కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 9/1 పేజీలు 30-32
  • యెహోవాకు మనమెట్లు తిరిగి చెల్లింతుము?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాకు మనమెట్లు తిరిగి చెల్లింతుము?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా నుండి కలుగు ఉపకారములు
  • యెహోవాకు నేను తిరిగి ఏమి చెల్లింతును?
  • మనము కలిగియున్నదానిని మనమెట్లు ఉపయోగించగలము?
  • వృద్ధులు మరియు యౌవనులనుండి కానుకలు
  • “ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవా తన పనిని వృద్ధిచేయు విధానము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 9/1 పేజీలు 30-32

యెహోవాకు మనమెట్లు తిరిగి చెల్లింతుము?

ఒక వ్యక్తి మనయందు నిజమైన మరియు ఆప్యాయతతోకూడిన శ్రద్ధను తీసుకొనినట్లయిన, బహుశా మనప్రయోజనము నిమిత్తమై ఒక పనిచేసినట్లయిన మనమెట్లు ప్రతిస్పందించుదుము? సాధారణముగా దయ మరియు దాతృత్వమునకు ప్రత్యుత్తరము లభిస్తుంది, కాదా? అట్లయిన మనయెడల యెడతెగక తన ప్రేమపూర్వకమైన దయను చూపించు మనదేవుడైన యెహోవాపట్ల మన భావముల విషయమేమి?

ప్రతిదిన జీవితవత్తిడుల వలన ఈడ్వబడుచున్నవారమై యెహోవా దయచేయు మేలులను ఏవోవాటంతటవిగా వచ్చువాటిగా యెంచుట, కొన్నిసార్లు అసలు కృతజ్ఞతలేనివారముగా నున్నట్లు కనిపించుట చాలా సులభంగా జరుగుతుంది. కావున కొంచెమాగి కీర్తన రచయితయొక్క ప్రశ్నపై మనము తలంచవలసియున్నాము. అదేమనగా “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమి చెల్లించుదును?” (కీర్తన 116:12) దీనికి మనము ఏయే విధములుగా ప్రత్యుత్తర మిచ్చుదుము?

యెహోవా నుండి కలుగు ఉపకారములు

తనవాక్యమైన, బైబిలు అను యెహోవా వరము లేనట్లయిన మనమెంతగా విడువబడినవారమైయుందుము! గడిచిన శతాబ్దములయందు ధైర్యవంతులైన స్త్రీ పురుషులు, దానిని కలిగియుండి, ఈ పుస్తకమును చదువుటకు తమప్రాణములను పోగొట్టుకొనిరి. వారెందుకట్లు చేసారో అర్థము చేసుకొనుస్థితికి మనము ఎదిగియున్నాము. దైవజనులు ఆయన ప్రేరేపితవాక్యము “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును” ప్రయోజనకరమైయున్నదని ఎరిగి ఎల్లప్పుడు దానికెంతో కృతజ్ఞతగలవారైయుండిరి.—2 తిమోతి 3:16.

ఏమైనను, “ప్రతిసత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” సన్నద్ధులమగుటకు కేవలము బైబిలును గూర్చిన జ్ఞానమును మనస్సునందు కలిగియుంటేనే చాలదని మనకు తెలియును. (2 తిమోతి 3:17) దానిప్రయోజనము దేవుని పరిశుద్ధాత్మ శక్తి మూలంగానే మన జీవితములకు తేబడియున్నది. ఈ విషయము తన ప్రవక్తయైన యెషయాకు యెహోవా వ్యక్తపరచిన వాటిద్వారా మన అవధానమునకు తీసుకు రాబడినది: “ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:16-18) తన వాక్యముతోపాటు ఆయన తన ఆత్మద్వారా మనకైమనము ప్రయోజనము పొందునట్లు నడుపును. తత్ఫలితముగా సమాధానము, నీతి ఫలించును.

అంతేగాక యెహోవా యొక్క చురుకైన శక్తి మన ప్రయోజనము నిమిత్తమై ఫలవంతముగా పనిచేయును. ఎందుకనగా ఒక నిర్మాణరూపము, అనగా ఒక భూసంబంధమైన సంస్థ స్థాపించబడియున్నది. దానిద్వారా పరిశుద్ధాత్మ పనిచేయును. మొదటి కొరింథీయులు 12వ అధ్యాయములో పౌలు క్రైస్తవసంఘమును ఒక శరీరమునకు పోల్చి 7వ వచనములో: “అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది” అని చెప్పుచున్నాడు. మరియు దేవుని భూసంస్థలో భాగమై యుండుటద్వారా మనమెట్లు ప్రయోజనమును పొందుచున్నామో ఆయన చూపించుచున్నాడు.

ఆమాటలు వ్రాసిన ఐదు సంవత్సరములు లేక ఆపైన ఎఫెసు సంఘమునకు తన పత్రికను వ్రాస్తూ అందులో ఆ భూసంబంధమైన ఏర్పాటుతో సంబంధము కలిగియున్నందున వచ్చు ప్రయోజనములను వివరించుచున్నాడు. ఆయన మొదట చెప్పినది అభిషక్తులకు అన్వయించుచున్నను ఈ నాటి గొప్పసమూహము కూడ ‘పరిచర్య జరిగించుటకు’ తగినవారై, ఆత్మీయముగా ‘సంపూర్ణపురుషులై’, విశ్వాసమందు స్థిరముగాయుండి, ‘ఇకమీదట పసిపిల్లలుకాక’, ‘ప్రేమకలిగి సంఘమునకు శిరస్సయిన క్రీస్తువలె ఉండుటకు ఎదుగుటలేదా?’ (ప్రకటన 7:9; ఎఫెసీయులు 4:12-16) కృతజ్ఞులమైయుండుటకు మనమందరమును మంచికారణమును కలిగియున్నాము.

మనలను ఆత్మీయగా పోషించు పనిని కల్గియుండి, క్రెస్తవసంఘముతో గుర్తింపబడియున్న నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు యెహోవా మనకు మేలుచేయుచున్నాడనుటకు మరొక నిదర్శనము. (మత్తయి 24:45, 46) యజమానుడు ప్రత్యక్షమైయుంటాడని ప్రవచింపబడిన సమయమందు మనమిప్పుడున్నాము. “దాసుడు” తన పనినిచేయుచున్నాడా? ఈ “అంత్యదినముల” నిరాశయందును మనము నిరీక్షణను కలిగియున్నామా? జీవితములో మనము యోగ్యమైన సంకల్పమును కలిగియున్నామా? (2 తిమోతి 3:1-5; రోమీయులు 5:5; 1 తిమోతి 4:10) ఔను! మననిరీక్షణ ఏదో జరుగవచ్చునేమో యనునదికాదుగాని విశ్వాసముపైన నిర్మింపబడిన నిశ్చయమైన ఒప్పుదలైయుండి, స్థిరమైన రుజువుపై ఆధారపడియున్నది.—హెబ్రీ 11:1.

స్పష్టముగా మన గొప్ప ఉపకారియైన యెహోవా మనము కృతజ్ఞత కలిగియుండుటకు ఎంతో అనుగ్రహించియున్నాడు. ఇక కారణసహితముగావచ్చు ప్రశ్నయేమనగా:

యెహోవాకు నేను తిరిగి ఏమి చెల్లింతును?

మొదట మననుండి యెహోవాకు ఏమియు అవసరములేదను దానిని మనము ఒప్పుకొనవలెను. “వెండినాది, బంగారునాది” “వేయికొండలమీది పశువులన్నియు నావేగదా” అని చెప్పువాడు ఆయనే. (హగ్గయి 2:8; కీర్తన 50:10; యోబు 41:11) దీని భావమేమనగా ఏ విధముగానైనను మనము యెహోవా దయను కొనలేము. అయినను యిష్టపూర్వకమైన అర్పణలను యివ్వవలెనని మనము ప్రోత్సహింపబడియున్నాము. (1 దినవృత్తాంతములు 29:14ను పోల్చుము.) అయినను యెహోవాకు కానుకలనిచ్చుటకు మనలననుమతించు కొన్ని నియమములున్నవి.

“ఏమి తీసికొనివచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొనివచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారముచేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్టపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?”—మీకా 6:6-8.

దీనినిబట్టి యెహోవా కోరునవన్నియు ఎల్లప్పుడు కారణసహితమైనవి, చేరుకోగల్గినవే. అంతేగాక యెహోవాకు మన అర్పణలు అంగీకృతమగుటకు ముందు యెహోవాతోను, మరియు మన పొరుగువానితోను మనసంబంధము సరిగా ఉండవలెనని యేసు చూపియున్నాడు. (మత్తయి 5:23, 24) సరైన పునాదిని వేసుకొన్నవారమై, ఆయన మనయెడల చూపిన మంచితనమునకు మెప్పుగా యెహోవాకు యివ్వదగినదానిని మనందరము ఏదోకొంత కలిగియున్నాము.

మనము కలిగియున్నదానిని మనమెట్లు ఉపయోగించగలము?

సమయము, ప్రయత్నము, కొంతమట్టుకు డబ్బు అవసరమైనను, ప్రకటించుపనిలో యెహోవాకు ప్రాతినిధ్యము వహించుట ఎంతటి ఆధిక్యతయైయున్నది! ఈ స్తుతి యాగము మనందరము యెహోవాకు ఇవ్వగలిగినదైయున్నది. ముగ్గురు చిన్నపిల్లలతో ఒక పయినీరు పెద్ద భావము యిలాగున్నది:

“పూర్తికాల సేవలో పాల్గొను ఆధిక్యత ఏవ్యక్తిగత త్యాగముకన్నా యోగ్యమైనది, ఇంకా మిన్నయైనది, ఎందుకనగా మన పరలోకపు తండ్రికి స్తుతులను తెల్పుటకు అది ఎంతో ఫలవంతమైన మార్గము. నాకు వ్యక్తిగతముగా ఆయన చూపిన మితిలేని కృపకు కొంతమట్టుకు ఆయనకు కృతజ్ఞతను తెల్పుటకు నాకు అది సహాయపడుచున్నది.”

తన భార్య అనునదేమనగా: “నాభర్త పయినీర్‌గా చేయుటకు సహాయపడుట ఒక నిజమైన ఆధిక్యతైయున్నది. అది కుటుంబమంతా పరిచర్యలో ఎక్కువ వంతును కలిగియుండుటకు దోహదపడుచున్నది. యెహోవా మాకు ప్రేమతో ఆత్మీయముగాను భౌతికముగాను దయచేయుటను చూచుట ఆయనను ఇంకా ఎక్కువగా స్తుతించుటకు యిష్టపడునట్లు చేయుచున్నది.”

వాచ్‌టవవర్‌ సొసైటి స్వచ్ఛందముగా దాదాపు నూరు సంవత్సరములకుపైగా బైబిళ్లను బైబిలు సాహిత్యములను పంచియున్నది. మరియు వీటిని 1920 నుండి తమస్వంత ముద్రణాయంత్రములయందే ముద్రించినది. ఈనాడు మనము కలిగియున్న సాహిత్యములన్నింటిని ఉత్పత్తిచేయుటకు బేతేలు పనిచేయు స్వచ్ఛంద పనివారలు, దానితోపాటు వాటిని పంచుటకు సంఘములలోని ప్రచారకులు మరియు పయినీర్లు గడిపిన సమయము మరియు వారి కృషి, ప్రాముఖ్యమైన ప్రకటనపనికొరకు అందించిన కానుకయైయున్నది.—మత్తయి 24:14.

ఆర్థికముగా ఎక్కువ స్థిరతకలిగిన దేశములలోని క్రైస్తవులు కూడ తమదేశములోని వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయమునకు పంపిన డబ్బు ప్రపంచములో ఇతర ప్రాంతములోనున్న తమసహోదరులు పూర్తికాలము ప్రకటన మరియు శిష్యులను తయారుచేయుపనిలో పాల్గొనుటకు సహాయపడినదని తెలిసికొనుటకు సంతోషిస్తున్నారు. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ నుండి వచ్చిన మిషనరీలు, ప్రాంతీయ మరియు జిల్ల కాపరులు, స్పెషల్‌ పయినీర్లు ఈ చందాలవలన వారి పూర్తికాలసేవలో కొనసాగుటకు సహాయము చేయబడిరి.

బహుశా బేతేలులోను, లేక అంతర్జాతీయ నిర్మాణకార్యక్రమపనివారలలో ఒకడవైయుండుట నీకు అసాధ్యము కావచ్చును. అయితే ఈపనిలో పాల్గొనుచు తమ్మునుతాము ఈ పనిలో యుంచుకొనుటకు “సమృద్ధిగా” డబ్బులేకుండు వారిని బలపరచగల డబ్బును నీవు కలిగియుండవచ్చును. కావున 2 కొరింథీయులు 8:14 నందు తెల్పిన ప్రకారము అందరికి సమముగాయుండు పరిస్థితి ఏర్పడగలదు. అట్టి చందాలతోపాటు వచ్చిన ఉత్తరములలో వయస్సుమళ్లిన ఒక సహోదరి నుండి వచ్చిన ఒక లేఖ యిట్లున్నది:

“యెహోవా నాకిచ్చుచున్న ఆశీర్వాదములన్నింటికి నేను కృతజ్ఞత కలిగియున్నాను. నిర్మాణకార్యక్రమము విషయములో మరియు సంస్థను గురించి నేను యెడతెగక ప్రార్థించుచున్నాను.”

“ఇంకొక సహోదరి యిట్లనెను: నేను కలిగియున్న ఈ కొద్దిమొత్తాన్ని త్వరలో పతనమగు బ్యాంకులోయుంచుటకన్న దైవిక పరిపాలనా సంబంధముగా కొంత మంచిని నెరవేర్చుటకు వినియోగించకోరుదును!”

“ఒక సహోదరుడు తనను తాను ఇట్లు వ్యక్తపర్చుకొనెను: “మనము కలిగియున్న వాటిని ఆయనను మహిమపరచుటకు వినియోగించమని యెహోవా యిచ్చిన ఉపదేశము సాతాను దుష్టవిధానముయొక్క ‘మూడవభాగమైన’ పేరాశతోకూడిన వ్యాపారమునుండి నిజమైన రక్షణదాయకమైయున్నది. యెహోవా యిచ్చుచున్న వృద్ధిని త్వరితముచేయుటకు నేను కొంత చందానిచ్చుటకు నేనెంత సంతోషిస్తున్నానో తెలుపుచున్నాను. నన్ను ఉపయోగించుకొను అవకాశమునిచ్చినందుకు ఆయనకు వందనములు తెల్పుచున్నాను.”

వృద్ధులు మరియు యౌవనులనుండి కానుకలు

వృద్ధులై ప్రస్తుత దుష్టవిధానము నందు రక్షింపబడుటకు నిరీక్షించుచున్నను, తాము మరణించినట్లయిన రాజ్యపనికొరకు తమవి చెందు నిశ్చయత కలిగియుండుటకు వీలునామా వ్రాయుచున్న విశ్వాసముగల తీర్మానములను చదువుట ఎంతో ప్రోత్సాహకరముగా యున్నది. అట్టివారి మంచి స్వభావమును గూర్చి వచ్చిన వ్యాఖ్యానములు యిలాగున్నవి:

“ప్రతి ఒక్కరియెడల ఎంతో దయగల వ్యక్తి, తన జీవితమంతటిలో. . .ఆమె యెహోవాను ఆయన సృష్టిని ప్రేమించినది.”

“ఎల్లప్పుడు రాజ్యాసక్తులను ఆమె తన మొదటి శ్రద్ధగాయెంచేది.”

“ఆయన తన 70 సంవత్సరముల నమ్మకమైన సేవతర్వాత తన పరలోకపు బహుమానమును పొందియున్నాడు. . . .ఆయన ఎల్లప్పుడు తన ఆస్తితో సత్యమును వ్యాపింపజేయుటకు కోరుకొనెను.”

తాము కలిగియున్న వస్తుసంబంధమైన వాటిని యెహోవా పనికొరకు ఉపయోగించు భావముగల పిల్లలను గూర్చికూడ మనము వినుటకు ఆనందిస్తుంటాము. పాఠశాల వయస్సు ప్రచారకునినుండి బ్రిటన్‌లోని సొసైటి ఆఫీసుకు ఈ ఉత్తరము ముట్టినది. ఆమె వ్యాస రచన పోటీలో మొదటి బహుమానమును పొందింది. ఆ బహుమానపు డబ్బునంతటిని ఆమె పంపించింది. “క్రైస్తవ ఒప్పందము” అను దానిపై రాసిన తన వ్యాసమునకు సంపూర్తిగా సొసైటి ప్రచురణలే మూలము. కావున ఈ డబ్బు యెహోవాదేయని ఆమె భావించెను.

యెహోవాకు తిరిగి నేనేమి చెల్లింతును అని అడిగిన తరువాత కీర్తన 116 రచయిత 13 మరియు 14 వచనములలో యిట్లనుచున్నాడు: “రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నామ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరియెదుటనే చెల్లించెదను.” యెహోవానుండి తన కుమారునిద్వారా కలుగు అమూల్యమైన రక్షణను గుణగ్రహించి కీర్తనరచయితవలెనె ఆయన నామమున ప్రార్థనచేసి మన మ్రొక్కుబళ్లను నిలబెట్టుకొనుటకు కదలింపబడుదుము.

యెహోవా మనకెంతో ఉపకారమును చేసియున్నాడు. దానికి పోలికగా మనము ఏమి తిరిగిచ్చినను దానితో పోలిస్తే అది అల్పమే. కావున కృతజ్ఞతకు గుర్తుగా ప్రతివిషయమందు మనము చేయగలిగినదానిని చేయుట ఎంతగా తగినది! “నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను.”—కీర్తన 116:17. (w88 12⁄1)

[31వ పేజీలోని బాక్సు]

కొందరెట్లు రాజ్యపనికొరకు చందావేతురు

◻ బహుమతులు: సచ్ఛందముగా డబ్బును చందాగా పంపువారలు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌సొసైటి ఆఫ్‌ పెన్సిల్వేనియా, 25 కొలంబియా హైట్స్‌, బ్రూక్లిన్‌, న్యూయార్కు 11201కి లేదా సొసైటి స్థానిక బ్రాంచికార్యాలయమునకు పంపవచ్చును. ఆస్తిని అనగా ఎస్టేటు, ఆభరణములు, లేక యితర విలువగలవాటిని కూడా చందాగా యివ్వవచ్చును. చందాలతోపాటు ఇది చందాగా పంపబడుతున్నవని తెలుపు క్లుప్తమైన ఉత్తరము వ్రాసి పంపాలి.

◻ షరతుపైన-చందా యిచ్చు ఏర్పాటు: దాతకు తిరిగి యివ్వబడులాగున, వ్యక్తిగత అవసరము కలిగినప్పుడు తీసుకొనువీలుగా, ట్రస్టుల ఆధీనమందుండునట్లు, వాచ్‌టవర్‌ సొసైటికి డబ్బు యివ్వవచ్చును.

◻ భీమా: జీవితభీమా పాలసీ లేక పదవీవిరమణ పెన్షన్‌ పథకముయొక్క ప్రయోజనము పొందుటకు ది వాచ్‌టవర్‌ సొసైటి పేరును నమోదు చేయవచ్చును. అలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నట్లయిన విషయమును సొసైటికి తెలియజేయవలెను.

◻ ట్రస్టులు: బ్యాంకు పొదుపుల ఖాతాలు సొసైటి కొరకు దాని ట్రస్టునందు వేయవచ్చును. యిలా చేసినట్లయిన దయచేసి సొసైటికి తెలియజేయండి. దాతకు తన జీవితకాలమందు ప్రయోజనము చేకూర్చు ఒప్పందము క్రింద స్టాకులు, బాండులు, మరియు ఆస్తిని సొసైటికి విరాళముగా ఇవ్వవచ్చును. ఈ పద్ధతి ఒకవేళ మరణము సంభవించినట్లయిన ఆస్తి నిశ్చయముగా సొసైటికి చెందునట్లు చేయుటయేగాక, మరణాంతర వీలునామా ఖర్చులను అనిశ్చయతలను తొలగించును.

◻ వీలునామాలు: న్యాయపరిధిలో తీసుకొనబడిన వీలునామాద్వారా ఆస్తి లేక ధనమును వాచ్‌టవర్‌ సొసైటికి సంక్రమించునట్లు దానిపేరట వ్రాయవచ్చును. దాని నఖలును సొసైటికి పంపవలెను.

ఈలాంటి విషయములో ఎక్కువ సమాచారమును మరియు సలహాల కొరకు, ట్రెజరర్స్‌ ఆఫీస్‌, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి ఆఫ్‌ పెన్సిల్వేనియా, 25 కొలంబియా ఫైట్స్‌, బ్రూక్లిన్‌, న్యూయార్కు 11201, లేక ప్రాంతీయ సొసైటి బ్రాంచి కార్యాలయమునకు వ్రాయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి