కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 4/1 పేజీ 7
  • బర్మాలో ‘పైరుపండినది’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బర్మాలో ‘పైరుపండినది’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇది డైనాములో జరిగినది
  • పనికిరానిదిగా పారవేయబడిన పుస్తకమునుండి సత్యమును పొందుట
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • నా యౌవన దశనుండే యెహోవాను దృఢంగా నమ్ముకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పయినీర్లకు మద్దతు చూపుట
    మన రాజ్య పరిచర్య—1992
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 4/1 పేజీ 7

రాజ్యప్రచారకుల నివేదిక

బర్మాలో ‘పైరుపండినది’

◻ సుందరమైన బర్మాదేశము 1,500 కంటె ఎక్కువ సువార్త ప్రచారకులను కలిగియున్నది. ఇటీవలి వారి సమావేశములు 2,273 మంది హాజరుతో బర్మా, లుషాయి, హకాచిన్‌ భాషలలో జరిగినవి. ‘భూమిపైరుపండియున్నది’ అని దర్శనములో యోహానుచూచిన దానిని నెక్కితెల్పుచూ రాజ్యవర్తమాన విషయములో గొఱ్ఱెలాంటి ప్రజలు కల్గిన శ్రద్ధను ఈ దిగువ అనుభవములు కనబర్చుచున్నవి.—ప్రకటన 14:15.

ఇది డైనాములో జరిగినది

◻ మటుపిలో యింటింటి పరిచర్య యందున్నప్పుడు, నరకమునుగూర్చి తెలుసుకొనుటకు ప్రత్యేక శ్రద్ధ కల్గిన ఒక విద్యార్ధిని ఒకస్పెషల్‌ పయినీర్‌ కలుసుకొనెను. బైబిలునందలి నరకము అనునది మానవుని సామాన్యసమాధి అనియతనికి వివరించినప్పుడు, అతడు చాలా ఆశ్చర్యపడెను. అతడు దానిని దాచిపెట్టలేక తన గ్రామమైన డైనాములోని తనబంధువులకు చెప్పవలెనని తలంచెను. స్కూలు సెలవుదినములలో తనగ్రామమునకు వెళ్లి నరకమును గూర్చిన సత్యమును వ్యాప్తిచేసెను. అతని బావ ఇంకనూ ఎక్కువ తెలిసికొనగోరి స్వయంగా పయినీరుతో మాట్లాడుటకు ఆ విద్యార్ధితోపాటు మటుపికి వెళ్లెను. కొన్ని వారములపాటు అతడు మటుపిలో ఉండి, పయినీరుతో పఠనముచేసెను. తరువాత, మటుపికి తన రెండవ సందర్శనములో, అతడు తన స్వగ్రామములో ఆసక్తిగల వ్యక్తులు అనేకులున్నారు గనుక పయినీర్లను తనగ్రామమును సందర్శించమని బలవంతముచేసెను. ముగ్గురు పయనీర్లు సంతోషంగా ఆహ్వానమును అంగీకరించారు. డైనాము చేరుటకువారికి 12గంటల కష్టముతో కూడిన సమయము పట్టింది.

పయినీర్లుచేరిన సమయమున అక్కడ ఒక మరణసంస్కారము జరుగుచుండెను, బైబిలు నరకమును గూర్చి వినుటకు ప్రక్క గ్రామములనుండి కూడ ప్రజలు అక్కడికి వచ్చారు. దర్శించుటకు వచ్చినవారిని చూచుటకు వారంతా త్వరపడుచున్నారు. ఒకబైబిలు చర్చ ప్రారంభమై రాత్రి 7 గంటలనుండి 11 గం.లవరకు కొనసాగింది. ఆ గుంపునందలి వివేకవంతుడైన ఒక వ్యక్తి, మరుసటి దినమునిమిత్తము పయినీర్లు కొంత విశ్రాంతి తీసుకొనేందుకు ఆ చర్చను రాత్రి 11 గం.లకు ఆపుచేసెను. మరుసటి ఉదయమున, వారు బైబిలు చర్చను దాదాపు ఏడు గంటలకు ప్రారంభించి మధ్యలో భోజనముకొరకు కొంతసమయాన్ని తీసుకొని రాత్రి పదిగంటలవరకు కొనసాగించారు. పయినీర్లు ఆ గ్రామమును విడిచి వెళ్ళేటప్పుడు, గొఱ్ఱెలాంటి ఆ ప్రజలు, మరలా వచ్చి తమతో మరింత సమయాన్ని గడుపమని వారిని వేడుకున్నారు. బోధనొందదగిన వ్యక్తులకు ప్రశస్తమైన రాజ్యసువార్తతో సహాయపడుట ఎంతటిభాగ్యం. నిజంగా, బర్మాలో పైరు ‘పండింది’!

పనికిరానిదిగా పారవేయబడిన పుస్తకమునుండి సత్యమును పొందుట

◻ బర్మాలో ఒకాయన, చిత్తుకాగితములుగా పుస్తకములను, వార్తాపత్రికలను అమ్ము తనస్నేహితుని సందర్శించినప్పుడు, ఆ చిత్తు కాగితములలో అట్టలేని ఒక పాత పుస్తకాన్ని చూచాడు. దానిని తీసి చదవడం మొదలుపెట్టాడు. త్వరలోనే దానిలో లీనమైపోయెను. అది వాచ్‌టవర్‌ సొసైటి ప్రచురణయైన లిసనింగ్‌ టుది గ్రేట్‌టీచర్‌. ఇంకా ఎక్కువ పుస్తకములను పొందుటకు అతడు సొసైటి బ్రాంచికార్యాలయమునకు వ్రాసెను. వెంటనే బ్రాంచి ఆఫీసు అతనిని సందర్శించుటకు ఒకపయినీరును పంపెను. అతనితో పఠనము ప్రారంభించబడింది, అటువంటి కొన్నిపఠనముల తరువాత సత్యస్వరమును గ్రహించి అతని జీవితంలో దురలవాట్లను విడిచి శుభ్రపరచుకొన ప్రారంభించెను. అటుపిమ్మట తన హిందూ మతవిగ్రహములన్నింటిని వదలించుకొనెను. ఎంతోకాలము గడువక ముందే అతడు అతని పెద్దకుమార్తె యెహోవాకు తమ్మును తాము సమర్పించుకొని బాప్తిస్మము పొందిరి. ఇప్పుడతడు ఒక రెగ్యులర్‌ పయినీరు.

నిజంగా, బర్మాలోని ఫలవంతమైన పొలములో “కోతవిస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు.”—మత్తయి 9:37, 38. (w89 2/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి