కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 9/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గ్రంథ పఠనం ఇంకా ప్రజాదరణ పొందుతూనే ఉంది
  • “తెలియని శత్రువులను” వేటాడటం
  • “పవిత్రమైన” కోతులు—ఓ న్యూసెన్సు
  • తిరిగి నీళ్లవైపుకు
  • ఇప్పుడు—హెపటైటిస్‌ జి
  • “ది మిలేనియమ్‌ బగ్‌”
  • ఏనుగు-పేడ కాగితం
  • ఆహారం ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్‌లు
  • ఖర్చులేని కలరా నివారణోపాయం
  • మనిషి తాబేలు కలిసేచోటు
    తేజరిల్లు!—1993
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • రక్తమార్పిడి–ఎంత వరకు సురక్షితము?
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
తేజరిల్లు!—1997
g97 9/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

గ్రంథ పఠనం ఇంకా ప్రజాదరణ పొందుతూనే ఉంది

కంప్యూటర్‌ సాంకేతికత బ్రిటీష్‌ వారి పఠన అలవాట్లను ఇంకా మార్చలేదని పాలసీ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ యొక్క సర్వే ప్రకారం తేలింది. ది టైమ్స్‌లో నివేదించబడిన విధంగా, “సర్వే చేయబడిన వారిలో సగంమంది అంటే 1989 నుండి కాస్త మారిన శాతం, ఆనందం కొరకు ప్రస్తుతం ఒక పుస్తకాన్ని చదువుతున్నామని చెప్పారు.” పురుషులకంటే స్త్రీలు ఎక్కువ చదువుతారు, మరి 55 దాటిన వారు అత్యంత పెద్ద పాఠక సమూహం. వంట పుస్తకాలు అత్యంత ప్రజాదరణ పొందినవి, వాటి తర్వాత నేర లేక థ్రిల్లర్‌ కథలు, ప్రేమ కథాంశం గల నవలలు మరియు 20వ శతాబ్దపు కల్పితాలు. మరి 30 శాతం ఇళ్లలో కంప్యూటర్‌లు ఉన్నప్పటికీ, పుస్తకాల పోటీదారు అయిన సీడీ-రామ్‌లను కేవలం 7 శాతం మంది మాత్రమే కలిగి ఉన్నారు. మరి ఒక లాప్‌టాప్‌ కంప్యూటర్‌ వలె కాకుండా, ఆసక్తికరమైన పుస్తకం సెలవు దినాన బీచ్‌కు పోతే అక్కడి ఇసుక ద్వారా లేక రద్దీగల సబ్‌వేలో ఉండే తోసుకుని తొక్కిసలాడే జనం చేత దాని పని పాడు కాదు, మరి అందంగా ఉత్పత్తి చేయబడిన ఒక పుస్తకం “దానిలోని అంశాలెంత పోషణకరంగా ఉంటాయో చూసేందుకు అంత చక్కగా కూడా ఉండవచ్చు.”

“తెలియని శత్రువులను” వేటాడటం

1997లో, ఇటలీలోని రోమ్‌నందలి ప్రజలకు మామూలుకన్నా రెండు నెలలు ముందుగానే అలర్జీలూ హే జ్వరమూ మొదలయ్యాయని కోరీరే డెల్లా సేరా చెబుతుంది. ఆ తొలి పుప్పొడి దాడి అనేది “శీతాకాలం యొక్క వ్యవధిని గమనార్హంగా తగ్గించిన ఈ గ్రహం యొక్క సగటు ఉష్ణోగ్రతలో సాధారణ పెరుగుదల” మూలంగా జరిగి ఉంటుందని ఒక అలర్జిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. “మంచి వాతావరణం ఉన్న దినాలు తెచ్చిన తెలియరాని పుప్పొడిని ఆ రంగంలోని నిపుణులు అడ్డగించలేక పోతున్నారు” అని ఆ వార్తాపత్రిక పేర్కొంటుంది. కాబట్టి, “తెలియరాని కారణం కొరకైన వేట” ఇప్పటికే ప్రారంభమైంది, అయితే ఇంతలో “రోగులు ఏ అలర్జీలతో బాధపడుతున్నారో, వాటి కారణాన్ని తెలుసుకోలేము.”

“పవిత్రమైన” కోతులు—ఓ న్యూసెన్సు

రేసస్‌ కోతులు భారతదేశంలోని వ్రిందావన్‌లో ఎవరైనా జ్ఞాపకం చేసుకోగలిగేంత క్రితం నుండే ఉండేవని ఇక్బాల్‌ మలిక్‌ అనే ప్రిమిటాలజిస్ట్‌ చెబుతుంది. కోతులు అనేకుల చేత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి, మరి అవి ఆ హిందూ పరిశుద్ధ నగరంలో ఇప్పటి వరకూ చెరపట్టబడతామనే భయం లేకుండా హాయిగా తిరుగగలుగుతున్నాయి. న్యూ సైంటిస్ట్‌ పత్రిక ప్రకారం, వాటికి ఆహారాన్నిచ్చే యాత్రికుల సంఖ్య పెరగడం మూలంగా ఇటీవలి సంవత్సరాల్లో వాటి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కోతులకు తిండి పెట్టడం తమను ధనికులను చేస్తుందని అనేకులు భావిస్తారు. అయితే, ఈ గడిచిన సంవత్సరాల్లో, పచ్చని చెట్లు చాలా తక్కువైనందున ఆ కోతులు మనుష్యులు పెట్టే తిండిపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. “అవి బ్యాగులను దొంగిలించడమూ ఆహారం కోసం ఇళ్లలోకి జొరబడడమూ ప్రారంభించాయి.” కోతుల సమూహంలో దాదాపు 60 శాతాన్ని పట్టి గ్రామీణ ప్రాంతాలకు తరలించేందుకు ఆ ప్రాంత నివాసులు అంగీకరించారు. మలిక్‌ ఇలా చెబుతుంది: “దేవుళ్లు మహామ్మారులయ్యాయి.”

తిరిగి నీళ్లవైపుకు

“ఓజోన్‌ పొరకు నష్టం కలిగించని ఒక అగ్నిమాపక రసాయనం కొరకైన సుదీర్ఘ అన్వేషణ తుదకు . . . నీళ్లవైపుకే నడిపింది” అని న్యూ సైంటిస్ట్‌ పేర్కొన్నది. “పరిశోధనాత్మక అగ్నిని వందసార్లు ఆర్పిన తర్వాత, ట్రాన్‌హమ్‌లోని నార్వేజియన్‌ అగ్ని పరిశోధనా లాబొరేటరీ నీళ్లను సన్నగా జల్లడం, అగ్ని మాపకాల్లో ఇంకా విరివిగా వాడబడుతున్న, ఓజోన్‌ను నాశనం చేసే హాలోన్‌లకన్నా ఇంకా ఉపయుక్తమైనదే” అనే ముగింపుకు వచ్చింది. హాలోన్‌లు—కార్బన్‌, బ్రోమైన్‌ మరియు ఫ్లోరీన్‌ల కాంపౌండ్లు—అగ్నిని ఆర్పేస్తాయి. నీటి బిందువులు కూడా అదే చేస్తాయి, అవి ప్రాణవాయువుకు స్థలం లేకుండా చేసేందుకు ఆవిరిగా మారి తమ పరిమాణానికి 1,700 రెట్లు ఎక్కువ విస్తరిస్తాయి. నీటిని ఆవిరిగా మార్చేందుకు అవసరమైనంత ఉష్టోగ్రతకు మంటలు చేరుకోలేనంతటి చిన్న మంటల విషయంలోనే అవి హాలోన్‌లకంటే తక్కువ ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి. అయితే హాలోన్‌లకు ఇతర కృత్రిమ ప్రత్యామ్నాయాలను ఇంకా వెదుకుతూనే ఉన్నారు, ఎందుకంటే నీరు మరొక సమస్యను కలిగిస్తోంది: అదేమిటంటే దాన్ని అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బు చేసుకోవడం సాధ్యం కాదు!

ఇప్పుడు—హెపటైటిస్‌ జి

రక్తాన్ని ఎక్కించుకున్న ఒక నెలకే, అమెరికాలో 1995లో గుర్తించబడిన ఒక క్రొత్త రకం అయిన హెపటైటిస్‌ జి చేత రోగులు కలుషితం అయ్యారని జపాన్‌లోని వైద్యులు నిర్ధారించారు. టోక్యో టొరానోమన్‌ ఆసుపత్రిలో 1992 నుండి 1994 మధ్య కాలంలో శస్త్ర చికిత్స చేయించుకున్న లివర్‌ క్యాన్సర్‌ రోగుల రక్తాన్ని తిరిగి పరీక్షించడం ద్వారా, 55 మంది రోగుల్లో ఇద్దరు శస్త్ర చికిత్సకు ముందే ఇన్‌ఫెక్షన్‌ను కలిగి ఉన్నారనీ మరియు ఏడుగురు శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారనీ వైద్యులు తెలుసుకున్నారు. ఆ ఏడుగురు రోగులకు ఇవ్వబడిన కలుషిత రక్తం సగటున 71 మంది దాతల నుండి లభించింది, రక్తంలోని 1.4 శాతం ఆ క్రొత్త వైరస్‌ చేత కలుషితమై ఉందనే విషయాన్ని అది సూచిస్తుందని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్‌ జి గురించి లేక ఆ ఇన్‌ఫెక్షన్‌ను కలిగి ఉన్న ఎంతశాతం మంది ఇంకా హెపటైటిస్‌ను లేక లివర్‌ క్యాన్సర్‌ను కలిగి ఉంటారనే విషయం గురించి చాలా తక్కువ తెలుసు అని అసాహీ ఈవినింగ్‌ న్యూస్‌ చెబుతుంది.

“ది మిలేనియమ్‌ బగ్‌”

“మిలేనియమ్‌ బగ్‌, 2000 సంవత్సరం సమస్య లేక క్లుప్తంగా ‘Y2K’” అనేది “ఆధునిక కంప్యూటర్‌ వ్యవస్థకు తెలిసిన వాటన్నిటిలోకీ అత్యంత హానికరమైన శక్తి” అని యూ.ఎస్‌.న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. కంప్యూటర్లు ఖరీదైనవిగా మరియు వాటి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నప్పటి 1960లలో అది ప్రారంభమైంది. స్థలం మిగుల్చుకునేందుకు, ప్రోగ్రామర్‌లు ఒక సంవత్సరం యొక్క కేవలం చివరి రెండు అంకెలనే ఉపయోగిస్తూ తేదీలను వ్రాశారు. కంప్యూటర్‌కు 1997 సంవత్సరం కేవలం “97” గా మాత్రమే తెలుసు. సమస్యేమిటి? “జన. 1, 2000 నాటికి ప్రపంచంలోని దాదాపు 90 శాతం కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ మరియు సాఫ్ట్‌వేర్‌లు ఆ దినాన్ని 1900 యొక్క మొదటి దినంగా భావిస్తాయి.” తప్పులు ఇప్పటికే జరిగిపోయాయి. “ఒక రాష్ట్ర చెరసాలలో, అనేకమంది ఖైదీల శిక్షను కంప్యూటర్‌లు తప్పుగా లెక్క వేసేలా చేసిందీ బగ్‌, అందుకు వారు అప్పుడు విడుదల చేయబడ్డారు” అని న్యూస్‌వీక్‌ చెబుతుంది. “కొన్ని క్రెడిట్‌ కార్డుల ‘00’ ఎక్స్‌పైరీ తేదీలు కంప్యూటర్‌లను గలిబిలి చేసినప్పుడు, దుకాణాల్లోనూ హోటళ్లలోనూ వాటిని నిరాకరించారు. అనేక రాష్ట్రాల్లో, మిలేనియమ్‌ను దాటిన తేదీలుగల రిన్యూవల్‌ దరఖాస్తులతో కంప్యూటర్‌లు వ్యవహరించలేక పోయినందున, తమ అంతర్రాష్ట్ర లైసెన్సులు రద్దు చేయబడినట్లు ట్రక్కు డ్రైవర్లు కనుగొన్నారు.” ప్రపంచవ్యాప్తంగా కార్పొరేషన్‌లు తేదీ కోడ్‌లను మార్చేందుకు 60,000 కోట్ల డాలర్లను వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనావేయబడింది, మరి దాన్ని ఈ మిగిలిన రెండు సంవత్సరాల్లో తాము చేయగలమని వారు నిరీక్షిస్తున్నారు.

ఏనుగు-పేడ కాగితం

మైక్‌ బుగారా తన పెరట్లో ఏనుగు పేడను కుండల్లో మరిగించడాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు చాలా కలవర పడటంలో అర్థముంది. ఆయన మంత్రవిద్యను అభ్యసిస్తున్నాడని కొందరు అనుకున్నారు, అయితే వాస్తవానికి ఆయన కాగితం తయారు చేస్తున్నాడు. బుగారా మొదట అరటి, మొక్కజొన్న మరియు యూకలిప్టస్‌ ఆకులతో కాగితం తయారు చేశాడు. అయితే కెన్యాకు చెందిన ఏనుగుల జనాభా నుండి, నార పీచు ఎక్కువగా ఉండే పేడ అధిక మోతాదుల్లో లభించడం, ఈ ఉత్సుకతగల సంరక్షకుడు దాన్ని ఉపయోగించి కాగితాన్ని తయారు చేయడాన్ని గురించి ఆలోచించేలా చేసింది. “ఆ జాతిని సజీవంగా ఉంచడం యొక్క విలువను గురించి ప్రజలకు తెలియజేసేందుకు” ఇది ఒక చక్కని మార్గమై ఉంటుందని ఆయన తీర్మానించుకున్నాడు అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తుంది. ఈ సంవత్సరం జరుగనున్న కెన్యా వన్యప్రాణి సేవ యొక్క 50వ వార్షికోత్సవం కొరకు ఆహ్వాన పత్రాలకు ఇప్పుడు ఆయన తయారు చేసిన ఏనుగు-పేడ కాగితం ఉపయోగించబడుతుంది.

ఆహారం ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్‌లు

“సంవత్సరమంతా లభించే విభిన్న తాజా ఉత్పత్తుల” కొరకు వినియోగదారుల అత్యధిక డిమాండు మరియు “రాత్రికి రాత్రే తన ఉత్పాదనలను ప్రపంచమంతటికీ రవాణా చేయగల భౌగోళిక విపణి” అమెరికాలో ఆహారం మూలంగా వచ్చే క్రొత్త జబ్బులకు కారణమౌతాయని జామా (ది జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌) నివేదిస్తోంది. గత పది సంవత్సరాలుగా జరుపబడిన అధ్యయనాల ఆధారంగా, ఆహారం మూలంగా వచ్చే మైక్రోబ్‌లు “అమెరికాలో ఏటా 65 లక్షల నుండి 8.1 కోటి మంది ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయనీ 9000 మరణాలకు దారి తీస్తున్నాయనీ” వైజ్ఞానికులు అంచనావేస్తున్నారు. ప్రాకృతిక విధానంలో పెంచబడిన ఆహారాన్ని (జంతువుల ఎరువుతో పెంచబడిన ఆహారాలు) ఎక్కువగా తినడం కూడా ఈ సమస్యకు కారణం కాగలదని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. జామా నివేదిక ప్రకారం, “ఈ కోలీ అనేది గేదె పేడలో 70 దినాల వరకూ బ్రతికి ఉండగలదు మరియు మైక్రోబ్‌లను చంపేందుకు పేడను వేడి చేయడం లేక ఉప్పు లేక ప్రిజర్వేటివ్‌ల వంటి వాటిని కలపడం వంటివి చేయకపోతే అది ఎరువులతో పెంచబడే ఆహారంలో పెరిగి వృద్ధి చెందగలదు.”

ఖర్చులేని కలరా నివారణోపాయం

కలరాను నివారించేందుకు తాము ఇప్పుడు ఖర్చులేని పద్ధతిని కనుగొన్నామని వైజ్ఞానికులు విశ్వసిస్తున్నారు, అదేమంటే త్రాగే నీళ్లను చీరలతో వడగట్టడం! అమెరికాలోని మేరీలాండ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులూ, బంగ్లాదేశ్‌లోని డాకా నందలి అతిసార వ్యాధిని గూర్చిన పరిశోధన కొరకైన అంతర్జాతీయ కేంద్రంలోని పరిశోధకులు, కలరాను కలిగించే సూక్ష్మ జీవులు నీళ్లలో జీవించే కోప్‌పోడ్‌, ప్లాంక్‌టన్‌వంటి క్రస్టేరియన్‌ల ప్రేగులో జీవిస్తాయనే విషయాన్ని తెలుసుకున్నారు. చీరను నాలుగు మడతలు వేసి నీళ్లను వడపోస్తే, కలరా సూక్ష్మజీవుల్లో 99 శాతాన్ని తీసివేయవచ్చు. చీరను సూటిగా ఎండలో రెండు గంటలు ఆరేయడం లేక వర్షాకాలంలో తక్కువ ధర బట్టల సబ్బుతో ఉతకడం ద్వారా దానిని శుభ్రం చేయవచ్చు. దీనికి సంబంధించిన క్షేత్ర పరీక్షలు ఈ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు, ఆ పద్ధతిని ఎలా అవలంభించాలనే విషయాన్ని కలరాకు గురైన ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలకు నేర్పించడం జరుగుతుందని లండన్‌ యొక్క వార్తాపత్రికైన ది ఇండిపెండెంట్‌ నివేదిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి