యెహోవా దయచేసిన వివేకము
“జనములలో వివేకముగలవారు అనేకులకు బోధించుదురు.”—దానియేలు 11:33 NW.
1, 2. (ఎ) ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమ మరియు కనికరములను అనుభవించినను, వారెందుకు తిరుగుబాటు చేసిరి? (బి) మనము ఏమిచేయుట లాభదాయకమైయున్నది? (యిర్మీయా 51:10)
ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన ప్రజలు యెహోవా అద్వితీయ సత్యదేవుడని ఎరిగియుండిరి. వారి పితరులతో ఆయన వ్యవహరించిన విధానము వారికి చెప్పబడెను, మరియు ఆయన ప్రేమ, కనికరమును వారు వ్యక్తిగతముగా అనుభవించారు. కాని వారు పలుమారులు అసలు వివేకములేని వారివలెనే ప్రవర్తించిరి. వారు యెహోవాకు మరియు ఆయన ప్రతినిధులకు విరుద్ధంగా “తిరుగుబాటు చేసారు.” ఎందుకు? ఎందుకనగా, ఆయన వారికొరకు చేసిన వాటినివారు వెంటనే “మరచిపోయిరి.” (కీర్తన 106:7, 13) ఈ విషయములు వారికి తెలియదు అని కాదుగాని, వాటినిగూర్చి గుణగ్రహణతో మననము చేయుట విషయంలో వారు తప్పిపోయారు. తత్ఫలితంగా, “వారు హానికరమైనవాటిని ఆశించు వారిగా” నిరూపించుకొనిరి.—1 కొరింథీయులు 10:6 NW.
2 మన దినములో, యెహోవా తన సాక్షులను ఒక ప్రత్యేక ప్రజలుగా వేరుపరిచిన ముఖ్యరీతి ఏమనగా, తన దృశ్య సంస్థద్వారా వారికి వివేకమును దయచేయుట వలననే. ఈ వివేకముయొక్క ఉదాహరణలను తిరిగి పరిశీలించుట వలన యెహోవా తన ప్రజలను నడిపించు విధానముపై మనకుగల ప్రశంస బలపడును. ఇందులో మన విశ్వాసముయొక్క కేంద్రీయభాగము అనగా—దేవుడు ఏమైయున్నాడని గుర్తించుట యిమిడియున్నది.
దేవుడు ఒక త్రిత్వమా?
3. వంద సంవత్సరముల క్రితము, దేవుని గుర్తించుటనుగూర్చిన సత్యమును తెలిసికొనుటకు, యెహోవా సేవకులకు ఏమి సహాయము చేసినది? (1 కొరింథీయులు 8:5, 6)
3 క్రీస్తుమత సామ్రాజ్యము వారు త్రిత్వమును నమ్మనివారు సనాతన మతధర్మమునకు విరోధులు అని గట్టిగా చెప్పిరి. అయితే మనుష్యులకు బెదరక యెహోవా సేవకులు దైవావేశములేని మనుష్యుల ఆచారములు మరియు సిద్ధాంతములుకాక పరిశుద్ధలేఖనములు సత్యమును గ్రహించుటకు ప్రమాణములనిచ్చునని గుర్తించిరి. ఈ పునాది మీదకడుతూ ఎన్నో సంవత్సరముల క్రితం 1882లో ఈ సమర్పిత బైబిలు విద్యార్థులు వాచ్‌టవర్ నందు స్పష్టముగా ఇట్లు వ్యక్తపరిచారు: “మేము యెహోవా దేవుని, యేసుక్రీస్తును మరియు పరిశుద్ధాత్మను నమ్ముతాము కాని, ఒకే వ్యక్తిలో ముగ్గురు దేవుళ్లు వున్నారని లేక ఇతరులు చూపినరీతిగా ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు వున్నారను బోధను లేఖనాధారములేనిదిగా తిరస్కరిస్తామని మా పాఠకులకు తెలుసు.”—యెహాను 5:19; 14:28; 20:17.
4. (ఎ) లోతుగా పరీక్షించినపుడు, యెహోవా ప్రజలు త్రిత్వమను సిద్ధాంతముయొక్క ఆధారమునుగూర్చి మరియు ఆ బోధయొక్క ప్రభావమునుగూర్చి ఏమి తెలిసికొనిరి? (బి) ఎందుకు యెహోవా తన సేవకులకు అటువంటి వివేకమును దయచేసెను?
4 బైబిలు సత్యమును ప్రేమించు వీరు విషయమును లోతుగా పరీక్షించి, త్రిత్వము అను నమ్మకముయొక్క వేర్లు క్రైస్తవులుకాని మతములలోనున్నవని తెలిసికొనిరి. లేఖనములను జాగ్రత్తగా పరిశీలించుటద్వారా వారు కొన్ని లేఖనములు త్రిత్వమునకు చెందిన అభిప్రాయములను బలపరిచినట్లు కనిపించినను, అది అనువాదకుల పక్షపాత దృష్టివలననేగాని, పురాతనమైన ఆరంభ భాషావ్రాత ప్రతులలో ఉన్నందువలనకాదు అని తెలుసుకొనిరి. ఈ బోధ బాహ్యముగా యేసును గౌరవిస్తున్నను, వాస్తవానికి ఆయన బోధలకు విరుద్ధంగావుండి యెహోవాను అగౌరపరుస్తుందని వారు గుర్తించారు. కావున పైనచెప్పబడిన వాచ్‌టవర్ సంచిక ఇలా చెప్పెను: “కావున మనము మనతోను మన తండ్రియొక్క వాక్యముతోను నిజాయితీగా వ్యవహరించుట సత్యమును అన్వేషించు మనకు తగినదైయుండి మనలను నిజముగా వివేకవంతులను చేయును. దైవావేశములేని మనుష్యుల, కుళ్లిన విధానములద్వారా వచ్చిన ఆచారములను మరియు సిద్ధాంతములను తిరస్కరించి, మనప్రభువు మరియు అపొస్తలుల ఆరోగ్యకరమైన వాక్యములను గట్టిగా చేపట్టుదము.” వారు సత్యమును నిజముగా ప్రేమించి, బైబిలులోని కొన్ని అనుకూలమైన లేఖనములకు మాత్రమే ధ్యానమియ్యక దేవుని వాక్యమునంతటిని స్వీకరించినందుకు, యెహోవా వారికి వివేకమునిచ్చి క్రీస్తుమత సామ్రాజ్యమునుండి నిస్సందేహముగా వారిని వేరుపరచెను.—2 తిమోతి 3:16, 17; న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిల్ పుట 1580, సెక్షన్ 6B చూడుము.
దేవుని నామముయొక్క యుక్తమైన స్థానము
5. బైబిలు అనువాదములనుండి దేవుని నామమును తీసివేయు ఉద్దేశ్యము వెనుక ఏమున్నది? (ప్రకటన 22:18, 19)
5 రెండవ ఉదాహరణను గమనించుము: బైబిలు అనువాదకులు పెరుగుతున్న సంఖ్యలో దేవుని వ్యక్తిగత నామమును మరుగుపరిచినప్పుడు, లేక వదిలివేసినప్పుడు వాచ్‌టవర్ సొసైటి దేవుని నామముయొక్క ప్రాముఖ్యతను మరి ఎక్కువగా నొక్కి వక్కాణించెను. యెహోవా నామమును తీసివేయడముద్వారా సువార్త విశ్వ ఆకర్షణపొందునని క్రీస్తుమత సామ్రాజ్యమువారు వాదించిరి, కాని యెహోవాయొక్క అభిషక్త సేవకులు పరిశుద్ధ లేఖనములనుండి ఆ అతిప్రాముఖ్యమైన నామమును తీసివేయుటకు వేసిన పన్నాగము వెనుక ఎవరున్నారో గుర్తించారు. (యిర్మీయా 23:27 పోల్చుము.) మనుష్యుల జ్ఞప్తినుండి సత్యదేవుని నామమును చెరిపివేయుటకు ఇది అపవాదిద్వారా పురికొల్పబడెనని దేవుని ప్రజలు గుర్తించారు.
6. క్రీస్తుమత సామ్రాజ్యము చేయుదానికి భిన్నముగా దేవుని నిజమైన సేవకులు ఆయన నామమును ఘనపరచుటకు ఏమిచేసిరి? (అ.కార్యములు 15:14)
6 క్రీస్తుమత సామ్రాజ్యము అనుసరించిన మార్గమునకు భిన్నముగా ప్రచురింపబడిన మొదటి సంవత్సరమునుండి (1879) వాచ్‌టవర్ యెహోవా అను దైవిక నామమునకు ప్రాముఖ్యతనిచ్చెను. 1926లో ఈ పత్రిక “యెహోవాను ఎవరు ఘనపరచెదరు?” అను ప్రధాన వ్యాసమును ప్రచురించెను. (కీర్తన 135:21) 1931లో వాచ్‌టవర్ సొసైటితో సహకరించు బైబిలు విద్యార్థులు యెహోవా సాక్షులు అను నామమును హత్తుకొనిరి. (యెషయా 43:10-12) అప్పుడు వారు యెహోవా నామమును మహిమపరచు గొప్ప ప్రాముఖ్యతను మరెంతో ఎక్కువగా గుణగ్రహించారు. (యెషయా 12:4, 5) వారు 1944లో యెహోవా నామమును 6,800కు పైగా ఉపయోగించిన అమెరికన్స్టాండార్డ్ బైబిలును ప్రచురించుట ప్రారంభించారు. బైబిలు ప్రచురణ సంబంధముగా 1950 నుండి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ చెప్పుకోదగిన రీతిలో ఉత్పత్తిచేయుట ప్రారంభించబడినది. అది హెబ్రీ మరియు గ్రీకు లేఖనములలో దైవిక నామమునకున్న తగిన స్థానమును ఇచ్చుచున్నది.
7. దేవుని నామము మరియు దానికి సంబంధించిన దానంతటిపై చూపిన ప్రాముఖ్యత ఏ విధముగా అనేకులపై ప్రయోజనకరమైన ప్రభావమును కలిగియుండెను?
7 ఆ విధంగా దేవుని వ్యక్తిగత నామమునకు ఇవ్వబడిన ప్రాధాన్యము, భూమండలము చుట్టువున్న లక్షలకొలది నీతిని ప్రేమించువారిని సంతోషపరిచెను. సత్యదేవుడు ఒకవ్యక్తియని గుర్తించుటకు అది వారికి సహాయపడెను, మరియు ఆయన మార్గములు తెలిసికొనిన కొలది, వారు మంచి ఆలోచన లేక వివేకముతో ప్రవర్తించగలిగిరి.—మీకా 4:2, 5.
మానవ ఆత్మ అమర్త్యమా?
8. వారి ఆధునిక చరిత్రలోని మొదటి భాగములో యెహోవా సాక్షులు ఆత్మనుగూర్చి మరియు చనిపోయినవారి స్థితినిగూర్చి ఏమి తెలిసికొనిరి?
8 ఇప్పుడు మూడవ ఉదాహరణము: యెహోవా సేవకుల ఆధునిక చరిత్రలోని మొదటి భాగములో దేవుని వాక్యముయెడల వారికిగల ప్రేమ ఇతర ముఖ్యమైన సత్యములకు వారి కన్నులను తెరిచెను. ఒక శతాబ్దమునకుపైగా “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు” ఆత్మ (SOUL) అంటే మనుష్యులలోవుండి వేరుపరచబడగల ఒక తెలివిగల శక్తికాదుగాని, మనుష్యుడే అని సరిగా అర్థము చేసుకొనిరి. (మత్తయి 24:45-47) 1880లో వాచ్‌టవర్ ఆదిమ భాషలను సునిశితముగా పరీక్షించి, షియోల్ మరియు హేడీస్ అను పదములు కేవలము సమాధిని సూచించుచున్నవని తేల్చిచెప్పి, ఆ పదములను అట్లే బైబిలునందు ప్రతిలిఖించినది. అలాగే గెహెన్నాకు అప్పగించబడిన వారు నాశనమగుదురుగాని బాధించబడరు అనికూడా అది చూపించెను.—న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిల్, పుటలు 1573-5 కూడా చూడుము.
9. 1894లో మానవ ఆత్మ వారసత్వముగానే అమర్త్యమైనదను బోధయొక్క మూలమునుగూర్చి వాచ్‌టవర్ ఏమి చెప్పెను?
9 1894లో వాచ్‌టవర్ ఈ ప్రశ్నను లేవదీసెను, “మనుష్యులు అమర్త్యతను సహజంగా, అంతర్గతముగా పొందియున్నారను జనాదరణగల ఈ ఆలోచన ఎక్కడనుండి వచ్చెను?” వివేకముతో అది యిట్లు జవాబిచ్చెను: “చరిత్ర పుటలను పరిశీలించినప్పుడు మనము కనుగొనేదేమంటే, మనుష్యుడు అమర్త్యుడు అను సిద్ధాంతము దేవుని ప్రేరేపిత సాక్షులు బోధించలేదు. అయితే అది అన్యుల మతములలో వేరుపారినదైయుండెను.. . .కావున సోక్రటీస్, ప్లాటో ఈ సిద్ధాంతమును మొదట బోధించిరనునది నిజముకాదు. వారికంటే ముందు ఒక బోధకుడున్నాడు. వాడు వారికంటే సామర్థ్యముగలవాడు. వారు మాత్రము ఆ సిద్ధాంతమునకు మెరుపునిచ్చి,. . .దానిని ఒక తత్వముగా మార్చి ఆనాటినుండి యిప్పటివరకు సంస్కారుల తరగతి అను వారికి ఆకర్షణీయముగా, అంగీకారనీయముగా చేసిరి. ఈ అబద్ధ బోధనుగూర్చి మానవునికి తెలిసిన అతిపురాతన చరిత్రలో—బైబిలులో నమోదు చేయబడెను. ఆ అబద్ధ బోధకుడు సాతాను.”a
10. ఆత్మనుగూర్చి చనిపోయినవారి స్థితినిగూర్చి చెప్పబడిన మతసంబంధమైన అబద్ధములవలన ఎటువంటిచెడు ప్రభావములు కలిగెను, అయితే కారణయుక్తమైన ప్రజలకు సహాయము ఎట్లు అందింపబడెను?
10 మనుష్యులు అమర్త్యమైన ఆత్మను కలిగియున్నారు, దుష్టులు నిరంతరము నరకాగ్నిలో బాధింపబడుదురను బోధను వ్యాపింపజేయుటద్వారా సాతాను దేవుని నామమును తప్పుగా తెలియజేసి ఆయనను దూషించెను. వాచ్‌టవర్ పత్రిక మొదటి సంపాదకుడైన సి. టి. రస్సెల్ దానిని గుర్తించెను. తెలివిగల వ్యక్తులు నిరంతరము బాధింపబడుటయను ఆలోచనను తిరస్కరించిరనియు, అయితే విచారకరమైన సంగతి ఏమంటే, వారు బైబిలు ఈ కారణరహిత సిద్ధాంతమునకు మూలాధారమని నమ్మి వారు దానిని కూడ తిరస్కరించిరనియు ఆయన చూసెను. అంధయుగపు (DARK AGES) ధూమమును కారణయుక్త ప్రజల మనస్సులలోనుండి తొలగించుటకు, సహోదరుడైన రస్సెల్ మనసున నాటుకొను “టు హెల్ అండ్ బ్యాక్! హు ఆర్ దేర్.” అను బహిరంగ ప్రసంగమునిచ్చెను.
11. (ఎ) అభిచారము ముందుకువస్తున్న సమయంలో ‘నమ్మకమైన దాసుని’ తరగతివారు ఎటువంటి హెచ్చరికను అందించిరి? (బి) ఈ హెచ్చరికవలన ఎవరు ప్రయోజనము పొందిరి, మరియు ఎట్లు?
11 అది అభిచారము ముందుకు వస్తున్న సమయమై యుండెను. అయితే తన వాక్యముద్వారా యెహోవా దేవుడు దయచేసిన వివేకముతో ‘నమ్మకమైన దాసుని’ తరగతివారు, చనిపోయినవారి ఆత్మలని నమ్మి ప్రజలు వాటితో సంభాషించేది నిజముగా దయ్యములని వారు తెలిసికొనిరి. అభిచార సంబంధమైన కార్యములలో పాలుపొందుటవలన కలుగు ప్రమాదముల విషయము, నీతి హృదయముగలవారి కన్నులు తెరచుటకై బలమైన లేఖనానుసారమైన వాదములు బహిరంగ ప్రసంగములందును మరియు లిఖితపూర్వక రూపములందును అందించబడెను. (ద్వితీయోపదేశకాండము 18:10-12; యెషయా 8:19) యెహోవా తన సేవకులకు యిచ్చిన ఈ వివేకముద్వారా లోకమంతటా ఎన్నోవేలమంది వ్యక్తులు చనిపోయిన వారి విషయమైన భయమునుండి, అభిచార ప్రయోగమునుండి, అభిచారసంబంధమైన అయోగ్య ఆచారములనుండి విడుదల పొందారు.
అల్లకల్లోల లోకములో క్రైస్తవ ప్రవర్తన
12, 13. (ఎ) దానియేలు 11:32, 33ను వివరించుము. (బి) వివేకము గలవారు ఇతరులకు బోధించుటకు ఆధారమునిచ్చు బైబిలు మూలసత్యములు కొన్ని ఏమైయున్నవి?
12 దానియేలు ప్రవక్త దేవుని ప్రజలు నాల్గవ విషయసంబంధముగా వివేకమును ప్రదర్శించెదరని సూచించెను. అది ముఖ్య సవాలుగాయున్న—తటస్థత. ప్రాముఖ్యమైన రాజకీయ శక్తులమధ్య జరుగు సంఘర్షణను వివరముగా వర్ణించిన తదుపరి దానియేలు 11:32, 33 (NW) యిట్లు చెప్పుచున్నది: “అందుకతడు యిచ్ఛకపు మాటలుచెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును.” అంటే ఉత్తరపు ఏకైకపక్ష ప్రభుత్వముయొక్క రాజు క్రైస్తవులని చెప్పుకొనుచు లోకమును ప్రేమించి దానిమెప్పును కోరువారిని మతభ్రష్టతకు నడిపి తద్వారా యేసుక్రీస్తు ఈ భూమిని ఏలుటకు యెహోవా చేసిన రాజ్యనిబంధనను, తృణీకరించును అని భావము. “అయితే తమ దేవునినెరుగువారు బలముకలిగి గొప్పకార్యములు చేసెదరు, జనములలో వివేకులు అనేకులకు బోధించుదురు” అని దానియేలు చెప్పెను.
13 మనచుట్టువున్న సంక్షోభ పరిస్థితులలో బుద్ధిమంతముగా వ్యవహరించుటకు కావలసిన వివేకము బైబిలు మూలసత్యముల గుణగ్రహణపై ఆధారపడియున్నది. యెహోవా దేవుని నడిపింపుతో ‘నమ్మకమైన దాసుని’ తరగతి ఈ సత్యములను గ్రహించెను. అందులో ఒకటి యేసు సూచించినరీతిగా ఈ లోకముయొక్క అదృశ్య అధికారి, అపవాదియైన సాతాను అను యథార్థము. (లూకా 4:5-8; యెహాను 12:31) ఈ సత్యముతో పొందిక కలిగి 1 యోహాను 5:19 కేవలము ఒక భాగముగాక “లోకమంతయు [నిజమైన క్రైస్తవ సంఘము వెలుపలి మానవ జాతియంతయు] దుష్టునియందున్నదనియు ఎరుగుదుము” అని చెప్పుచున్నది. (ప్రకటన 12:9) యేసుతన శిష్యులతో వారు “లోకసంబంధులుకారు” అని చెప్పెను. కావున వారు క్రైస్తవ తటస్థతను పాటించవలెను.—యోహాను 17:16.
14. (ఎ) 1939 మరియు 1941లో సమయానుసారమైన ఏ విషయములు యెహోవా సేవకుల దృష్టికి తేబడెను? (బి) అటువంటి వివేకము యెహోవాసాక్షులు జ్ఞానానుసారముగా ప్రవర్తించుటకు ఎట్లు సహాయపడెను?
14 కావున సమయానుకూలముగా, రెండవ ప్రపంచ యుద్ధమేఘములు ఐరోపాపై కమ్ముకొనుచుండగా క్రైస్తవ తటస్థత సవాలును నవంబరు 1, 1939 వాచ్‌టవర్ ఎత్తిచూపెను. ఒకమూల సత్యము ఈ విషయముతో సంబంధమును కలిగియున్నది. అదేమనగా, విశ్వసార్వభౌమాధిపత్యపు సవాలుయొక్క ప్రాముఖ్యత మరియు ఈ సవాలును పరిష్కరించుటలో మెస్సీయా రాజ్యముయొక్క పాత్ర. సరియైన రీతిలో 1941లో ఈ సవాలుకు ప్రాధాన్యమునిస్తూ ఒక ప్రసంగము సెయింట్ లూయీస్ మిస్సోరి అమెరికాలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశంలో ఇవ్వబడినది. మరియు తదుపరి సంవత్సరంలో ది న్యూవరల్డ్ అనే పుస్తకములో ఈ సవాలుకు ప్రాధాన్యత ఇయ్యబడెను. ఈ విభజింపబడి, కలహిస్తున్న లోకంలో అక్కడ ఇవ్వబడిన దైవిక వివేకము యెహోవా సేవకులకు ఎంత సురక్షతనిచ్చెను! అంతర్జాతీయ కలహములో మరియు ప్రభుత్వములను పడద్రోయు గెరిల్లా ఉద్యమములలో భాగమువహించుట వలన క్రీస్తుమత సామ్రాజ్య విధానము ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నమైనప్పటికి, యెహోవాసాక్షులు అన్ని దేశములలో ఐకమత్యముతో దేవుని రాజ్యమే మానవజాతియొక్క ఏకైక నిరీక్షణ అని ప్రచురించుటలో నిమగ్నులైయుండిరి. వారు జీవితములను రక్షించు పనిలో పనిరద్దీగలవారై ఆయన ప్రవచిస్తూ చెప్పినట్లుగా చేసిరి: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
బైబిలు ప్రవచనముల నెరవేర్పు
15. యెహోవాసాక్షులు వివేకమును ఎందుకు కలిగియుండిరి?
15 యెహోవాసేవకులు ఎందుకు అటువంటి వివేకము కలిగియుండిరి? ఎందుకనగా వారు దేవుని లిఖితవాక్యముపై దృఢనమ్మకము కలిగి దానికి విధేయులైయున్నారు. మరియు యెహోవా ఆత్మ వారిపైయున్నది. ఇది ముఖ్యమైన బైబిలు ప్రవచనములను అర్థము చేసికొనుటలో సహాయము చేసినది, మరియు దీన్ని అయిదవ విషయముగా ఇప్పుడు మనము పరిశీలించబోతున్నాము.
16, 17. (ఎ) యెహోవాసాక్షులు వాడిన తేదీలకు, ప్రాపంచిక చరిత్రకారులు వాడిన తేదీలకు కొన్నిసార్లు తేడా ఎందుకు ఉన్నది? (బి) యెహోవాసాక్షులు బైబిలుపై తమ పూర్తి విశ్వాసముంచి అర్తహషస్తయొక్క 20వ సంవత్సరము మరియు యెరూషలేముయొక్క నాశనసమయము నిర్ణయించుటవలన ఎట్లు ప్రయోజనము పొందిరి?
16 ప్రాపంచిక చరిత్రకారులు పురాతత్వ శాస్త్రీయులు కనుగొన్న అసంపూర్ణ పలకల వివరణపై ఆధారపడి సా.శ.పూ. 464ను అర్తహషస్త లాంగిమేను రాజ్యపరిపాలనయొక్క మొదటి సంవత్సరముగాను, సా.శ.పూ. 604ను నెబుకద్నెజరు II రాజ్యపరిపాలనయొక్క మొదటి సంవత్సరముగాను నిర్ణయించారు. అది నిజమైనట్లయితే అర్తహషస్తయొక్క 20వ సం. సా.శ.పూ. 445తో మొదలగును. మరియు బబులోనీయులద్వారా (నెబుకద్నెజరు యొక్క 18వ పరిపాలనా సంవత్సరము) యెరూషలేముయొక్క నాశనము సా.శ.పూ. 587యై యుండును. కాని ఒక బైబిలు పాఠకుడు బైబిలు ప్రవచనములు పూర్తగుటను లెక్కించుటకు ఈ తేదీలను వాడినపుడు అతడు కేవలము గలిబిలిచెందును.
17 బైబిలుకు సంబంధించిన విషయములనుగూర్చి పురాతత్వ శాస్త్రీయులు కనుగొనువాటిపై యెహోవాసాక్షులు ఆసక్తిని కలిగియున్నారు. అయితే కనుగొనిన వాటినిగూర్చిన అర్థవివరణ బైబిలు స్పష్టముగా చెప్పిన దానికి పొందికగాలేనప్పుడు మేము పరిశుద్ధలేఖనములు చెప్పిన వాటిని దృఢనమ్మకముతో స్వీకరిస్తాం. అది తేదీలు లెక్కకట్టు శాస్త్రమైనా లేక ఏ ఇతర విషయమైనా. ఆ కారణంచేత అర్తహషస్తయొక్క 20వ సం.తో మొదలైన ప్రవచనార్థక సమయము సా.శ.పూ. 455 నుండి లెక్కించవలెనని, మరియు తద్వారా దానియేలు 9:24-27 ప్రకారము మెస్సీయాగా యేసుయొక్క అభిషేకము సా.శ. 29 శరదృతువులో జరిగెనని యెహోవా సేవకులు గుర్తించిరి.b అదే కారణముచేత దానియేలు 4వ అధ్యాయములో ప్రవచింపబడిన “ఏడుకాలములు” 607-606 సా.శ.పూ. నుండి లెక్కింపబడి, సా.శ. 1914 శరదృతువులో క్రీస్తు సింహాసనాసీనుడై పరలోకములో రాజుగా పరిపాలనచేయుట మొదలుపెట్టెనని, మరియు ఈ లోకము అంత్యదినములలో ప్రవేశించెనని,c ఆ ప్రవచనము చూపించినట్లు వారు గుర్తించారు. దైవావేశమువలన కలిగిన పరిశుద్ధలేఖనములపైగల దృఢనమ్మకము లేనట్లయిన కంపింపజేయు ఈ ప్రవచన సంపూర్తులను వారుగ్రహించి యుండేవారుకాదు. కావున వారు చూపిన వివేకము దేవుని వాక్యముపై ఆధారపడుటతో సంబంధము కలిగియున్నది.
18. యెహోవాయొక్క యథార్థసేవకుల ఆత్మీయ పరిస్థితినిగూర్చి యెషయా 65:13, 14 ఏమి చెప్పుచున్నది?
18 ప్రజలు మెచ్చిన దానిని స్వీకరించి లేఖనములను త్రోసిపుచ్చు వ్యక్తులకు మరియు గుంపులకు తన నమ్మకమైన సేవకుల ఆత్మీయపరిస్థితిని పోల్చుతూ యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆలకించుడి, నా సేవకులు పానము చేయుదురుగాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరుగాని మీరు ఆకలిగొనెదరు, నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు.”—యెషయా 65:13, 14.
19. (ఎ) ప్రాముఖ్యముగా దేనిద్వారా “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని” తరగతివారు లేఖనములను వివరించుచున్నారు? (బి) ఎటువంటి పఠనవిధానము మనకు ఈ ఆత్మీయ ఆహారమునుండి పూర్తిలాభము పొందుటకు సహాయము చేయును?
19 ఈ క్లుప్తమైన చారిత్రిక పునఃపరిశీలన చూపేదేమంటే, ది వాచ్‌టవర్ పంక్తుల ద్వారానే ప్రాముఖ్యమైన లేఖన సత్యములను యెహోవాయొక్క “నమ్మకమును, బుద్ధిమంతుడైన దాసుడు” వివరించియున్నాడు. ఈ దాసుని తరగతి ఆత్మీయ ఆహారమును అందించుటకు వాచ్‌టవర్ ప్రధానమైన పనిముట్టుయైయున్నది. మీరు దానినుండి పూర్తి లాభమును పొందుతున్నారా? నీవు ప్రతిసంచికను చదువుతున్నావా, మరియు నీ పఠన కార్యక్రమములో ఎత్తివ్రాయకుండా కేవలము చూపించబడిన లేఖనములను తెరచిచూచుట కూడా ఇమిడియుందా? ఇంకా మీరు చదివిన దానిపై మననముచేసి దానిపై గుణగ్రహణ పెంపొందించి అది మన మనోభావములపై, మన ఆశలపై, మన అనుదినకార్యములపై మన జీవితములోని గురులపై ఎటువంటి ప్రభావము కలిగియుండవలెనని ఆలోచించుటకు అలవాటు చేసుకొన్నారా? అలా చేసినయెడల కేవలము యెహోవా ఇచ్చు స్వచ్ఛమైన వివేకముపై ఆధారపడి నిర్ణయములు చేయుటలో అది ప్రభావమును కలిగియుండును. (w89 3/15)
[అధస్సూచీలు]
a శారీరకముగా ఆమె చావనేచావదని సాతాను హవ్వను నమ్మింపజేసెను. (ఆదికాండము 3:1-5) కాబట్టి, శరీరము మృతినొందిన తర్వాత, జీవించియుండు అమర్త్యమైన ఆత్మనొకదానిని మానవులు కలిగియుందురని ప్రారంభించబడిన ఈ అబద్ధ సిద్ధాంతమునకు పూర్వము అటువంటి నమ్మకమే లేకుండెను.—ది వాచ్‌టవర్ సెప్టెంబరు 15, 1957, పుట 575 చూడుము.
b ఇన్సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్, సంపుటి 2, పుటలు 614-16, 899-901.
c “లెట్ యువర్ కింగ్డం కం,” పుటలు 186-9.
మీరేమి గుర్తుంచుకొన్నారు?
◻ దేవుడు ఒక త్రిత్వమా, అలా అని మీరెందుకు జవాబిచ్చుచున్నారు?
◻ దేవుని నామము యుక్తముగా ఎక్కడ ఉండవలెను?
◻ మానవ ఆత్మ అమర్త్యమైనదా?
◻ అల్లకొల్లల లోకములో క్రైస్తవ ప్రవర్తననుగూర్చి యెహోవా ఎటువంటి వివేకమును దయచేసెను?
◻ యెహోవాసాక్షులు బైబిలు ప్రవచనముల నెరవేర్పునుగూర్చి ఏ వివేకమును పొందిరి?
[8వ పేజీలోని చిత్రాలు]
ది వాచ్‌టవర్ పత్రికద్వారా “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు” లేఖనముల భావము మరియు మనకాలము కొరకైన అన్వయింపు విషయములో వివేకమును దయచేయుచున్నాడు