కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 13-15
  • మనుగడ కొరకై ఫ్రెంచి బైబిలు పోరాటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుగడ కొరకై ఫ్రెంచి బైబిలు పోరాటం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అసలైన యుద్ధం మొదలౌతుంది
  • బైబిలు కొరకైన పోరాటం చెలరేగుతుంది
  • భయంకరమైన పోరాటం
  • ఎదురుదాడులు
  • చరమఘాతం
  • ఇటలీ భాషలో బైబిలు దాని కల్లోలభరిత చరిత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 13-15

మనుగడ కొరకై ఫ్రెంచి బైబిలు పోరాటం

ఫ్రాన్స్‌ నందలి తేజరిల్లు! విలేఖరిద్వారా

ప్రపంచంలో పది కోట్లకంటే ఎక్కువమంది ప్రజలు ఫ్రెంచి భాష మాట్లాడతారు. మీరు వారిలో ఒకరు కాకపోయినా, మనుగడ కొరకై ఫ్రెంచి బైబిలు సలిపిన పోరాటాన్ని గురించి చదవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మత స్వేచ్ఛతో దానికున్న సంబంధం కూడా అందుకు కొంతవరకు కారణం. శతాబ్దాలుగా, అనేక ఫ్రెంచి బైబిళ్లు శత్రువుల ద్వారా, అబద్ధ స్నేహితుల ద్వారా క్రూరంగా నాశనం చేయబడ్డాయి. భయభ్రాంతులను చేసే రీతిలో వ్యతిరేకత ఎదురైనప్పటికీ, అనువాదకులూ ముద్రణకర్తలూ ఆ పోరాటంలో విజయం సాధించేందుకు తమ జీవితాలను పణంగా పెట్టారు.

12వ శతాబ్దంలో, ఫ్రెంచితో పాటూ అనేక ఇతర ప్రాంతీయ భాషల్లో బైబిలు యొక్క కొన్ని భాగాల అనువాద ప్రతులు అందుబాటులో ఉండేవి. కాథోలిక్‌ చర్చి ద్వారా చర్చి వ్యతిరేకులని పిలువబడిన గుంపులు వాటి ఉపయోగాన్ని ప్రోత్సహించాయి. అయితే 19వ శతాబ్దం వరకూ కూడా బైబిలు ఫ్రెంచి భాషలో విస్తృతంగా పంపిణీ చేయబడలేదు. శతాబ్దాల ఈ సుదీర్ఘ కాలవ్యవధి, మనుగడ సాగించేందుకు ఫ్రెంచి బైబిలు అడుగడుగునా ఎదుర్కొన్న గండాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంది.

దాదాపు సా.శ.900లో ప్రచురించబడిన ఫ్రెంచి బైబిలు నిఘంటువు, ఫ్రెంచి భాషలో అచ్చు వేయబడిన తొలి పుస్తకాల్లో ఒకటి. కాథోలిక్‌ చర్చి ఉపయోగించే భాష అయిన లాటిన్‌లో ఉన్న బైబిలును అర్థం చేసుకునేందుకు పాఠకులకు సహాయం చేసేందుకు అది రూపకల్పన చేయబడింది. అయితే ఆ సమయానికల్లా లాటిన్‌ భాష సామాన్య ప్రజల వాడుకలో లేదు, సామాన్య ప్రజలు అనేక మాండలిక భాషలు ఉపయోగించే వారు. అలా దేవుని వాక్యం వారికి అందుబాటులో లేకుండాపోయింది. దేవుని వాక్యాన్ని చదువగలిగే, లాటిన్‌ భాష వచ్చిన మత నాయకుల ప్రత్యేకహక్కుగా అది ఉండిపోయింది.

సా.శ.842లో, మొదటి అధికారిక ఫ్రెంచి రాష్ట్ర దస్తావేజు ఉనికిలోకి వచ్చింది. ప్రజల్లో అత్యధికులు ఇక లాటిన్‌ భాష మాట్లాడటం లేదనే విషయానికి మౌనాంగీకారిక గుర్తింపది. దాదాపు సా.శ.880లో ఫ్రాన్స్‌ నందు సామాన్య ప్రజల భాషలో మత పద్యాలు ఉనికిలోకి రావడం ప్రారంభించాయి. అయితే మరొక రెండు శతాబ్దాల వరకూ కూడా బైబిలు అనువాదాలు ఉనికిలో లేవు. తొలి కాలంనాటి ప్రతుల్లో, 12వ శతాబ్దారంభంలో ఉత్పత్తి చేయబడిన నార్మన్‌-ఫ్రెంచి భాషలోకి అనువదించబడిన బైబిలులోని కొన్ని భాగాలు ఉన్నాయి.

అసలైన యుద్ధం మొదలౌతుంది

ఫ్రాన్స్‌ ప్రజలు చదువగల ఆకృతిలో వారి కొరకు పరిశుద్ధ లేఖనాలను సిద్ధం చేసేందుకు మొదటిగా, మధ్య ఫ్రాన్స్‌ నందలి లీయోన్‌కు చెందిన 12వ శతాబ్దం నాటి వర్తకుడైన పీటర్‌ వాల్డో తీవ్రంగా ప్రయత్నించాడు. వాల్డో మొదట ఆగ్నేయ ఫ్రాన్స్‌లో వాడుకలో ఉన్న ప్రొవెన్‌కల్‌ అనే భాషలోకి బైబిలు యొక్క కొన్ని భాగాలను అనువదించేందుకు ఏర్పాట్లు చేశాడు. 1179లో, మూడవ లాటరన్‌ సలహాసంఘ సమావేశంలో ఆయన పోప్‌ అలెగ్జాండర్‌ IIIకు తన బైబిలు అనువాదం యొక్క కొంత భాగాన్ని సమర్పించాడు.

తర్వాత, చర్చి వాల్డోనూ ఆయన అనుచరులనూ చర్చి వ్యతిరేకులని నిందించింది, ఆయన ఏర్పాట్ల ప్రకారంగా అనువదించిన ప్రతులను మాంకులు మంటల్లో కాల్చేశారు. అప్పటినుండీ, దేవుని వాక్యాన్ని సామాన్య ప్రజలకు అందజేయాలని జరిగే ప్రతి ప్రయత్నాన్నీ కూడా చర్చి నిరోధించడం ప్రారంభించింది.

ఫ్రాన్స్‌లో తూర్పు భాగానున్న మెట్జ్‌ నగరంలో బైబిళ్లను కాల్చివేయడం ద్వారా 1211లో చర్చి తన పథకాన్ని స్పష్టం చేసింది. 1229లో టులూజ్‌ సలహాసంఘం చర్చి సభ్యులు ప్రాంతీయ భాషా బైబిళ్లను ఏ భాషలో కూడా ఉపయోగించకూడదని స్పష్టంగా నిషేధించింది. దాని తర్వాత, మత గురువులు కూడా రొమాన్స్‌ భాషల్లో ఏ భాషలో కూడా (లాటిన్‌ నుండి పుట్టిన భాష) బైబిళ్లను కలిగి ఉండకూడదని 1234లో స్పెయిన్‌ నందలి టారగోన సలహాసంఘం నిర్థారించి చెప్పింది.

అలాంటి ఎడతెగని వ్యతిరేకత ఉన్నప్పటికీ, 13వ శతాబ్దం యొక్క రెండవ అర్థ భాగంలో బైబిలు యొక్క మొదటి పూర్తి ఫ్రెంచి భాషా అనువాదం సిద్ధమైంది. వాటిని అనువదించిన వారిని గురించి అజ్ఞాతంగా ఉంచబడిన ఈ బైబిలు ఎక్కువగా పంపిణీ చేయబడలేదు. ఆ సమయంలో బైబిలు సామాన్య ప్రజలకు ఏ రూపంలోనూ అందుబాటులో ఉండేది కాదు. ప్రతులు చేతితో ఎత్తి వ్రాయబడేవి. ఖరీదైనవీ మరియు చాలా తక్కువ ప్రతులు అందుబాటులో ఉండేవి గనుక, కేవలం రాజ కుటుంబీకులు మరియు మత గురువులు మాత్రమే బైబిళ్లను కలిగి ఉండేవారు.

బైబిలు కొరకైన పోరాటం చెలరేగుతుంది

1450లో, జొహన్నాస్‌ గూటెన్‌బర్గ్‌ ద్వారా అచ్చుయంత్రం మరియు మూవబుల్‌ టైప్‌ ఆవిష్కరించబడటంతో, యూరప్‌ నందలి ముద్రణా విప్లవం ఫ్రాన్స్‌ను శక్తివంతంగా ప్రభావితం చేసింది. పారిస్‌, లీయోన్‌ మరియు రూవన్‌ అనే మూడు ఫ్రెంచి పట్టణాలు ముద్రణాపనికి ప్రముఖ కేంద్రాలయ్యాయి, అవి బైబిలు కొరకైన పోరాటంలో కోటగోడలయ్యాయి.a

పోరాటం యొక్క ఈ స్థాయి వరకూ కూడా, ఫ్రెంచి భాషా బైబిలు అనువాదాలు లాటిన్‌ వల్గేట్‌పై ఆధారపడి ఉండేవి. ఒక వేయి సంవత్సరాలుగా దానినుండి మళ్లీ మళ్లీ ప్రతులు తయారు చేయబడడం మూలంగా లాటిన్‌ బైబిలులో అనేక తప్పులు చొరబడ్డాయి, అయినప్పటికీ చర్చి మాత్రం వల్గేట్‌నే అంటిపెట్టుకుని కూర్చుంది. ఫ్రెంచి కాథోలిక్‌ అయిన జాక్‌ లఫెవ్‌రీ డేటప్‌లీ బైబిలును సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానించుకున్నాడు. మరి 1530లో ఆయన వల్గేట్‌ను ఫ్రెంచి భాషలోకి అనువదించాడు. అలా అనువదిస్తున్నప్పుడు ఆయన ఆ మధ్యనే లభ్యమైన హెబ్రీ మరియు గ్రీకు చేవ్రాత ప్రతులను చూస్తూ వల్గేట్‌లో ఉన్న తప్పులను సరి చేశాడు. ఆ పాఠ్య భాగంలోకి చర్చి చొప్పించిన కొన్ని గలిబిలిపరిచే సిద్ధాంతపర వివరాలను కూడా ఆయన తీసివేశాడు.

లఫెవ్‌రీ యొక్క అనువాదం త్వరలోనే దాడికి గురైంది. కొన్ని గ్రంథాలను ఫ్రాన్స్‌ వెలుపల ముద్రించవలసి వచ్చింది. వీటిని చర్చి నిషేధించిన పుస్తకాల పట్టికలో ఉంచారు. కొంత సమయం వరకూ, ఆయన ఫ్రాన్స్‌కు తూర్పున ఉన్న స్వతంత్ర రాజ సంబంధ నగరమైన స్ట్రాస్‌బర్గ్‌లో తలదాచుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన అనువాదం విజయం సాధించింది.

ఆదిమ భాషా పాఠ్యగ్రంథాలపై ఆధారితమైన బైబిలు యొక్క మొదటి ఫ్రెంచి అనువాదం 1535లో ముద్రించబడింది. సంస్కర్త అయిన జాన్‌ కాల్విన్‌ యొక్క పినతండ్రి కుమారుడైన ప్యేరీ-రాబర్ట్‌ ఆలీవేటన్‌ అనే ఫ్రెంచి ప్రొటెస్టెంటే ఆ అనువాదకుడు. చర్చి యొక్క వ్యతిరేకత మూలంగా దాన్ని ఫ్రాన్సులో ముద్రించడం కుదరలేదు, కాబట్టి క్రొత్త ప్రొటెస్టెంటు సమాజమైన స్విట్జర్లాండ్‌ నందలి న్యూషాటల్‌లో ఈ అనువాదం ముద్రించబడింది. ఆలీవేటన్‌ యొక్క ఫ్రెంచి బైబిలు అనువాదం, అనేక ప్రతులను పిమ్మట సంస్కరించి తిరిగి ముద్రించేందుకూ బైబిలును ఇతర భాషల్లోకి అనువదించేందుకూ కూడా ప్రామాణికంగా పని చేసింది.

భయంకరమైన పోరాటం

ఫ్రాన్స్‌లో, ఏట్యన్‌ డాల్‌ వంటి ధైర్యంగల ముద్రణకర్తలు కొంతమంది, బైబిలును ముద్రించినందుకు 1546లో కొయ్యకు కట్టి కాల్చి చంపబడ్డారు. 1546లో ట్రెంట్‌ నందలి సలహాసంఘం వల్గేట్‌ ఎన్నో తప్పులను కలిగివున్నప్పటికీ దాని “అధికారిక స్థానాన్ని” తిరిగి సమర్థించింది, మరి అప్పటినుండి ప్రాంతీయ అనువాదాలకు విరుద్ధంగా చర్చి మరింత దృఢంగా స్థానం వహించింది. 1612లో స్థానిక బైబిళ్లను తుడిచిపెట్టాలనే ప్రచారంతో స్పానిష్‌ ఇంక్విజిషన్‌ ప్రారంభమైంది.

కొన్నిసార్లు హింస తెలివైన పద్ధతులను కనుగొనడాన్ని సాధ్యం చేసింది. స్త్రీ కొప్పులో దాచుకోగల పరిమాణంలోని “ఛిగ్‌నాన్‌” బైబిళ్లు లేక “కొప్పు” బైబిళ్లు ఉత్పత్తి చేయబడ్డాయి. 1754లో, హెబ్రీ మరియు గ్రీకు లేఖనాల కొన్ని భాగాలు కేవలం 3/5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే పుస్తకంలో ముద్రించబడ్డాయి.

ఎదురుదాడులు

అయితే, కొంత కాలానికి గణనీయమైన మార్పులు వచ్చాయి. బైబిలు శతాబ్దాల తరబడి తీవ్రమైన దాడులను ఎదుర్కొని నిలిచిన తర్వాత, దానికి అనుకూలంగా తీవ్రమైన దాడులు జరిగాయి. ఫ్రెంచి విప్లవం తర్వాత మొదలైన క్రొత్త ఆలోచనలూ లభించిన ఆరాధనాస్వేచ్ఛా బైబిలు అనువదించబడేందుకు వ్యతిరేకంగా చర్చి చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ వేశాయి. అలా 1803లో ఒక ప్రొటెస్టెంటు క్రొత్త నిబంధన ఫ్రాన్స్‌లో ముద్రించబడింది, అది 125 సంవత్సరాల తర్వాత అచ్చు వేయబడిన వాటిలో మొట్టమొదటిది!

బైబిలు సొసైటీల నుండి కూడా సహాయం లభించింది. 1792లో, “తమకు అర్థమయ్యే భాషలో ఈ దైవిక సంపదను కలిగిలేని ఫ్రెంచి ప్రజలకు వీలైనన్ని ఎక్కువ ఫ్రెంచి బైబిళ్లను లభ్యం చేసేందుకు” ఇంగ్లండ్‌ నందలి లండన్‌లో ఫ్రెంచి బైబిలు సొసైటీ స్థాపించబడింది. ఇతర బైబిలు సొసైటీలు మద్దతునిచ్చాయి. బైబిలును ఫ్రెంచిలో ఉత్పత్తి చేసి వాటిని పంపిణీ చేయాలన్న వారి లక్ష్యం విజయాన్ని సాధించింది.

చరమఘాతం

కాథోలిక్‌ చర్చి తన కుతంత్రాల్లో ఎలాంటి మార్పులూ రాకుండా నిరోధించింది, అయినప్పటికీ అది విజయం సాధించలేని పోరాటాన్ని సాగిస్తోంది. 19వ శతాబ్దమంతటిలో, స్థానిక భాషా బైబిళ్లను వ్యతిరేకిస్తూ పోప్‌లు ఎడతెగకుండా ఆజ్ఞల పరంపరను జారీ చేశారు. “కాథోలిక్‌లుకాని రచయితలు ఎవరైనా అనువదించిన పరిశుద్ధ పుస్తకాల వర్షన్‌లన్నీ ప్రాముఖ్యంగా అనేక సందర్భాల్లో ఫాంటిఫ్‌ ఆఫ్‌ రోమ్‌ ద్వారా ఖండించబడిన బైబిలు సొసైటీల ద్వారా ఉత్పత్తి చేయబడినవన్నీ కూడా నిషేధించబడ్డాయి” అని 1897లో పోప్‌ లియో XIII ఉద్ఘాటించాడు.

అయితే, బైబిలు సొసైటీలు ప్రచురించిన చౌకైన ప్రొటెస్టెంటు బైబిళ్లు అందుబాటులో ఉండటం మూలంగా, కాథోలిక్‌ పండితులు బైబిలును ఫ్రెంచి భాషలోకి అనువదించేందుకు కాథోలిక్‌ చర్చి అనుమతించింది. మొదట ఏడు సంపుటుల్లోనూ (1894-1904) ఆ తర్వాత ఒక సంపుటిలోనూ (1904) ప్రచురించబడిన ఆగస్టిన్‌ క్రాంపాన్‌ యొక్క అనువాదం, ఆదిమ పాఠ్యగ్రంథాల ఆధారంగా అనువదించబడిన మొదటి ఫ్రెంచి కాథోలిక్‌ అనువాదం. అనేకానేక పాండిత్య అధఃస్సూచిలు మరియు దేవుని నామం యొక్క ఫ్రెంచి రూపమైన జెహోవాను క్రాంపాన్‌ ఉపయోగించాడనే వాస్తవం ఎంతో గణనీయమైనవి.

తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ, 1943లో తమ డీవీనో అఫ్లాంటె స్పీరీట్యూ నందు స్థానిక భాషల్లోకి బైబిళ్లను అనువదించడాన్ని గురించి వాటికన్‌ తుదకు సూత్రాలను ఏర్పరచింది. అప్పటినుండి అనేక కాథోలిక్‌ అనువాదాలు ప్రచురించబడ్డాయి, మొదట ఫ్రెంచిలో ప్రచురించబడి తర్వాత ఆంగ్లంతో సహా అనేక ఇతర భాషల్లోకి అనువదించబడిన ప్రఖ్యాత జెరూసలేమ్‌ బైబిల్‌ వాటిలో ఒకటి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది ఫ్రెంచి మాట్లాడే ప్రజలకు సహాయం చేసిన ఒక బైబిలు పరిశుద్ధ లేఖనాల నూతన లోక అనువాదం యొక్క ఫ్రెంచి ప్రతి. మొదట 1974లో పూర్తిగా ప్రచురించబడిన ఈ బైబిలు 1995లో సంస్కరించబడి మళ్లీ ప్రచురించబడింది. నూతనలోక అనువాదం ఇప్పటి వరకు అనువదించబడిన అనేక భాషల్లో, బైబిలు యొక్క గ్రంథకర్త అయిన యెహోవా నామాన్ని హెబ్రీ లేఖనాల్లోనూ మరియు గ్రీకు లేఖనాల్లో తగిన స్థలంలో ప్రతి చోటా పొందుపర్చుతూ ఆ బైబిలు ఆయనకు ఘనతనిస్తుంది. నేటికి, ఫ్రెంచి అనువాదం యొక్క 50 లక్షల కంటే ఎక్కువ ప్రతులు ముద్రించబడ్డాయి. ఫ్రెంచి భాషలో మనుగడను సాగించేందుకు బైబిలు చేసిన పోరాటంలో అది విజయాన్ని సాధించింది అనడంలో సందేహమే లేదు.

[అధస్సూచి]

a ఫ్రెంచి భాషలో ముద్రణ ఎంత విజయవంతంగా సాగిందంటే, 1552లో విదేశీ బైబిళ్లను అన్నింటినీ వెలికి తీయమని స్పానిష్‌ ఇంక్విజిషన్‌ ఆజ్ఞాపించినప్పుడు, అక్కడ జప్తు చేయబడిన బైబిళ్లలో దాదాపు 90 శాతం బైబిళ్లు ఫ్రాన్స్‌లో ముద్రించబడినవేనని ట్రిబ్యూనల్‌ ఆఫ్‌ సెవిల్లే నివేదించింది.

[13వ పేజీలోని చిత్రం]

లఫెవ్‌రీ డేటప్‌లీ యొక్క 1530 బైబిలు

[13వ పేజీలోని చిత్రం]

ఆలీవేటన్‌ యొక్క 1535 బైబిలు

[14వ పేజీలోని చిత్రం]

“13వ శతాబ్దపు బైబిలు” యొక్క ఒక అరుదైన ఉదాహరణ

[14వ పేజీలోని చిత్రం]

బైబిళ్లు: Bibliothèque Nationale de France

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి