వార్తలలోని సారాంశము
రోగగ్రస్తమైన విద్య
గత పదిసంవత్సరములనుండి న్యూయార్క్‌రాష్ట్రములోని ఒక కాలేజి, మూడు కాలేజి పట్టాలను పొందగల మానవలైంగిక సంబంధమైన విద్యనందించుచున్నది. అందలి విద్యార్థులు పరిశీలకయాత్రలో బయటకువెళ్లి వేశ్యలతో మాట్లాడుట, శృంగారక్రియలు విచ్ఛలవిడిగా జరుపు బార్‌లను, లేక నగ్నముగాయుండు బీచ్‌లకు వెళ్లి వారిని పరిశీలించుటయు చేయవలసియున్నది,” అని న్యూయార్క్‌పోస్టు కాలమిస్టు రిపోర్టుచేయుచున్నారు. తరగతియందలి అచ్చు పుస్తకములు నోటితో అభ్యసించు లైంగికక్రియలను, మరియు హస్తప్రయోగమును గూర్చిన ఉపదేశములను స్పష్టముగా అందిస్తుందట. పోస్టు ప్రకారము క్లాసురూమునందలి పాఠ్యప్రణాళికలో భాగముగా విద్యార్థులకు “ఒక జత లైంగిక సంపర్కమునందు పాల్గొనుచున్న చిత్రములను” అలాగే “స్త్రీపురుష శరీరాంగములను అతి దగ్గరగా చూపించుటయు చేయుదురు”. ఒకరి పవిత్రత మరియు మాన్యతాభావములను యింతకంటె ఎక్కువగా తీసివేయునది వేరే ఏమున్నది?—ఫిలిప్పీయులు 4:8, 9.
యవనస్థులకు జీవితసత్యములను ఎరుగుట మరియు వాటినిగూర్చిన మంచి దృక్పధము కలిగియుండుట అవసరమైనను, అట్టి ఉపదేశమునిచ్చుటకు తల్లిదండ్రులు ముఖ్యమైన బాధ్యతను కలిగియున్నారు. (సామెతలు 22:6) వివాహమునకు వెలుపటి లైంగికసంబంధమును, X-రేటెడ్ చిత్రములను చూపించుట మరియు పురుషసంయోగము, వేశ్యవృత్తిని బహిర్గతముచేయు ఎట్టి పాఠశాలవిద్యయైనను దేవుని ఆరాధించు సత్యారాధికులకు అంగీకారముకాదు. వ్యభిచారము, జారత్వము, పురుషసంయోగమునందు పాల్గొనువారిని బైబిలు స్పష్టముగా “తుచ్ఛమైన అభిలాషలుగల” వారిగాను “అవాచ్యమైన” దానిని చేయువారిగాను వర్ణించుచున్నది. అట్టివాటినిగూర్చి బైబిలు: “జారత్వమునకు దూరముగా ఉండుడి,” అని ఆజ్ఞాపించుచూ, “మీలో జారత్వమును. . .ఉచ్ఛరింపకూడద”నియు చెప్పుచున్నది.—రోమా 1:24-32; 1 థెస్సలొనీకయులు 4:3; ఎఫెసీయులు 5:3, 5; గలతీయులు 5:19, 21.
ఒక అబద్ధ నిరీక్షణ
పురాతనకాలమందు మృతశరీరములను దాచి ఉంచుకొను అలవాటు ప్రకారమే “మరణములోకి ఒక ప్రత్యేక వ్యక్తిగత మార్గము” ను కలిగియుండవలెననుకొను ప్రజలు సాధారణ రీతిలో సమాధిచేయబడుటను కోరుకొనుటలేదని దివాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టుచేయుచున్నది. మొదట 7,500 డాలర్లఖర్చుతో “ఒక వ్యక్తి రెండు నెలలు ద్రాక్షారసము, కొన్నిచెట్లమొక్కలు, భద్రపరచగల కెమికల్స్, సువాసనగల తైలములో శ్రేష్టమైననూలు, ఫైబర్‌గ్లాసు, పోలిథిన్ మరియు ప్లాస్టర్‌తో కట్టబడి రెండు నెలలు నానబెట్టుదురు.” అని జర్నల్ చెప్పుచున్నది. శరీరమును ఉంచుటకై చేయబడిన కంచుపెట్టె దానిపై పొదుగు బంగారము, మరియు నగల విలువ 1,00,000 డాలర్లు లేక యింకా ఎక్కువగును.
అయినను అలా చేయించుకొనుటకు ప్రజలను ఆకర్షించునది ఇట్టి సాటిలేని పద్దతియేకాదు. ఒక వ్యక్తి యిలా అనుచున్నాడు: “కొందరు క్రైస్తవులు చెప్పునట్లు తీర్పుదినమందు క్రీస్తు మృతులను సమాధులలోనుండి లేపుతాడు అనునది నిజమే అయినట్లయిన నాకు చేతనైనంత మంచి షేప్‌లో (ఆకారములో) నేనుండ కోరుకుంటాను.”
చనిపోయిన తరువాత మరలా ఆత్మతిరిగి వచ్చి ప్రవేశించునట్లు శరీరమును దాచి ఉంచవలెనను పురాతన ఐగుప్తీయులవలెనె, వీరు తమనమ్మకమును ఆత్మ అమర్త్యముగలది అను బోధపై ఆధారము చేసికొనియున్నారు. తీర్పుదినమందు నీతిమంతుల ఆత్మలు, దుష్టుల ఆత్మలు తమశరీరములతో మరలా కలుపబడి పరలోక ఆశీర్వాదమునకేగాని, లేక నరకమందు దండింపబడుటకేగాని వెళ్లునని మతనాయకులు బోధింతురు.
అయినను, మనము సహజముగా అమర్త్యతను ధరించుకొనియున్నామను సిద్ధాంతము బైబిలులో బోధింపబడలేదు. “పాపముచేయు ఆత్మ ఏదో అదియే మరణించును” (యెహెజ్కేలు 18:4 NW) ఆవిధముగా బైబిలులో చూపబడినట్లు జీవితమునకు తరవాతి నిరీక్షణ అమర్త్యమైన ఆత్మకాక, అదేరూపముగల తగినశరీరముతో తాను చనిపోయినప్పుడుయున్న జ్ఞాపకాలతో అదేవ్యక్తి మరలా దేవునిచే పునరుత్థానము చేయబడటము. యేసు సరిగా చెప్పినట్లు: “ఒకకాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దమువిని బయటికి వచ్చెదరు”—యోహాను 5:28, 29.
“లోకసంబంధులుకారు”
గతసంవత్సరము ఒక 19 అంతస్థుల నివాసభవన నిర్మాణపు స్థలమును మార్చుకొనేందుకు అడుగుటకై వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్‌సొసైటి ఆఫ్ న్యూయార్క్ ఐఎన్‌సి., న్యూయార్క్ సిటి ఎస్టిమేట్ బోర్డును కలుసుకొన్నది. ఆ నిర్మాణం విషయములో ఎక్కువమంది నిరాకరించగా అందుకు అనుకూలముగా న్యూయార్క్ సిటి మేయర్ ఎడ్వర్డు కోచ్ తరపున రెండు వోట్లుమాత్రము వేయబడెను. తన నిర్ణయమునకు కారణమును వివరిస్తూ మేయర్ కోచ్ గమనించిన విషయము యిలా ఉన్నది: “యెహోవాసాక్షులు మాత్రమే మంచి పొరుగువారిగా యెంచబడగలరు. వారిని ఉన్నతమైన గౌరవమునకు పాత్రులనుగా నేను యెంచుదును.” ఇంకను ఆయన చెప్పినదేమనగా “మతసంబంధమైన కారణమును బట్టి వారు ఏ ఎన్నికయందును వోటుచేయరని చెప్పబడ్డాను. బహుశ ఈ నిర్మాణము విషయములో వారు ఎదుర్కొనుచున్న సమస్యలకు కారణములలో ఇదొకటై యుండవచ్చును. ఇటువంటి వివాదాస్పద విషయములలో వోటు వేయనటువంటివారు జయము సంపాదించడం చాలా కష్టము. ఎందుకనగా ఎన్నుకొనబడిన అధికారులు ఇంకొకపక్షముగా ఎక్కువమంది ప్రజలవలన పీడించబడటం జరుగుతుంది.”
వ్యతిరేకించిన అనేకులమధ్య తన ధైర్యము మరియు నిష్పక్షపాతమునకు మేయర్ కోచ్ మెచ్చుకొనబడవచ్చును. రాజకీయ సంబంధమైన ఎన్నికలలో పాల్గొనినట్లయిన పరిస్థితులు వేరుగాయుండినను, రాజకీయ వివాదాంశములందు తాము కలిగియున్న తటస్థవిధానమునుండి అది ఎంతటి ప్రతిఫలదాయకమైనదైనను వారు వైదొలగరు. నిజక్రైస్తవుల స్థానము స్పష్టమైయున్నది. ఎందుకనగా యేసు యిలా చెప్పెను: “నేను లోకసంబంధినికానట్టు వారును లోకసంబంధులుకారు”.—యోహాను 17:16. (w89 2/15)