కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 14 పేజీ 17
  • ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • చర్చాంశాన్ని విపులీకరించడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 14 పేజీ 17

అధ్యాయం 14

ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం

లేఖనం

హెబ్రీయులు 8:1

ఏమి చేయాలి? మీ ప్రసంగాన్ని చివరి వరకు శ్రద్ధగా వినేలా ప్రేక్షకులకు సహాయం చేయండి. ప్రతీ ముఖ్యాంశం (main point) ప్రసంగ ఉద్దేశంతో, ప్రసంగ అంశంతో (theme) ఎలా ముడిపడివుందో స్పష్టం చేయండి.

ఎలా చేయాలి?

  • ఒక ఉద్దేశంతో బోధించండి. మీ ప్రసంగ ఉద్దేశం ప్రేక్షకులకు సమాచారం తెలియజేయడమా, వాళ్లను ఒప్పించడమా, లేదా ప్రోత్సహించడమా అనేది గుర్తించి, దానికి తగ్గట్టు ప్రసంగాన్ని సిద్ధం చేసుకోండి. అంతేకాదు, ప్రసంగంలోని ముఖ్యాంశాలన్నీ ఆ ఉద్దేశానికి తగ్గట్టు ఉండేలా చూసుకోండి.

    సలహా

    ‘ఈ విషయం మీద ప్రేక్షకులకు ఏ ప్రశ్నలు లేదా సందేహాలు రావచ్చు? వాళ్ల మనసులో మొదట ఏ ప్రశ్న వస్తుంది, తర్వాత ఏ ప్రశ్న వస్తుంది?’ అని ఆలోచించండి. తర్వాత అదే వరుసక్రమంలో ముఖ్యాంశాలను తయారుచేసుకోండి. అప్పుడు ప్రేక్షకులు ప్రసంగాన్ని చివరి వరకు శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు, నమ్ముతారు.

  • ప్రసంగ అంశాన్ని నొక్కిచెప్పండి. ప్రసంగ అంశంలోని ముఖ్యమైన పదాలను మళ్లీమళ్లీ చెప్తూ లేదా అదే అర్థం వచ్చే వేరే పదాలను ఉపయోగిస్తూ ప్రసంగమంతా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండండి.

  • ముఖ్యాంశాలు తేలిగ్గా అర్థమయ్యేలా ఉండాలి. ప్రసంగ అంశానికి సంబంధం ఉన్నవాటిని, మీకు ఇచ్చిన సమయంలో చక్కగా బోధించగలిగేవాటిని మాత్రమే ముఖ్యాంశాలుగా ఎంపిక చేసుకోండి. ఎక్కువ ముఖ్యాంశాలను ఎంచుకోకండి. ప్రతీ ముఖ్యాంశాన్ని స్పష్టంగా చెప్పండి, ఒక ముఖ్యాంశం నుండి మరో ముఖ్యాంశానికి మారుతున్నప్పుడు కాసేపు ఆగండి, అలాగే వాటి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పండి.

    సలహా

    ప్రేక్షకులు మీ ప్రసంగాన్ని శ్రద్ధగా వినేలా మొదట్లోనే మీరు ముఖ్యాంశాలను చెప్పవచ్చు, లేదా వాళ్లు వాటిని గుర్తుంచుకునేలా ప్రసంగం చివర్లో కూడా ప్రస్తావించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి