కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 11/8 పేజీ 30
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దౌర్జన్యానికి పాల్పడే ప్రయాణీకులు
  • మూర్ఛరోగులకు శునకాల సహాయం
  • వైద్యపరంగా “యౌవనపు ఊట” లేదు
  • వంట చేయడం—అంతరించిపోతున్న కళా?
  • పెద్ద సస్తన జంతువు యొక్క మొదటి క్లోన్‌
  • పిల్లలకు ఉబ్బసం వచ్చేందుకు జిల్లపురుగులే కారణం
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2000
  • మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?
    తేజరిల్లు!—2002
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 11/8 పేజీ 30

ప్రపంచ పరిశీలన

దౌర్జన్యానికి పాల్పడే ప్రయాణీకులు

విసుగు చెందిన ప్రయాణీకులు అఘాయిత్యాలకు పాల్పడటం విపరీతంగా పెరిగిపోతోందని వాణిజ్య విమానయాన సంస్థలు నివేదిస్తున్నాయి. విమానాలు ఆలస్యం కావడం, సామాను కనిపించకపోవడం వంటి విషయాల మూలంగా కలత చెందిన ప్రయాణీకులు “ఏర్‌ హోస్టెస్‌లపై ఉమ్మివేయడం, ఆహారపు ట్రేలను విసిరేయడం కొన్నిసార్లు ఉద్యోగులను కొట్టడం వంటివి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, వారు పైలెట్లపై కూడా దాడి చేశారని” ది న్యూ యార్క్‌ టైమ్స్‌ పత్రిక నివేదిస్తుంది. విమానాలు గాలిలో ఎగురుతున్నప్పుడు అలా దాడి చేయడాన్ని గురించి ప్రత్యేకంగా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అలా దాడులు చేయడం విమానం కూలిపోయేందుకు దారి తీయగలవు. ప్రతి నెలా దాదాపు 100 సార్లన్నా అలాంటి మౌఖిక లేక భౌతిక దాడులు జరుగుతాయని ఒక విమానాశ్రయం నివేదిస్తుంది. “లింగ, వర్ణ, వయో వ్యత్యాసం లేకుండా మరియు ఆర్థిక, వ్యాపార లేక మొదటి తరగతి అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారూ దాడి చేస్తున్నారనీ మరి దాడి చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరు త్రాగి ఉన్నారనీ” టైమ్స్‌ నివేదిస్తుంది.

మూర్ఛరోగులకు శునకాల సహాయం

ఇంగ్లండ్‌లో, మూర్ఛ వచ్చేందుకు కాస్త ముందు మూర్ఛరోగులను హెచ్చరించేలా కుక్కలకు తర్ఫీదు ఇవ్వబడుతోంది. మూర్ఛ వచ్చే ముందు రోగి సిద్ధపడేందుకు ఇది వారికి తగినంత సమయాన్ని అందిస్తుందని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ పత్రిక నివేదిస్తుంది. “మూర్ఛ వచ్చినప్పుడు మొరిగినందుకు కుక్కకు బహుమతి ఇవ్వడం మూలంగా, మూర్ఛ వచ్చేందుకు కాస్త ముందు కనిపించే సూచనలను మరియు చిహ్నాలను ఆ కుక్క పూర్తిగా పసిగట్టింది. అలాంటి ప్రతిస్పందన తనకు బహుమతిని తెచ్చిస్తుందనే విషయాన్ని తెలుసుకోవడం, వాస్తవానికి కుక్క ఆ సూచనలను నిశితంగా పరిశీలించేలా చేస్తుందని” వికలాంగులకు సహాయపడేందుకు కుక్కలకు తర్ఫీదునివ్వడంలో ప్రత్యేకంగా పని చేసే ఒక ధర్మాధికార సంస్థ మేనేజరు వివరిస్తుంది.

వైద్యపరంగా “యౌవనపు ఊట” లేదు

గెరియేట్రీషియన్‌ అయిన ఆండ్రియా ప్రేట్స్‌ ప్రకారం, యౌవనాన్ని కాపాడుకునేందుకు కొన్ని హోర్మోనుల వంటి వేలంవెర్రి మందులు ఉపయోగించడం “ఒకటో రెండో ప్రయోజనాలను తీసుకురావచ్చు అయితే అది మీ ఆరోగ్యానికి ఎంతో నష్టాన్ని కూడా కలిగించవచ్చు.” వయస్సుపెరగడాన్ని నిరోధించేందుకు చేస్తున్న పోరాటంలో, “క్రొత్త ప్రవర్తనా అలవాట్లు క్రొత్త మందులకంటే మరింత ప్రభావవంతంగా ఉంటాయి” అని డా. ప్రేట్స్‌ సలహా ఇస్తోంది. దీర్ఘాయువు కలిగించగల మంచి అలవాట్లలో తగినంతగా నిద్ర పోవడం, మృదు స్వభావాన్ని కలిగి ఉండటం, ఒళ్లు విరుచుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, మెదడును పదును పెట్టడం మరియు క్రొవ్వు పదార్థాలను నివారించడం ఇమిడి ఉన్నాయని సూపర్‌ఇంటర్‌ఎసెంటే అనే బ్రెజిల్‌ పత్రిక పేర్కొంటుంది. పళ్లలోనూ కూరగాయల్లోనూ లభించే విటమిన్లనూ మినరల్‌లనూ తీసుకోవడం కూడా ప్రాముఖ్యమే. వయస్సు పెరగడమనేది శరీరంలోని అన్ని కణాలనూ ప్రభావితం చేస్తుంది, మరి ఒకదానికొకటి భిన్నంగా ఉన్న శరీరావయవాలన్నింటికీ ఒకే పదార్థ కారకం ఏకకాలంలో ప్రయోజనాన్ని చేకూర్చలేదు.

వంట చేయడం—అంతరించిపోతున్న కళా?

ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలోని ఆహారపుటలవాట్లను గురించి 12 నెలలపాటూ జరుపబడిన ఒక అధ్యయనం ప్రకారం, వంట చేయడమనేది అంతరించిపోతున్న కళ కాగలదు. 25 సంవత్సరాల వయస్సుకంటే తక్కువ వయస్సుగల ప్రజలకు తమ వంట తాము వండుకోవడం రాదని ది కురియర్‌ మేల్‌ నివేదిస్తుంది. ఆ అధ్యయనకర్తా ప్రజారోగ్య ఉపన్యాసకురాలు అయిన మార్గరెట్‌ వింగెట్టీ, గత కాలాల్లో యౌవనస్థులు ప్రాముఖ్యంగా అమ్మాయిలు తమ ఇళ్లలో తమ తల్లుల నుండి లేక పాఠశాలనుండి వంట చేయడాన్ని నేర్చుకునే వారని చెప్పింది. అయితే ఇటీవలి రోజుల్లో, యౌవనస్థులకు అంటే చివరకు అమ్మాయిలకు కూడా వంట చేయడం రాదు, మరి దాన్ని నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నట్లు వారు కనిపించరు. అనేకమంది ముందే ప్యాక్‌ చేయబడిన ఆహారాన్ని లేక సులభంగా సిద్ధం చేసుకోగల ఆహారాన్ని ఇష్టపడతారు. అలాంటి ఆహారపుటలవాట్లు అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి మరియు హృద్రోగం వంటివి పెరిగేందుకు దారి తీయవచ్చు.

పెద్ద సస్తన జంతువు యొక్క మొదటి క్లోన్‌

స్కాట్‌లాండ్‌లోని పరిశోధకులు, ఒక పెద్ద గొర్రె యొక్క డిఎన్‌ఏ నుండి ఒక గొర్రె పిల్ల క్లోన్‌ను ఉత్పత్తి చేశామని ఫిబ్రవరి నెల చివరలో ప్రకటించినప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనేక సంవత్సరాలుగా గర్భస్థ పిండం నుండి తీసిన కణాలతో క్లోన్‌ను తయారు చేయడం జరిగినప్పటికీ, పెద్ద సస్తన జంతువు యొక్క ఒక జన్యుకణ పోలికను ఉత్పత్తి చేయడాన్ని ఇప్పటి వరకూ వైజ్ఞానికులు ఒక అసంభవమైన విషయంగా పరిగణించారు. సిద్ధాంతపరంగా, మానవులకు కూడా అదే ప్రక్రియను అన్వయించవచ్చు అంటే ఒక పెద్ద వ్యక్తి నుండి తీయబడిన డిఎన్‌ఏ నుండి ఒక జన్యుకణ పోలికను ఒకవేళ వయస్సులో కాస్త చిన్నదాన్ని ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెప్పారు. అయితే, ఆ ప్రణాళికకు నాయకత్వం నెరపిన ఒక వైజ్ఞానికుడైన లాన్‌ విల్‌ముట్‌ ఆ ఆలోచన నైతికంగా అనంగీకారమైన దానిగా పరిగణిస్తున్నాడని ఇంటర్‌నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ చెబుతుంది. మానవ క్లోన్‌ అనేది పరిశోధనాత్మకత యొక్క మరీ విపరీతమైన పద్ధతని అంటూ, ఆయన అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమర్థించిందని ది జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నివేదిస్తుంది.

పిల్లలకు ఉబ్బసం వచ్చేందుకు జిల్లపురుగులే కారణం

యు.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కొరకైన ఒక ఐదు సంవత్సరాల అధ్యయనం, నగరంలోని మధ్యభాగంలో నివసించే పిల్లల్లో ఎక్కువ మందికి ఉబ్బసం రావడం యొక్క సంఘటనల విషయమై జిల్లపురుగులను నిందిస్తుందని న్యూయార్క్‌కు చెందిన డేలీ న్యూస్‌ నివేదిస్తుంది. ఏడు నగరాల్లో అధ్యయనం చేయబడిన 1,528 మంది ఉబ్బసంగల పిల్లల్లో, 37 శాతం మందికి జిల్ల పురుగులంటే ఎలర్జీ. అలా జిల్ల పురుగులంటే ఎలర్జీ ఉన్న పిల్లల పడక గదుల్లో జిల్లపురుగులను ఎక్కువ శాతం ఉంచినప్పుడు వారికి, ఉబ్బసంగల ఇతర పిల్లలకంటే మూడు రెట్లు ఎక్కువ ఆసుపత్రి సహాయం అవసరమైంది. ఆ అధ్యయనానికి నాయకత్వం వహించిన డా. డేవిడ్‌ రోజెన్‌స్టిక్‌ జిల్లపురుగుల వలలను, పురుగుల మందును, బోరిక్‌ ఆసిడ్‌ను ఉపయోగించాలని మరియు చాలా శుభ్రంగా ఉండటం మంచిదని చెబుతున్నాడు. ఇంటిని వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయడం దుమ్ములో ఉండే వాటి పేడను కూడా తీసేస్తుంది. “మీరు ఆహారం మరియు నీళ్లను ఎక్కడా బయట ఉంచకూడదు మరియు ప్రాముఖ్యంగా నీళ్లు కారడాన్ని ఆపాలి” అని డా. రోజెన్‌స్టిక్‌ చెప్పాడు. “ఎందుకంటే జిల్లపురుగులు సజీవంగా ఉండేందుకు వాటికి నీళ్లు కావాలి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి