కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 జూలై పేజీ 11
  • మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . .
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • క్రమశిక్షణ​—⁠యెహోవా ప్రేమకు ఒక రుజువు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ అమ్మానాన్నల్ని గౌరవించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 జూలై పేజీ 11
చిత్రాలు: “మీ కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించుకోండి” వీడియో ఆధారంగా చిత్రాలు. 1. అమ్మానాన్నలు కేక్‌ తింటుంటే వాళ్ల కూతుళ్లు చూస్తున్నారు. 2. కుటుంబ ఆరాధనలో ఆ కూతుళ్లు ఒకర్నొకరు చూసుకుని నవ్వుతున్నారు. 3. ఆరోగ్యం బాలేక సోఫాలో పడుకున్న వాళ్ల అమ్మను ఆమె కూతురు చూసుకుంటోంది.

మన క్రైస్తవ జీవితం

మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే . . .

కుటుంబం, సంతోషానికి చిరునామాలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త 127:3-5; ప్రస 9:9; 11:9) అయితే, లోకంలో ఉన్న ఒత్తిళ్ల వల్ల, కుటుంబ సభ్యులు చేసే పొరపాట్ల వల్ల ఆ సంతోషం ఆవిరైపోవచ్చు. అలా అవ్వకూడదంటే అది మీ చేతుల్లోనే ఉంది. కుటుంబ సంతోషం కోసం కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏం చేయవచ్చు?

భర్త తన భార్యను గౌరవించాలి. (1పే 3:7) ఆమెతో సమయం గడపాలి. ఆమె చేయలేని వాటిని ఆమె నుండి ఆశించకూడదు; భర్త కోసం, కుటుంబం కోసం ఆమె చేసినవాటికి కృతజ్ఞత చూపించాలి. (కొలొ 3:15) ఆమె మీద ఉన్న ప్రేమను చేతల్లో చూపించాలి, ఆమెను మెచ్చుకోవాలి.—సామె 31:28, 31.

భార్య తన భర్తకు అండగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించాలి. (సామె 31:12) ఆయన మాట వినాలి, సహకరించాలి. (కొలొ 3:18) ఆయనతో దయగా మాట్లాడాలి; ఆయన గురించి వేరేవాళ్ల దగ్గర మంచిగా మాట్లాడాలి.—సామె 31:26.

తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. (ద్వితీ 6:6, 7) వాళ్లను ఎంత ప్రేమిస్తున్నారో మాటల్లో చెప్పాలి. (మత్త 3:17) క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు ప్రేమ, వివేచన చూపించాలి.—ఎఫె 6:4.

పిల్లలు అమ్మానాన్నల మాట వినాలి, వాళ్లను గౌరవించాలి. (సామె 23:22) వాళ్ల ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని అమ్మానాన్నలకు చెప్పుకోవాలి. అమ్మానాన్నలు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుని వాళ్లను గౌరవించాలి.—సామె 19:20.

మీ కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించుకోండి వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

కుటుంబ సంతోషం కోసం కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏం చేశారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి