కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 3/1 పేజీలు 12-13
  • భయంకర పెనుతుఫానును నిమ్మళింపజేసెను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భయంకర పెనుతుఫానును నిమ్మళింపజేసెను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • భయంకర పెనుతుపానును నిమ్మళింపజేయుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసు తుఫానును నిమ్మళింపజేశాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసుకు మనల్ని కాపాడే శక్తి ఉంది
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • యేసు నీళ్ల మీద నడుస్తాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 3/1 పేజీలు 12-13

యేసు జీవితము పరిచర్య

భయంకర పెనుతుఫానును నిమ్మళింపజేసెను

యేసు సముద్రతీరమున జనసమూహములకు బోధించుట, అటుపిమ్మట ఆ ఉపమానములను తన శిష్యులకు వివరించుటతో తన దినకార్యక్రమము పూర్తిగా నిండియుండెను. సాయంత్రమయ్యే సరికి “మనము అద్దరికి వెళ్లుదమురండి” అని అంటూ ఉండేవారు.

గలిలయ సముద్రమునకు తూర్పుతీరమున దెకపొలి అనేప్రదేశమున్నది. గ్రీకు భాషలో డె’క (దెక) అంటే “పది” మరియు పొ’లిస్‌ (పొలి) అంటే “పట్టణము” అని అర్ధము. దెకపొలి నందలి పట్టణములు గ్రీకు నాగరికతకు కేంద్రస్థానములు. అయినను అనేక యూదులగృహములచ్చట ఉన్నవనుటకు సందేహములేదు. అయితే ఈ ప్రాంతములో యేసుచేసిన కార్యములు చాలాతక్కువ. మనమిప్పుడు చూచునట్లు ఈ సందర్శనములో కూడ అచ్చట ఎక్కువకాలము ఉండకుండా నిరోధించబడెను.

ఆవలి ఒడ్డునకు వెళ్లుదమని యేసు కోరినప్పుడు ఒక పడవమీద ఆయనను తీసుకొని వెళ్తున్నారు. వారు వెళ్లడం గమనించ బడకుండా లేదు. వెంటనే కొందరు తమ పడవలలో ఆయనను వెంబడించారు. అది అంత పెద్దదూరమేమి కాదు. అసలు గలిలయసముద్రము 13మైళ్ల (21 కి.మీ) పొడవు, 7 1/2మైళ్ల (12 కి.మీ) వెడల్పుగల ఒక పెద్దసరస్సు వంటిది.

యేసు చాలా అలసిపోయి ఉండెను. కనుక పడవ దరిని విడువగానే దాని వెనుక భాగమున తలగడపై తనతలను వాల్చి ఆయన గాఢంగా నిద్రపోయెను. అపొస్తలులలో చాలా మంది గలిలయ సముద్రముపై విస్తారంగా చేపలు పట్టిన అనుభవజ్ఞులైన నావికులు. కనుక పడవ నడిపే బాధ్యతను వారు చేపట్టరు.

అయితే ఈ సారి ప్రయాణం అంత సులభంగా లేదు. సముద్రమాట్టనికి 700 అడుగుల (210 మీటర్ల) దిగువన ఉన్న ఆ సరస్సు ఉపరితలంపై వేడిమిగల ఉష్ణోగ్రత ఉండుటవలన, సమీపకొండలలో ఉన్న చల్లనిగాలివలన అప్పుడప్పుడు బలమైన వీదురు గాలులు వీచుచు దానిపై భయంకరమైన పెనుతుఫానును ఆకస్మికంగా సృష్టించుచుండును. ఇప్పుడు జరిగింది అదే. వెంటనే అలలు పడవను తాకుచు దానిలోనికి చిమ్ముతూ పడవ మునిగి పోవుటకు సిద్ధంగా ఉన్నది. అయితే యేసు యింకా నిద్రపోవుచునే ఉండెను!

అనుభవజ్ఞులైన ఈ నావికులు పడవను నడుపుటలో వడలు మరచి కృషిసల్పుచున్నారు. మునుపు వారు తుఫానులందు ఆరితేరియున్నారనుటకు సందేహంలేదు. కాని యిప్పుడైతే వారు తమ ఆఖరి ఉపాయమువరకు ప్రయత్నించారు. తమప్రాణములనుగూర్చి భయపడినవారై యేసును లేపారు. ‘బోధకుడా, నీవు లక్షముచేయవా? మేము మునిగి పోవు చున్నాము!’ అని కేక వేసారు. ‘మేము నశించిపోవు చున్నాము, మమ్మును రక్షించుము!’

యేసు లేచి గాలిని సముద్రమును ‘నిశ్శబ్దమై ఊరకుండుము!’ అని గద్దించెను. చెలరేగుచున్న గాలి ఆగి సముద్రము నిమ్మళమాయెను. తన శిష్యులవైపు తిరిగి: ‘మీరెందుకు భయపడుచున్నారు? మీరింకా విశ్వాసము లేక ఉన్నారా?’ అని అడిగెను.

అంతట, అసాధారణమైన భయము శిష్యులను ఆవరించెను. ‘ఈయన నిజంగా ఎవరు?’ అని వారు ఒకరి నెకరు ప్రశ్నించుకొన్నారు. ‘గాలిని, నీటిని కూడా ఈయన ఆజ్ఞాపించుచున్నాడు, అవి ఆయనకు లోబడుచున్నవి!’

ఎంతటి శక్తిని యేసు ప్రదర్శించెను! ప్రకృతిపై మనరాజుకు ఉన్న శక్తిని తెలిసికొనుట మరియు ఆయన తన రాజ్యపరిపాలనలో మనభూమిపై తనపూర్తి అవధానమును నిలిపినప్పుడు భయంకరప్రకృతి వైపరీత్యాలనుండి మనమంతా భద్రముగా నివసించుదమనుటకు ఎంత దృఢనిశ్చయతనిస్తున్నది!

తుఫాను అణిగిపోయిన కొంతసేపటికి యేసు ఆయన శిష్యులు సురక్షితంగా అద్దరిని చేరుకున్నారు. చెలరేగిన ఆ తుఫాను బారినుండి మిగిలిన పడవలు కూడా బహుశా కాపాడబడి సురక్షితంగా తిరిగి వెళ్లియుండవచ్చును. మార్కు 4:35–5:2; మత్తయి 8:18, 23-28; లూకా 8:22-27.

◆ దెకపొలి అంటే ఏమిటి, అది ఎక్కడ ఉన్నది?

◆ గలిలయ సముద్రముపై పెనుతుఫానులు చెలరేగుటకు ఎటువంటి నైసర్గిక పరిస్థితులు కారణములు?

◆ తమ నావిక నైపుణ్యములు తమ్మును రక్షించలేనప్పుడు, శిష్యులు ఏమిచేసారు? (w87 5/1)

[12వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి