సెక్షన్ 2
“యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు”
రోజురోజుకీ ప్రపంచంలో అన్యాయం బాగా పెరిగిపోతుంది, చాలామంది దానికి కారణం దేవుడే అని వేలెత్తి చూపిస్తారు. అయితే, బైబిలు మనకు హాయినిచ్చే ఒక నిజాన్ని చెప్తుంది. అదేంటంటే, “యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.” (కీర్తన 37:28) ఈ సెక్షన్లో యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తున్నాడని ఎలా నిరూపించుకున్నాడో, అలాగే అన్యాయం అంతటినీ ఎలా తుడిచేస్తాడో చూస్తాం.