కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 98 పేజీ 228-పేజీ 229 పేరా 1
  • క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ మిషనరీ సేవకు ప్రేరేపిత లేఖన మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా ప్రజలు విశ్వాసమందు స్థిరపరచబడిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ‘యెహోవా అధికారంతో ధైర్యంగా మాట్లాడారు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 98 పేజీ 228-పేజీ 229 పేరా 1
అపొస్తలుడైన పౌలు, బర్నబా కుప్ర అధికారి అయిన సెర్గి పౌలుకు ప్రకటించారు

లెసన్‌ 98

క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది

భూమి అంతటా మంచివార్త గురించి చెప్పమని యేసు ఇచ్చిన ఆజ్ఞను అపొస్తలులు పాటించారు. క్రీ.శ. 47లో అంతియొకయలో ఉన్న సహోదరులు పౌలు, బర్నబాను వేర్వేరు ప్రాంతాలకు ప్రకటించడానికి పంపించారు. ఈ ఇద్దరు ఎంతో ఆసక్తితో దెర్బే, లుస్త్ర, ఈకొనియ లాంటి ప్రాంతాలకు ప్రకటిస్తూ ఆసియా మైనరు అంతా వెళ్లారు.

పౌలు, బర్నబా ధనవంతులకు, పేదవాళ్లకు, పిల్లలకు, ముసలి వాళ్లకు అందరికీ ప్రకటించారు. చాలామంది క్రీస్తు గురించిన సత్యాన్ని నమ్మారు. పౌలు, బర్నబా కుప్ర దేశానికి అధికారి అయిన సెర్గి పౌలుకు ప్రకటించినప్పుడు ఒక మంత్రగాడు వాళ్లను ఆపడానికి ప్రయత్నించాడు. పౌలు ఆ మంత్రగాడితో ఇలా అన్నాడు: ‘యెహోవా నిన్ను శిక్షిస్తాడు.’ అ క్షణంలో అతను గుడ్డివాడు అయ్యాడు. అది చూసి, అధికారి అయిన సెర్గి పౌలు విశ్వాసి అయ్యాడు.

పౌలు, బర్నబా ప్రతీచోట ప్రకటించారు. ఇంటింటికి వెళ్లి, మార్కెట్లలో, వీధుల్లో, సమాజమందిరాల్లో అన్ని చోట్ల ప్రకటించారు. లుస్త్రలో వాళ్లు ఒక కుంటివాడిని బాగు చేశారు. ఆ అద్భుతాన్ని చూసిన వాళ్లు పౌలు, బర్నబాను దేవుళ్లని అనుకుని ఆరాధించడానికి ప్రయత్నించారు. కానీ పౌలు, బర్నబా వాళ్లను ఆపి, ఇలా చెప్పారు: ‘దేవుడినే ఆరాధించండి. మేము మనుషులం మాత్రమే.’ తర్వాత కొంతమంది యూదులు వచ్చి అక్కడున్న గుంపును పౌలుకు వ్యతిరేకంగా చేశారు. ఆ గుంపు అతన్ని రాళ్లతో కొట్టి, పట్టణం బయటికి ఈడ్చుకెళ్లారు. ఆయన చనిపోయాడని అనుకుని అక్కడే వదిలేశారు. కానీ పౌలు బ్రతికే ఉన్నాడు! వెంటనే, సహోదరులు అతని సహాయానికి వచ్చి, పట్టణంలోకి తీసుకెళ్లారు. తర్వాత, పౌలు మళ్లీ అంతియొకయకు వెళ్లిపోయాడు.

క్రీ.శ. 49లో పౌలు ఇంకో యాత్రకు వెళ్లాడు. ఆసియా మైనరులో ఉన్న సహోదరులను చూడడానికి వెళ్లాక ఇంకా దూరం వెళ్లి యూరప్‌లో కూడా మంచివార్త చెప్పాడు. అతను ఏథెన్సు, ఎఫెసు, ఫిలిప్పీ, థెస్సలొనీక, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్లాడు. పౌలుతోపాటు సీల, లూకా, తిమోతి అనే యవనస్థుడు కూడా వెళ్లారు. వాళ్లు సంఘాలు ఏర్పడడానికి కలిసి పని చేశారు. అవి బలంగా ఉండేలా సహాయం చేశారు. పౌలు కొరింథులో ఒకటిన్నర సంవత్సరం ఉండి అక్కడ సహోదరులను బలపర్చాడు. అక్కడ ఆయన ప్రకటించాడు, నేర్పించాడు, ఎన్నో సంఘాలకు ఉత్తరాలు రాశాడు. డేరాలు తయారు చేసే పని కూడా చేశాడు. కొంతకాలం తర్వాత పౌలు అంతియొకయకు తిరిగి వచ్చేశాడు.

అపొస్తలుడైన పౌలు మార్కెట్‌లో ప్రీచింగ్‌ చేస్తున్నాడు

తర్వాత, క్రీ.శ. 52లో పౌలు మూడవసారి యాత్ర చేశాడు. ఆసియా మైనరు ప్రాంతంలో మొదలుపెట్టి ఉత్తర దిక్కులో ఉన్న ఫిలిప్పీ నుండి దక్షిణాన ఉన్న కొరింథు వరకు ప్రయాణించాడు. ఎఫెసులో బోధిస్తూ, రోగుల్ని బాగు చేస్తూ, సంఘానికి సహాయం చేస్తూ పౌలు అక్కడ చాలా సంవత్సరాలు గడిపాడు. ఒక స్కూల్‌ ఆడిటోరియమ్‌లో ఆయన రోజూ బహిరంగ ప్రసంగాలు కూడా ఇచ్చేవాడు. చాలామంది విని వాళ్ల పద్ధతులు మార్చుకున్నారు. చాలా దేశాల్లో మంచివార్త ప్రకటించి పౌలు చివరికి యెరూషలేముకు వెళ్లిపోయాడు.

“కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి.”—మత్తయి 28:19

ప్రశ్నలు: మీ బైబిల్లో ఉన్న మ్యాప్‌ చూసి, పౌలు ప్రకటనా పని కోసం ఎక్కడెక్కడికి వెళ్లాడో చూపించండి.

అపొస్తలుల కార్యాలు 13:1–23:35

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి