కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 4
  • వినయం చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వినయం చూపించండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పౌలు ఏం చేశాడు?
  • పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • పౌలులా ఉందాం
  • వినయమును ఎందుకు ధరించుకొనవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా వినయస్థుల్ని ఇష్టపడతాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • అనుకరించదగు సాత్వికముగలవారి ఉదాహరణలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • నిజమైన వినయాన్ని అలవరచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 4

మొదటిసారి మాట్లాడేటప్పుడు

ఒక భటుడు పౌలును సంకెళ్లతో బంధించి నిలబడ్డాడు. రాజైన అగ్రిప్ప, అధిపతైన ఫేస్తు, ఇంకా బెర్నీకేతో పౌలు గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నాడు.

అపొ. 26:2, 3

పాఠం 4

వినయం చూపించండి

సూత్రం: “వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి.”—ఫిలి. 2:3.

పౌలు ఏం చేశాడు?

ఒక భటుడు పౌలును సంకెళ్లతో బంధించి నిలబడ్డాడు. రాజైన అగ్రిప్ప, అధిపతైన ఫేస్తు, ఇంకా బెర్నీకేతో పౌలు గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నాడు.

వీడియో: పౌలు అగ్రిప్ప రాజుకు ప్రకటించాడు

1. వీడియో చూడండి, లేదా అపొస్తలుల కార్యాలు 26:2, 3 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. పౌలు అగ్రిప్ప రాజుతో మాట్లాడేటప్పుడు ఎలా వినయం చూపించాడు?

  2. బి. పౌలు మాట్లాడుతున్నప్పుడు అవధానాన్ని తనమీదికి కాకుండా యెహోవా మీదికి, లేఖనాల మీదికి ఎలా మళ్లించాడు?—అపొస్తలుల కార్యాలు 26:22 చూడండి.

పౌలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మనం వినయంతో, గౌరవంతో ప్రకటించినప్పుడు ప్రజలు మనం చెప్పే సందేశాన్ని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

పౌలులా ఉందాం

3. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీకే అన్నీ తెలుసు, ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడకండి. మీ మాటల్లో గౌరవం చూపించండి.

4. మీరు చెప్పేవి బైబిల్లోనివే అని స్పష్టం చేయండి. దేవుని వాక్యంలో ఉన్న ఆలోచనలు ప్రజల హృదయాలను కదిలిస్తాయి. కాబట్టి మనం బైబిల్ని ఉపయోగించినప్పుడు మనం చెప్పేవాటి మీద కాకుండా బైబిలు మీద వాళ్ల విశ్వాసాన్ని పెంచిన వాళ్లమౌతాం.

5. సౌమ్యంగా ఉండండి. మీ మాటే నెగ్గాలన్నట్టు ప్రవర్తించకండి. వాళ్లతో వాదన పెట్టుకోవాలన్నది మన ఉద్దేశం కాదు. ప్రశాంతంగా ఉండడం ద్వారా, సరైన సమయంలో అక్కడ నుండి వెళ్లిపోవడం ద్వారా వినయం చూపించండి. (సామె. 17:14; తీతు 3:2) మీరు సౌమ్యంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి భవిష్యత్తులో మీతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు.

ఇవి కూడా చూడండి

రోమా. 12:16-18; 1 కొరిం. 8:1; 2 కొరిం. 3:5

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి