కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 10/8 పేజీలు 3-4
  • ఎందుకింత ద్వేషం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకింత ద్వేషం?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనుకూల తరహా, ప్రతికూల తరహా ద్వేషం
  • ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
  • ద్వేషం ఎన్నటికైనా అంతమౌతుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2022
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 10/8 పేజీలు 3-4

ఎందుకింత ద్వేషం?

జర్మనీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

“ఎందుకు” అనే పదం, చిన్న పదమే అయినా అది జవాబును కోరే పదం. ఉదాహరణకు, 1996 మార్చిలో స్కాట్‌లాండ్‌ నందలి డన్‌లేన్‌లో ఓ స్కూలు వెలుపల ఉన్న పూలగుత్తులకూ, ఎలుగుబంటి బొమ్మలకూ కట్టిన ఓ కాగితంపై ఆ పదం కనబడినప్పుడు ప్రజలు దానికి జవాబును తెల్సుకోవాలనుకున్నారు. దానికి కేవలం కొన్ని రోజులు ముందు, హడావిడిగా ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చి 16 మంది పిల్లల్నీ వారి ఉపాధ్యాయురాల్నీ తుపాకీతో కాల్చి చంపాడు, అనేకమందిని గాయపర్చాడు. తర్వాత, తనను తాను కాల్చుకున్నాడు. అతడు తనను తానూ, ఇతరుల్నీ, మొత్తం సమాజాన్నీ పూర్తిగా ద్వేషించాడనే విషయం స్పష్టం. దుఃఖ చిత్తులైన తలిదండ్రులూ, స్నేహితులూ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలూ అదే ప్రశ్నను ప్రశ్నిస్తారు, ‘ఎందుకు? అమాయకులైన పిల్లలు ఎందుకిలా చనిపోవాలి?’

లోకం పూర్తిగా నిర్హేతుకమైంది, వివరించలేని ద్వేషం మీ దృష్టిపథంలో నుండి బహుశా తప్పించుకొని ఉండకపోవొచ్చు. నిజానికి, ఏదొక కారణాన్నిబట్టి మీరూ ద్వేషానికి గురైన ఓ వ్యక్తియై ఉండవచ్చు. ఒకటి కన్నా ఎక్కువసార్లు బహుశా మీరు కూడా ఇలా ప్రశ్నించుకొని ఉండవచ్చు: ‘ఎందుకు?’

అనుకూల తరహా, ప్రతికూల తరహా ద్వేషం

“ద్వేషం,” “ద్వేషించడం” అనేవి “తీవ్రమైన శత్రుత్వం, విముఖత” అని నిర్వచించబడ్డాయి. అవును, హానిని కల్గించే లేక వ్యక్తిగత సంబంధాలకు ముప్పును తేగల్గే వాటి ఎడల ‘తీవ్రమైన శత్రుత్వాన్నీ, విముఖతనూ’ కల్గివుండడం ప్రయోజనకరం. ఇలాంటి ద్వేషాన్నే ప్రతి ఒక్కరూ కల్గివుంటే, ప్రపంచం జీవించేందుకు నిజంగా అనువుగావుండే ఓ శ్రేష్ఠమైన స్థలమవుతుంది. అయితే, అపరిపూర్ణులైన మానవులు తప్పుడు కారణాల్నిబట్టి ద్వేషించకూడని వాటిని ద్వేషించేందుకు మొగ్గుచూపడం విచారకరమైన విషయం.

ఒక నిర్వచనం ప్రకారంగా వినాశనకరమైన ద్వేషం, పూర్వనిర్ధారిత అభిప్రాయంపైనా అజ్ఞానంపైనా లేక తప్పుడు సమాచారంపైనా ఆధారపడి, సాధారణంగా “భయం, కోపం, లేక గాయపడిన భావన” మూలంగా పుడుతుంది. సరైన ఆధారంలేకుండానే, ఈ ద్వేషం చెడు ఫలితాల్ని తీసుకొచ్చి, ‘ఎందుకు’ అనే ప్రశ్నను పదే పదే లేవదీస్తుంది.

కొన్నిసార్లు బహుశా మనల్ని చికాకు పర్చే లక్షణాల్నీ లేక అలవాట్లనూ కల్గివున్న ప్రజలను గురించీ, కలిసి పనిచేయడం కష్టమని మనం కనుగొన్న ప్రజలను గురించీ మనమంతా ఎరుగుదుం. కానీ చికాకును కల్గించడమనేది ఒక విషయమైతే, ప్రజలకు శారీరకంగా హాని కల్గించాలనే కోరికను కల్గివుండడమనేది పూర్తిగా మరొక విషయం. కాబట్టి, ప్రజా వర్గాలన్నింటి ఎడలా, తరచుగా తానెరుగని ప్రజల ఎడలా ఓ వ్యక్తి ద్వేష భావాల్ని ఎలా పెంపొందించుకుంటాడో గ్రహించడం మనకు కష్టంగానే ఉండవచ్చు. బహుశా ఆ ప్రజలు, అతని రాజకీయ దృక్పథాల్ని అంగీకరించకపోయినవారో, వేరొక మతానికి చెందినవారో లేక మరొక తెగకు చెందినవారో అయ్యుండొచ్చు. అయితే, వారిని ద్వేషించడానికి కారణమదేనా?

అయినా, అలాంటి ద్వేష భావం ఇంకా ఉంది! ఆఫ్రికానందలి రువాండాలో 1994లో హుటూ టుట్సీ తెగలకు చెందినవారు ఒకరినొకరు వధించుకోడానికి నడిపించిన ద్వేషం, “అంత చిన్న దేశంలో ఇంతగా ద్వేషం ఎలా పేరుకుపోయిందా?” అని ఒక విలేఖరి ప్రశ్నించడానికి కారణమైంది. మధ్య ప్రాచ్యంలో, అరబ్‌ ఇశ్రాయేల్‌ తిరుగుబాటుదారులు చేసిన ఉగ్రవాద దాడులకు ద్వేషమే కారణం. యూరప్‌లో, మునుపటి యుగోస్లేవియా విభజనకు ద్వేషం దోహదపడింది. ఓ వార్తాపత్రిక నివేదిక ప్రకారంగా, ఒక్క అమెరికాలోనే “ద్వేషాన్ని రెచ్చగొట్టే దాదాపు 250 గుంపులు” జాతివివక్షతో కూడిన అభిప్రాయాల్ని వ్యాపింపజేస్తున్నాయి. ఎందుకింత ద్వేషం? ఎందుకు?

ద్వేషం ఉత్పన్నం చేసిన పోరాటాలు పరిష్కరించబడినప్పటికీ, అది మాత్రం ఇంకా నిలిచి ఉండేంత లోతుగా పాతుకుపోయింది. యుద్ధపీడిత, ఉగ్రవాద పీడిత దేశాల్లో శాంతిని కాపాడడంలోనూ, కాల్పుల విరమణలోనూ ఉన్న క్లిష్టతకు మరింకేది కారణమై ఉండగలదు? బోస్నియా, హెర్జ్‌గొవిన క్రోట్‌ ఫెడరేషన్‌ క్రింద సరజివొ నగరాన్ని తిరిగి చేర్చాలనే శాంతి ఒప్పందంపై 1995 చివరలో పారిస్‌నందు సంతకం చేసిన తర్వాత జరిగిన దాన్ని మరింకెలా మనం వివరించగలం? ప్రతీకారం తీర్చుకునే వ్యక్తులకు భయపడి అక్కడ నివసిస్తున్న సెర్బియా దేశీయుల్లో అనేకమంది ఆ నగరాన్నీ, నగర పరిసర ప్రాంతాల్నీ విడిచిపెట్టి పారిపోనారంభించారు. ప్రజలు దోచుకోబడ్డారనీ, వాళ్లు విడిచిపెట్టిన భవనాలు కాల్చబడ్డాయనీ నివేదిస్తూ, టైమ్స్‌ పత్రిక ఇలా ముగించింది: “పునరేకీకరించబడింది సరజివొయే, కానీ దాని ప్రజలు కాదు.”

పనికిరాని దొంగనోట్లలా చలామణి అయ్యే మోసపూరితమైన సమాధానమే ఒకరినొకరు ద్వేషించుకునే ప్రజల మధ్య ఉన్న సమాధానం. దాన్ని పునరుద్ధరించడంలో నిజమైన ప్రయోజనం లేకపోవడంతో, కొద్దిపాటి ఒత్తిడికే అది కుప్పకూలిపోగలదు. కానీ ఈ లోకంలో ఎందుకింత ద్వేషమూ, ఎందుకింత కొద్దిపాటి ప్రేమా ఉన్నాయి. ఎందుకు?

[4వ పేజీలోని చిత్రం]

వినాశనకరమైన ద్వేషం, పూర్వనిర్ధారిత అభిప్రాయంపైనా అజ్ఞానంపైనా లేక తప్పుడు సమాచారంపైనా ఆధారపడివుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి