కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 10/1 పేజీలు 3-4
  • కష్టించి పనిచేయుట సంతోషము తేగల్గునా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టించి పనిచేయుట సంతోషము తేగల్గునా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టపడి పనిచేయుటకు కారణములు
  • క్రొత్త తలంపుల నెందుకంగీకరించవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మీ పనిలో ఆనందించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మిమ్ములను సంతోషపర్చగల్గే పని
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • కష్టపడి పనిచేసి సంతృప్తిని పొందండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 10/1 పేజీలు 3-4

కష్టించి పనిచేయుట సంతోషము తేగల్గునా?

“అసలు మానవునికి పనియేకదా సర్వస్వం, అవును కాదా?” అని జపాను వ్యాపారరంగమందలి ప్రముఖుడు బున్‌పై ఉట్సుకి అడిగెను. వేసవి సెలవులను తీసుకొనడాన్కి తానెందుకు యిష్టపడుటలేదో అతడు వివరిస్తున్నాడు. యుద్ధానంతర దుస్థితినుండి దేశాన్నిపునఃర్నిర్మించిన జపానీయుల మాటలకు యితని మాటలు ప్రతిరూపములు. సంయుక్త రాష్ట్రములకు చెందిన కొమ్మోడోరి ఫెర్రి జపానును దీర్ఘకాల ఏకాంతమునుండి విడిపించిన నాటినుండి జపాను దేశస్థులు శ్రమించి పనిచేసే వారిగా వర్ణించబడుచున్నారు. కష్టించి పనిచేసేవారమని వారు గర్వపడతారు.

అయితే మరీవిపరీతముగా కష్టించి పనిచేయుచున్నందుకు, పారిశ్రామిక దేశాలని పిలువబడుచున్న వాటిలోకెల్ల ఎక్కువగా వార్షిక పనిగంటలను కల్గియున్నందుకు నేడు జపాను విమర్శలకు లోనగుచున్నది. పనియనే విగ్రహాన్ని సమూలంగా నిర్మూలించడాన్కి జపాను ప్రభుత్వము యత్నించుచున్నది. “కార్మిక మంత్రిత్వ శాఖ, ‘అంత కష్టించి పనిచేయడం మానండి’” అని చెప్పుచున్నదని ఒక వార్తాపత్రికలోని ముఖ్యశీర్షిక పేర్కొన్నది. 1987 వేసవి సెలవుల కాలమందు దాని ప్రచారదాడిలో ఆ మంత్రిత్వశాఖ “సెలవుతీసుకుంటే యోగ్యతకు నిదర్శనము” అని చేప్పేంతమేరకు కూడా వెళ్లింది. మరో మాటలో చెప్పాలంటే, “ఎందుకంత కష్టించి పనిచేయాలి?” అని ప్రభుత్వం అడుగుచున్నది.

నిజంగా జపానులో ఉన్నవారంతా సమర్పిత, కష్టజీవులుకారు. ఇటీవల జపాను ఉత్పాదిక కేంద్రం 7,000 మందికంటె ఎక్కువ పనివారిని సర్వేచేయగా వారిలో 7 శాతంమంది మాత్రమే సామాన్యజీవన విధానంకంటె ఉద్యోగానికి ప్రాధాన్యత యిస్తున్నట్లుగా తేలింది. ఇట్టి పోకడ యితరదేశములలోకూడా కన్పించుచున్నది. జర్మనీలో 18 నుండి 29 సంవత్సరముల వయస్సుమధ్యగల జర్మనులలో 19 శాతంమంది వారికివ్వబడే వేతనంతో నిమిత్తములేకుండా తాము పనిలో బహు శ్రేష్ఠంగా పనిచేస్తున్నట్లు నిరూపించబడిరని ఆలెన్స్‌బేచర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోస్కోపి తెల్సుకొన్నది.

సుఖాన్ని కోరుతున్న యౌవనులతో పోల్చగా జపానులో ప్రత్యేకముగా పనికొరకు పిలువబడినవారు ఎక్కువ కష్టించి పనిచేస్తున్నారు. టోక్యోలోని ఒకయజమాని, కాయకష్టం చేయుచున్న తన అల్జీరియా ఉద్యోగునిగూర్చి గొప్పగా చెప్పుకొనుచున్నాడు. అతడిట్లనుచున్నాడు: “ఇటువంటి ఉద్యోగాలకు జపానీయులు ధరఖాస్తు చేయరు, ఒకవేళచేసినా, వాళ్లు వెంటనే విడిచివెళ్లిపోతారు.” కష్టించిపనిచేసే జపానీయులు కూడా స్వభావసిద్ధంగా పట్టుదలగలవారుకారు. ప్రజలు కష్టించి పనిచేస్తున్నారంటే, ఏదో బలమైన కారణముండవచ్చును.

కష్టపడి పనిచేయుటకు కారణములు

“ఆస్తి, స్థిరత్వము, సంపద, లోకముతోపాటు సాగిపోవుట”—జర్మనులు కష్టించి పనిచేయుటకు కారణములు, అని జర్మన్‌ వారపత్రిక డెర్‌ స్పైగిల్‌ తెల్పుచున్నది. అవును, జీవితములో కొంతమేరకు స్థిరపడవలెనని వస్తుసంపద కొరకు చాలామంది కష్టపడిపనిచేస్తారు. కొందరైతే “లోకముతోపాటు సాగిపోవుటకు” లేదా సమాజముతోపాటు పైకెగయుటకు కష్టపడి పనిచేయుదురు. అట్టి గమ్యములను సాధించుటకు పోటీ విద్యావిధానముచేత బలీయంగా పురికొల్పబడిన అనేకులు దురదృష్టకరంగా పారిశ్రామిక సమాజములో అంతరించిపోయి ఏమీకాకుండాపోయారు.

ప్రజలు కష్టించి పనిచేయడాన్కి డబ్బు మరియు హోదా మాత్రమే కారణములుకావు. కొందరు పని నిమిత్తమే పనిచేస్తారు. వారికి పనియే సర్వస్వం. యితరులు వారిపనిలో ఆనందాన్ని అనుభవిస్తారు. “ఆత్మీయకార్యములు అణచివేయబడేటంతగా, ప్రయోగశాలలో నేను చేయుచున్న కార్యమందు బహుగా నిమగ్నుడనైపోయాను” అని హోరూ ఒప్పుకొనుచున్నాడు.

అయితే సేవ మరియు యితరుల సంక్షేమము కొరకు ప్రయోజనాత్మక కారణముల నిమిత్తము సమర్పించుకొనినవారు కూడా ఉన్నారు. ప్రాణాలను కాపాడు నిమిత్తము వారు కష్టించి పనిచేస్తున్నారు. దృష్టాంతమునకు అగ్నిమాపకసిబ్బంది తమపరికరములను సంసిద్ధంగా ఉంచుటకొరకు ప్రతిదినము కష్టపడిపనిచేస్తారు.

కాని కష్టపడి పనిచేయుటకు ఇవన్నియు సరియైన కారణములేనా? అవి సంతోషానికి నడుపునా? నిజంగా ఎట్టిపని మిమ్ములను సంతోషపర్చగల్గును? (w89 7⁄15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి