ఆ భూమిపై ఎవరులేకున్నను ఆదాము ఆ ఏదెను తోటను కాచెను. అతడు ఒంటరిగాయుండెను. తనజాతివారు మానవజాతికి చెందినవారెవరు లేకుండిరి. తనతో భూమిపై సహవాసము చేయుటకు తనవంటి వారికొరకు అతడు వెదుకుచూ వెళ్ళలేదు. అతడు దేవుని తన పరలోకపు తండ్రిని ఒక సహోదరుని లేక సహోదరిని ఇమ్మని అడుగలేదు. అతని ఒంటరితనము అతణ్ణి పిచ్చివాణ్ణిచేసి అతని జీవితము మరియు పనిలోని ఆనందమును తీసివేయలేదు. అతడు దేవుని సహవాసమును కలిగియుండెను.—కీర్తన 27:4 పోల్చుము.
20. (ఎ) ఆదామునకు అత్యంత సంతోషము, ఆనందమునిచ్చునదేమి? (బి) ఆ జీవనవిధానము ఆదామునకు అతి కష్టతరమైనది ఎందుకు కాదు? (సి) తదుపరి శీర్షిక దేనిని చర్చించును?
20 తన పరలోక తండ్రి తనను తనపనిని పరిశీలించుచున్నాడని ఆదాముకు తెలిసియుండెను. తనచుట్టువున్న సుందరమైన సృష్టినిచేసి తన మహాత్యమును బయలుపరచిన తన దేవుడు మరియు సృష్టికర్తను సంతోషపరచుటలోనే అతనికి అత్యంత ఆనందము. (ప్రకటన 15:3 పోల్చుము) దేవునితో మాట్లాడగలుగు ఆ పరిపూర్ణ సమతూకముగల నరునికి ఆవిధమైన జీవితము కఠినమైన, కష్టమైన లేక ఆసక్తిలేని పనివలే లేకుండెను. అతనికి సంతృప్తి మరియు ఆనందమునిచ్చు ఆసక్తికరమైన, ఉల్లసకరమైన పనిని దేవుడు ఆదామునకిచ్చెను. ఆదాము తన సృష్టికర్తనుండి ఆ పరదైసులో పొందిన ఆశీర్వాదములు మరియు ఉత్తరాపేక్షలు తదుపరి శీర్షికలో చర్చించబడును. (w89 8/1)
[అధస్సూచీలు]
a పరిశుద్ధ బైబిలులోని సృష్టిని వర్ణించుటలో మూలభాషలో ఈ పదము వాడారు.—ఆదికాండము 1:26, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిల్, పాదవచనము.
b మోషే ప్రవక్త మన సా.శ.పూ. 16వ శతాబ్దములో ఆదికాండము పుస్తకములోని వర్తమానమును వ్రాయునప్పుడు ఏదెనులో ప్రవహించు ఈ నదినిగూర్చి తన సమయమందు కలిగిన జ్ఞానమును వాడి ఈ క్రిందచూపిన వర్తమానమును అందులో కలిపాడు:
“మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటిని చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటిని చుట్టు పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూప్రటీసు.”—ఆదికాండము 2:11-14.
మీ జవాబులు ఏమైయున్నవి?
◻ తాను ఉనికిలోయుండుటను గూర్చి ఆదాము చాలా సమయము ఎందుకు దిగ్భ్రాంతిచెందలేదు?
◻ దేవుడు ఆదాముకు ఎలాంటి పనిని ఇచ్చెను, దానికి అతనెట్లు ప్రత్యుత్తరమిచ్చియుండవచ్చును?
◻ పరిపూర్ణ మానవుడు ఎలాంటి ఉత్తరాపేక్షను అనుభవించెను, మరియు ఎందుకు?
◻ మర్మములను పరిష్కరించుటను తనగమ్యముగా ఆదాము ఎందుకు చేసుకొనలేదు?
◻ మానవునిగా ఆదాము కలిగియున్న ఒంటరితనము జీవించుటలోని అతని ఆనందమును ఎందుకు తీసివేయలేదు?
[14వ పేజీలోని చిత్రసౌజన్యం]
NASA photo