వార్తలలోని భావావగాహనము
వేరుపడిన యిల్లు
“ఒక యిల్లు తనకుతానే విరోధముగా వేరుపడినయెడల, ఆ యిల్లునిలువనేరద,”ని యేసు చెప్పెను. (మార్కు 3:25) అయితే పురుషసంయోగము మరియు విచ్ఛలవిడిగా శృంగారక్రియలలోపాల్గెనే స్త్రీపురుషులను చర్చినియామకములలో నియమించే వివాదాంశములో, దేశపు అతిపెద్ద ప్రొటెస్టెంట్ చర్చియైన యునైటెడ్ చర్చ్ ఆఫ్ కెనడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనుచున్నది.
యునైటెడ్ చర్చ్ ఆఫ్ కెనడా 32వ జనరల్ కౌన్సిల్‌చే తీసుకొనబడిన తీర్మానము పురుషసంయోగము నభ్యసించువారిని మతగురువులుగా నియమించుటను అనుమతించుచున్నది. కెనడా వార్తాపత్రికయైన ది గ్లొబ్ అండ్ మెయిల్ ప్రకారము ఆ తీర్మానము చెప్పునదేమనగా, ఒక వ్యక్తిలో నెలకొనియున్న లైంగిక యిచ్ఛ ఎట్టిదైనను, “యేసుక్రీస్తునందు విశ్వాసము, మరియు విధేయతను కలిగియున్నట్లు చెప్పుకొను ఎవరైనను చర్చి సభ్యులగుటకు, లేక అయ్యుండుటకు ఆహ్వానింపబడుచున్నారు,” “చర్చిసభ్యులందరు నియమిత పరిచర్యలో నియమింపబడులాగున పరిశీలించబడుటకు యోగ్యులైయున్నారు.” 125 పేజీల యునైటెడ్ చర్చి రిపోర్టు చెప్పునదేమనగా: “లైంగిక ప్రవృత్తులు వివిధరకములు: పురుషసంయోగము, ఒకే వ్యక్తిలో స్త్రీ మరియు పురుషసంబంధమైన లైంగికత్వము (ద్విలింగాత్మకమైన), మరియు విభిన్నమైన లైంగిక యిచ్ఛ. ఇవన్నియు సహజమైన వాటిగాను మరియు దేవుడిచ్చిన వరముగాను ఎంచబడవలెను.”
అయితే పురుషసంయోగులను మతగురువులుగా అంగీకరించు తీర్మానముపై వ్యాఖ్యానించుచు, ది గ్లోబ్ యిలా వివరించుచున్నది: “ముఖ్యమైన వివాదాంశమేమనగా అసలు చర్చి నిలుస్తుందా”యనునది. 1972నుండి క్రమముగా చర్చి తన సభ్యులను కోల్పోవుచు, ఆర్ధిక యిబ్బందులలో మునిగియున్నది. కారణం? “చర్చి దానిక్రైస్తవ వేరులనుండి కొట్టుకొని పోవుటను చూచుకొలది ప్రజలు దానిని విడిచి వెళ్లుటయే.” అని మతగురువైన జాన్ విడీ తెల్పుచున్నాడు. “కావున,” ది పోస్టు ఆఫ్ కెనడా నివేదించునదేమనగా, “పురుషసంయోగము, వివాహబంధమునకు వేరుగా లైంగికసంబంధము, అవసరమునుబట్టి గర్భస్రావము మరియు పరిష్కారములేని వివాహములందు పాల్గొనుటకు యువతరమునకు బాహాటమైన అవకాశమునిచ్చుచున్నవి.
ఏమైనను క్రీస్తుకు లోబడుటయనునది బైబిలు సూత్రములకు రాజీపడుటను అనుమతించునా? అందుకు భిన్నముగా దేవునివాక్యము యిలా స్పష్టపరచుచున్నది: “మిమ్మును మీరు బుద్ధిహీనులుగా చేసికొనకుడి; . . . లైంగిక అవినీతి గలప్రజలు . . . పురుషసంయోగులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.”—1 కొరింథీయులు 6:9, 10, టు డేస్ ఇంగ్లీషు వర్షన్.
బెత్తమును వాడుట
యిండ్లలోను, పాఠశాలలోను పిల్లలకు భౌతికశిక్షనిచ్చులో వెనుకాడుతున్న ఆధునిక దిన స్వభావమునుగూర్చి విలపిస్తూ, దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ది నెటాల్ మెర్కురి, “బెత్తమును వాడకుండా, ఫలితములను చూడుము” అనుపేరున ఒకశీర్షికను వ్రాసినది. బెత్తముతో చురుకైన దెబ్బకొట్టుటలో మారిన యిట్టి వైఖరికి బాధ్యులెవరు? దక్షిణ ఆఫ్రికాలోని యూనివర్సిటి ఆఫ్‌నెటాల్‌లో పిల్లల వైద్యునిపుణుడైన ప్రొఫెసర్ స్మితే, దీనికి ముఖ్యకారణము పిల్లల మనస్తత్వ శాస్త్రజ్ఞులని వారిని బాధ్యులనుగా చేయుచున్నాడు. “భావోద్రేకమైన వివాదాంశముపై లోతుగా పరిశీలించి” స్మితే యిలా వివరించుచున్నాడు, “మనస్తత్వ పిడివాదములనుండి ఈ వైఖరిలో మార్పు ప్రారంభమగుచున్నట్లు ఒకడు కనుగొనవచ్చును. మొదట ప్రతివిధమైన భౌతికశిక్షను తీవ్రముగా వ్యతిరేకించి, హద్దులులేనప్పుడు విఫలతలే లేవను సిద్ధాంతము నుండి ఉత్పన్నమౌతున్న యిట్టి క్రమశిక్షణారాహిత్యపు ఫలితములనుబట్టి భయపడుచున్నారు.”
ఇచ్చట స్మితే సమతూకమును చాటుచున్నాడు. “మరీ విపరీతంగా శిక్షించుట ఎంతచెడ్డదో, అతిగా విచ్ఛలవిడిగా వదలిపెట్టుటయు అంతే చెడ్డది,” “అయితే బొత్తిగా శిక్షింపబడనివానికన్న అతిగా శిక్షింపబడినవాని నుండే మంచిఫలితములు సులభమను వాస్తవము, సందేహమున్నప్పుడు శిక్షించుటపైనే ఆధారపడుట మంచిదని చూపుతుంది.” భౌతిక శిక్షయొక్క ఉద్దేశ్యము పిల్లవాని ప్రస్తుత మరియు భవిష్యత్ క్షేమమైయుండవలెనని ఫ్రొఫెసరు నొక్కిచెప్పుచున్నాడు.
అట్టి సలహా క్రొత్తదేమి కాదుగాని పరిపూర్ణమైన బైబిలు నడిపింపునకు తిరిగి వెళ్లుటయే: “బెత్తమువాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.”—సామెతలు 13:24; సామెతలు 23:13, 14ను కూడా చూడుము.
జూదము పాపము కాదా?
యు.ఎస్.ఎ. లోని విస్‌కన్సిన్‌లో లాటరీటిక్కెట్లను అమ్ముటకు అనుమతినికోరిన మొట్టమొదటి మతసంస్థ ఒక రోమను కేథలిక్ చర్చిసంస్థయని ది షెబాయ్‌గన్ ప్రెస్ రిపోర్టుచేసినది. ఈ అమ్మకములు వారపు చందారాబడులను “పెంచుటకని” అనుచున్నను, దీనికి వెనుకనున్న ముఖ్యకారణము “బింగో గేమ్సు”కు వచ్చువారి సంఖ్యను పెంచుటకై యున్నది. ఇప్పటికే చర్చి బింగో గేమ్సును నిర్వహిస్తు ఒక రాత్రికి “800 నుండి 1,000 డాలర్ల వరకు లాభమును పొందుచున్నట్లు” నివేదించబడింది.
జూదము నిజముగా పాపమా అని అడగబడినప్పుడు చర్చిసంస్థ ప్రీస్టు రాబర్టు ఫ్లెష్‌మాన్ యిలా జవాబిచ్చెను: “నాకు తెలియదు.” బింగోను లేక లాటరీటిక్కెట్ల అమ్మకమును చర్చి నడిపించుచున్నదనియు, ఇది “బహుశా, మన ఆత్మీయపిలుపునకు, మించి కొంతమేరకు ప్రక్కకు వెళ్లుటయే,” ననియు అంగీకరిస్తూ, “ఒకవేళ వారు యిక్కడకు రాకపోయినను తమడబ్బును ఖర్చుచేయుటకు మరొకచోటికి వెళ్లుదు” రనెను.
అయితే క్రీస్తు అనుచరుడనని చెప్పుకొను మతనాయకుడు జూదమును పురికొల్పవచ్చునా? లేదు. ఏ విధమైన జూదమైనను మానవలక్షణములలో అతినీచమైన లక్షణమును అది కోరుచున్నది. అదేమనగా—లోభత్వము లేక పేరాశ. దానిని చేయువారు యితరుల నష్టమునుండి మనము లాభము పొందుట సరియేనను నమ్మకమును ప్రోత్సహిస్తున్నారు. లోభులు దేవునిరాజ్యమును స్వతంత్రించుకొనరని దేవునివాక్యము స్పష్టముగా తెలియపరచుచున్నది.—1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 4:19; 5:3. (w88 12/15)