కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 36 పేజీ 209-పేజీ 211 పేరా 1
  • చర్చాంశాన్ని విపులీకరించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చర్చాంశాన్ని విపులీకరించడం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 36 పేజీ 209-పేజీ 211 పేరా 1

36

చర్చాంశాన్ని విపులీకరించడం

మీరు ఏమి చెయ్యాలి?

మీ ప్రసంగమంతటా చర్చాంశాన్ని ప్రస్తావిస్తూ దాన్ని వేర్వేరు విధాల్లో విశదంగా చర్చించండి.

ఎందుకు ప్రాముఖ్యం?

మీరు చెప్పే విషయాలకు పొంతన ఉండి, మీరు చెబుతున్నదాన్ని అర్థం చేసుకొని గుర్తుంచుకోవడానికి మీ శ్రోతలకు సహాయపడుతుంది.

అనుభవజ్ఞులైన ప్రసంగీకులకు ప్రసంగానికి ఒక అంశం ఉండడంలోని విలువ తెలుసు. వాళ్ళు ఒక ప్రసంగానికి సిద్ధపడుతున్నప్పుడు, నిర్దిష్ట సమాచారంపై దృష్టి కేంద్రీకరించి, దాని గురించి లోతుగా ఆలోచించేందుకు వారికది సహాయం చేస్తుంది. ఫలితంగా వాళ్ళు అనేక అంశాలను పైపైన చెప్పుకుపోయే బదులు, ఆ సమాచారాన్ని శ్రోతలకు మరింత ప్రయోజనకరమయ్యేలా విపులీకరిస్తారు. ఒక్కో ముఖ్యాంశం చర్చాంశానికి నేరుగా ముడిపడివుండి దాన్ని విపులీకరించడానికి సహాయపడుతున్నప్పుడు శ్రోతలు కూడా ఆ అంశాలను గుర్తుంచుకునేందుకూ వాటి ప్రాముఖ్యతను అర్థంచేసుకోవడానికీ అది దోహదపడుతుంది.

మీరు మాట్లాడవలసిన విషయమే మీ చర్చాంశం అని చెప్పవచ్చు, అయినప్పటికీ మీరు విషయాన్ని ఏ దృక్కోణంతో విపులీకరిస్తారో ఆ దృక్కోణాన్నే మీరు చర్చాంశంగా దృష్టించినప్పుడు మీ ప్రసంగాల నాణ్యత మెరుగుపడుతోందని మీరు గ్రహిస్తారు. రాజ్యం, బైబిలు, పునరుత్థానం అనేవి సాధారణ విషయాలు. ఈ విషయాల ఆధారంగా వైవిధ్యభరితమైన చర్చాంశాలను విపులీకరించవచ్చు. కొన్ని ఉదాహరణలు: “రాజ్యం నిజమైన ఒక ప్రభుత్వం,” “దేవుని రాజ్యం భూమిని పరదైసుగా చేస్తుంది,” “బైబిలు దైవప్రేరేపితం,” “బైబిలు మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శి,” “పునరుత్థానం దుఃఖితులకు నిరీక్షణనిస్తుంది,” “హింసకు గురైనప్పుడు మనం స్థిరంగా ఉండడానికి పునరుత్థాన నిరీక్షణ మనకు సహాయపడుతుంది.” ఈ చర్చాంశాలన్నింటినీ పూర్తిగా భిన్నమైన పంథాల్లో విపులీకరించాలి.

యేసుక్రీస్తు తన భూ పరిచర్య కాలంలో చేసిన ప్రకటనా పని, బైబిలులోని ప్రముఖ చర్చాంశానికి పొందికగా, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అన్న చర్చాంశాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా చేసింది. (మత్త. 4:17) ఆ చర్చాంశం ఎలా విపులీకరించబడింది? నాలుగు సువార్తల్లో, 110 కన్నా ఎక్కువ సార్లు రాజ్యము గురించి పేర్కొనబడింది. అయితే యేసు “రాజ్యము” అన్న పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం కన్నా ఎక్కువే చేశాడు. వారి మధ్యవున్న తానే దేవుని కుమారుడననీ యెహోవా ఎవరికైతే రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడో ఆ మెస్సీయ తానేననీ ఆయన తన బోధనల ద్వారా తాను చేసిన అద్భుతాల ద్వారా స్పష్టం చేశాడు. ఇతరులు ఆ రాజ్యంలో భాగం వహించే మార్గం తన ద్వారా తెరవబడిందని కూడా యేసు చూపించాడు. ఆ ఆధిక్యత పొందే వ్యక్తి చూపించవలసిన గుణాలు ఏమిటో ఆయన తెలిపాడు. దేవుని రాజ్యం ప్రజల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆయన తన బోధనల ద్వారా తాను చేసిన శక్తివంతమైన కార్యాల ద్వారా స్పష్టం చేశాడు; తాను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టడం, తన శ్రోతల దగ్గరికి ‘దేవుని రాజ్యము వచ్చియున్నది’ అన్నదానికి రుజువుగా సూచించాడు. (లూకా 11:20) ఆ రాజ్యం గురించి సాక్ష్యమివ్వమనే యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించింది.—మత్త. 10:7; 24:14.

సముచితమైన చర్చాంశాన్ని ఉపయోగించడం. ఒక చర్చాంశాన్ని బైబిలు విపులీకరిస్తున్నంత విస్తృతంగా మిమ్మల్ని విపులీకరించమని కోరడం లేదు, అంతమాత్రాన సముచితమైన చర్చాంశం ఉండడానికి తక్కువ ప్రాముఖ్యతేమీ లేదు.

చర్చాంశం ఎంపిక మీకే వదిలేయబడినట్లయితే, మొదట మీ అందింపు ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోండి. సంక్షిప్త ప్రతిగా తయారయ్యే ముఖ్యాంశాలను ఎంపిక చేసుకునేటప్పుడు, అవి మీరు ఎంపిక చేసుకున్న చర్చాంశానికి నిజంగా మద్దతునిస్తున్నాయో లేవో నిశ్చయపరచుకోండి.

చర్చాంశం నియమించబడినట్లయితే, సమాచారం ఏ విధంగా విపులీకరించబడాలని ఆ చర్చాంశం సూచిస్తుందో జాగ్రత్తగా విశ్లేషించండి. అలాంటి చర్చాంశానికున్న విలువనూ శక్తినీ గ్రహించేందుకు కొంత ప్రయత్నం అవసరమవుతుండవచ్చు. మీకు నియమించబడిన చర్చాంశాన్ని విపులీకరించేందుకు సమాచారాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లయితే, చర్చాంశంపై దృష్టి కేంద్రీకరించబడే విధంగా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మరొకవైపు సమాచారం మీకు ఇవ్వబడినా, దాన్ని చర్చాంశానికి పొందికగా ఉపయోగించడమెలాగో మీరు విశ్లేషించుకోవాలి. ఆ సమాచారం మీ ప్రేక్షకులకు ఎందుకు ముఖ్యమో మీరు దాన్ని అందించడంలో మీ లక్ష్యమేమిటో కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ ప్రసంగంలో మీరు దేన్ని నొక్కిచెప్పాలో నిర్ణయించుకునేందుకు అది మీకు దోహదపడుతుంది.

చర్చాంశాన్ని ఎలా నొక్కి చెప్పాలి? చర్చాంశాన్ని సముచితమైన విధంగా నొక్కిచెప్పాలంటే మీరు సమాచారాన్ని ఎంపికచేసుకొని క్రమబద్ధంగా పొందుపరుచుకునేటప్పుడే పునాది వేసుకోవాలి. మీ చర్చాంశాన్ని బలపరిచే సమాచారాన్ని మాత్రమే ఉపయోగిస్తే మంచి సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడంలో ఉన్న సూత్రాలను అనుసరిస్తే మీరు ఆ చర్చాంశాన్ని దాదాపుగా మీకు తెలియకుండానే నొక్కి చెప్పేస్తారు.

మళ్ళీ చెప్పడం, చర్చాంశానికి మరింత బలాన్నిచ్చేందుకు సహాయపడగలదు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఒక రాగమే చర్చాంశం. ఆ రాగం, ఆ సంగీతంలో ఎంతగా పునరావృతమవుతూ ఉంటుందంటే, అది ఆ సంగీత రచన అంతటి ప్రత్యేకతగా గుర్తించబడుతుంది. అయితే అన్నిసార్లూ ఒకేవిధంగా పునరావృతం కాదు. కొన్నిసార్లు ఒకటో రెండో నొటేషన్స్‌ మాత్రమే పునరావృతమవుతాయి, అదే రాగం అప్పుడప్పుడు సూక్ష్మభేదంతో పునరావృతం కావచ్చు. అయినప్పటికీ ఆ రాగం ఏదో ఒకవిధంగా ఆ సంగీతరచన అంతటా పెనవేసుకుపోయేలా సంగీతాన్ని కూర్చే వ్యక్తి దాన్ని నైపుణ్యంతో కూర్చుతాడు. చర్చాంశం కూడా అదేవిధంగా ఉండాలి. చర్చాంశంలోని కీలక పదాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం, సంగీత రచనలోని ఒక రాగం పునరావృతమవ్వడంలాంటిదే. చర్చాంశంలోని పదాల పర్యాయపదాలైనా వాటి సమానార్థక పదాలైనా చర్చాంశాన్ని వైవిధ్యభరితమైన విధంగా చెప్పడానికి సహాయపడతాయి. ఈ విధాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పడం, మీ ప్రేక్షకులు చర్చాంశాన్ని ముఖ్యమైన విషయంగా గుర్తుంచుకునేలా చేస్తుంది.

ఈ సూత్రాలు వేదిక మీద నుండి ఇచ్చే ప్రసంగాలకు మాత్రమే కాక పరిచర్యలో చేసే చర్చలకు కూడా వర్తిస్తాయి. చిన్న సంభాషణల్లో, చర్చాంశం ప్రత్యేకంగా గుర్తించేటట్లుంటే అవి ఇంకా ఎక్కువ గుర్తుంటాయి. ఒక బైబిలు అధ్యయనంలో చర్చించబడుతున్న చర్చాంశం నొక్కి చెప్పబడితే ఇవ్వబడిన ఉపదేశం ఇంకా త్వరగా గుర్తుకువస్తుంది. తగిన చర్చాంశాలను ఎంపిక చేసుకొని విపులీకరించుకునేందుకు మీరు చేసే ప్రయత్నం, ఒక ప్రసంగీకుడిగా దేవుని వాక్యపు బోధకుడిగా మీ ప్రతిభను పెంచేందుకు ఎంతో తోడ్పడగలదు.

ప్రాముఖ్యమైన ఒక రచనలోని ప్రధానమైన చర్చాంశం

ఒక చర్చాంశం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడంలో, యెహోవా దేవుడు మానవ రచయితలను ఉపయోగించుకున్నప్పటికీ మొత్తం బైబిలుగా రూపొందిన 66 పుస్తకాల్లో అంతటా ప్రముఖమైన చర్చాంశాన్ని ఎలా కూర్చాడో అధ్యయనం చేయడం సహాయకరంగా ఉంటుంది. ఆ చర్చాంశం: మానవజాతిని పరిపాలించేందుకు యెహోవాకున్న హక్కును నిరూపించడం, ఆయన రాజ్యం ద్వారా ఆయన ప్రేమపూర్వక సంకల్పం వాస్తవమవ్వడం.

ఈ చర్చాంశం ఆదికాండము మొదటి అధ్యాయాల్లో మొదలై, దాని వివిధ పార్శ్వాలు బైబిలులోని మిగతా భాగాల్లో విపులీకరించబడ్డాయి. దేవుని పేరు మీదకి మళ్ళీ మళ్ళీ శ్రద్ధ మళ్ళించబడింది. అదీ 7,000 కంటే ఎక్కువసార్లు. యెహోవా పరిపాలనా హక్కు, సృష్టి వృత్తాంతంలో స్పష్టంగా రుజువవుతుంది. అవిధేయత వల్ల వచ్చిన విపత్కరమైన ఫలితాలు, వాటితో పాటు ఆయన పరిపాలనకు ఎదురైన సవాలు నివేదించబడ్డాయి. యెహోవా ఉత్కృష్ట ప్రేమ, జ్ఞానం, న్యాయం, సర్వశక్తి ఆయన తన సృష్టితో వ్యవహరించిన విధానంలో ప్రదర్శితమయ్యాయి. దేవునికి విధేయత చూపించడం వల్ల చేకూరే ప్రయోజనాలూ అవిధేయత వల్ల వచ్చే విపత్తూ అనేకానేక ఉదాహరణల ద్వారా తెలియజేయబడ్డాయి. పాప మరణాలను తుడిచి వేయడానికి యేసుక్రీస్తు ద్వారా యెహోవా చేసిన ఏర్పాటు వివరించబడింది, స్పష్టం చేయబడింది. తన సృష్టిపై యెహోవా పరిపాలనా హక్కును గుర్తించడానికి నిరాకరించే దుష్టాత్మలనూ మానవులనూ నాశనం చేసే పరలోక ప్రభుత్వాన్ని గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఏక సత్య దేవుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఒకరినొకరు ప్రేమించే ప్రజలతో నిండిన పరదైసుగా భూమి మారాలన్న యెహోవా సంకల్పాన్ని ఆయన రాజ్యం నెరవేరుస్తుందని అది స్పష్టం చేసింది.

ఎలా చెయ్యాలి?

  • మీరు ప్రసంగాన్ని తయారు చేసుకునేటప్పుడే మీ చర్చాంశాన్ని విపులీకరించేందుకు నిజంగా తోడ్పడుతూ ఆధారాన్నిచ్చే వివరాలనూ ముఖ్యాంశాలనూ ఎంపిక చేసుకోండి.

  • మీరు మీ ప్రసంగాన్ని అభ్యాసం చేసేటప్పుడు, చర్చాంశాన్ని ఎక్కడ, ఎలా నొక్కి చెప్పాలో ఆలోచించుకోండి. మీరు ఏ అంశాల దగ్గర అలా నొక్కి చెప్పాలనుకుంటున్నారో ఆ అంశాలను సంక్షిప్త ప్రతిలో ఏదైనా గుర్తు పెట్టుకోవచ్చు.

  • ప్రసంగించేటప్పుడు చర్చాంశంలోని కీలక పదాలను గానీ అంశాలను గానీ మధ్యమధ్యలో మళ్ళీ మళ్ళీ చెబుతుండండి.

అభ్యాసం: ఇటీవలి కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని నిర్దిష్ట ఆర్టికల్‌కి పొందికగా ఉండే చర్చాంశాన్ని క్షేత్రసేవ కోసం ఎంపిక చేసుకోండి. మీ ఉపోద్ఘాతంలో ఆ చర్చాంశంపై ఆసక్తిని పుట్టించేందుకూ ఆ చర్చాంశాన్ని మీ చర్చలో ఒకటో రెండో అంశాలతో విపులీకరించేందుకూ ముగింపులో దాని విలువను నొక్కి చెప్పేందుకూ శాయశక్తులా ప్రయత్నించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి