కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 33
  • శత్రువులకు భయపడకండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శత్రువులకు భయపడకండి!
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • శత్రువులకు భయపడకండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • “రోజుకొక ఆపిల్‌ వైద్యున్ని దూరంగా ఉంచుతుంది”
    తేజరిల్లు!—1996
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 33

పాట 33

శత్రువులకు భయపడకండి!

(మత్తయి 10:28)

1. ఓ నా ప్రజలారా మీరు సువార్త పనిచేస్తూ,

సాగిపోండి ముందుకు. ధైర్యాన్ని కోల్పోవద్దు.

సాతాన్ని పడద్రోశాడు నా సుతుడైన క్రీస్తు.

త్వరలో బంధించి వాణ్ణి విమోచించున్‌ మిమ్మును.

(పల్లవి)

నా ప్రియ సేవకుల్లారా,

వైరికి భీతిల్లొద్దు.

కాపాడతాను మిమ్మల్ని

కనుపాపల్లా నేను.

2. శత్రువులు వేవేలున్నా ఎగతాళి చేసినా

దూషించి హింసించినా జడియద్దు ఏమైనా.

నేను మీకు తోడైవుంటా నా ప్రియ యోధుల్లారా.

ధైర్యమునిస్తా మెండుగా రక్షిస్తా కడదాకా.

(పల్లవి)

నా ప్రియ సేవకుల్లారా,

వైరికి భీతిల్లొద్దు.

కాపాడతాను మిమ్మల్ని

కనుపాపల్లా నేను.

3. శత్రువులు క్రూరులైనా అండగా నేనుంటాను.

మీకెందుకు భయము? అందిస్తా నా హస్తము.

ప్రాణాలు తీయడం తప్ప చేయలేరేమీ వారు.

నమ్మకంగా ఉంటే మీరు ఇస్తా జీవాన్ని నేను.

(పల్లవి)

నా ప్రియ సేవకుల్లారా,

వైరికి భీతిల్లొద్దు.

కాపాడతాను మిమ్మల్ని

కనుపాపల్లా నేను.

(ద్వితీ. 32:10; నెహె. 4:14; కీర్త. 59:1; 83:2, 3 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి