కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 13 పేజీ 16
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి ఉపోద్ఘాతం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 13 పేజీ 16

అధ్యాయం 13

సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం

లేఖనం

యెషయా 48:17

ఏమి చేయాలి? మీరు చెప్పే విషయం తమ జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుందో అర్థంచేసుకునేలా వినేవాళ్లకు సహాయం చేయండి, నేర్చుకున్నవాటిని ఎలా పాటించాలో చూపించండి.

ఎలా చేయాలి?

  • వినేవాళ్ల గురించి ఆలోచించండి. మీరు చెప్తున్న సమాచారం వాళ్లకు ఎందుకు అవసరమో, దానిలో ఏ విషయం వాళ్లకు బాగా ఉపయోగపడుతుందో ఆలోచించండి.

  • ప్రేక్షకులు ఏమి చేయాలో మీ ప్రసంగం అంతట్లో చెప్తూ ఉండండి. ప్రసంగం మొదటి నుండి, ‘ఇది నా కోసమే’ అని ప్రతీ ప్రేక్షకునికి అనిపించాలి. ఒక్కొక్క ముఖ్యాంశం వివరిస్తూ దాన్ని ఎలా పాటించాలో చెప్పండి. ఏమి పాటించాలో పైపైన కాకుండా నిర్దిష్టంగా చెప్పండి.

    సలహా

    బైబిలు సూత్రాలను ఎలా పాటించవచ్చో ప్రేమతో, సహానుభూతితో చెప్పండి. తప్పు చేశామనే భావన ప్రేక్షకుల్లో కలిగించకుండా వాళ్ల ప్రేమను, విశ్వాసాన్ని పెంచడానికి కృషిచేయండి. వాళ్లు సరైనది చేస్తారనే, మీరు చెప్పింది పాటిస్తారనే నమ్మకం చూపించండి.

పరిచర్యలో

ప్రకటించడం కోసం సిద్ధపడుతున్నప్పుడు, తాజా వార్తల గురించి, మీ ప్రాంతంలోని ప్రజలు ఇష్టపడే విషయాల గురించి ఆలోచించండి. ఆ సమయంలో వాళ్లు దేని గురించి ఎక్కువగా ఆందోళనపడుతున్నారో దాని గురించి మాట్లాడండి. వాళ్ల సమస్యలు, ఇష్టాలు తెలుసుకోవడానికి తెలివిగా ప్రశ్నలు వేయండి. వాళ్ల జవాబు విన్నాక, దానికి తగ్గట్టు మాట్లాడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి