కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీలు 4-5
  • ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచవ్యాప్త సమస్య
  • ప్రేమా నిరీక్షణలు అంతరించిపోయినప్పుడు
    తేజరిల్లు!—1998
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఆత్మహత్యే పరిష్కారమా?
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—2001
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీలు 4-5

ఆత్మహత్య—యువతను పీడిస్తున్న మహామారి

మన యువతను నాశనం చేయడానికి యుద్ధం, హత్యలు, దారుణకృత్యాలు చాలవన్నట్లు, ఇప్పుడు ఆత్మహత్యల రూపంలో యువత స్వనాశనం జరుగుతోంది. మత్తుపదార్థాల దుర్వినియోగం మరియు మద్యపాన దుర్వినియోగం యువత మనస్సులకూ శరీరాలకూ హాని కలిగిస్తూ, యౌవనస్థుల్లో అనేకుల మరణానికి కారణమౌతున్నాయి. మత్తుపదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం, అంటే అలా కావాలనే తీసుకున్నప్పటికీ లేదా పొరపాటున తీసుకున్నప్పటికీ అది ఎక్కువగా మరణానికి దారితీస్తుందని చాలామంది తరచూ అనడం వినిపిస్తోంది.

మోర్‌బిడిటి అండ్‌ మోర్టాలిటి వీక్లి రిపోర్ట్‌ యొక్క 1995, ఏప్రిల్‌ 28 సంచిక, “అమెరికాలో 15 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సుగల యువత మరణానికి ఆత్మహత్య మూడవ ముఖ్య కారణంగా ఉంది” అని తెలియజేసింది. ది డికేడ్‌ ఆఫ్‌ ది బ్రెయిన్‌లో డా. జె. జె. మాన్‌ ఇలా వ్రాస్తున్నాడు: “ప్రతి సంవత్సరం 30,000 [1995లో ఆ సంఖ్య 31,284] కంటే ఎక్కువమంది అమెరికావాసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విచారకరంగా, సాధారణంగా అలా చేసుకుంటున్నది యౌవనులే . . . ఆ 30,000 కంటే పది రెట్లు ఎక్కువమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, కాని బ్రతికి బయట పడుతున్నారు. . . . ఆత్మహత్య చేసుకునే ప్రమాదంవున్న రోగులను గుర్తించడమన్నది వైద్యచికిత్సా సంబంధంగా ఒక పెద్ద సవాలు, ఎందుకంటే విపరీతమైన కృంగుదల మూలంగా ఆత్మహత్యకు పాల్పడే రోగులెవరో పాల్పడని రోగులెవరో వైద్యులు అంత సులభంగా గుర్తించలేరు.”

అమెరికా, కనెక్టికట్‌లోని న్యూ మిల్‌ఫోర్డ్‌ హాస్పిటల్‌లో మనోవ్యాధుల వైద్యసంబంధ శాఖాధిపతి అయిన సైమన్‌ సోబో ఇలా పేర్కొన్నాడు: “నేనిక్కడున్న 13 సంవత్సరాల్లో చూసిన ఆత్మహత్యా ప్రయత్నాల కంటే ఈ [1995] వసంత ఋతువులో ఎక్కువ ఆత్మహత్యా ప్రయత్నాలు జరిగాయి.” అమెరికాలో, ప్రతి సంవత్సరం వేలాదిమంది యౌవనులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రతి ప్రయత్నమూ, సహాయ శ్రద్ధల కొరకైన ఒక ఆక్రందనే. మరీ ఆలస్యం కాకముందే వారికెవరు మద్దతునిస్తారు?

ప్రపంచవ్యాప్త సమస్య

ప్రపంచంలోని మరితర అనేక ప్రాంతాల్లో పరిస్థితి మరీ భిన్నంగా ఏమీ లేదు. ఇండియా టుడే ప్రకారం 1990లో ఇండియాలో దాదాపు 30,000 మంది యౌవనులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇజ్రాయేల్‌, కెనడా, థాయ్‌లాండ్‌, న్యూజీలాండ్‌, నెదర్‌లాండ్స్‌, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, స్విట్జర్‌లాండ్‌, స్పెయిన్‌లలో యౌవనుల ఆత్యహత్య రేట్లు పెరిగాయి. న్యూజీలాండ్‌, ఫిన్‌లాండ్‌, రష్యా, లాట్వియా, లిథువేనియా మరియు స్లొవేనియాలలో యౌవనుల ఆత్యహత్యా రేట్లు అత్యధికంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి (యునిసెఫ్‌) నుండి 1996లో వెలువడిన ఒక నివేదిక తెలియజేస్తుంది.

ప్రపంచంలో, యౌవనుల ఆత్మహత్యా రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ది కాన్‌బెర్రా టైమ్స్‌ అనే వార్తాపత్రికలోని ఒక నివేదిక ప్రకారం, ఆ దేశంలో 1995లో మరణించిన యువకులలో 25 శాతం మరణాలు, యువతుల్లో 17 శాతం మరణాలు ఆత్మహత్యలే. ఆస్ట్రేలియాలోని యువతుల “విజయవంతమైన” ఆత్మహత్యారేటు కన్నా యువకుల ఆత్మహత్యా రేటు దాదాపు ఐదురెట్లు ఎక్కువగా ఉంది. అనేక దేశాల్లో నిష్పత్తి అలాగే ఉంది.

అంటే దీని భావం అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తారనా? అలాగనేమీ కాదు. ఆత్మహత్యా ప్రయత్నాల గురించి అందుబాటులో ఉన్న గణాంక వివరాలు ఈ విషయంలో ఆడామగా మధ్యన పెద్ద తేడాను చూపించడం లేదు. అయితే, “ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన తాజా సంఖ్యల ప్రకారం, పారిశ్రామిక దేశాల్లో ఆడవారికంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ మంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.”—యూనిసెఫ్‌ ప్రచురించిన ది ప్రోగ్రెస్‌ ఆఫ్‌ నేషన్స్‌.

ఈ భయంగొలిపే గణాంక వివరాలు కూడా సమస్య యొక్క పూర్తి విస్తృతిని చెప్పకపోవచ్చు. యువత ఆత్మహత్యా గణాంక వివరాల గురించి వైద్య సంబంధంగానూ విశ్లేషణ రూపంలోనూ ఇవ్వబడిన వివరణలను చదవడం ఆశ్చర్యకరంగా ఎంతో సులభమే. అయితే, భావరహితంగా ఇవ్వబడిన ప్రతి గణాంక వివరణ వెనుకా ఉన్న ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు, చితికిపోయిన కుటుంబాలను ఎవరూ పట్టించుకోరు. బ్రదికివున్నవారు ఇలా ఎందుకు జరిగిందా అని కారణాల కోసం వెదుకుతూ పడుతున్న హృదయవేదన, దుఃఖం, బాధ, నిరాశ తరచూ ఎవరి దృష్టికీ రావు లేక ఎవరూ గ్రహించరు.

కాబట్టి, యువత ఆత్మహత్యల వంటి దుర్ఘటనలను ఆపే అవకాశం ఉందా? కొన్ని ప్రాథమికమైన మూలాంశాలను గుర్తించడం జరిగింది, ఈ బాధాకరమైన పరిస్థితిని నివారించడానికి అవి సహాయకరంగా ఉన్నట్లు నిరూపించబడవచ్చు.

[5వ పేజీలోని బాక్సు]

ఆత్మహత్యకు పురికొల్పేవి

ఆత్మహత్యకు పురికొల్పే ప్రేరణల గురించి చాలా థియరీలున్నాయి. “ఉదాహరణకు ఇతరుల నుండి దూరమైపోయినట్లు భావించడం, ప్రియమైనవారి (ప్రాముఖ్యంగా వివాహ జత) మరణం, బాల్యంలో కుటుంబం విచ్ఛిన్నమైపోవడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వయస్సు పైబడడం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి తనకున్న క్లిష్ట సమస్యకు ఒక వ్యక్తి తాను ప్రతిస్పందించే దాన్నిబట్టి ఆత్మహత్యకు పాల్పడతాడు.”—ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ మెడిసిన్‌.

సమాజశాస్త్ర పండితుడైన ఏమీల్‌ డర్కీమ్‌ ప్రకారం, నాలుగు ప్రాథమిక రకాలైన ఆత్మహత్యలు ఉన్నాయి:

1. స్వార్థపూరిత కారణాలతో చేసుకునే ఆత్మహత్య—“ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేకపోవడం మూలంగా ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడతాడని తలంచబడుతుంది. ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడేవారు ఎక్కువగా ఒంటరివారై ఉండి, సమాజంతో సంబంధం కల్గివుండరు లేదా సమాజంపై ఆధారపడి ఉండరు.” సాధారణంగా వారు ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుతారు.

2. సమాజ శ్రేయస్సు కోసం చేసుకునే ఆత్మహత్య: “ఒక వ్యక్తి ఒక గుంపులోకి ఎంతగా ఇమిడిపోతాడంటే అతడు ఆ గుంపు శ్రేయస్సు కోసం ఏమి త్యాగం చేసినా తక్కువేనని భావిస్తాడు.” ఉదాహరణలు ఏవంటే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని జపానుకు చెందిన కమికాజె పైలట్లు మరియు తమ శత్రువులని భావిస్తున్నవారిని చంపడానికి వారితోపాటు తమను తామే ఆహుతి చేసుకునే మత తీవ్రవాదులు. ఇతర ఉదాహరణలు ఏవంటే, ఒక విషయం వైపుకు ఇతరుల అవధానాన్ని మళ్లించడానికి ఆత్మాహుతి చేసుకుని మరణించినవారు.

3. నిస్సహాయతతో చేసుకునే ఆత్మహత్య: “ఈ విధమైన ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ఒక సమస్యతో హేతుబద్ధంగా వ్యవహరించలేక, దానికి పరిష్కారం ఆత్మహత్యేనని భావిస్తాడు. ఒక వ్యక్తికి సమాజంతో ఉన్న సంబంధం హఠాత్తుగా, భీతిగొల్పే విధంగా దెబ్బతిన్నప్పుడు [ఇది] సంభవిస్తుంది.”

4. నిరాశతో చేసుకునే ఆత్మహత్య: “ఒక వ్యక్తి స్వేచ్ఛను ప్రధానంగా పరిమితం చేసే విపరీతమైన సాంఘిక కట్టుబాట్ల మూలంగా [ఇది] సంభవిస్తుందని తలంచబడుతుంది.” అలాంటివారు “తమకు పురోగతిచెందే ఏ విధమైన భవిష్యత్తు లేదని భావిస్తారు.”—అలన్‌ ఎల్‌. బర్మన్‌ మరియు డేవిడ్‌ ఎల్‌. జోబ్స్‌ వ్రాసిన అడోలసెంట్‌ సూయిసైడ్‌: అసెస్‌మెంట్‌ అండ్‌ ఇంటర్‌వెన్షన్‌.

[5వ పేజీలోని చిత్రం]

యువతను ఆత్మహత్యకు నడపగల కొన్ని హానికరమైన అలవాట్లు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి