Thomas Jackson/Stone via Getty Images
అప్రమత్తంగా ఉండండి!
2024లో ఆశతో జీవిద్దాం—బైబిలు ఏం చెప్తుంది?
2024 సంవత్సరంలో వచ్చే సమస్యల్ని గట్టెక్కడం కష్టమే అని చాలామంది అనుకుంటున్నారు. అయినా మనం ఒక ఆశతో ముందుకెళ్లవచ్చు. ఆ ఆశ ఎక్కడ దొరుకుతుంది?
బైబిలు మనలో ఆశను చిగురింపజేస్తుంది
సమస్యల వల్ల నేడు అన్ని దారులూ మూసుకుపోయినట్టు అనిపిస్తోంది. కానీ ఆ సమస్యలన్నిటినీ దేవుడు పూర్తిగా తీసేస్తాడని బైబిలు మాటిస్తోంది. త్వరలోనే, మన ‘కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును దేవుడు తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.’—ప్రకటన 21:4.
భవిష్యత్తు గురించి బైబిలు ఏమని మాటిస్తుందో తెలుసుకోవడానికి “మంచి రోజులు రాబోతున్నాయి—ఈ మాట ముమ్మాటికీ నిజం” (ఇంగ్లీష్) అనే ఆర్టికల్ చదవండి.
బైబిలు మీకు ఇప్పుడెలా సహాయం చేస్తుంది?
ఇక జీవితంలో ఏ ఆశా లేదు అనే ఆలోచనల్ని పక్కన పెట్టేసి ధైర్యంతో, నమ్మకంతో ముందడుగు వేయడానికి సహాయం చేసే మాటలు బైబిల్లో ఉన్నాయి. (రోమీయులు 15:13) ఇప్పుడు మీ ముందున్న పేదరికాన్ని, అన్యాయాన్ని, అనారోగ్యాన్ని తట్టుకుని ఎలా నిలబడవచ్చో చెప్పే చక్కని సలహాలు కూడా బైబిల్లో ఉన్నాయి.
పేదరికంలో పుట్టి పెరిగిన ఒకాయన బైబిల్లోని ఆశ నింపే మాటల్ని తెలుసుకుని ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాడు. దాని గురించి తెలుసుకోవడానికి “జువాన్ పాబ్లో జెర్మెనో: యెహోవా నాకు అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చాడు” అనే వీడియో చూడండి.
మీరు చేసిన తప్పుల్ని తలచుకుని కృంగిపోతున్నారా? సమస్యల్ని చూసి బాధపడుతున్నారా? ఆందోళనలతో పోరాడుతున్నారా? మీకు ఇష్టమైనవాళ్లు చనిపోయారని దుఃఖంలో మునిగిపోయారా? అయితే బైబిల్లోని మాటలు మీకు ఓదార్పును, ఊరటను ఇస్తాయి. “బైబిలు నాకు ఓదార్పును ఇస్తుందా?“ (ఇంగ్లీష్) అనే ఆర్టికల్ చదవండి.
మిలటరీలో పని చేసి రిటైర్ అయిన ఒకామె ఇలా అంటుంది: ‘నేను ఎవర్నీ పట్టించుకోకుండా, మనసే లేనట్టు ప్రవర్తించేదాన్ని.’ అయితే బైబిల్లోని మాటలు ఆమె జీవితాన్ని ఎలా మార్చేశాయో తెలుసుకోండి. “నేను నా తుపాకీని వదిలేశాను” (ఇంగ్లీష్) అనే వీడియో చూడండి.
ఈ 2024 సంవత్సరం మీ జీవితంలో, మీ కుటుంబ సభ్యుల జీవితంలో వెలుగు నింపేలా చేసుకోండి. బైబిలు మీకెలా సహాయం చేస్తుందో మరింత ఎక్కువగా తెలుసుకోండి. యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు తీసుకోండి. దేవుడు ఇప్పుడు మీకు “శాంతిని“ అలాగే, “మంచి భవిష్యత్తు, నిరీక్షణ (ఆశ)” ఎలా ఇస్తాడో తెలుసుకోండి.—యిర్మీయా 29:11.