కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 15 పేజీ 18
  • గట్టి నమ్మకంతో చెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గట్టి నమ్మకంతో చెప్పడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిశ్చయతతో చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సహజంగా మాట్లాడడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 15 పేజీ 18

అధ్యాయం 15

గట్టి నమ్మకంతో చెప్పడం

లేఖనం

1 థెస్సలొనీకయులు 1:5

ఏమి చేయాలి? మీరు చెప్తున్న సమాచారం నిజమని, ప్రాముఖ్యమని గట్టిగా నమ్ముతున్నట్లు చూపించండి.

ఎలా చేయాలి?

  • బాగా సిద్ధపడండి. ముఖ్యమైన విషయాలు ఏమిటో, అవి నిజమని బైబిలు ఎలా నిరూపిస్తుందో అర్థమయ్యేంత వరకు సమాచారాన్ని బాగా చదవండి. ముఖ్యాంశాలను తేలిగ్గా అర్థమయ్యే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించండి. వినేవాళ్లకు సమాచారం ఎలా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించండి. పవిత్రశక్తి కోసం ప్రార్థించండి.

    సలహా

    ప్రసంగాన్ని బిగ్గరగా ప్రాక్టీసు చేయండి. అప్పుడు దానిలోని విషయాలు మీ మనసులో నాటుకుపోతాయి, మీరు చక్కగా ప్రసంగం ఇవ్వగలుగుతారు.

  • మీకు గట్టి నమ్మకం ఉందని చూపించే మాటలు ఉపయోగించండి. ప్రచురణలో ఉన్న మాటల్ని ఉన్నదున్నట్లు చెప్పే బదులు, సొంత మాటల్లో చెప్పండి. మీరు చెప్తున్న సమాచారం మీద మీకు గట్టి నమ్మకం ఉందని చూపించే మాటలు ఎంచుకోండి.

  • మీకు నిజంగా నమ్మకం కుదిరిందని చూపించండి. తగినంత స్వరంతో మాట్లాడండి. మీ సంస్కృతిలో తప్పు కాకపోతే ప్రేక్షకుల కళ్లల్లోకి చూసి మాట్లాడండి.

    సలహా

    గట్టి నమ్మకంతో మాట్లాడడమంటే దురుసుగా, సొంత అభిప్రాయాల్ని రుద్దుతున్నట్లుగా, మొండిగా మాట్లాడడం కాదు. మీకు నమ్మకం కుదిరిందన్నట్లు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రేమ, దయ చూపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి