కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 19 పేజీ 22
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • హృదయాన్ని స్పృశించేందుకు కృషి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రోత్సాహకరంగా మాట్లాడడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 19 పేజీ 22

అధ్యాయం 19

హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం

లేఖనం

సామెతలు 3:1

ఏమి చేయాలి? వినేవాళ్లు తాము నేర్చుకున్నవాటిని విలువైనవిగా ఎంచి, వాటి ప్రకారం చర్య తీసుకునేలా సహాయం చేయండి.

ఎలా చేయాలి?

  • తమను తాము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. వినేవాళ్లు తమ హృదయంలో ఏముందో పరిశీలించుకునేలా ప్రశ్నలు వేయండి.

  • వినేవాళ్లను పురికొల్పండి. వాళ్లు ఎందుకు మంచి పనులు చేస్తున్నారో పరిశీలించుకోమని ప్రోత్సహించండి. మంచి ఉద్దేశాలతో అంటే యెహోవా మీద, సాటి మనుషుల మీద, బైబిలు బోధల మీద ప్రేమతో మంచి పనులు చేసేలా వాళ్లకు సహాయం చేయండి. వాళ్లను ఆలోచింపజేయండి, అంతేకానీ ఉపన్యాసం ఇవ్వకండి. సమాచారమంతా విన్నాక వాళ్లు సిగ్గుపడకూడదు కానీ ప్రోత్సాహం పొంది, చేయగలిగినదంతా చేయాలని కోరుకోవాలి.

  • యెహోవావైపు దృష్టి మళ్లించండి. బైబిలు బోధల్లో, సూత్రాల్లో, ఆజ్ఞల్లో దేవుని లక్షణాలు, మనమీద ఆయనకున్న ప్రేమ ఎలా కనిపిస్తున్నాయో నొక్కిచెప్పండి. వినేవాళ్లు యెహోవా భావాల గురించి ఆలోచించి ఆయనను సంతోషపెట్టాలని కోరుకునేలా చేయండి.

    సలహా

    ప్రజల్ని ఆకర్షించేది యెహోవా అని గుర్తుంచుకోండి. వినేవాళ్లను ఆయన వాక్యంతో పురికొల్పండి.

పరిచర్యలో

ఇంటివ్యక్తి నిజంగా ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి వీలైనప్పుడల్లా ప్రశ్నలు వేయండి. ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఆయన ముఖకవళికలు, స్వరం గమనించండి. కానీ ఓపిగ్గా ఉండండి. తన మనసులో ఏముందో చెప్పాలంటే, ముందు ఆయనకు మీ మీద నమ్మకం కలగాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి