కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 8/1 పేజీలు 28-29
  • ఏలా లోయ దావీదు భారికాయుని హతముచేసినది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏలా లోయ దావీదు భారికాయుని హతముచేసినది!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • “యుద్ధము యెహోవాదే”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దావీదు గొల్యాతుల యుద్ధం​—⁠నిజంగా జరిగిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • “యుద్ధము యెహోవాదే”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఒక భారీకాయుడికి ఎదురు నిలబడ్డాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 8/1 పేజీలు 28-29

వాగ్ధానదేశమునుండి దృశ్యములు

ఏలా లోయ దావీదు భారికాయుని హతముచేసినది!

“దావీదు ఫిలిష్తీయుని కంటె బలాఢ్యుడై. . .వడిసెలతోను రాతితోను” చంపిన గొల్యాతు వృత్తాంతమును వివరించులాంటి దానికంటె గొప్పగా పులకరింపజేయు బైబిలు వృత్తాంతములు బహు తక్కువగాకలవు. (1 సమూయేలు 17:50) ఇది ఏలా లోయయందు జరిగినది.

అయితే ఆ లోయ ఎక్కడ ఉన్నది? అది ఎట్లున్నది? దీనిని తెలుసుకొనుట ఇశ్రాయేలీయుల భవిష్యత్‌ రాజుగా అభిషేకించబడిన బాలుడైన దావీదు బహుగొప్పవిజయమును దృష్టీకరించుకొనుటకు మీకు సహాయపడును. ఆ తరువాత మనకు నిత్యప్రయోజనములనిచ్చు రాజ్యనిబంధనను దావీదుతో చేశాడు గనుక ఈ ఏలా లోయలో జరిగినదానిని నేర్చుకొనుటకు అదనపు కారణమును మనము కలిగియున్నాము.

ఫిలిష్తీయులు కనాను తీరము వెంబడి నివసించారు. యూదయ కొండలు (యెరూషలేమునకు దక్షిణము) ఇశ్రాయేలీయుల ఆధిపత్యముక్రింద ఉన్నవి. పడమట క్రింది భాగమున శత్రువులుండగా తూర్పు భాగముగా దేశపు ఎగువప్రాంతమందు దేవునిసేవకులున్నారు. ఈ రెంటికి మధ్య వివాదములోనున్న షెపెలా అనబడు కొండదిగువ ప్రాంతమున్నది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఎట్లు ముట్టడించగలరు? వారికి సరైనమార్గము తూర్పు-పడమరలుగానున్న దారియగు ఏలా లోయయే. ఇది వారి పట్టణములైన గాతు, ఎక్రోను దగ్గరనున్న మైదానముల నుండి షెపెలా గుండా యెరూషలేము బెత్లేహేములకు నైరుతిదిశగా దాదాపు 15 మైళ్లు కొండలవరకు విస్తరించియున్నది. ఆగ్నేయదిశగా చూడబడుచున్న ఈ పటము ఈలోయయొక్క ఎగువ ప్రాంతపు చివరికొనను చూపుచున్నది. ఆపైన అడ్డముగానున్న విశాలప్రాంతమందు యూదయకొండలను మీరు చూచెదరు.a

ఈ ఫొటోగ్రాఫ్‌ను చూస్తూ చదునైన ఆ లోయగుండా ఫిలిష్తీయులు కొండలవైపు వచ్చుటను ఊహించుము. వారిని ఆపుటకు ఇశ్రాయేలీయులు యూదయనుండి నైరుతిదిశగా వచ్చారు. ఇచ్చట ఒకరికొకరు భేటీగా నిలబడటం జరిగింది. ఎందుకు? “ఫిలీష్తీయులు ఆతట్టు పర్వతముమీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను.”—1 సమూయేలు 17:3.

ఈ లోయలో ఖచ్ఛితముగా ఎక్కడ అది జరిగినది మనకు తెలియకున్నను, కుడివైపు క్రిందిభాగమునున్న కొండమీద ఇశ్రాయేలీయులు ఉన్నట్లు ఊహించుము. దానికి ఎదురుగా మట్టిరంగుతోనున్న ప్రాంతమునకు పైగానున్న కొండపై సౌలు సైన్యము ఉండియుండును. ఏ సైన్యముకూడా లోయదాటి మంచి భద్రతగలస్థానములోనున్న శత్రుబలమును ముట్టడించ క్రిందికి రాకున్నది. ఒకరికొకరు భేటీగా యుండి ఒకనెలకు పైగానే అయినది. ఈ స్థితికి ముగింపు ఏమిటి?

ప్రతిరోజు ఉదయం సాయంత్రం తొమ్మిదడుగుల ఎత్తుకు పైగా నున్న ఫిలిష్తీయుల శూరుడొకడు లోయలో నిలబడి వారిలో ఒకడు వచ్చి తనతో పోట్లాడి గెలిచి ఈ భేటీయెడల ఒక నిర్ణయమునకు రమ్మని దూషించుచున్నాడు. చివరకు దావీదు అనుపేరుగల పడుచువాడైన గొఱ్ఱెలకాపరి సైన్యములోనున్న తన అన్నలయొద్దకు ఆహారమును తీసుకొనివచ్చెను. అవమానకరమైన ఈ సవాలుకు అతని ప్రతిస్పందనయేమిటి? “జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు?” అని ప్రతిస్పందించాడు. (1 సమూయేలు 17:4-30) నిజముగా 1990వ సంవత్సరమునకు యెహోవాసాక్షులు మూలవచనంగా కలిగియున్న, “ప్రభువు (యెహోవా) నాకు సహాయుడు. . .అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైయున్నాము” అను దానిలోని భావమును ఆయన స్పష్టంగా ప్రతిబింబించాడు.—హెబ్రీయులు 13:6; కీర్తన 56:11; 118:6.

ఈ పడుచువాడు యుద్ధాభ్యాసము లేనివాడును, నిరాయుధుడునైయుండి భీతిగొల్పునట్టి గొల్యాతునెదుర్కొంటాడని రాజైన సౌలు వినినప్పుడు ఆయన తన యుద్ధకవచమును అందించెను. అయితే దావీదు తనకాపరి కఱ్ఱ, చర్మపు వడిసెల, లోయలో దొరికిన అయిదు రాళ్లతో వెళ్లుటకు యిష్టముగలవాడై దానిని తిరస్కరించెను. రాళ్లు ఎలాగున్నవి? చాలామట్టుకు అవి ద్రాక్షా లేక ఒలీవ పండ్లంత చిన్నరాళ్లయి ఉండవు. కనుగొనబడిన వడిసెల రాళ్లు 2 నుండి 3 అంగుళముల వృత్తముతో చిన్నసైజు నారింజ పండ్లంతటివి. వడిసెలవేయువాడు రాయిని గంటకు 100 నుండి 150 మైళ్ల వేగముతో విసరగలడు.

ఇరుపక్షముల కళ్లముందు ఆ లోయలో ఏమి జరిగినదో నిశ్చయంగా మీరు చదివియుందురు. “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నామీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవాపేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను,” అని దావీదు ప్రకటించెను. యెహోవా జయమునిచ్చెను. పడుచువాడు, గొల్యాతు నుదుటిలోనికి చొచ్చుకొనిపోయి, అతనిని చంపునంత బలముగా రాయిని విసిరెను. గొఱ్ఱెలకాపరి పరుగెత్తిపోయి ఆశూరుని స్వంత కత్తితోనే అతని తలను తెగవేసెను.—1 సమూయేలు 17:31-51.

దావీదుయొక్క దేవునియందలి విశ్వాసము, నమ్మకముచే ప్రోత్సహించబడినవారై ఇశ్రాయేలీయులు ధైర్యము కోల్పోయిన ఫిలిష్తీయులను షెపెలాగుండా తిరిగి ఫిలిష్తియ వరకు తరిమిరి.—1 సమూయేలు 17:52, 53.

యూదాలో వినబడిన ఆనందమును గూర్చి తలంచుడి! నేడు హెబ్రోనుదగ్గర కనిపించుక్రింది దృశ్యమురీతిగా కొండప్రాంతములలోని దేవునిప్రజలు పడమటివైపునకు క్రిందుగా ఏలా లోయను షెపెలాను చూడగలిగిరి. వికసించిన తెల్లని బాదము మొగ్గలు చూచుటకు ఎంతో రమ్యముగానున్నవి. అయితే దేవుని శత్రువులపైన విజయము అంతకంటె ఇంకా ఎక్కువ రమ్యమైనది. ఏలా లోయలో చంపబడిన ఆ శూరునితో సహా “సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు హతముచేసిరనియు” ఇశ్రాయేలు స్త్రీలు చక్కగా చెప్పగలిగిరి.—1 సమూయేలు 18:7. (w90 1/1)

[అధస్సూచీలు]

a ఇదే పటము పెద్దసైజులో 1990 యెహోవాసాక్షుల కేలండరు నందును కలదు. దాని పైఅట్టపైన దాని యొక్క ప్రాంతముకూడా సూచింపబడినది.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి