కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 5/1 పేజీలు 26-27
  • “కొరాజీనా! నీకు శ్రమ”—ఎందుకు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కొరాజీనా! నీకు శ్రమ”—ఎందుకు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • గలిలయ సముద్ర ప్రాంతాన్ని పర్యటిద్దాం రండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • A7-D యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (2వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • స్పందించని తరంవాళ్లకు శ్రమ
    యేసే మార్గం, సత్యం, జీవం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 5/1 పేజీలు 26-27

వాగ్ధానదేశమునుండి దృశ్యములు

“కొరాజీనా! నీకు శ్రమ”—ఎందుకు?

మీపై దేవుడు శ్రమను ప్రకటించుటను మీరు కోరుకొనరు. అలా కోరుకొందురా? అట్లయితే మూడు గలిలైయ పట్టణములపైన దేవునికుమారుడు, మరియు న్యాయాధిపతి శ్రమను ప్రకటించుటను అందలి యూదులు ఎట్లు భావించియుందురో ఆలోచించుము:

“అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్టకట్టుకొని బూడిదెవేసికొని మారుమనస్సుపొంది యుందురు. విమర్శదినమందు మీగతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదైయుండునని మీతో చెప్పుచున్నాననెను. కపెర్నహూమా, . . ..నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.”—మత్తయి 11:21-23.

పైనున్న దృశ్యము వాటిలోని ఒకపట్టణమగు కొరాజీనాను చూపించుచున్నవి. ఈ చిత్రము 1989 యెహోవాసాక్షుల క్యాలండరు నందలి జూలై/ఆగష్టు నెలలలో కనిపించును. ఆసక్తిదాయకముగా మత్తయి 11:21-23లోని యేసు మాటలు ఆగష్టు నెలలో యెహోవాసాక్షుల బైబిలు చదువు కార్యక్రమపట్టికనందున్నది. కావున కొరాజీనాను గురించి మనమేమి తెలుసుకొనవలసియున్నాము?

మొదట, పురాతన కొరాజీనా ఎక్కడున్నదో గమనించును. ఈ ఫోటోగ్రాఫ్‌లోని క్రింది భాగములో దాని శిధిలాలను మీరు చూడవచ్చును. ఆ తరువాత గలిలైయ సముద్రపు ఉత్తర తీరమందలి చెట్లను గమనించుము. దానికి రెండుమైళ్ల దూరములో కపెర్నహూము ఉన్నది. పైనుండి తీసిన ఈ ఫొటోగ్రాఫ్‌ దృశ్యమును బట్టి కొరాజీనా, ఒక సమభూమిగా కనిపించునట్లు చేయుచున్నది. కాని నిజమునకు అది కొండలలో సముద్రదరికి 885 అడుగుల ఎత్తులో యున్నది.

మరియు కపెర్నహూమునుండి దాదాపు అదే దూరములో తీరమార్గమున బేత్సయిదా యున్నది. ఆవిధముగా ఈ మూడు పట్టణములను నిందించుటలో గలిలైయలో తనకార్యమునకు కేంద్రప్రాంతమైన చిన్నప్రదేశమునకు ఎక్కువగా మన అవధానమును మలుపుచున్నాడు. (మత్తయి 4:13; మార్కు 2:1; లూకా 4:31) ఎందుకు యేసు వాటికి శ్రమను ప్రకటించాడు?

యేసు తన అపొస్తలులతో ఎక్కువకాలమును ఈ ప్రదేశమందు గడిపాడు. అనేక అద్భుతకార్యాలను చేశాడు. బేత్సయిదాకు దగ్గర ఆయన అయిదు వేలమందికి అద్భుతరీతిలో ఆహారమును పెట్టాడు, ఒకగ్రుడ్డివానికి చూపునిచ్చాడు. (మార్కు 8:22-25; లూకా 9:10-17) కపెర్నహూమునకు సమీపములో లేక అందులో వ్యాధిగ్రస్థుని దూరముననుండియే బాగుచేసెను. దయ్యము పట్టినవానిని బాగుచేయుట, పక్షవాయువుగలవానిని నడుచునట్లు చేయుట, సమాజమందిరపు అధికారి కుమార్తెను పునరుత్థానముచేయుట జరిగినది. (మార్కు 2:1-12; 5:21-43; లుకా 4:31-37; యోహాను 4:46-54) కొరాజీనాలో ఏ మహత్కార్యములను చేసినది బైబిలు వివరణగా చెప్పకపోయినను, మత్తయి 11:21 మాత్రము ఆ చోటనో లేక ఆ చుట్టుప్రక్కలనో యేసు అద్భుతములను చేసినట్లు సూచించుచున్నది. అయినను ప్రజలు పశ్చాత్తాపపడి, దేవుని శక్తినికలిగియున్న మెస్సియాగా మాత్రము ప్రజలు ఆయనయందు విశ్వాసముంచలేదు.

యేసు అట్టి కార్యములను చేయుచున్నట్లు చూపుచున్న ప్రక్క దృశ్యమును చూచి ఎందుకు కొరాజీనా ప్రజలు అట్లు ప్రత్త్యుత్తరమివ్వనివారై యుండిరని మీరడగవచ్చును? ఈ శిధిలాలలో పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వి తీసిన బ్లాక్‌ బసాల్ట్‌ స్టొన్స్‌ నుండి కొంత ఆధారము దొరకుచున్నది. ఇవి సా.శ. మూడవ శతాబ్దము నాటివి. త్రవ్వి తీయబడిన వాటియందు ఒక సమాజమందిరము, దగ్గరలోని కొన్నినివాసప్రాంతములు ఉన్నవి. త్రవ్వితీయబడిన సమాజమందిరపు రాళ్లలో కొన్నిఅసాధారణ చెక్కడపు చిత్రములున్నవి. గ్రీకుపురాణపు ప్రతిమలు అనగా పాములవంటి వెంట్రుకలుగల మెడూస, సగము మనిషి సగము గుర్రము రూపముతోయుండు సెంటార్‌ రూపములున్నవి. అట్టి విగ్రహారాధన రూపములను యూదావిధానము ఖండితముగా వ్యతిరేకించవలసియున్నప్పుడు, కొరాజీనాలోని యూదానాయకులు వారి సమాజమందిరములో వాటిని ఎందుకు అనుమతించారు?

ఇందుకు ఒకసిద్ధాంతము ఏమనగా “దేనినైనను స్వేచ్ఛగా అనుమతించే స్వభావము ఆ ప్రాంతములో ఆచారయుక్తమైనదిగా యుండి ఉండవచ్చును” అది వారు మంచి ప్రత్యుత్తరమిత్తురను అభిప్రాయమును యేసునకు ఇచ్చుటకు కారణమైయుండును.a అయితే సమాజమందిరపు చిత్రప్రతిమలు యేసు దినములనాటి వారి దృక్పధమును ఏమైన సూచిస్తున్నట్లయిన, కొరాజీనాలోని ఎక్కువమంది “తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించు” శ్రద్ధను కలిగిలేరను దానిని సూచించుచున్నది. (యోహాను 4:23) అద్భుతములు చేయు మెస్సియాను వారు అంగీకరించకపోవుటద్వారా అది చూపబడినది.

యేసు 70 మంది శిష్యులను పంపించినప్పుడు కొరాజీనా, బేత్సయిదా, కపెర్నహూము యొక్క అప్రత్త్యుత్తరమును యిమిడ్చి ఒక అలంకారిక వాక్యమును ఉపయోగించెను. ఆయన చేసిన అద్భుతకార్యములను తెలిసికొనియున్న కొరాజీనా లోని యేసుతోటి గలిలైయులు అనుకూలముగా ప్రత్యుత్తరమివ్వక పోయినందున వారు ప్రకటించిన యితరపట్టణములలో తమను చేర్చుకొనకపోయిన వారు ఆశ్చర్యపడకూడదు.—లూకా 10:10-15.

కావున నిర్జీవముగానున్న కొరాజీనా శిధిలాలను మనము తలంచుకొలది, “శ్రమ” అని యేసు చెప్పినదానిలోని హెచ్చరికను మన హృదయములోనికి తీసుకొనవలెను. పశ్చాత్తాపపడకుండా, ఆయన ప్రజలచే చేయబడు దేవుని పనికి ప్రత్త్యుత్తరమివ్వకపోవుట హీనమైన మరియు శిధిలమైన భవిష్యత్తుకు నడిపింపగలదు. (W89 7/1)

[అధస్సూచీలు]

a 1959లో ఎడ్యుకేషనల్‌ హెరిటేజ్‌, ఐయన్‌సి.,న్యూయార్క్‌ వారిచే ప్రచురింపబడిన ది వరల్డ్‌ ఆఫ్‌ ది బైబిలు, వాల్యూమ్‌ 5, పేజి 44.

[26వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

Chorazin

Bethsaida

Capernaum

Sea of Galilee

Tiberias

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి