కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 2 పేజీలు 8-9
  • 2. బాధలకు కారణం మనమేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2. బాధలకు కారణం మనమేనా?
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?
  • ఒకసారి ఆలోచించండి
  • బైబిలు ఏం చెప్తుందంటే . . .
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • విషయసూచిక
    తేజరిల్లు!—2020
  • 4. బాధలు పడడానికే దేవుడు మనల్ని సృష్టించాడా?
    తేజరిల్లు!—2020
  • బాధలు, కష్టాలు
    తేజరిల్లు!—2015
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 2 పేజీలు 8-9
ఒక చేతిలో సిగరెట్‌, మరో చేతిలో తెరిచి ఉన్న బీర్‌ బాటిల్‌ పట్టుకుని ఒకతను తన ఇంటి హాలులో కూర్చున్నాడు.

2. బాధలకు కారణం మనమేనా?

దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?

ఒకవేళ బాధలకు కారణం మనమే అయ్యుంటే, వాటిని తగ్గించుకోవడం కూడా మన చేతుల్లోనే ఉండేది.

ఒకసారి ఆలోచించండి

బాధలకు కారణమైన ఈ విషయాల్లో మనుషులు ఎంతవరకు బాధ్యులు?

  • భౌతిక, లైంగిక దాడులకు గుర్తుగా బిగించిన పిడికిలి బొమ్మ.

    శారీరక, లైంగిక దాడులు.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రతీ నలుగురు పెద్దవాళ్లలో ఒకరు చిన్నప్పుడు ఏదోక సమయంలో శారీరక దాడికి గురయ్యారు. అలాగే ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు తమ జీవితంలో ఏదోక సమయంలో శారీరక లేదా లైంగిక దాడికి (లేదా ఆ రెండు దాడులకు) గురయ్యారు.

  • శ్మశానవాటికకు గుర్తుగా సమాధిరాళ్ల బొమ్మ.

    ప్రియమైనవాళ్లు చనిపోవడం.

    WHO ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య గణాంకాలు 2018 ప్రకారం, “2016 లో భూవ్యాప్తంగా 4,77,000 హత్యలు జరిగాయని అంచనా.” దీనికి తోడు ఆ సంవత్సరం జరిగిన యుద్ధాల్లో, గొడవల్లో 1,80,000 మంది చనిపోయారని అంచనా.

  • జబ్బులకు గుర్తుగా గుండె, ఈసీజి (ECG) బొమ్మ.

    జబ్బులు.

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌ పత్రికలో ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో, ఫ్రాన్‌ స్మిత్‌ అనే రచయిత ఇలా రాశారు: “పొగతాగేవాళ్లు వంద కోట్ల కన్నా ఎక్కువమంది ఉన్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ ఐదు జబ్బుల్లో పొగాకు ప్రమేయం ఉంది: గుండె జబ్బు, స్ట్రోక్‌, శ్వాస సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌.”

  • అసమానతకు గుర్తుగా సమానంగా లేని ఒక త్రాసు బొమ్మ.

    సామాజిక అసమానత.

    “పేదరికం, కుల వివక్ష, జాత్యహంకారం, స్త్రీలను ఒకలా పురుషులను ఒకలా చూడడం, వలస వెళ్లాల్సి రావడం, పోటీతత్వం కారణంగా మానసిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది” అని మనస్తత్వ నిపుణురాలైన జే వాట్స్‌ చెప్తున్నారు.

    ఎక్కువ తెలుసుకోండి

    jw.org వెబ్‌సైట్‌లో దేవుడు భూమిని ఎందుకు చేశాడు? అనే వీడియో చూడండి.

బైబిలు ఏం చెప్తుందంటే . . .

ముందటి చిత్రంలో ఉన్న వ్యక్తి హాస్పిటల్‌ బెడ్‌ మీద పడుకుని ఉన్నాడు. అతని ఆరోగ్యం గురించి డాక్టర్‌ చేదు వార్త చెప్తుండగా అతని భార్య బాధతో ముఖం తిప్పేసుకుంటుంది.

బాధలకు చాలావరకు మనుషులే కారణం.

చాలావరకు అణచివేసే ప్రభుత్వాల వల్ల బాధలు కలుగుతున్నాయి. ఏ ప్రజలకైతే సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నాయో ఆ ప్రజల జీవితాల్నే అవి దుర్భరం చేస్తున్నాయి.

“మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.”—ప్రసంగి 8:9.

బాధల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

బైబిలు సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం మెరుగౌతుంది, అలాగే వేరేవాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉంటాం.

“ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం, అసూయ ఎముకలకు కుళ్లు.”—సామెతలు 14:30.

“మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.”—ఎఫెసీయులు 4:31.

బాధలకు కారణం మనమేనా?

“మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు” అని బైబిలు చెప్తుంది. (గలతీయులు 6:7) కొన్ని బాధలు మనం చేసుకునే పనుల్ని బట్టే వస్తాయి. అందుకే పౌష్టిక ఆహారం తినమని, వ్యాయామం చేయమని, పొగతాగడం లాంటి చెడు అలవాట్లు మానుకోమని డాక్టర్లు చెప్తుంటారు. అయితే బాధలన్నీ మనుషులు తెచ్చుకున్నవే అని చెప్పలేం. చాలామంది ప్రజలు తమకు తెలియకుండానే ప్రమాదాలకు, విపత్తులకు, ఇతర విషాదాలకు బలి అవుతున్నారు.

మంచివాళ్లకు ఎందుకు ఈ బాధలు?

3వ ప్రశ్న చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి