కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 3/8 పేజీలు 7-9
  • ఏకైక సత్యదేవుడ్ని గుర్తించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏకైక సత్యదేవుడ్ని గుర్తించడం
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక విశిష్టమైన నామం
  • యెహోవా లేక యాహ్వే?
  • ఇది నిజంగా అంత పట్టించుకోవలసిన విషయమా?
  • సత్యదేవుని లక్షణాలు
  • సత్యదేవుడు బయల్పర్చబడ్డాడు
  • యెహోవా ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • దేవుని పేరు ఎలా ఉచ్చరించాలో తెలియనప్పుడు దానిని ఎందుకు ఉపయోగించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • A4 హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 3/8 పేజీలు 7-9

ఏకైక సత్యదేవుడ్ని గుర్తించడం

మానవులు ఉనికిలోకి వచ్చినప్పటి నుండి, వారు అనేక దేవుళ్ళను ఆరాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించబడుతున్న దేవుళ్ళు, దేవతలు, వారి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడమే కష్టమయ్యేంత అధికంగా ఉన్నారు—అంటే, ఇది కోట్లసంఖ్యకు చేరిపోయింది.

దేవుడున్నాడని నిరూపించాము కాబట్టి, మనమిలా అడుగవచ్చు, గతంలోను, ప్రస్తుతంలోను భూమి అంతటా ఆరాధించబడుతున్న దేవుళ్ళందరిలో నిజమైన దేవుడెవరు? సత్యదేవునిగా గుర్తించబడగల వ్యక్తి ఒక్కడే ఉన్నాడని బైబిలు యోహాను 17:3, NW నందు స్పష్టంగా ఇలా చెబుతుంది. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుతూ ఉండడమే నిత్యజీవము.”

ఒక విశిష్టమైన నామం

తమ తమ స్వంత నామాలు గల ఇతర దేవుళ్ళ నుండి వేరుగా తెలుపబడేందుకు వ్యక్తిత్వం గల ఏ దేవునికైనా ఒక వ్యక్తిగత నామం ఉండడం కారణసహితం. తన ఆరాధకులు తనకు ఒక నామాన్ని పెట్టడం కంటే, తన నామాన్ని తానే సూచించుకోవడం సహేతుకం.

ఈ విషయంలో విస్మయం కల్గించే ఒక వాస్తవం వెలుగులోకి వచ్చింది. సుస్థాపితమైన చాలా మతాలు తమ దేవుళ్ళకు వ్యక్తిగత నామాలను ఆపాదిస్తుండగా యూదులు, అత్యంత ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ మత సామ్రాజ్య చర్చీల వారు తాము ఆరాధించే దేవునికి గల ప్రత్యేకమైన వ్యక్తిగత నామాన్ని గుర్తించడంలో విఫలులయ్యారు. బదులుగా, వారు ప్రభువు, దేవుడు, సర్వశక్తిమంతుడు, తండ్రి వంటి బిరుదులను ఆశ్రయించారు.

రచయితయైన డేవిడ్‌ క్లైన్స్‌ థియోలజీ అనే ప్రచురణలో వ్రాస్తూ క్రింది విధంగా అన్నాడు: “క్రీస్తుపూర్వం ఐదవ, రెండవ శతాబ్దాలకు మధ్యలో దేవునికి సంబంధించి ఒక విషాద సంఘటన జరిగింది: ఆయన తన నామాన్ని కోల్పోయాడు. యూదులు దేవుని వ్యక్తిగత నామమైన యాహ్వేను ఉపయోగించడం మానివేశారు, యాహ్వే స్థానంలో వేర్వేరు పర్యాయపదాలను ఉపయోగించడం ప్రారంభించారు, అవేమిటంటే: దేవుడు, ప్రభువు, నామము, పరిశుద్ధుడు, సాన్నిధ్యం, చివరకు స్థలం కూడా. బైబిలు మూలపాఠంలో ఎక్కడెక్కడైతే యాహ్వే వ్రాయబడిందో, అన్నిచోట్ల పాఠకులు ఆ నామాన్ని అదోనాయ్‌ అని ఉచ్చరించడం ప్రారంభించారు. చివరిసారిగా దేవాలయం పడిపోయినప్పుడు, అంతకు ముందు కేవలం బహిరంగ ఆరాధనలోనే అరుదుగా ఉపయోగించే ఆ నామాన్ని ఇక ఉపయోగించడం మానివేశారు, ఆ నామాన్ని ఎలా ఉచ్చరించాలో ఆ ఉచ్చరించే విధానం కూడా మరువబడింది.” అయితే ఛాందసవాదులైన యూదులు సరిగ్గా ఎప్పుడు దేవుని నామాన్ని ఉచ్చరించడం మానివేసి, దానికి బదులుగా హెబ్రీలో దేవుడు, సర్వశక్తిగల ప్రభువు అనే పదాలను పెట్టారో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.

‘అద్వితీయ సత్యదేవుని’ గుర్తించడానికి తీసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన చర్య ఆయన నామాన్ని తెలుసుకోవడానికై అన్వేషించడమే. అటువంటి అన్వేషణ ఏ మాత్రం కష్టమైనది కాదు. ఎందుకంటే, సర్వశక్తిగల దేవుడు, సృష్టికర్తయైన వాని నామము కీర్తనలు 83:18 నందు స్పష్టంగాను, సూటిగాను ఇలా నివేదించబడింది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”

యెహోవా లేక యాహ్వే?

కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌, ఇతర బైబిలు అనువాదాలు యెహోవా అన్న నామాన్ని ఉపయోగిస్తుండగా కొందరు యెహోవాకు బదులుగా యాహ్వే అన్న నామాన్నే ఇష్టపడుతున్నారు. అయితే, ఈ రెండింటిలో ఏది సరియైన నామం?

అతిప్రాచీన బైబిలు చేతివ్రాతప్రతులు హెబ్రీ భాషలోనే వ్రాయబడ్డాయి. హెబ్రీ లేఖనాల్లో దైవ నామం దాదాపు 7,000 సార్లు కన్పిస్తుంది, ఈ నామం నాలుగు హల్లులతో ఉచ్చరించబడుతుంది, అవి—YHWH, లేదా JHVH. ఈ నాలుగు హల్లులను సాధారణంగా టెట్రాగ్రమాటన్‌ (లేదా టెట్రాగ్రామ్‌) అని పిలుస్తారు. ఈ టెట్రాగ్రమాటన్‌ అనే పదం “నాలుగు అక్షరాలు” అని అర్థంగల రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది. అయితే, ఇప్పుడు ఖచ్చితమైన ఉచ్చారణ ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే, తొలి హెబ్రీ లిపిలో హల్లులు మాత్రమే ఉండేవి, కాబట్టి హెబ్రీ వ్రాతలు పాఠకుడిచేత అచ్చులు లేకుండా హల్లులతోనే చదవబడేవి. కాబట్టి ఈ నాలుగు హల్లులకు పాఠకుడు ఏ అచ్చులను ఉపయోగిస్తాడన్న దాని మీదనే యాహ్వే లేదా యెహోవా రెండింటిలో టెట్రాగ్రమాటన్‌ ఉచ్చారణ దేనికి సరిపోతుందనేది ఆధారపడి ఉంటుంది. ఈనాడు అనేకమంది హెబ్రీ విద్వాంసులు యాహ్వే అన్నదాన్నే నిజమైన ఉచ్చారణగా సిఫారసు చేస్తారు.

అయితే, యెహోవా అన్న పదమే అనుగుణ్యత గలది. ఎలా? శతాబ్దాలుగా జెహోవా అన్న ఉచ్చారణ ఆంగ్లంలో అంగీకరించబడింది. ఈ ఉచ్చారణను నిరాకరించే వారు జెర్మయా, చివరకు జీసస్‌ పేర్ల ఉచ్చారణను కూడా నిరాకరించాలి. అప్పుడు జెర్మయాను యిర్మీయాహ్‌ లేదా యిర్మీయాహుగాను, జీసస్‌ను యేషువా (హెబ్రీ) లేదా యేసూస్‌ (గ్రీకు) గాను మార్చవలసి ఉంటుంది. కాబట్టి యెహోవాసాక్షులతో సహా అనేకమంది బైబిలు విద్యార్థులు, అనుగుణ్యత ఉండాలంటే, ఇప్పటికే ఆంగ్లభాషలో బాగా ప్రాచుర్యంలో ఉన్న “జెహోవా”ను, ఇతర భాషల్లో దానికి తత్సమానంగా ఉన్న పేరును ఉపయోగించాలని భావిస్తారు.

ఇది నిజంగా అంత పట్టించుకోవలసిన విషయమా?

సర్వశక్తిమంతుడైన దేవుడ్ని ఆయన వ్యక్తిగత నామాన్ని ఉపయోగించి పిలవడం, పిలవకపోవడమనేది అంత పట్టించుకోవలసిన విషయమేమీ కాదని కొందరు వాదించవచ్చు, వాళ్ళు దేవుడ్ని తండ్రి అనీ లేదా సులభరీతిలో దేవుడు అనీ తెలియజేయడంతోనూ, ఆ పేర్లను ఉపయోగించి మాట్లాడడంతోనూ సంతృప్తి చెందుతారు. అయితే, ఇవి బిరుదులే తప్ప పేర్లు మాత్రం కాదు, కాబట్టి ఇవి వ్యక్తిగతంగా అన్వయించబడేవిగాను, భేదాన్ని చూపేవిగాను ఉండవు. బైబిలు కాలాల్లో దేవుడు (ఎలోహిమ్‌, హెబ్రీ) అనే పదాన్ని ఏ దేవునికైనా ఉపయోగించేవారు—అన్యులైన ఫిలిష్తీయుల దేవుడైన దాగోనుకు కూడా. (న్యాయాధిపతులు 16:23, 24) కాబట్టి ఒక హెబ్రీయుడు ఒక ఫిలిష్తీయునితో హెబ్రీయుడిగా తాను దేవుడ్ని ఆరాధిస్తున్నానని చెప్పడం, అతడు ఆరాధిస్తున్న సత్యదేవుడ్ని గుర్తించదు.

1874లోని ది ఇంపీరియల్‌ బైబిల్‌-డిక్షనరీ ఆసక్తికరంగా ఇలా వ్యాఖ్యానించింది: “[యెహోవా] అనే నామం ప్రత్యేకించి ఆయనకు మాత్రమే ఉపయోగించబడే వ్యక్తి నామం. అది వ్యక్తిత్వం ఉన్న దేవునికి, కేవలం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది; ఎలోహిమ్‌ అనేది ఎక్కువగా జాతి వాచకానికి సంబంధించిన పదం; సాధారణంగా ఇది అత్యున్నతుడ్ని సూచిస్తున్నప్పటికీ, దీనిని దేవుళ్ళెవరికైనా ఉపయోగించవచ్చు. . . . అయితే, అబద్ధ దేవుళ్ళందరికీ విరుద్ధంగా ఒక హెబ్రీయుడు సత్యదేవుని గురించి ఫలానా ఎలోహిమ్‌ అని చెప్పవచ్చు, కానీ, ఫలానా యెహోవా అని చెప్పడు. ఎందుకంటే, యెహోవా అన్నది కేవలం ఏకైక సత్యదేవుని నామం మాత్రమే. అలాగే, అతడు నా దేవుడు అని మళ్ళీ మళ్ళీ చెప్పవచ్చు. . . ; కానీ నా యెహోవా అని చెప్పడు, ఎందుకంటే అతడు నా దేవుడు అని చెబుతున్నప్పుడు యెహోవా అని భావం. అలాగే ఇశ్రాయేలీయుల దేవుడు అని అంటాడు కానీ ఇశ్రాయేలీయుల యెహోవా అని అనడు ఎందుకంటే, మరొక యెహోవా లేడు కాబట్టి. అలాగే, జీవము గల దేవుడు అంటాడు కానీ, జీవము గల యెహోవా అని అనడు ఎందుకంటే, యెహోవా జీవము లేని దేవుడన్న తలంపు ఎన్నడూ రాదు కాబట్టి.”

సత్యదేవుని లక్షణాలు

కేవలం ఒకరి పేరును తెలుసుకున్నంత మాత్రాన అతని లేదా ఆమెను గూర్చి లోతుగా తెలుసునని దానర్థం కాదు. మనలో చాలామందికి ప్రముఖ రాజకీయవేత్తల పేర్లు బాగా తెలుసు. ఇతర దేశాల్లోని ప్రఖ్యాతి గాంచిన స్త్రీ, పురుషుల పేర్లు కూడా మనకు బాగా తెలిసి ఉండవచ్చు. కానీ, కేవలం పేర్లను మాత్రం తెల్సుకోవడం—ఆ పేర్లను ఏ విధంగా పలకాలో కూడా తెల్సుకోవడం—వారిని గూర్చి వ్యక్తిగతంగాను, లేదా వారెటువంటి ప్రజలై ఉన్నారో మనకు తెలుసని దాని భావం కాదు. అదేవిధంగా, ఏకైక సత్యదేవుని గూర్చి తెల్సుకోవడమంటే, ఆయనను గూర్చి పూర్తిగా తెల్సుకోవలసిన, ఆయన లక్షణాలను మెప్పుదలతో చూడవలసిన అవసరత ఉంది.

ఏ మానవుడు ఎన్నడూ సత్యదేవుడ్ని చూడలేడన్నది వాస్తవమైనప్పటికీ, దయతోనే ఆయన మన కోసం తన వ్యక్తిత్వాన్ని గూర్చిన వివరాలను బైబిలులో వ్రాయించాడు. (నిర్గమకాండము 33:20; యోహాను 1:18) కొందరు హెబ్రీ ప్రవక్తలకు పరలోక ప్రాంగణంలో ఉన్న సర్వశక్తుని గూర్చిన ప్రేరేపిత దర్శనాలు ఇవ్వబడ్డాయి. వారు కేవలం ఘనతను, అత్యున్నత మహోన్నతత్వాన్ని, శక్తినే కాదుగానీ, ప్రసన్నతను, క్రమ బద్ధతను, సౌందర్యాన్ని, ఆహ్లాదాన్ని గూర్చి కూడా వర్ణించారు.—నిర్గమకాండము 24:9-11; యెషయా 6:1; యెహెజ్కేలు 1:26-28; దానియేలు 7:9; ప్రకటన 4:1-3.

యెహోవా దేవుడు తన ఆకర్షణీయమైన, ప్రీతిపర్చే ప్రధాన లక్షణాలను కొన్నింటిని మోషేకు తెలిపాడు, దీని గురించి నిర్గమకాండము 34:6, 7లో ఉంది: “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా, ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.” దేవుని ఈ లక్షణాలను గూర్చి తెలుసుకోవడం మనల్ని ఆయనకు దగ్గర చేస్తుందని, ఒక వ్యక్తిగా ఆయనను గూర్చి మరింత ఎక్కువగా తెల్సుకోవడానికి మనల్ని పురికొల్పుతుందని మీరు అంగీకరించరా?

మహిమాన్వితుడైన యెహోవా దేవుడ్ని ఏ మానవుడు ఎన్నడూ చూడక పోయినప్పటికీ, మానవునిగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన పరలోకపు తండ్రియైన యెహోవా ఎలాంటి వ్యక్తియై ఉన్నాడో అలాగే ఆయన పూర్తిగా ప్రతిబింబించాడు. ఒక సందర్భంలో యేసు ఇలా చెప్పాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.”—యోహాను 5:19.

కాబట్టి, యేసు చూపిన దయ, సానుభూతి, మృదు స్వభావం, నిష్పక్షపాతంతో కూడిన అపేక్ష, నీతి మీద ప్రగాఢమైన ప్రేమ, దుష్టత్వం మీద ద్వేషం ఇవన్నీ ఈ భూమి మీదకు రాక పూర్వం పరలోక ప్రాంగణంలో తన తండ్రియైన యెహోవా దేవునితో ఉన్నప్పుడు పరిశీలించిన లక్షణాలని మనం ఒక నిర్ధారణకు రాగలం. కాబట్టి, యెహోవా అన్న నామాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ పరిశుద్ధ నామాన్ని ప్రేమించడానికి, ఉన్నతపర్చడానికి, స్తుతించడానికి, ఘనపర్చడానికి, దాని యందు నమ్మకముంచడానికి ఖచ్చితంగా సరియైన కారణముంది.

నిజానికి ఏకైక సత్యదేవుడ్ని గూర్చి ఈ విధంగా తెలుసుకోవడమన్నది నిరాటంకంగా కొనసాగే ముగింపు లేని ఒక ప్రక్రియ. ఇది యోహాను 17:3 పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదములో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గ్రీకుక్రియ (జ్ఞానము పొందడం)ను ఖచ్చితంగా అనువదించడం చాలా సహాయం చేస్తుంది—సాధారణ క్రియకు బదులుగా కొనసాగే క్రియ ఉపయోగించబడింది. కాబట్టి మనమిలా చదువుతాము: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుతూ ఉండడమే నిత్యజీవము.” అవును, ఏకైక సత్యదేవుడైన యెహోవాను గూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుతూనే ఉండడమనేది ముగింపు ఉండకూడని ప్రక్రియ.

సత్యదేవుడు బయల్పర్చబడ్డాడు

కాబట్టి, సత్యదేవుడు అనేక ఇతర అబద్ధ దేవుళ్ళ నుండి ప్రత్యేకంగా ఉన్నాడు. భూగ్రహాన్ని, దానిపైనున్న మానవజాతి అంతటితో సహా ఈ విశ్వానికే సృష్టికర్తయైనవాడు సర్వశక్తిమంతుడు. ఆయనకు గల నిరుపమానమైన వ్యక్తిగతనామం యెహోవా లేదా యాహ్వే. ఆయన మర్మంతో కూడిన ఒక త్రియేక దేవుడు లేదా త్రిత్వంలో భాగం కాదు. ఆయన ప్రేమా స్వరూపి. ఆయన తన మానవ సృష్టికి అత్యంత శ్రేష్ఠమైన దాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు కూడా, కాబట్టి, భూమిని నాశనం చేసే, యుద్ధాలను, హింసను పురికొల్పే వారిని ఇక ఎంతోకాలం సహించడు.

యెహోవా భూమి మీది దుష్టత్వాన్ని, బాధను నిర్మూలించడమే కాదుగానీ, యథార్థహృదయులైన ప్రజలు నిరంతరం సంతోషంతో జీవించేలా ఈ భూమిని ఒక పరదైసుగా చేస్తానన్న తన కృతనిశ్చయాన్ని తెలియజేశాడు. (కీర్తన 37:10, 11, 29, 34) ఇప్పుడు దేవుని రాజ్యానికి పరలోకపు రాజుగా తన కుమారుడైన యేసును సర్వశక్తిగల దేవుడు స్థాపించాడు, త్వరలోనే యేసుక్రీస్తు మన భూమిపై పరదైసు పరిస్థితులను పునఃస్థాపించడం ద్వారా నీతియుక్త నూతన లోకాన్ని తీసుకువస్తాడు.—దానియేలు 2:44; మత్తయి 6:9, 10.

ఇప్పుడు మీరు దేవుడు నిజంగా ఉనికిలో ఉన్నాడా? అనే ప్రశ్నకు మరింత సుళువుగా సమాధానమివ్వగలరని, సత్యదేవుని సుళువుగా గుర్తించగలరని మేమాశిస్తున్నాము.

[9వ పేజీలోని చిత్రం]

యెహోవాయే ఏకైక సత్యదేవుడని యేసుక్రీస్తు గుర్తించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి