కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 8/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏకాంతత విలువ
    తేజరిల్లు!—1998
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 8/8 పేజీ 30

మా పాఠకుల నుండి

ఏకాంతత “బైబిలు ఉద్దేశము: ఏకాంతత విలువ” (నవంబరు 8, 1998) అనే శీర్షిక వ్యక్తిగతంగా నాకు వర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగానూ భావోద్వేగపరంగానూ నేను ఆరోగ్యంగా ఉండటానికి నాకు ఏకాంతత అవసరం. అయితే, ఏకాంతత అన్నది “సందర్శించదగినదే అయినా, అక్కడే ఉండిపోవడం అపాయకరం” అన్న విషయాన్ని నేను గుర్తుంచుకుంటాను.

ఎల్‌. జి., అమెరికా

ఒకరినొకరు ప్రేమిస్తారు “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” (జనవరి 8, 1999) అన్న శీర్షికల పరంపర అమోఘంగా ఉంది! పగను, ద్వేషాన్ని పెంచుకొనేలా నాలో కొన్నిసార్లు కలిగే శక్తివంతమైన ప్రచోదనాన్ని అణుచుకొనేందుకు ఇది సహాయంచేసింది. చాలా కృతజ్ఞతలు! మీ ప్రచురణల ద్వారా నేను పొందుతున్న ప్రోత్సాహం నేను యెహోవా దేవుని సమర్పిత సేవకునిగా అయ్యేందుకు సహాయపడతాయని ఆశిస్తున్నాను.

జి. కె., ఇటలీ

సత్యాన్ని ఒకని సొంతం చేసుకోవడం నాకు 12 సంవత్సరాలు, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . సత్యాన్ని ఎలా నా సొంతం చేసుకోగలను?” (నవంబరు 8, 1998) అన్న శీర్షికను ఆస్వాదించాను. ఇప్పుడు స్కూలు తెరిచారు గనుక, క్రైస్తవ కూటాలకు సిద్ధపడటం ఇంకొంచెం ఎక్కువ కష్టంగా ఉంటుంది. కాని సమయాన్ని నేను కొనుక్కోవలసి ఉంది. యెహోవాపై అనురాగాన్ని పెంచుకోవడానికీ సత్యంలో లోతుగా వేరుపారడానికీ ఈ శీర్షిక అనేకమంది యౌవనస్థులకు సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను.

సి. ఎస్‌., పోర్చుగల్‌

సత్యాన్ని గురించిన అవే ప్రశ్నలను ఒక సంవత్సరం క్రితం నాలో నేను ప్రశ్నించుకున్నాను నేను సత్యాన్ని నిజంగా ప్రేమిస్తున్నానో లేక నేను సత్యంలో ఉన్నది నా కుటుంబాన్ని బట్టో నాకు నిశ్చయంగా తెలియదు. మీరు ప్రోత్సహించిన విధంగా నేను చేశాను—బైబిలు పరిశోధన ద్వారా నాకై నేను పరీక్షించి తెలుసుకున్నాను. సత్యం నా సొంతం అని చెప్పడానికి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. ఒక పూర్తి-కాల ప్రచారకుడుగా ఉండాలని ఎదురు చూస్తున్నాను!

హెచ్‌. ఎన్‌., అమెరికా

యువ క్యాన్సర్‌ బాధితుడు నాకు 18 సంవత్సరాలు, “అతడు వదిలిపెట్టలేదు” (నవంబరు 8, 1998) అన్న శీర్షికలో మాట్‌ టాపీయో అనుభవాన్ని ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. అతని విశ్వాసం, ఆధ్యాత్మిక విషయాల పట్ల అతనికున్న మెప్పు, అతడు కనపర్చిన అత్యవసర భావమూ నన్ను నిజంగా కదిలించాయి. మాట్‌ పరదైసులో పునరుత్థానమై వచ్చినప్పుడు వ్యక్తిగతంగా అతనికి కృతజ్ఞతలు చెప్పాలని ఎదురుచూస్తున్నాను.

ఈ. జి. జి., స్పెయిన్‌

ఆ శీర్షిక కొరకు మా కుటుంబం తరుపున కృతజ్ఞతలను తెలుపుతున్నాను. మా అబ్బాయిలు కౌమారదశలో ఉన్నారు గనుక, మాట్‌ టాపీయో విశ్వాసపు ఉదాహరణను వారితోపాటు పరిశీలించడం చాలా ప్రయోజనకరమని మేము కనుగొన్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, మా సొంత ప్రాధాన్యతలను విశ్లేషించడానికి అది మాకొక అవకాశాన్ని ఇచ్చింది.

ఎమ్‌. ఎఫ్‌. ఎన్‌. జి., బ్రెజిల్‌

యౌవనులైన మాకు ఈ శీర్షిక చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఎందుకంటే, అనారోగ్యంగా ఉన్నప్పటికీ యెహోవా గురించి మాట్లాడడం ఎన్నడూ మానని ఆ యౌవనస్థుని అభినివేశాన్ని అది ఉన్నతపరచింది.

డి. ఎమ్‌., ఇటలీ

మాట్‌ టాపీయో ప్రాణాంతకమైన రోగాన్ని ఎదుర్కొన్నప్పటికీ, యెహోవాను స్తుతించగల్గేందుకు ఆయనకు సేవచేయగల్గేందుకు బ్రతకాలని పోరాడాడు. మనలో మంచి ఆరోగ్యంతో ఉన్న వారికి ఇది ఒక మంచి మాదిరి.

డి. పి., ప్యూర్టోరికో

14 సంవత్సరాలప్పుడే మెదడు వాపుకు సర్జరీ చేయించుకోవలసి వచ్చిన మాట్‌ గురించిన శీర్షిక, నా అవధానాన్ని చూరగొంది. తన చివరి మాటల్లో, “యెహోవా గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని ఎన్నడూ మానవద్దు” అన్నది ఒకటి. మానకుండా ఉండేలా ఇది నన్ను ప్రోత్సహించింది, బైబిలును పఠించడమూ, జీవానికి నడిపించే జ్ఞానాన్ని పొందడమూ ఎంత ప్రాముఖ్యం అన్నది గుర్తించడానికి ఇది నాకు సహాయం చేసింది!

డి. వి., ఫిలిప్పీన్స్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి