కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 8/1 పేజీలు 12-13
  • గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • గలిలయలో ప్రకటించాడు, అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • ఆనందభరితులైన కోత పనివారిగా ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యేసు దేవుని రాజ్యం గురించి చెప్పాడు
    నా బైబిలు పుస్తకం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 8/1 పేజీలు 12-13

యేసు జీవితము పరిచర్య

గలిలయకు చేసిన మరొక ప్రచారయాత్ర

రెండు సంవత్సరములు పట్టుదలతో తీవ్రముగా ప్రచారముచేసిన పిదప, యేసు యిప్పుడు దానిని విడిచి, చులకనగా ఎంచుచున్నాడా? బదులుగా, గలిలయకు మరొక యాత్ర అనగా మూడవపర్యాయము వెళ్లుట మూలంగా తనప్రచారపనిని విస్తృతపరచుచున్నాడు. ఆ ప్రాంతమందలి అన్ని పట్టణములను, గ్రామములను ఆయన సందర్శించి సమాజమందిరములలో బోధించుచు, దేవునిరాజ్యసువార్తను ప్రకటించుచుండెను. మునుపు కంటె ప్రచారపు పనిని విస్తృతపర్చవలసిన అవసరతను ఈ యాత్రలో ఆయన గమనించినది ఆయనను ఒప్పింపజేసింది.

యేసు ఎచ్చటికి వెళ్లినను, జనసమూహము ఆత్మీయ స్వస్థత మరియు ఓదార్పు యొక్క అవసరతలో నున్నట్లు ఆయన గమనించెను. వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నారని ఆయన వారిని గూర్చి జాలిపడెను. తనశిష్యులతో ఆయన యిలా చెప్పెను: “కోతవిస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.”

యేసుకు కార్యాచరణ పథకమున్నది. దాదాపు సంవత్సరము క్రిందట ఆయన ఎంపిక చేసుకొనిన 12 మంది అపొస్తలులను ఆయన పిలిచెను. వారిని యిద్దరిద్దరినిగా విడదీసి, ఆరు ప్రచార బృందాలను ఏర్పరచి వారికి యిలా ఆజ్ఞాపించెను: “మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెలయొద్దకే వెళ్లుడి. వెళ్లుచు ‘పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.’”

మాదిరి ప్రార్థనలో యేసు వారిని ప్రార్థించుమని బోధించిన రాజ్యమును గూర్చియే వారు ప్రకటించవలెను. రాజ్యము సమీపించియున్నది అనగా దేవునిచే నియమించబడిన రాజైన, యేసుక్రీస్తు ప్రత్యక్షముగా ఉన్నాడని భావము. మానవాతీత ప్రభుత్వము యొక్క ప్రతినిధులుగా తన శిష్యులకున్న ఆధిక్యతలను స్థిరపర్చుటకుగాను, రోగులను స్వస్థపరచుట మరియు చనిపోయిన వారినికూడ లేపుటకు యేసు వారికి శక్తినొసంగెను. ఈ సేవలను ఉచితముగా చేయవలెనని ఆయన వారికి ఆజ్ఞాపించెను.

అటుతరువాత తమ ప్రచారయాత్రకొరకు ఏ వస్తు సామాగ్రిని సిద్ధంచేసికొనవద్దని ఆయన తన శిష్యులకు చెప్పెను: “మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను ప్రయాణముకొరకు జాలెనైనను రెండుఅంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడే.” ఆవర్తమానమును అభినందించేవారు ప్రతిస్పదించి ఆహారమును, వసతిని ఏర్పాటుచేస్తారు. యేసుచెప్పిన మాటలలో అది కన్పించును: “మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతనియింటనే బసచేయుడి.”

పిమ్మట రాజ్యవర్తమానముతో గృహయజమానులను ఎలా సమీపించాలో యేసు సూచించెను. “మీరు ఒక యింటిలోనికి ప్రవేశించునపుడు ఇంటివారికి శుభమని చెప్పుడి. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను పట్టణమునైనను విడిచి పోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.”

వారి వర్తమానమును నిరాకరించు పట్టణమును గూర్చి యేసు చెప్పుచు: “విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదైయుండుననెను.” దీని భావము సొదొమవారు పునరుత్థానులగుదురని కాదు. బదులుగా ఇచ్చట, తన ప్రేక్షకులైన ఇశ్రాయేలీయుల మదిలో తీర్పుదినమందు పునరుత్థానులగుటకు పూర్తిగా అయోగ్యులని ఎంచబడుచున్న పురాతన సొదొమీయుల స్థితి ఓర్వతగినదైయుంటుందని చెప్పుటద్వారా, అటువంటి పట్టణప్రజలపై మోపు దోషారోపణను యేసు నొక్కి తెలుపుచున్నాడు. మత్తయి 9:35–10:15; మార్కు 6:6-12; లూకా 9:1-5.

◆ గలిలయకు యేసు తనమూడవ ప్రచార యాత్రను ఎప్పుడు ప్రారంభించెను, అది ఆయనకు ఏమి ఒప్పింపజేసెను?

◆ ఆయన 12మంది అపొస్తలులను ప్రకటించుటకు పంపునపుడు, ఆయన వారికి ఏ ఉపదేశము నిచ్చెను?

◆ రాజ్యము సమీపించియున్నదని శిష్యులు ప్రకటించుట ఎందుకు సరియైయున్నది?

◆ తన శిష్యుల వర్తమానమును తిరస్కరించుటలోయున్న గంభీరతను యేసు ఎట్లు నొక్కి తెలియజేసెను? (w87 7/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి