కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 2 పేజీలు 6-7
  • 1. మన బాధలకు కారణం దేవుడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1. మన బాధలకు కారణం దేవుడా?
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?
  • ఒకసారి ఆలోచించండి
  • బైబిలు ఏం చెప్తుందంటే . . .
  • విషయసూచిక
    తేజరిల్లు!—2020
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మన బాధలకు దేవుడే కారణమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 2 పేజీలు 6-7
చర్చిలో ఒక పాస్టరు బైబిలు పట్టుకుని ప్రసంగం ఇస్తున్నాడు, ప్రియమైన వాళ్లను కోల్పోయిన బాధలో ఉన్న ప్రజలు దాన్ని వింటున్నారు.

1. మన బాధలకు కారణం దేవుడా?

దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?

చాలామంది తమ బాధలకు దేవుడే కారణం అనుకుని ఆయన్ని ఆరాధించడానికి ఇష్టపడట్లేదు.

ఒకసారి ఆలోచించండి

మన బాధలకు కారణం దేవుడే అని చాలామంది మతనాయకులు నేరుగా గానీ, మరో విధంగా గానీ చెప్తున్నారు. ఉదాహరణకు, కొంతమంది ఇలా అంటారు:

  • దేవుడు మనల్ని శిక్షించడానికి ప్రకృతి విపత్తులు తెస్తున్నాడు.

  • దేవునికి పరలోకంలో దూతలు అవసరం కాబట్టి పిల్లలు చనిపోతున్నారు.

  • చాలా బాధలకు కారణమయ్యే యుద్ధాల్లో దేవుడు ఏదోక పక్షానికి సహాయం చేస్తాడు.

కానీ మతనాయకులు దేవుని గురించి అబద్ధాలు చెప్పే అవకాశం ఉందా? మరి దేవుడు వాళ్లను అంగీకరిస్తున్నాడా?

ఎక్కువ తెలుసుకోండి

jw.org వెబ్‌సైట్‌లో బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియో చూడండి.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

మన బాధలకు కారణం దేవుడు కాదు.

దేవుడు మన బాధలకు కారణం అవ్వడం, బైబిల్లో చెప్పబడిన ఆయన లక్షణాలకు పూర్తి విరుద్ధం. ఉదాహరణకు:

“ఆయన [దేవుని] మార్గాలన్నీ న్యాయమైనవి. . . . ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.”—ద్వితీయోపదేశకాండం 32:4.

“సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!”—యోబు 34:10.

“సర్వశక్తిమంతుడు న్యాయాన్ని వక్రీకరించడు.”—యోబు 34:12.

తన గురించి అబద్ధాలు చెప్పే మతాల్ని దేవుడు ఇష్టపడడు.

బాధలకు కారణం దేవుడు అని బోధించే మతాలు, అలాగే యుద్ధాల్ని, హింసను సమర్థించే మతాలు ఆయనకు ఇష్టం లేదు.

“ఆ ప్రవక్తలు నా [దేవుని] పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు, వాళ్లతో మాట్లాడనూ లేదు. వాళ్లు అబద్ధ దర్శనాన్ని, . . . తమ హృదయాల్లో ఉన్న మోసాన్ని మీకు ప్రవచిస్తున్నారు.”—యిర్మీయా 14:14.

కపట మతనాయకుల్ని యేసు ఖండించాడు.

“‘ప్రభువా, ప్రభువా,’ అని నన్ను పిలిచే ప్రతీ ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి కోరేవాటిని చేసేవాళ్లే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు చేయలేదా?’ అని అంటారు. అయితే అప్పుడు నేను వాళ్లతో, ‘అక్రమంగా నడుచుకునే వాళ్లారా, మీరు ఎవరో నాకు అస్సలు తెలీదు, నా దగ్గర నుండి వెళ్లిపోండి!’ అని అంటాను.”—మత్తయి 7:21-23.

మన బాధలకు కారణం దేవుడా?

ఉదాహరణకు, ఒక తండ్రి తన పిల్లల్ని పెంచిపెద్ద చేసి వాళ్లకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. కొంతకాలానికి వాళ్లలో ఒక కొడుకు తండ్రికి ఎదురుతిరిగి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు, తన జీవితాన్ని నాశనం చేసే చెడు దారిని ఎంచుకున్నాడు. అతని ప్రవర్తనకు తండ్రి బాధ్యుడా? అతను అనుభవిస్తున్న చెడు పర్యవసానాలకు తండ్రే కారణం అని అనగలడా? అదేవిధంగా మన బాధలకు దేవుడే కారణమని అనలేం.

మరి బాధలకు కారణం మనమేనా?

2వ ప్రశ్న చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి