“స్వచ్ఛమైన భాష” జిల్లాసమావేశమునకు తప్పిపోకుడి!
బైబిలు ఉపదేశమునిచ్చు ప్రతిఫలదాయకమైన నాలుగు దినములు మీకొరకు వేచియున్నవి. గురువారము సాయంత్రము 1.30 గంటలకు కార్యక్రమము ప్రారంభమౌనప్పుడు అక్కడ ఉండుడి. ఆలోచనను రేకెత్తించు “మీ స్నేహితులు యెహోవాకు కూడ స్నేహితులా?” అను ప్రసంగమును, దానితోపాటు “జనాంగములన్నిటికి స్వచ్ఛమైనభాష” అను ముఖ్యాంశ ప్రసంగమును ఆనందించుము. మధ్యాహ్నపు ముగింపు ప్రసంగమైన “రక్తముతో మీ జీవమును రక్షించుకొనుట—ఎట్లు?” అనునది ప్రాణమును రక్షించుకొనుటకు: నిజముగా రక్తము అవసరమా? అను ప్రశ్నకు సమాధానమిచ్చును?
శుక్రవారము ఉదయకాల కార్యక్రమము 9.30 ని.లకు ప్రారంభమగును. “క్రీస్తు ‘దుర్నీతిని ద్వేషించెను’—మరి మీరు?” అను పరిశీలనాత్మక ప్రసంగమును, మనస్సును ప్రేరేపించు “లోకపు భ్రమలను విసర్జించి, రాజ్య వాస్తవాలను వెంటాడుము” అనుప్రసంగమును వినుటకు అక్కడయుండుము. మధ్యాహ్నసమయమందు మీకున్న ఆర్థిక స్థితిలోనే జీవించుటకు తగిన ఆచరణాత్మక మార్గము అందించబడును. తమ కర్తవ్యములను ఎక్కువ ఫలవంతముగా నెరవేర్చుటనుగూర్చి తల్లిదండ్రులు చూపబడుదురు. మరియు ఆధునిక డ్రామా యువకులకు తమ పాఠశాలయందలి అదనపు కార్యక్రమములలో పాల్గొను విషయములో మంచి నడిపింపు నిచ్చును.
శనివారపు ఉదయకాల భాగమున సమర్పణ మరియు బాప్తిస్మమును గూర్చి మరియు వ్యక్తిగత బైబిలు పఠనముచేయుటకు మనము చేయవలసిన త్యాగములను గూర్చి ప్రసంగములుండును. మధ్యాహ్నకార్యక్రమములో “ప్రకాశమానమైన యెహోవా రథము కదలివెళ్లుచున్నది” అను ఉత్తేజకర ప్రసంగముండును. అబద్ధమతముచే అంధులైనవారికి సహాయముచేయు మన బాధ్యతనుగూర్చి శక్తివంతమైన సూచనలు, ఈ బాధ్యతను నెరవేర్చుటకు ఆచరణాత్మకమైన సహాయము అందించబడును.
క్రీస్తుమత సామ్రాజ్యము మరియు దాని మత గురువులకు వ్యతిరేకముగా విడుదలయగు బలమైన వర్తమానములను వినుటకు ఆదివారము ఉదయమున హాజరగుటకు మీరుయిష్టపడుదురు. ఆ తదుపరి యెహూ మరియు యెహోనాదాబుల జీవితములు యిమిడియున్న ప్రాచీనకాల దుస్తుల వేషముతోకూడిన డ్రామా అందింపు ఉండును. మధ్యాహ్నము “స్వచ్ఛమైన భాషవలన ఐక్యపరచబడినవారై యుండుడి” అను బహిరంగప్రసంగమును తప్పక వినునట్లు చూచుకొనుడి.
సెప్టెంబరు 1990 నుండి జనవరి 1991 మధ్యకాలమున ఒక్క ఇండియాలోనే 26 సమావేశములు జరుగులాగున నిర్ణయించబడియున్నవి. కావున ఏదో ఒక సమావేశము మీకు దగ్గరలో యుండును. మీకు అతి దగ్గరగా యున్న సమావేశ స్థలము మరియు తారీఖులకై స్థానికముగాయున్న యెహోవాసాక్షులను విచారించుము. లేక ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయుము.