కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 8/8 పేజీలు 3-5
  • స్వంత వైద్యం—ప్రయోజనాలూ ప్రమాదాలూ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వంత వైద్యం—ప్రయోజనాలూ ప్రమాదాలూ
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వంత వైద్యం—ఓ ప్రమాదమా?
  • క్షేమకరంగా తమకైతామే రోగాన్ని నిర్ధారించుకోవడం—ఎలా?
  • మీరు మంచి ఆరోగ్యాన్ని ఎలా కల్గివుండగలరు?
    తేజరిల్లు!—1998
  • మందులను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
    తేజరిల్లు!—1996
  • ఓషధి చికిత్సలు మీకు సహాయం చేయగలవా?
    తేజరిల్లు!—2004
  • ఎయిడ్స్‌ స్వైరవిహారం ఆగుతుందా? అయితే అదెలా జరుగుతుంది?
    తేజరిల్లు!—2003
తేజరిల్లు!—1998
g98 8/8 పేజీలు 3-5

స్వంత వైద్యం—ప్రయోజనాలూ ప్రమాదాలూ

బ్రెజిల్‌ నందలి తేజరిల్లు! విలేఖరి

“ప్రపంచ వ్యాప్తంగా స్వంత వైద్య విపణి విస్తృతమౌతోంది” అని ఒక పెద్ద మందుల కంపెనీ అధ్యక్షుడు చెబుతున్నాడు. “ప్రజలు తమ ఆరోగ్యంపై తాము అదుపు కలిగివుండాలని కోరుకుంటున్నారు.” అయితే ఇది వాస్తవమే అయినప్పటికీ, మీరు తెలుసుకుని ఉండవలసిన చిక్కులు ఏమైనా ఇందులో ఉన్నాయా?

ఒక్కటి మాత్రం నిజం, మందులను సరిగ్గా ఉపయోగించినట్లైతే, అవి మీకు ఉపశమనాన్ని ఇవ్వగలవు. ఉదాహరణకు, ఇన్సులిన్‌ మరియు ఆంటీబయోటిక్‌లు అలాగే ఎంతో చౌకైన, మామూలు ఫార్ములాగల ఓరల్‌ రీహైడ్రేషన్‌ థెరపీలు లెక్కలేనన్ని జీవితాలను కాపాడుతున్నాయి. అయితే స్వంత వైద్యంవల్ల ప్రమాదాలకన్నా ప్రయోజనాలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయన్నది నిర్థారించడమే అందులోని నిజమైన సవాలు.

కొన్ని ప్రాంతాల్లో అర్హతగల వైద్య సహాయం మరీ దూరంగానో లేక మరీ ఖరీదైనదిగానో ఉంటుందని అంగీకరించాల్సిందే. కాబట్టి, అనేకమంది ప్రజలు మందులు తీసుకునే విషయంలో అధిక సమాచారం కొరకు తమ స్నేహితుల అభిప్రాయాలపైనో, బంధువుల అభిప్రాయాలపైనో లేక సెల్ఫ్‌-హెల్ప్‌ పుస్తకాలపైనో ఆధారపడతారు. అంతేకాకుండా, “ఒక చిన్న క్యాప్సూల్‌ను కొనడం ద్వారా మీరు ఆరోగ్యాన్నీ సంక్షేమాన్నీ పొందడం సాధ్యమనే తలంపును పబ్లిసిటీ క్యాంపేన్‌లు కలిగిస్తున్నాయి” అని బ్రెజిల్‌ నందలి సావో పౌలో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ అయిన ఫెర్నాన్‌డో లెఫెవ్రీ చెబుతున్నాడు.a దాని ఫలితంగా, అధికంగా పని చేయడం, కుపోషణ, మరి చిన్న చిన్న భావోద్రేకపరమైన సమస్యల వల్ల కలిగే ప్రభావాలను అధిగమించేందుకు కూడా ప్రజలు మందులవైపు తిరుగుతున్నారు. “తమ జీవితాల నాణ్యతను మెరుగుపర్చుకునే బదులు, ప్రజలు తమకు నచ్చిన మందులను కొనుక్కుని తమ సమస్యలను సరిచేసుకోవాలని ప్రయత్నిస్తారు” అని లెఫెవ్రీ జతచేస్తున్నాడు. మరి రోగులు తమ జబ్బును గురించిన సరైన రోగనిర్థారణను కలిగి ఉన్నారో లేదో ఎవరికి తెలుసు?

తలనొప్పులు, హైబీపీ, ఉదర సమస్యల వంటి అనారోగ్యాలను సరిచేసుకునేందుకు మందులను వాడటంతో పాటూ, చింత, భయం, ఒంటరితనం వంటివాటిని తట్టుకునేందుకు కూడా అనేకులు మందుల వైపుకు తిరుగుతారు. “ఒక గుళిక తమ సమస్యను పరిష్కరిస్తుందని ప్రజలు భావిస్తారు గనుక వాళ్లు వైద్యుల వద్దకు వెళ్తారని” డా. ఆండ్రే ఫైన్‌గోల్డ్‌ చెబుతున్నాడు. “ఆరోగ్య నిపుణులు కూడా ప్రిస్క్రిప్షన్‌లు వ్రాసేందుకూ లెక్కలేనన్ని టెస్టులు చేయించుకోమని చెప్పేందుకూ మొగ్గుచూపుతున్నారు. రోగికున్న వైద్యపర పూర్వచరిత్రను తెలుసుకోవాలనే ప్రయత్నమే జరుగదు, అయితే అత్యధిక కేసుల్లో ఆ రోగి గందరగోళమైన, ఒత్తిడిగల అస్తవ్యస్తమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటాడు.” సైకోట్రోపిక్‌ల (గ్రహణశక్తినీ లేక ప్రవర్తననూ మార్చేసే మందుల) దురుపయోగాన్ని నివారించేందుకైన ప్రపంచ కౌన్సిల్‌కు చెందిన రోమిల్డో బ్వెనో ఇలా అంగీకరిస్తున్నాడు: “రోగులను చూసేందుకు వైద్యునివద్ద చాలా తక్కువ సమయం ఉంటుంది, మరి వైద్యుడు కేవలం రోగ సూచక లక్షణాలకు మాత్రమే చికిత్స చేసి ఆ వ్యక్తిని పంపించేస్తాడు.” మందులను ఉపయోగించడం “సాంఘిక సమస్యలను [పరిష్కరించేందుకైన] ఔషధపర మార్గం.” అయితే, అనేకమంది రోగులకు జాగ్రత్తగా ప్రిస్‌క్రైబ్‌ చేసిన సైకోట్రోఫిక్‌ మందులు అవసరమని మరొక వైద్యుడు హెచ్చరిస్తున్నాడు.

“ప్రొజాక్‌ ష్యాషన్‌”ను గురించి చర్చించిన తర్వాత, బ్రెజిల్‌కు చెందిన ఓ ఎస్టాడో డే సా. పౌలో అనే దినపత్రిక ఇలా చెబుతోంది: “సరిక్రొత్త హేర్‌స్టైల్‌ వలెనే ఒక మందు ఫ్యాషన్‌గా మారడం నిజంగా ఎంతో విచిత్రమైన విషయం.” అది మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన ఆర్థర్‌ కౌఫ్‌మాన్‌ చెప్పిన దాన్ని ఉదాహరించింది: “జీవితంలో విషయాల్ని సరైన స్థానాల్లో పెట్టే సామర్థ్యం లేకపోవడమూ, సంకల్పం లేకపోవడమూ ఎలాంటి స్థితిని కలిగిస్తాయంటే, ఒక ప్రభావవంతమైన చికిత్స అన్ని దుఃఖాలనూ నివారించేదిగా కనిపిస్తుంది.” కౌఫ్‌మాన్‌ ఇంకా ఇలా జతచేస్తున్నాడు: “మానవుడు త్వరిత చికిత్సల ఎడల మరీ ఎక్కువ మక్కువ చూపుతున్నాడు, తన సమస్యలకుగల మూలాలను తెలుసుకునే విషయంలో ఆసక్తి లోపించినవాడై, వాటిని పరిష్కరించుకునేందుకు అతడు మాత్రలను తీసుకోవడాన్ని ఇష్టపడతాడు.” అయితే స్వంత వైద్యం క్షేమకరమైనదేనా?

స్వంత వైద్యం—ఓ ప్రమాదమా?

“ఈ ఇరవయ్యో శతాబ్దానికి చెందిన వైద్య రంగంలోని ఒక అత్యంత గణనీయమైన విలక్షణత ఏమంటే సరిక్రొత్త మందులను ఉత్పత్తి చేయడమే” అని ది న్యూ ఎన్‌సైక్లోపేడియా బ్రిటానికా చెబుతోంది. అయితే “ఇతర కారణాలకంటే మందులను సరిగ్గా వాడకపోవడం మూలంగానే ఎక్కువ విషప్రయోగమౌతోందని” కూడా అది చెబుతోంది. వాస్తవానికి, మందులు నయం చేయగలిగిన విధంగానే అవి హాని కూడా కలుగజేయగలవు. అనోరెక్సియా డైట్‌ మాత్రలు (ఆకలి తగ్గించే మాత్రలు) “నాడీ వ్యవస్థపై పని చేస్తాయి కాబట్టి అవి నిద్రలేమీ, ప్రవర్తనలో మార్పుల వంటి తీవ్రమైన రోగ లక్షణాలను కలిగిస్తాయనీ మరి కొన్ని కేసుల్లో భ్రాంతికి గురయ్యేలా కూడా చేస్తాయనీ” సీలనీ డె కాస్ట్రో అనే రచయిత్రి వివరిస్తోంది. ఆమె ఇలా జతచేస్తోంది: “అనోరెక్సియా మాత్రలు ఆకలిని మాత్రమే తగ్గిస్తాయని ఎవరైనా అనుకుంటే అతడు తనను తానే మోసగించుకుంటున్నాడు. ఒక క్యాప్సూల్‌ చికిత్సల విషవలయం యొక్క ప్రారంభం మాత్రమే కావచ్చు, అలా ప్రతి మందూ మరో మందు ప్రభావాన్ని తగ్గించివేస్తుంది.”

సాధారణంగా ఉపయోగించే అనేక మందులు కడుపులో మంట కలిగేలా చేయవచ్చు చివరకు వికారం, వాంతులూ రక్తస్రావమూ కూడా కలిగించవచ్చు. కొన్ని మందులు ఉపయోగించడం వ్యసనంలా తయారు కావచ్చు లేక మూత్రపిండాలకూ కాలేయానికీ నష్టం కలిగించవచ్చు.

పేరు పొందిన ఆరోగ్య ఉత్పత్తులను కూడా అనుమానించవచ్చు. “విటమిన్‌ సప్లిమెంట్ల కొరకైన ఈ పిచ్చి ఎంతో ప్రమాదకరమైనది. ప్రజలు తమకైతామే మందులు తీసుకోవడమే కాకుండా, ఎక్కువ తెలియని కొంతమంది వైద్యులు అందులోని ప్రమాదాలను అలక్ష్యం చేస్తూ సంశయాత్మక ప్రిస్క్రిప్షన్‌లను ఇస్తున్నారని” బ్రెజిల్‌ యొక్క వైద్య సమాఖ్య అధ్యక్షుడైన డా. ఎఫ్రాయీమ్‌ ఓల్స్‌జేవర్‌ హెచ్చరిస్తున్నాడు. అయితే, కొన్ని అనారోగ్యాలనూ, విటమిన్‌ కొరతలనూ నయం చేసేందుకు సరైన మోతాదుల్లో ఇవ్వబడే విటమిన్‌ సప్లిమెంట్లు అవసరం కావచ్చు లేక ప్రయోజనకరంగా ఉండవచ్చు అని మరొక వైద్యుడు పేర్కొన్నాడు.

క్షేమకరంగా తమకైతామే రోగాన్ని నిర్ధారించుకోవడం—ఎలా?

మనకు నలతగా అనిపించిన ప్రతిసారీ మనం వైద్యుని వద్దకు వెళ్లలేము గనుక, ఆరోగ్యాన్ని గురించి కొంత తెలుసుకోవడం మరియు తగినంత మేరకు స్వంతగా వైద్యం చేసుకోవడం మన కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే, ఏ మందునైనా తీసుకోబోయే ముందు, మనకు వచ్చిన జబ్బు ఏమిటో సరిగ్గా, పూర్తిగా మనకై మనమే తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. మీకు దగ్గర్లో వైద్యుడు లేకపోతే లేక మీరు వైద్యుడి దగ్గరికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను పెట్టుకోలేకపోతే, సరైన సమాచారంగల వైద్య రిఫరెన్సు పుస్తకాన్ని చూడటం మీరు మీ జబ్బును గురించి సరైన రోగనిర్థారణ చేసుకునేందుకు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ ఒక కుటుంబ మెడికల్‌ గైడ్‌ను ప్రచురిస్తోంది. అందులో రోగలక్షణాలను గురించిన 183 పేజీల చార్టు కూడా ఉంది. అందులో రోగులకు కొన్ని ప్రశ్నలు వేయబడి ఉంటాయి, వాటికి అవును లేక కాదు అని సమాధానం చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ఒక అనారోగ్యాన్ని తరచూ చాలా సులభంగా గుర్తించి నిర్ధారణ చేయవచ్చు.

వైద్యుల పాత్ర విషయమేమిటి? మనం వాళ్ల సహాయాన్ని ఎప్పుడు కోరవచ్చు? మనం మన ఆరోగ్యాన్ని గురించి మరీ చింతించే వారిగా లేక మరీ అలక్ష్యంగా ఉండే వారిగా ఉండకుండా ఈ రెంటిమధ్యా ఎలా సమతూకాన్ని కలిగి ఉండగలం? వాస్తవానికి, అనారోగ్యం, మనశ్శరీర సంబంధమైన వ్యాధులు ఎంతో వ్యాపించివున్న ఈ ప్రపంచంలో మనం కొంతవరకైనా మంచి ఆరోగ్యాన్ని ఎలా కలిగి ఉండగలం?

[అధస్సూచీలు]

a అనేక దేశాల్లో, వైద్యుని ప్రిస్క్రిప్షన్‌ ద్వారా మాత్రమే లభించే మందులు ఇప్పుడు “నేరుగా వినియోగదారులకు” అందుబాటులో ఉన్నాయని వాణిజ్య ప్రకటనలు చేయడం, ఈ విధమైన ధోరణి మంచిది కాదని అనేకమంది వైద్యులూ వైద్య సంస్థలూ విమర్శిస్తున్నా ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతోంది.

[5వ పేజీలోని చిత్రం]

“రోగికున్న వైద్యపర పూర్వచరిత్రను తెలుసుకోవాలనే ప్రయత్నమే జరుగదు, అయితే అత్యధిక కేసుల్లో ఆ రోగి గందరగోళమైన, ఒత్తిడిగల అస్తవ్యస్తమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటాడు.”—డా. ఆండ్రే ఫైన్‌గోల్డ్‌

[4వ పేజీలోని బాక్సు]

మూలికలతో గృహ వైద్యం

వేల సంవత్సరాలుగా, అనేక సంస్కృతుల్లోని ప్రజలు పొలాల్లోనూ అడవుల్లోనూ కనిపించే మొక్కలను ఉపయోగిస్తూ తమ అనారోగ్యాలను మూలికలతో నివారించుకున్నారు. గుండె జబ్బులను నయం చేసేందుకు ఉపయోగించబడే డిజిటాలిస్‌ వంటి అనేక ఆధునిక మందులు కూడా మొక్కల నుండి తీయబడినవే. అందుకని, యునైటెడ్‌ కింగ్డమ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ హెర్బలిస్ట్స్‌లో ఒక సభ్యురాలైన పనలపీ ఓడీ, “సాధారణ సమస్యలను తీసివేసేందుకు 250 కంటే ఎక్కువ క్షేమకరమైన చికిత్సలు ఉన్నాయి, అవి మామూలు దగ్గు, జలుబు, తలనొప్పులు మొదలుకొని చర్మ సంరక్షణ కొరకైన ప్రత్యేక చికిత్స, అరుగుదల సమస్యలు మరియు పిల్లల అనారోగ్యం వరకూ చేరి ఉన్నాయని” తన పుస్తకంలో పేర్కొన్నది.

ఆమె ఇలా వ్రాస్తోంది: “మూలికా వైద్యం (హెర్బలిజం) ఎల్లప్పుడూ కూడా ‘సామాన్య ప్రజల మందుగానే’ పరిగణించబడింది, దానిలో మామూలు జబ్బులకు ఇంట్లో ఉపయోగించగల సాధారణ చికిత్సలు లేక దీర్ఘకాలిక మరియు ప్రాణాపాయకరమైన వ్యాధుల కొరకు వైద్యులు ప్రిస్‌క్రైబ్‌ చేసిన ఎంతో శక్తివంతమైన చికిత్సలకు ప్రత్యామ్నాయాలు కూడా చేరి ఉన్నాయి.” ఆమె ఇలా కొనసాగిస్తోంది: “మూలికల్లో చాలావరకూ సహజసిద్ధంగా క్షేమకరమైనవే అయినప్పటికీ, వాటితో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించాలి. మీ అనారోగ్యం అలాగే కొనసాగితే, లేక పరిస్థితి క్షీణిస్తే లేక రోగ నిర్థారణ సరిగ్గా జరుగకపోతే చెప్పబడిన డోసుకుమించి ఎక్కువ తీసుకోవడం గానీ లేక ఆ గృహ వైద్యాన్నే కొనసాగించడం గానీ చేయకండి.”—ది కంప్లీట్‌ మెడిసినల్‌ హెర్బల్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి