కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • th అధ్యాయం 11 పేజీ 14
  • ఉత్సాహం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉత్సాహం
  • చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ఉత్సాహంగా బోధించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఆప్యాయత, సహానుభూతి
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ప్రేక్షకుల గురించి ఆలోచించి, వాళ్లకు ఉపయోగపడేది చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
చక్కగా చదువుదాం, బోధిద్దాం
th అధ్యాయం 11 పేజీ 14

అధ్యాయం 11

ఉత్సాహం

లేఖనం

రోమీయులు 12:11

ఏమి చేయాలి? ఉత్సాహంగా మాట్లాడుతూ వినేవాళ్లను పురికొల్పండి, ప్రోత్సహించండి.

ఎలా చేయాలి?

  • ముందుగా సమాచారం మీ హృదయాన్ని కదిలించనివ్వండి. సిద్ధపడుతున్నప్పుడే మీరు చెప్పే సమాచారం ఎందుకు ప్రాముఖ్యమో లోతుగా ఆలోచించండి. మీ సమాచారాన్ని బాగా అర్థం చేసుకోండి. అప్పుడు హృదయంలో నుండి మాట్లాడగలుగుతారు.

  • వినేవాళ్ల గురించి ఆలోచించండి. మీరు చదివే లేదా బోధించే సమాచారం వల్ల వినేవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారో ధ్యానించండి. మీరు ఎలా మాట్లాడితే వాళ్లు దాని విలువను గ్రహిస్తారో ఆలోచించండి.

  • మీరు చెప్తున్న సమాచారానికి జీవం పోయండి. ఉత్సాహంగా మాట్లాడండి. సహజమైన సంజ్ఞలు, ముఖకవళికల ద్వారా మీ భావాలు తెలియజేయండి.

    సలహా

    అలవాటుగా ఒకే సంజ్ఞను పదేపదే ఉపయోగించి వినేవాళ్ల ధ్యాస మళ్లించకండి. మీరు చేసే సంజ్ఞలు మీరు చెప్పే సమాచారానికి పొందికగా ఉండాలి. ప్రత్యేకించి ముఖ్యాంశాలు బోధిస్తున్నప్పుడు, చర్య తీసుకునేలా ప్రోత్సహిస్తున్నప్పుడు ఉత్సాహం చూపించండి. మొదటి నుండి చివరివరకు మితిమీరిన ఉత్సాహం చూపించి ప్రేక్షకులు అలసిపోయేలా చేయకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి