కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 8/1 పేజీలు 30-31
  • దైవికంగా భద్రపరచబడుటకుగల రుజువు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవికంగా భద్రపరచబడుటకుగల రుజువు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మూల వ్రాతలు ఎంతనిజమైనవి?
  • యోహాను సువార్తలోని ఒక ముఖ్యభాగము
  • యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచిన “సముద్రపు కీర్తన” రాతప్రతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 8/1 పేజీలు 30-31

దైవికంగా భద్రపరచబడుటకుగల రుజువు

దేవునియొక్క ప్రేరేపితవాక్యము మనకు ఎంతో ఖచ్చితముగా అందించబడినది. అట్టి అద్భుతకర భద్రతకు ముఖ్యముగా బైబిలు గ్రంథకర్తకు మనము కృతజ్ఞతలు చెల్లించవలసి యున్నాము. హెబ్రీలేఖనముల చేతివ్రాతప్రతులు పూర్తిగా లేక అందలి భాగములుగా 6,000 వరకు, క్రైస్తవగ్రీకు లేఖనములవి 5,000 వరకు ఉన్నవి.

“ప్రభువు (యెహోవా) వాక్యము ఎల్లప్పుడు నిలుచును.” (1 పేతురు 1:25) అయితే తన పరిశుద్ధ వాక్యమును భద్రపరచుటను గూర్చి ఆధునిక దిన పరిశోధన ఏమి బయలు పరచుచున్నది?

మూల వ్రాతలు ఎంతనిజమైనవి?

క్రైస్తవ గ్రీకులేఖనముల యందలి మూల వ్రాతలు ఎంతనమ్మదగినవి? పురాతనమునుండి మిగిలియున్న ఇతర వ్రాతలను పరిశీలించినప్పుడు నిజమునకు వేటికి పోల్చరానంత నమ్మదగినవిగా ఇవి యున్నవి. ఈ సత్యము ఆఫ్‌డన్‌ స్పురెన్‌ జెసు (యేసు అడుగు జాడలలో) అను పుస్తకములో గెర్‌హర్డ్‌ క్రోల్‌చే ఉన్నతపరచబడినది. ఉదాహరణకు గ్రీకు తత్వవేత్తయైన అరిస్టాటిల్‌ (సా.శ.పూ. నాలుగవ శతాబ్దము) వ్రాతలలో కేవలము ఆరు పాప్రిలు భద్రపరచబడియున్నవి. వాటిలో ఎక్కువభాగము సా.శ. పదవశతాబ్దము లేక ఆ తరువాత వాటిగా లెక్కించబడుచున్నవని గ్రంథకర్త చూపియున్నాడు. ప్లాటో వ్రాతలు (సా.శ.పూ. నాలుగవ శతాబ్దము) కొంత ఫర్వాలేదు. 13వ శతాబ్దమునకు ముందటినాటివిగా లెక్కించబడుచున్న తన రచనల చేతివ్రాతప్రతులు పది కలవు. హెరొడోటస్‌ విషయములో (సా.శ.పూ. అయిదవ శతాబ్దము) మొదటి శతాబ్దము లేక ఆ తరువాత నాటివిగా లెక్కింపబడుచున్న దాదాపు 20 పాపిరస్‌ భాగములున్నవి. తనచేవ్రాయబడి సంపూర్ణముగాయున్న మొదటి చేతివ్రాతప్రతులు పదవశతాబ్దపు వాటివిగానే లెక్కించబడుచున్నవి. జోసఫస్‌వ్రాతల అతిపురాతన చేతివ్రాతప్రతులు కేవలము 11వ శతాబ్దమునాటివిగా లెక్కించబడుచున్నవి.

ఇందుకు భిన్నముగా గ్రీకులేఖనముల (సా.శ. మొదటి శతాబ్దములో పూర్తిచేయబడిన) మూల వ్రాతలు రెండవ శతాబ్దమునాటి కొన్నిభాగములు మరియు పూర్ణముగాయున్న నాలుగవ శతాబ్దపునాటి చేతివ్రాతప్రతుల వలన ధృవపరచబడుచున్నవి. క్రోల్‌ ప్రకారముగా 2 నుండి 7వ శతాబ్దమునాటివి 81 పాపిరీలు, 4 నుండి 10వ శతాబ్దపు గ్రీకు పెద్ద అక్షరములతో వ్రాయబడిన చేతివ్రాతప్రతులు 266, 9 నుండి 15వ శతాబ్దపునాటివి కలిపివ్రాతతో వ్రాయబడినవి 2,754 చేతివ్రాతప్రతులు, 2,135 పాఠాంతరములు ఉన్నవి. ఇవన్నియు క్రైస్తవ గ్రీకులేఖన మూలవ్రాతలను స్థిరపరచుటకు మనకు సహాయపడును. కావున నిజముగా అవి ఎన్నోవాటివలన ధృవపరచబడియున్నవి.

యోహాను సువార్తలోని ఒక ముఖ్యభాగము

విలువ గలిగిన బైబిలు వ్రాతప్రతులు చెత్తకుప్పలో ఉంటాయని ఎవరనుకుంటారు? అయితే యోహాను సువార్తయొక్క 18వ అధ్యాయపు విలువైన భాగము అచ్చటనే కనుగొనబడినది. ప్రస్తుతము జాన్‌ రైలాండ్స్‌ పాపిరస్‌ 457 (P52), అని పిలువబడుచున్న ఆ భాగము ఇంగ్లాండునందలి మాంచెస్టర్‌లో భద్రపరచబడియున్నది. అది ఎట్లు కనుగొనబడినది? ఎందుకది ఎంతోప్రాముఖ్యము?

ఈ శతాబ్దపు మలుపున పురాతన వస్తుశాస్త్రజ్ఞులు ఈజిప్టు నందలి ఎల్‌ ఫయూమ్‌ జిల్లాలోని ఆక్సిరిన్‌చస్‌ పట్టణపు వెలుపల పెద్దమొత్తములో పాపిరస్‌ భాగములను, పత్రికలు, రసీదులు, మనవిపత్రములు, జనాభారికార్డులు మరి ఇతర అనేక వ్రాతపుస్తకములను త్రవ్వితీశారు. ఎక్కువవరకు గ్రీకులో వ్రాయబడియున్న ఇవి శతాబ్దముల కాలము ఎండియున్న ఇసుకలో భద్రపరచబడియున్నవి.

1920వ సంవత్సరములో, ఈ పాపిరీలు మాంచెస్టర్‌ జాన్‌రైలాండ్స్‌ లైబ్రరీచే సమకూర్చబడెను. పదునాలుగు సంవత్సరముల తర్వాత విద్వాంసుడైన సి. హెచ్‌. రాబర్ట్స్‌ ఆ ముక్కలను వేరుచేయుచుండగా పరిచయమున్నట్లు కనిపించిన కొన్నిమాటలు తనకు అగుపించెను. యోహాను 18వ అధ్యాయపు 31 నుండి 33 వచనములు ఒక ప్రక్కను, అవతలి ప్రక్క 37 మరియు 38 వచనములు ఉన్నట్లు అతడు గుర్తించినపుడు అతని సంతోషమును ఊహించుము. ఈ పాపిరస్‌ భాగము ఇప్పటికి కనుగొన్న క్రైస్తవ గ్రీకులేఖనముల ప్రతులన్నిటిలోకెల్ల అతిపురాతనమైనదానిగా రుజువైనది. ఇది అన్‌సియల్స్‌ అని పిలువబడు గ్రీకు పెద్ద అక్షరములలో వ్రాయబడినదై మనసామాన్యశకము రెండవశతాబ్దపు మొదటి అర్ధభాగములో తయారైనది.

ఈ భాగము 3.5×2.5 అంగుళముల ప్రమాణములో యున్నది. పాపిరస్‌లోని ఈ ముక్కను ఏ నాటిదో లెక్కించుట ఎట్లు సాధ్యమగును? ఇది పాలియోగ్రఫీ అనబడు వ్రాతశైలిని పరిశీలించు పఠనముద్వారా తెలుస్తుంది. సంవత్సరములు గడుచుకొలది చేతివ్రాత శైలి క్రమేపి మారుతుంది. ఈ మార్పులు వ్రాతప్రతియొక్క కాలమును అటోయిటో కొన్నిసంవత్సరముల తప్పుతో సూచించును. సంపూర్ణమైన వ్రాతప్రతిలో చిన్నభాగముగాయున్న ఈ ముక్క మొదట యోహానుచే వ్రాయబడిన సువార్తవృత్తాంతపు వ్రాతకు దగ్గర సమయమునాటిది. ఈ ప్రతికి మధ్యవ్యవధి 30 లేక 40 సంవత్సరములకు లోపే ఉంటుంది. యోహాను వృత్తాంతము తరువాతి చేతివ్రాతప్రతులను వ్రాయువారిద్వారా కూడా మార్చబడలేదని నిశ్చయత కలిగియుండగలము, ఎందుకనగా ఆ భాగము తరువాతి వ్రాతప్రతులతో చాలావరకు ఖచ్చితముగా పొందిక కలిగియున్నది.

ఇది కనుగొనబడక పూర్వము యోహాను సువార్త నిజముగా యేసు అపొస్తలునిచే వ్రాయబడినదికాక, రెండవశతాబ్దపు అంతములో కొంతకాలము తర్వాత వ్రాయబడినదని విమర్శకులు వాదించారు. అందుకు భిన్నముగా ఈ భాగము నుండి సా.శ. రెండవశతాబ్దపు మొదటి అర్ధభాగములో ఐగుప్తునందు గ్రంథపుచుట్టగా కాక పుస్తకరూపములో యున్నదని ప్రస్తుతము స్పష్టమయినది. ఏ గుర్తింపులేనటువంటి ఆ పాపిరస్‌ భాగము విమర్శకులను ఎంతో ప్రభావవంతముగా నోరుమూయింపగలుగుట ఎంతటి ఆశ్చర్యకరమైనది! (w88 11⁄15)

[31వ పేజీలోని బాక్సు]

పాపిరస్‌

పాపిరస్‌ లోతులేని నిలువయున్న లేక బురదగుంటలలో లేక నెమ్మదిగా పారు నైలు నదివంటి నదుల ఒడ్డునపెరుగు మొక్కైయున్నది. (యోబు 8:11) పాపిరస్‌ నుండి తయారుచేయబడిన ఈ కాగితము అబ్రాహాము కాలమునాటినుండి కూడా వ్రాయుటకు తగినదానిగా వాడబడియుంటుంది. తరువాత దానిని తయారుచేయుట పురాతన ఐగుప్తులో ఒక ముఖ్యపరిశ్రమగా ఉండెను. దీనిని తయారుచేయుటకు వారు ఒక సులభమైన పద్ధతిని అనుసరించిరి. దానిలోపలి మెత్తనిభాగమును పొడవుగా చీల్చి, వాటిని ఒకదాని ప్రక్కన మరొకదానిని పేర్చి ఇంకొకపొరను దానిపై అడ్డముగా అతికింతురు. దీనిని అదిమి షీట్లుగాచుట్టి, ఎండబెట్టి, మెరుగుపెట్టుటకు ఉపయోగించు మెత్తటి నున్ననిరాయి, లేక గవ్వ లేక ఏనుగ దంతము మొదలగుదానితో నునుపుచేయుదురు. దాచబడిన ఒక చుట్ట 133 అడుగుల పొడవున ఉన్నను, ఈ షీట్లను 14 నుండి 20 అడుగుల పొడవున చుట్టలుగా తయారగునట్లు కలుపుదురు. దానికిబదులుగా ఆ కాగితములను పుస్తకముల మాదిరి కూడా మడిచేవారు. ఇవి తొలిక్రైస్తవులలో ప్రసిద్ధముగాయున్నవి.

[31వ పేజీలోని బాక్సు]

పార్చమెంటు మరియు వెల్లం

ఐదవ శతాబ్దపు అలెక్సెండ్రైన్‌ కోడెక్స్‌, అనగా మొదటి నుండి పూర్తి బైబిలును కలిగియున్న ఈ కోడెక్స్‌ వెల్లం పైన వ్రాయబడినది. ఈ పదార్దమేమిటి, పార్చమెంటు నుండి ఇది ఎట్లు వేరైయున్నది?

తొలి కాలములనుండి కూడా పార్చమెంటు గొర్రెచర్మము, మేకచర్మము, లేక దూడచర్మము నుండి తయారుచేయబడినది. కడుగబడిన చర్మమునుండి వెంట్రుకలు తీసివేసి ఎండిపోవునట్లు వ్రేలాడగొట్టుదురు. (2 తిమోతి 4:13ను పోల్చుము.) మనసామాన్యశకము మూడు నాలుగు శతాబ్దములలో ఈ పదార్దములో నాణ్యతను నిర్ణయించటం జరిగింది. ముతకగా ఉన్నదానిని పార్చమెంటు అని పిలుచుచు, నాణ్యతగల దానిని వెల్లం అని పిలిచారు. వెల్లంను చేయుటకు అతి మెత్తనిచర్మముద్వారా మేక, దూడల లేత చర్మము లేక యింకా జన్మించని దూడ లేక గొర్రెల చర్మమును ఉపయోగించారు. పలుచగా, మెత్తగా, తెల్లగాయుండి వ్రాయుటకు ఉపయోగించు ఈ పదార్దమును ముద్రణాయంత్రమును కనుగొని, చౌక మరియు మేలైన పేపరును వాడేంతవరకు ప్రాముఖ్యమైన పుస్తకములకొరకు దీనిని ఉపయోగించారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి