మీరు మంచి ఆరోగ్యాన్ని ఎలా కల్గివుండగలరు?
థెరపీలు ఎంతో ప్రజాదరణ పొందిన చర్చనీయాంశం. ఒక్కో వైద్య సమస్యకూ ప్రతి స్నేహితురాలి వద్దా లేక పొరుగింటామె వద్దా తలో చిట్కా వైద్యం ఉంటుందేమో అనిపిస్తుంది. అందుకే స్వంతగా వైద్యం చేసుకోవాలన్న కోరిక మరీ బలంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, “కేవలం ఎంతో తీవ్రమైన పరిస్థితిలో మాత్రమే వైద్యుని వద్దకు వచ్చే” ప్రజలూ ఉన్నారని ఒక బ్రెజిల్ వైద్యురాలు అంటోంది. “వాళ్ల చర్మంపై ఉన్న పొక్కులకు ఎన్నో నెలలు స్వంత వైద్యం చేసినా నయం కావు. తీరా వాళ్లు వైద్యుని వద్దకు వచ్చినప్పుడు అది ఒక విధమైన క్యాన్సరనీ దాన్ని మొదటి స్థాయిలోనే నయం చేయవలసి ఉండాల్సిందనీ తెలుస్తుంది.”
త్వరగా రోగ నిర్ధారణ చేయడం తరచూ జీవితాలను కాపాడుతుంది గనుక, ఆ విషయంలో ఆలస్యం చేయడం ఎంతో ప్రమాదకరం కావచ్చు. “ఒక ముప్పై ఏళ్ల స్త్రీకి ఒకసారి ఋతుస్రావం ఆలస్యంగా అయ్యింది, ఆమెకు పొత్తి కడుపులో కాస్త నొప్పి ఉంది. ఆమె నొప్పి తగ్గించే మందులనూ వాపు తగ్గించే మందులనూ ఎక్కువగా తీసుకుంది, దాంతో నొప్పి తగ్గింది” అని ఒక సర్జన్ నివేదిస్తున్నాడు. “అయితే మూడు దినాల తర్వాత, ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో షాక్‌కి గురైంది, ఆమెను త్వరగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె గర్భవాహికలో గర్భం నిలిచిపోయిందని నేను తెలుసుకుని ఆమెకు వెంటనే ఆపరేషన్ చేశాను. అది సరైన సమయంలో చేసినందువల్ల బ్రతికిపోయింది.”
సావో పౌలోలోని ఒక యౌవనస్థురాలు తాను ఎనిమిక్‌గా ఉన్నానని భావించింది, అయితే ఆమె మూత్రపిండం సరిగ్గా పని చేయకపోవడమే ఆమెకున్న సమస్య. ఆమె చికిత్స విషయంలో జాప్యం చేసింది గనుక, ఆమెకు మూత్రపిండాన్ని మార్చడం తప్పలేదు. ఆమెకు వైద్యం చేసిన డాక్టరు ఇలా చెబుతోంది: “తరచూ రోగులు వైద్య చికిత్స తీసుకునేందుకు సంకోచిస్తారు, స్వంతగా వైద్యం చేసుకుంటారు లేక వైద్యం తెలియని వ్యక్తులు చెప్పే ఇతర సలహాల కొరకు ప్రయత్నిస్తారు, అలా వాళ్లు గంభీరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.”
మన శరీరం ఇచ్చే హెచ్చరికా సూచనలను మనం ఎంతమాత్రం అలక్ష్యం చేయాలనుకోము. అయినప్పటికీ థెరపీలకూ లేక స్వంత వైద్యానికీ బానిసలమవ్వకుండా మనం ఎలా ఉండగలం? ఆరోగ్యం అనేది “శరీరం, మనస్సు లేక ఆత్మ మంచి స్థితిలో ఉండటం” లేక “శారీరక వ్యాధి లేక నొప్పి లేకుండా ఉండడం” అని నిర్వచించబడింది. నేటి వ్యాధుల్లో అనేకాన్ని కొద్దొ గొప్పో నివారించవచ్చనే విషయం అంగీకరించబడటం ఎంతో ఆసక్తికరం. డా. లూవిస్ థోమాస్ ప్రకారం: “మనం అసంగతంగా దగ్గరకు కూర్చబడిన ప్రాణులం కాదు, మనం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో బలంగా దృఢంగా ఉన్న ప్రాణులం, ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నాం.” కాబట్టి, ‘ఆరోగ్యవంతులైన చింతగల వారిగా ఉండి ఆ చింతతో మనలను మనం సగం చంపుకునే’ బదులు తనను తాను ఎంతో ప్రభావవంతంగా నయం చేసుకోగల శక్తి ఉన్న మన శరీరంతో మనం సహకరిద్దాం. ఒక మంచి వైద్యుడు లేక ఆరోగ్యకార్యకర్త కూడా మనకు సహాయం చేయగలడు.
వైద్య సహాయం కోరవలసిన సమయం
“ఒకవేళ జ్వరం, తలనొప్పులు, వాంతులు, లేక పొత్తి కడుపూ ఉరఃకుహరం, లేక వస్థిగుహ నొప్పికి సాధారణ మందులు తీసుకున్నప్పటికీ అవి తగ్గకపోతే మరియు ఎలాంటి తెలిసిన కారణం లేకుండానే ఆ నొప్పి తరచుగా మళ్లీ వస్తుంటే లేక ఆ నొప్పి మరీ విపరీతంగా లేక తీవ్రంగా ఉంటే” వైద్యుని వద్దకు వెళ్లాలని బ్రెజిల్‌కు చెందిన ఒక వైద్యుడు సలహా ఇస్తున్నాడు. మనలోని రోగలక్షణాలతో ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడు లేక ఆ లక్షణాలు కనిపించిన ఇతరసార్లకంటే ఇప్పుడు ఏదో తేడా ఉన్నట్లు గమనించినప్పుడు తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలని కోరాలని మరొక వైద్యుడు సలహా ఇచ్చాడు. ఆయనిలా జతచేస్తున్నాడు: “పిల్లవానికి రోగం వచ్చినప్పుడు, ఆ పిల్లవానికి తామే మందులు వేసే బదులు, సాధారణంగా తలిదండ్రులు వైద్యుల సహాయం తీసుకోవాలని ఇష్టపడతారు.”
అయితే మందులు ఎల్లవేళలా అవసరమేనా? మందుల ఉపయోగం వ్యతిరేక ఫలితాలను తెస్తుందా? వాటి మూలంగా కడుపులో మంట లేక కాలేయానికీ లేక మూత్రపిండాలకూ నష్టం వంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయా? మరి ఇతర మందులతో ఇంటరాక్షన్‌ల సంగతేమిటి? “రోగుల్లో చాలాకొద్ది మందే తమ సమస్యలను భావోద్రేకరహితమైన లేక వివేకవంతమైన రీతిలో దృష్టిస్తారని” ది న్యూ ఎన్‌సైక్లోపేడియా బ్రిటానికా చెబుతోంది. అయినప్పటికీ, మందులన్నీ సాధారణంగా హానికరమైనవనీ మరియు నేడు ఉపయోగించబడే మందుల్లో చాలా కొద్ది మందులే సైడ్ ఎఫెక్టులు లేనివనీ మనం తెలుసుకునేందుకు మనస్సాక్షిగల వైద్యుడు మనకు సహాయం చేయగలడు. మీరు ఈసారి కొనే ప్రిస్క్రిప్షన్ మందు లేబుల్‌పైన, రాగల సైడ్ ఎఫెక్టులను గురించిన హెచ్చరికను ఒకసారి చదవండి ! ఓవర్ ది కౌంటర్ మందులను (ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా మందుల షాపులో కొనగల మందులు) కూడా తప్పు రీతిలో ఉపయోగిస్తే లేక అధికంగా ఉపయోగిస్తే అవి హాని కలిగించగలవు లేక మరణానికి దారితీయగలవు.
ది బోస్టన్ గ్లోబ్‌లో రిచ్చర్డ్ ఏ. నాక్స్ ద్వారా వ్రాయబడిన ఒక నివేదిక అప్రమత్తంగా ఉండవలసిన అవసరతను నొక్కి చెబుతోంది: “ఆర్థరైటిస్ మూలంగా బాధననుభవిస్తూ ప్రతిదినమూ నొప్పి తీసివేసే మాత్రలను మింగే లక్షలాదిమంది అకస్మాత్తుగా గంభీరమైన మరణకర రక్తస్రావానికి గురయ్యే ప్రమాదం ఉందని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నివేదిస్తున్నారు.” ఆయనిలా జతచేస్తున్నాడు: “అంతేకాకుండా, నొప్పి తీసివేసే మాత్రలకు తోడు అంటాసిడ్‌లనూ లేక ప్రఖ్యాత ఆసిడ్ బ్లాకింగ్ మాత్రలను వాడటం గంభీరమైన ఉదర సమస్యలనుండి కాపాడదు సరికదా అది ప్రమాదాన్ని అధికం చేయవచ్చుకూడా అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.”
సాధారణ స్వంత వైద్యం సంగతేమిటి? బ్రెజిల్ నందలి రిబైరో ప్రిటోకి చెందిన ఒక వైద్యుడు ఇలా చెబుతున్నాడు: “అందరూ ఇంట్లో కొన్ని మందులను ఉంచుకోగలిగితే అది ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను . . . అయితే, ఈ మందులను మంచిగా ఆలోచించి ఎంతో అవసరం అనుకున్నప్పుడే ఉపయోగించాలి.” (7వ పేజీలోని బాక్సును చూడండి.) అంతేకాకుండా, ఆరోగ్యాన్ని గురించి సాధారణ విషయాలు తెలిసి ఉండటం జీవితం మరింత శ్రేష్ఠంగా అయ్యేందుకు దోహదపడుతుంది. ఒక్కో వ్యక్తి పరిస్థితి వేరుగా ఉంటుంది గనుక, ప్రతిదానికి నిర్దిష్ట మందులనూ, థెరపీలనూ లేక సహజ చికిత్సలనూ తేజరిల్లు! సిఫారసు చేయదు.
మంచి ఆరోగ్యం—మీరు ఏమి చేయవచ్చు?
“ప్రపంచంలోని శ్రేష్ఠమైన వైద్యులు డాక్టర్ డైట్, డాక్టర్ క్వైట్, డాక్టర్ మెర్రీమ్యాన్‌లేనని” 18వ శతాబ్దానికి చెందిన ఒక రచయిత అయిన జోనాథాన్ స్విఫ్ట్ వ్రాశాడు. నిజంగానే, సమతూకంగల డైట్ (ఆహారం), క్వైట్ (తగినంత విశ్రాంతీ) మరియు మెర్రీమ్యాన్ (సంతృప్తి) మంచి ఆరోగ్యానికి అవసరమైన ప్రాముఖ్యమైన అంశాలు. దానికి భిన్నంగా, తెలివైన వాణిజ్య ప్రచారాలు ఎన్ని కబుర్లు చెబుతున్నప్పటికీ, మనం మందులు వాడినంత మాత్రాన మంచి ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. “మందులను అనవసరంగా లేక ప్రమాదకరంగా ఉపయోగించడం” వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనపర్చవచ్చు.—డిసియోనార్య టెరాపెవుటికు గ్వానాబారా.
అయితే, మన జీవిత విధానానికై బాధ్యత వహించడం మరియు మాదక ద్రవ్యాల దురుపయోగాన్నీ పొగత్రాగడాన్నీ అధికంగా మత్తుపానీయాలు సేవించడాన్నీ మానుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం ఎంతో చేయగలం. బ్రెజిల్‌లో ఎంతో కాలంగా మిషనరీగా ఉన్న 60 సంవత్సరాల మారియన్ ఇలా చెబుతోంది: “నేను మోడరేట్‌గా జీవించడం మరియు విభిన్న రకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంతోనే ఉన్నాను.” ఆమె ఇంకా ఇలా వివరిస్తోంది: “నేను సాధారణంగా త్వరగా నిద్ర లేవటాన్ని ఇష్టపడతాను, కాబట్టి త్వరగా నిద్రపోవడం ఎంతో ప్రాముఖ్యం.” కనీసజ్ఞానాన్నీ మంచి అలవాట్లనూ తక్కువగా పరిగణించకూడదు, అయితే క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవలసిన ప్రాముఖ్యతనూ, మంచి ఫ్యామిలీ డాక్టర్‌తో జరిపే చక్కని సంభాషణల ప్రాముఖ్యతను కూడా అలక్ష్యం చేయకూడదు.
మారియన్ తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, ఆమె తన ఆరోగ్యాన్ని మరీ అలక్ష్యం చేయడమో లేక దాని గురించి మరీ ఎక్కువ చింతకలిగి ఉండడమో చేయకుండా జాగ్రత్త వహిస్తోంది. ఆమె ఇలా చెబుతోంది: “దీర్ఘకాలంలో నాకు ఏది శ్రేష్ఠంగా ఉంటుందో అదే చేసేందుకూ మరియు నా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలనే ప్రయత్నంలో నేను అధిక సమయాన్నీ, వనరులనూ వెచ్చించకుండా ఉండేందుకు గానూ, నేను తీసుకోవలసిన ఎలాంటి ఆరోగ్య సంబంధ నిర్ణయాల్లోనైనా నేను యెహోవా యొక్క నడిపింపు కొరకు కూడా ప్రార్థన చేస్తాను.” ఆమె ఇలా జతచేస్తోంది: “చురుకుగా ఉండటం ఎంతో ప్రాముఖ్యం గనుక, నేను నా సమయాన్నీ బలాన్నీ ఉపయోగించడంలో సహేతుకంగా ఉండేందుకు దేవుడు నాకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను, అలా నేను మరీ బద్ధకించకుండా ఉండేందుకూ అలాగే అదే సమయంలో నా శక్తి సామర్థ్యాలకు మించి శ్రమపడకుండా ఉండేందుకూ అది నాకు సహాయం చేస్తుంది.”
నిజంగా సంతోషంగా ఉండేందుకు, మనం భవిష్యత్తును అలక్ష్యం చేయలేం. మనకు ఇప్పుడు సాపేక్షికంగా మంచి ఆరోగ్యమే ఉన్నప్పటికీ, వ్యాధి, నొప్పి, బాధ చివరకు మరణం ఉండనే ఉన్నాయి. మనం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఎప్పటికైనా కలిగి ఉంటామనే నిరీక్షణ ఏమైనా ఉందా?
[6వ పేజీలోని బాక్సు]
సమతూకమైన స్వయంశ్రద్ధ వల్ల కలిగే ప్రయోజనాలు
మీ ఆరోగ్యం చాలా మేరకు మీరు ఏమి తింటారూ ఏమి త్రాగుతారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మీరు మీ కారులో నీళ్లు కలిపిన పెట్రోల్‌ను పోసి నడిపేందుకు లేక గ్యాస్‌కు చక్కెరను కలిపేందుకు ప్రయత్నిస్తే, మీరు త్వరలోనే ఇంజన్‌ను పాడు చేస్తారు. అదే విధంగా, మీరు చిరుతిళ్లు తింటూ, పానీయాలు త్రాగుతూ బ్రతకాలని ప్రయత్నిస్తే, మీరు అందుకు మీ ఆరోగ్యాన్ని మూల్యంగా చెల్లించవలసి రావచ్చు. కంప్యూటర్ ప్రపంచంలో ఇది GIGO అని పిలువబడుతుంది, అంటే “గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ (లోనకు వెళ్లేది చెత్తే అయితే, బయటకు వచ్చేదీ చెత్తే)” అని దాని అర్థం.
కుటుంబ వైద్య ప్రొఫెసరైన డా. మిలానీ మింట్జర్ ఇలా వివరిస్తున్నాడు: “రోగుల్లో మూడు రకాలైన వాళ్లు ఉంటారు: తాము సులభంగా ఇంట్లోనే సరిచేసుకోగల వాటి గురించి కూడా వైద్యుణ్ని సందర్శించే వారు, ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థను చక్కగా ఉపయోగించుకునే వారూ, మరియు వైద్యుని దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉన్నప్పుడుకూడా వైద్యుని వద్దకు వెళ్లని వారు. మొదటి కోవకు చెందిన వారు వైద్యుని సమయాన్నీ తమ సమయాన్నీ డబ్బునూ వృధా చేసుకుంటారు. మూడో గుంపుకు చెందిన వాళ్లు సరైన సమయానికి వైద్యుని వద్దకు వెళ్లకపోవడం ద్వారా తమ జీవితాలనే ప్రమాదంలో పడవేసుకుంటారు. అందుకే ఎక్కువమంది ప్రజలు ఆ రెండవ గుంపుకు చెందిన వారై ఉండాలని వైద్యులు కోరుకుంటారు.”
“పూర్తి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏడు కీలకాలు: సరైన ఆహారాన్నీ పానీయాలనూ తీసుకోండి, క్రమంగా వ్యాయామం చేయండి, పొగత్రాగకండి, తగినంత విశ్రాంతి తీసుకోండి, మీకు వత్తిడి కలిగించే పనిలో సర్దుబాట్లు చేసుకోండి, సన్నిహిత సాంఘిక సంబంధాలను కలిగి ఉండండి, అనారోగ్యం కలిగేందుకూ మరియు ప్రమాదాలు కలిగేందుకు ఉన్న సాధ్యతలను తగ్గించేందుకు అవసరమైన యుక్తమైన ముందు జాగ్రత్తలను తీసుకోండి.”—ఆన్ సైమన్స్, ఎమ్.డి., బాబీ హాసల్‌బ్రింగ్, మికాయెల్ క్యాసల్‌మ్యాన్‌లు రచించిన బిఫోర్ యూ కాల్ ది డాక్టర్—సేఫ్, ఎఫెక్టివ్ సెల్ఫ్-కేర్ ఫర్ ఓవర్ 300 మెడికల్ ప్రాబ్లమ్స్.
[7వ పేజీలోని బాక్సు]
ఇంట్లో ఒక మందుల పెట్టె
“మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు కలిగే—నొప్పులు, బాధలు, దెబ్బలు, మరి నలతను లేక వ్యాధిని సూచించే ఇతర లక్షణాలు—రోగ లక్షణాల్లో దాదాపు 90 శాతాన్ని వారు అలక్ష్యం చేసి ఎవ్వరికీ ఎన్నడూ చెప్పరు. . . . తరచూ వాటికి చికిత్స త్వరగా లభిస్తుంది, ఉదాహరణకు తలనొప్పి వస్తే రెండు ఆస్ప్రిన్ మాత్రలు.”
“దీన్ని తరచూ సాధ్యం చేసేది ఇంట్లో ఉన్న మందుల పెట్టే. అది వైద్యుల వద్దకూ క్లినిక్‌లకూ అనవసరంగా వెళ్లడం ద్వారా అయ్యే విపరీతమైన ఖర్చులను తగ్గిస్తుంది.”—కంప్లీట్ హోమ్ మెడికల్ గైడ్, ది కొలంబియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్.
ఈ పుస్తకమే, మీ ఇంట్లోని మందుల పెట్టెలో బ్యాండ్-ఎయిడ్, టేప్, స్టెరైల్ చేయబడిన పట్టీ, దూది, బ్యాండేజ్‌లు, వివిధ ఆయింట్‌మెంట్‌లు, క్రీములూ, డెట్టాల్, కత్తెర, థర్మామీటర్ మరియు ఇతర ఉపయోగకరమైన వస్తువులు ఉంటే మంచిదని సలహా ఇస్తోంది.
మందుల విషయంలో జ్వరాన్నీ, నొప్పినీ తగ్గించే మాత్రలనూ, ఆంటాసిడ్‌లనూ, దగ్గు మందునూ, ఒక ఆంటీహిస్టమైన్/డికాన్‌జెస్టెంట్‌ను, ఒక మైల్ట్ లాక్సేటివ్‌నూ, విరోచనాల మందులనూ ఉంచుకోవాలని సలహా ఇస్తోంది.
[8వ పేజీలోని బాక్సు]
హెచ్చరిక
“ఓటిసి [ఓవర్ ది కౌంటర్] మందుల కొరకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేకపోయినప్పటికీ, అవి నిజంగానే మందులు. ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే మందుల వలెనే, వీటిలో కొన్నింటిని ఇతర మందులతో కలిపి లేక కొన్ని ఆహార పదార్థాలతో లేక మత్తుపానీయాలతో కలిపి తీసుకోకూడదు. ఇతర మందుల వలెనే, వాటిలో కొన్ని మరింత గంభీరమైన సమస్యలను మరుగుపర్చవచ్చు లేక వాటిపైనే ఆధారపడేలా చేయవచ్చు. మరి కొన్నిసార్లు వైద్యుడి వద్దకు వెళ్లే బదులు ఓటిసిని వాడటమే మంచిది అని అనుకోకూడదు.
“అయినప్పటికీ, వాటిలో అనేకం క్షేమకరమైనవీ ప్రభావవంతమైనవీనూ . . . అవి పని చేస్తాయి, చక్కగా పని చేస్తాయి.”—మందులను జ్ఞానయుక్తంగా ఉపయోగించడం.
[7వ పేజీలోని చిత్రాలు]
ఏ మూలికా లేక మందూ కూడా పూర్తిగా హానిరహితమైనది కాదు
1. అమ్మకందారుని మందుల పెట్టె
2. బహిరంగంగా మందులమ్మే వాడు
3. చికిత్సా మూలికల సంచులు