కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 2 పేజీలు 4-5
  • కొందరి నమ్మకాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొందరి నమ్మకాలు
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • హిందువులు
  • ముస్లింలు
  • యూదుల నమ్మకాలు
  • బౌద్ధ మతస్థులు
  • కన్‌ఫ్యూజనిసం మతస్థులు
  • కొన్ని ఆఫ్రికన్‌ మతాలవాళ్లు
  • క్రైస్తవులు
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • 4. బాధలు పడడానికే దేవుడు మనల్ని సృష్టించాడా?
    తేజరిల్లు!—2020
  • బాధలు, కష్టాలు
    తేజరిల్లు!—2015
  • దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 2 పేజీలు 4-5
బౌద్ధుల, హిందువుల, కొన్ని ఆఫ్రికన్‌ మతాల, యూదుల, క్రైస్తవుల, ముస్లింల, కన్‌ఫ్యూజనిస్టుల చిహ్నాలు.

కొందరి నమ్మకాలు

హిందువులు

హిందువుల చిహ్నం.

ఈ జన్మలోనో గత జన్మలోనో చేసిన పనులకు ఫలితంగా బాధలు వస్తాయని వాళ్లు నమ్ముతారు. మనసును లోక సంబంధ విషయాలకు దూరంగా ఉంచుకుంటే మోక్షాన్ని అంటే పునర్జన్మల చక్రం నుండి విముక్తిని పొందవచ్చని వాళ్ల నమ్మకం.

ముస్లింలు

ముస్లింల చిహ్నం.

బాధలు అనేవి పాపానికి శిక్ష అని, విశ్వాసానికి పరీక్ష అని వాళ్లు నమ్ముతారు. కష్టాలు వచ్చినప్పుడు “దేవుడిచ్చిన దీవెనలన్నిటి విషయంలో కృతజ్ఞులై ఉండాలని, అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయాలని మనకు గుర్తొస్తుంది” అని ఇస్లామిక్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికాకు ప్రెసిడెంట్‌ అయిన డా. సయ్యద్‌ సయీద్‌ అంటున్నారు.

యూదుల నమ్మకాలు

యూదుల చిహ్నం.

ఒక వ్యక్తి చేసిన పనుల ఫలితమే బాధలని వాళ్లు నమ్ముతారు. కొంతమంది యూదులు చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారని, బాధలు అనుభవించి చనిపోయిన నిర్దోషి తిరిగి బ్రతికిన తర్వాత ప్రతిఫలం పొందుతాడని నమ్ముతారు. కాబలిస్టిక్‌ యూదా మతంవాళ్లేమో పునర్జన్మను నమ్ముతారు. పునర్జన్మ ద్వారా ఒక వ్యక్తికి తన తప్పుల్ని సరిదిద్దుకునే ఎన్నో అవకాశాలు దొరుకుతాయని వాళ్లు చెప్తారు.

బౌద్ధ మతస్థులు

బౌద్ధుల చిహ్నం.

ఒక వ్యక్తి ఎన్నో జన్మల పాటు బాధలు అనుభవిస్తాడనీ అతని చెడు పనులు, భావోద్వేగాలు, కోరికలు ఆగిపోయే వరకు అలా జన్మలు ఎత్తుతూనే ఉంటాడనీ వాళ్లు నమ్ముతారు. తెలివి ద్వారా, మంచి పనుల ద్వారా, మనసును నియంత్రించుకోవడం ద్వారా ఒక వ్యక్తి నిర్వానం పొందవచ్చని అంటే బాధలేవీ ఉండని పరిస్థితిని చేరుకోవచ్చని నమ్ముతారు.

కన్‌ఫ్యూజనిసం మతస్థులు

కన్‌ఫ్యూజనిస్టుల చిహ్నం.

చాలావరకు బాధలకు కారణం “మనుషుల వైఫల్యాలు, తప్పులు” అని వాళ్లు నమ్ముతారని ఎ డిక్షనరీ ఆఫ్‌ కంపారెటివ్‌ రెలీజియన్‌ చెప్తుంది. వాళ్ల సిద్ధాంతాల ప్రకారం, మంచిగా జీవించడం ద్వారా కొంతవరకు బాధల్ని తగ్గించుకోవచ్చు కానీ ఎక్కువశాతం బాధలు మాత్రం “మనుషుల కన్నా శక్తిమంతులైన ఆత్మ ప్రాణుల వల్ల వస్తాయి. అలాంటి సందర్భాల్లో విధి ఎలా నడిపిస్తే మనిషి అలా నడుచుకోక తప్పదు.”

కొన్ని ఆఫ్రికన్‌ మతాలవాళ్లు

కొన్ని ఆఫ్రికన్‌ మతాల చిహ్నం.

దుష్టశక్తుల వల్ల బాధలు వస్తున్నాయని వాళ్లు నమ్ముతారు. వాళ్ల నమ్మకాల ప్రకారం దుష్టశక్తులు అదృష్టాన్నైనా, విపత్తునైనా తీసుకురాగలరు, ఆ శక్తుల్ని శాంతింపజేయాలంటే రకరకాల ఆచారాలు చేయాలి. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే, అది దుష్టశక్తుల పని అని వాళ్లు నమ్ముతారు. దాన్ని తిప్పికొట్టడానికి ఏ ఆచారాలు చేయాలో, ఏ మందులు వాడాలో భూతవైద్యుడు చెప్తాడు.

క్రైస్తవులు

క్రైస్తవుల చిహ్నం.

బైబిల్లోని ఆదికాండం పుస్తకం చెప్తున్నట్లు, బాధలకు కారణం మొదటి మానవ జంట చేసిన పాపమే అని వాళ్లు నమ్ముతారు. అయితే, చాలా చర్చి శాఖలు ఆ బోధకు తమ సొంత ఆలోచనలు చేర్చాయి. ఉదాహరణకు కొంతమంది క్యాథలిక్కులు ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి తనకు వచ్చిన బాధను ‘దేవునికి అర్పించవచ్చు,’ ఆ అర్పణ వల్ల చర్చికి ప్రయోజనం చేకూరవచ్చు లేదా ఇతరులకు రక్షణ కలగవచ్చు.

ఎక్కువ తెలుసుకోండి

jw.org వెబ్‌సైట్‌లో దేవుణ్ణి ఎలా ఆరాధించినా ఫర్వాలేదా? అనే వీడియో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి