మీకు తెలుసా?
(ఇవ్వబడిన బైబిలు ఉల్లేఖనాల నుండి ఈ క్విజ్‌కు జవాబులను కనుగొనవచ్చు. అంతేకాక జవాబుల పూర్తి పట్టిక 26వ పేజీలో ముద్రించబడి ఉంది. అదనపు సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ప్రచురించిన “ఇన్‌సైట్ ఆన్ ద స్క్రిప్చర్స్” అనే ప్రచురణను చూడండి.)
1. యేసు శాస్త్రులను, పరిసయ్యులను నిందిస్తూ, ‘బలిపీఠముకు, దేవాలయముకు మధ్య చంపబడినవాడు’ అని ఎవరి గురించి చెప్పాడు? (మత్తయి 23:35)
2. బెన్యామీను మొదటి కుమారుడు ఎవరు? (ఆదికాండము 46:21)
3. ధర్మశాస్త్ర నకలు వ్రాతగాడిగాను బోధకునిగాను ప్రసిద్ధిగాంచిన అహరోన్య యాజకుడు ఎవరు? (నెహెమ్యా 8:1, 2)
4. ఒక వ్యక్తి నిజమైన జ్ఞాని అయ్యేందుకు లోకం దృష్టిలో ఏమవ్వడం తప్పనిసరి? (1 కొరింథీయులు 3:18, 19)
5. చెవియొక్క వ్రేలాడే భాగం ఏమని పిలువబడుతుంది? (లేవీయకాండము 14:14, NW)
6. ధనాపేక్ష వలన ఏ పర్యవసానాలు కలుగుతాయని పౌలు చెప్పాడు? (1 తిమోతి 6:10)
7. యెహెజ్కేలు దర్శనంలోని పరలోక రథము యొక్క “నేల” దేనికి సాదృశ్యంగా ఉంది? (యెహెజ్కేలు 1:22)
8. పౌలును ఖైదీగా రోమ్‌కు తీసుకువెళ్తుండగా, తమ ఓడ ఏ ఇసుకతిప్పమీద పడిపోతుందని నావికులు భయపడ్డారు? (అపొస్తలుల కార్యములు 27:17)
9. అహరోను కర్ర ఏ వృక్షం నుండి తయారు చేయబడింది? (సంఖ్యాకాండము 17:8)
10. ప్రజల నుండి తన అతిథులను కాపాడేందుకు లోతు ఏమి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు? (ఆదికాండము 19:6-8)
11. ఐగుప్తు నగరమైన మెంఫస్‌కున్న బైబిలు పేరేమిటి? (యెషయా 19:13)
12. ఆడ ఎర్ర జింక ఏమని పిలువబడుతుంది? (సామెతలు 5:19)
13. తమ సాపేక్ష సంక్లిష్ట సామాజిక సంస్థీకరణను బట్టి “ఒక జనము” అని పిలువబడిన జీవులు ఏవి? (సామెతలు 30:25, NW)
14. యూదా భార్య యొక్క కనానీయుడైన తండ్రి ఎవరు? (ఆదికాండము 38:2)
15. మగ గాడిద మరియు ఆడ గుర్రముల సంకరజాతి సంతతి ఏమని పిలువబడుతుంది? (2 సమూయేలు 13:29)
16. “యెహోవాకు హేయమైన”వని చెప్పబడినవేవి? (సామెతలు 12:22)
17. ఇశ్రాయేలీయుల్లోని 7,000 మంది ఏ అబద్ధ దేవునికి నమస్కరించలేదని ఏలీయాకు చెప్పబడింది? (1 రాజులు 19:18)
18. షీయోల్ మరియు హేడీస్ అనే హెబ్రీ మరియు గ్రీక్ పదాలను తర్జుమా చేసేందుకు ఏ పదం ఉపయోగించడం వలన మృతులకు ఏమి సంభవిస్తుంది అనే విషయం గందరగోళంగా ఉంది? (అపొస్తలుల కార్యములు 2:31, కింగ్ జేమ్స్ వర్షన్)
19. నీతిమంతురాలైన హన్నా త్రాగి మత్తురాలైందని ఎవరు అపార్థం చేసుకున్నారు? (1 సమూయేలు 1:13)
20. “క్రీస్తునందు యోగ్యుడైన” వాడు అని రోమా సంఘంలోని ఎవరిని పౌలు పిలిచాడు? (రోమీయులు 16:10)
21. సువార్తల్లో మిగిలిన 11 మంది అపొస్తలులకన్నా ఏ అపొస్తలుని ప్రస్తావనలు ఎక్కువగా నమోదుచేయబడ్డాయి? (మత్తయి 15:15)
22. పౌలు ఏ విషయాన్ని తెలియజేయడం వల్ల కొరడా దెబ్బలను తప్పించుకున్నాడు? (అపొస్తలుల కార్యములు 22:25-29)
23. యేసు శరీరాన్ని సమాధిచేసే సిద్ధపాటులో నీకొదేము ఏ రెండు పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాడు? (యోహాను 19:39)
24. యేసు ఎంతమంది కుష్ఠురోగులను స్వస్థపరచిన సందర్భంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒకరే తిరిగి వచ్చారు? (లూకా 17:12-19)
25. తనకు తానుగా ప్రతివాదన చేసుకోలేని ఏ రుగ్మతగలవారిని తిట్టడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది? (లేవీయకాండము 19:14)
క్విజ్‌కు జవాబులు
1. “బరకీయ కుమారుడగు జెకర్యా”
2. బెల
3. ఎజ్రా
4. వెఱ్ఱివాడు
5. చెవి తమ్మె
6. “విశ్వాసం నుండి తొలగి”పోవడంతో పాటు ‘సమస్తమైన కీడులు’ కలుగుతాయి
7. “తళతళలాడు స్ఫటికము”
8. సూర్తిస్
9. బాదము
10. వారికి తన కుమార్తెలను ఇస్తానన్నాడు
11. నోపు
12. (ఎర్ర) లేడి
13. చీమలు
14. షూయ
15. కంచర గాడిద
16. అబద్ధమాడు పెదవులు
17. బయలు
18. నరకము
19. ప్రధానయాజకుడైన ఏలీ
20. అపెల్లె
21. పేతురు
22. తాను ఒక రోమీయుడని ప్రకటించాడు
23. బోళము, అగరు
24. పదిమంది
25. చెవుడు