భయమును కలిగియుండుట అన్నిసమయాల్ల తప్పా?
అది సంతోషమును పాడుచేసి, నిరీక్షణను నాశనముచేయగలదు. అది మానసిక విషముగాను, తర్కవిచారమును నాశనముచేయునదిగా పిలువబడినది, మరియు అది ఘోరమైన శరీరక రోగము కంటే నాశనకరమైనదిగా చెప్పబడినది. అవును, భయము ఒక శక్తివంతమైన ఉద్రేకము. అయితే, అది అన్ని సమయాల్లో చెడ్డదా?
మీకు పరిచయములేని రోడ్డుపై మీరు కారు నడుపుతున్నారని ఊహించండి. రోడ్డు పర్వతములలోనికి ఎక్కి మలుపులు తిరుగుతూవుంది. రాత్రి కావడం మొదలైంది. నెమ్మదిగా మంచు పడుతుంది. మీ కారు కొంచెం జారుతుంది, అప్పుడు రోడ్డంత మంచుతో నిండియున్న ఎత్తైనచోట ఉన్నారని మీరు గ్రహిస్తారు.
ఇప్పుడు మీరు చాలా మెలకువుగా ఉండాలి. మంచుతోవున్న ప్రతి మలుపును మీరు జాగ్రత్తగా దాటుతుండగా, ఆ జారుడు రోడ్డుపై ఎంత సులభంగా మీ కారు అదుపు తప్పి లోయలో పడగలదో మీరు ఆలోచిస్తారు. అంతేకాకుండా చీకటిలో మరి ఏ ప్రమాదములు వేచియున్నవో మీకు తెలియదు. ఈ ఆలోచనలు మీమనస్సులోనికి వచ్చినపుడు మీనోరు ఆరిపోతుంది, మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది. మీరు అతిజాగ్రత్తగా ఉంటారు. ఇంతకు ముందు మీరు ఏమి ఆలోచించినప్పటికి ఇప్పుడు మీరు మీ ముందున్న పనిలో కారును రోడ్డుపై ఉంచి ప్రమాదము తప్పించుటలో నిమగ్నులవుతారు.
చివరికి రోడ్డు క్రిందికి దిగుతుంది. ఇపుడు వీధి దీపములు ఉన్నవి, మంచులేదు. క్రమంగా ఒత్తిడి మీ శరీరమును విడుస్తుంది. మీరు సడలి ఉపశమనములో కూడిన నిట్టూర్పు విడుస్తారు. ఏమి లేనిదానికి అంతభయం!
అయితే ఆ భయమంతా నిరర్ధకమైనదా? నిజంగా కాదు. అటువంటి పరిస్థితులలో కొంచెము కంగారు సహజమైన ప్రతిక్రియయైయున్నది. అది మనలను మెలుకువుగా వుంచి జాగరూకులుగా చేయును. ఆరోగ్యకరమైన భయము తొందర పాటుతో ఏదైననుచేసి మనకైమనము హానిచేసికొనకుండా సహాయపడుతుంది. అవును భయము అన్నిసమయాల్లో తర్కవిచారమును నాశనముచేయునది మరియు మానసిక విషము కాదు. కొన్నిసమయాల్లో అది మనకు ప్రయోజనకరమై యుండగలదు.
బైబిలు భయమును గూర్చిచెపుతుంది, మరియు రెండు విధములైన భయమును మన దృష్టికి తెస్తుంది. ఒక విధమైన భయము నిజంగా మానసిక విషమైయున్నది. మరియొకటి సహజము మరియు ఆరోగ్యకరమే కాకుండా మన రక్షణకు అత్యవసరమైయున్నది. ఆరెండు విధములైన భయములేమైయున్నవి? మనము ఒకదానిని పెంపొందించుకొనుచు మరియొక దానిని విసర్జించుట ఎట్లు నేర్చుకొనగలము? ఇది తదుపరి శీర్షికలో చర్చించబడును. (w89 6⁄1)