కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 99 పేజీ 230-పేజీ 231 పేరా 4
  • ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • సీల—ప్రోత్సాహానికి మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • యెహోవా వాక్యము వ్యాపించుట!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 99 పేజీ 230-పేజీ 231 పేరా 4
ఫిలిప్పీలో జైలు అధికారి జైలు తలుపులు అన్నీ తెరిచి ఉన్నా ఖైదీలు ఎక్కడికీ పోలేదని చూస్తాడు

లెసన్‌ 99

ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు

ఫిలిప్పీలో, ఒక పనమ్మాయిలోకి చెడ్డదూత ప్రవేశించాడు. ఆ చెడ్డదూత ఆ అమ్మాయిని భవిష్యత్తు లేదా జాతకం చెప్పడానికి ఉపయోగించాడు. ఆ అమ్మాయి వల్ల ఆమె యజమానులకు చాలా డబ్బులు వచ్చేవి. పౌలు, సీల ఫిలిప్పీకు వచ్చినప్పుడు చాలా రోజులు ఆ అమ్మాయి వాళ్ల వెంట పడింది. ఆ చెడ్డదూత ఆమెను ఇలా అరిచేలా చేశాడు: “వీళ్లు సర్వోన్నత దేవుని దాసులు.” చివరికి పౌలు ఆ చెడ్డదూతతో ఇలా అన్నాడు: ‘యేసు పేరున ఆమెలో నుండి బయటికి రా.’ అప్పుడు ఆ చెడ్డదూత ఆమె నుండి బయటికి వచ్చేశాడు.

ఇక ఆమెను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోలేరని ఆ అమ్మాయి యజమానులకు తెలిసి వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్లు పౌలు, సీలను నగర పాలకుల దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నారు: ‘వీళ్లు చట్టాన్ని పాటించకుండా, పట్టణంలో గందరగోళం సృష్టిస్తున్నారు.’ పాలకులు పౌలు, సీలను కొట్టి జైల్లో పడేయమని చెప్పారు. జైలు అధికారి వాళ్లను జైల్లో బాగా చీకటిగా ఉన్న లోతైన చోట పడేసి, వాళ్లను బొండలో పెట్టాడు.

మిగతా ఖైదీలు వింటుండగా పౌలు, సీల యెహోవాకు పాటలు పాడారు. మధ్యరాత్రి అయినప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చి జైలు పైనుండి కిందికి ఊగిపోయింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి, ఖైదీలకు వేసిన సంకెళ్లు, బొండలు ఊడిపోయాయి. జైలు అధికారి జైలు లోపలికి వెళ్లి చూసినప్పుడు తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఖైదీలందరు పారిపోయారని అనుకుని తనను చంపుకోవడానికి ఒక పెద్ద కత్తి తీసుకున్నాడు.

వెంటనే పౌలు ఇలా పిలిచాడు: ‘మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి! మేమంతా ఇక్కడే ఉన్నాం!’ ఆ జైలు అధికారి పరుగెత్తుకుంటూ వచ్చి పౌలు, సీల ముందు పడిపోయాడు. ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” వాళ్లు ఇలా జవాబిచ్చారు: ‘నువ్వు, నీ కుటుంబం యేసును నమ్మాలి.’ తర్వాత పౌలు, సీల వాళ్లకు యెహోవా వాక్యం నేర్పించారు. ఆ జైలు అధికారి, అతని కుటుంబంలో అందరూ బాప్తిస్మం తీసుకున్నారు.

“ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసించి, సమాజమందిరాలకు అప్పగిస్తారు; చెరసాలల్లో వేయిస్తారు. నా శిష్యులుగా ఉన్నందుకు మిమ్మల్ని రాజుల ముందుకు, అధిపతుల ముందుకు తీసుకెళ్తారు. దానివల్ల, సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.”—లూకా 21:12, 13

ప్రశ్నలు: పౌలు, సీలను జైల్లో ఎందుకు వేస్తారు? జైలు అధికారి సత్యం ఎలా నేర్చుకున్నాడు?

అపొస్తలుల కార్యాలు 16:16-34

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి