మా పాఠకుల నుండి
దూషణాత్మక మాటలు యెహోవా మనపట్ల ఎంతగా శ్రద్ధవహిస్తాడో చూపించిన ఎన్నో శీర్షికల్లో, “గాయపర్చే మాటలకు బదులు స్వస్థపర్చే మాటలు” అనే శీర్షికల పరంపర (నవంబరు 8, 1996) కేవలం ఒకటి మాత్రమే. “త్రాగుబోతులకూ వారి కుటుంబాలకూ సహాయం” (మే 22, 1992), “స్త్రీలు—గౌరవానికి యోగ్యులు” (జూలై 8, 1992), “విడాకులు పొందిన కుటుంబంలోని పిల్లలకు సహాయం” (ఏప్రిల్ 22, 1991), “ఇంట్లో హింస ఎన్నడైనా అంతమౌతుందా?” (ఫిబ్రవరి 8, 1993) వంటి శీర్షికలు త్రాగుబోతైన భర్త చేతుల్లో ఎన్నో సంవత్సరాలు నేను అనుభవించిన భావోద్రేక దురాచారాన్ని అధిగమించడానికి సహాయం చేశాయి. నేనీ శీర్షికల్ని ఆనందబాష్పాలతో, దుఃఖంతో చదివాను. మన అత్యంత ఆంతరంగిక భయాల్నీ, బాధల్నీ, క్షోభనూ ఎరిగివున్న దేవునిపట్ల నా హృదయం మెప్పుదలతో ఉప్పొంగిపోతుంది.
జె. సి., కెనడా
ఈ శీర్షికలు నన్నెంతో కదిలించాయి. అవి నా భర్తతో నేనున్న పరిస్థితిని సరిగ్గా వర్ణించాయి. నేను పూర్తి సంసిద్ధతతో ప్రతి వాక్యంతో ఏకీభవిస్తాను. మీరు స్త్రీలపట్ల చాలా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు, ఈ సంస్థ యెహోవాచే ఉపయోగించుకోబడుతుందన్న నా నమ్మకాన్ని ఇది స్థిరపరుస్తుంది.
పి. ఎస్., జర్మనీ
నా నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా నా బలహీనతతో పోరాడడాన్ని కొనసాగించమని ఈ శీర్షికలు నన్ను ప్రోత్సహించాయి. ఇప్పుడు నేను నా భర్తతో ఎలా ప్రవర్తించాలన్నది తెల్సుకున్నాను. నేనీ శీర్షికల్ని కన్నీటితో చదివాను.
జి. ఐ., ఆస్ట్రియా
నా భర్త నన్ను సంవత్సరాల తరబడి దూషణాత్మక మాటలతో హింసించాడు. నేను దేవుని ఆత్మ ఫలాలను వృద్ధిచేసుకోవడంద్వారా, పూర్తికాల ప్రచార పనిలో బిజీగా ఉండడంద్వారా ఆశను వదులుకోకుండా ఉండడంలో సఫలీకృతురాలినయ్యాను. నేను ఒంటరిదాన్నని భావించక—సమస్యల్ని అర్థం చేసుకునేవారు ఒకరు ఉన్నారని గ్రహించడానికి మీ శీర్షికలు సహాయం చేశాయి.
ఎమ్. ఎన్., ఇటలీ
నేనింతకు మునుపు మీ శీర్షికలు చాలా చదివాను, కానీ ఇవి నా హృదయాన్ని స్పృశించాయి. 9వ పేజీలోని ఫోటోను చూస్తుంటే మా అమ్మనో నా సహోదరినో చూస్తున్నట్లుగా ఉంది—వారు చాలా సంవత్సరాలపాటు తమ భర్తల చేతుల్లో బాధలను అనుభవించారు. ఈ విధమైన బాధల్ని అనుభవిస్తున్నట్లు నాకు తెల్సిన కొంతమందికి ఈ శీర్షికల కాపీలు తీసి పంపించాను. ఏ విధమైన దూషణాత్మక మాటలూ ఉండని దేవుని నూతన లోకం కొరకు మేము ఎదురు చూస్తున్నాము.
బి. పి., కెన్యా
నేనీ పత్రికను మా మామయ్యకిచ్చాను, ఆయన తన భార్యను మాటలతో బాధించేవాడు. ఆయన దాన్ని అనేకసార్లు చదివాడు. అటుతర్వాత ఆయన ఇక తన భార్యను దూషించడం మానుకున్నాడనీ, వారి ఇంట్లో ఇక ఎటువంటి కల్లోల పరిస్థితీ లేదనీ మేం గమనించాము. ఆయనా, ఆయన భార్యా తమను తాము అర్థంచేసుకోవడానికి సహాయం చేసినందుకు నాకు కృతజ్ఞతలు తెల్పుతూ ఉంటారు. నేను ఆ కృతజ్ఞతల్ని తేజరిల్లు!కు అందించాలనుకుంటున్నాను.
ఎఫ్. ఎఫ్., నైజీరియా
నడిపింపు “బైబిలు ఉద్దేశము: మీరు ఎవరి నడిపింపును నమ్మగలరు?” అనే శీర్షికను చదివి నిజంగా ఆనందించాను. (డిశంబరు 8, 1996) అది నాకు చాలా ఆదరణకరంగానూ, ప్రోత్సాహకరంగానూ ఉంది. చాలామంది ఇతరుల విషయంలో సంభవించినట్లుగానే, గతంలో నేను నడిపింపు కొరకు ఆధారపడిన వ్యక్తులు నన్ను నిరాశకు గురిచేసినప్పుడు నేనెంతో నిరుత్సాహానికి గురయ్యాను. ఒక పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకునివున్న చిత్రం నేను ఒక్కసారిగా కంటతడిపెట్టేలా చేసింది. తాను తన ప్రజల ‘చేతిని పట్టుకుంటానని’ యెహోవా యెషయా 41:13లో అన్న మాటలు వినడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.
ఎమ్. ఎస్., అమెరికా
నాకు 17 ఏళ్లు, ఈ మధ్య నాకు చాలా సమస్యలు మొదలైనాయి. ఒక స్నేహితుడు నన్ను ప్రార్థించమనీ ఏదైనా ఆధ్యాత్మిక విషయాల గురించి చదవమనీ చెప్పాడు. “మీరు ఎవరి నడిపింపును నమ్మగలరు?” అనే శీర్షికను చదివిన తర్వాత, నేను నిరాశకు గురవ్వకుండా నా పరలోకపు తండ్రి చేతిని ఇంకా దృఢంగా పట్టుకుని ఉండాలని నిర్ణయించుకున్నాను!
సి. జి., అమెరికా
నిర్బంధితులు నేనొక ఖైదీని, నా శిక్ష పూర్తి కావడానికి ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. “మేము ఒక కారాగార తిరుగుబాటులో నిర్బంధితులుగా ఉన్నాము” అనే శీర్షికను నేను రెండు సార్లు చదివాను. (నవంబరు 8, 1996 [ఆంగ్లం]) చదివిన రెండుసార్లూ నేను ఆనందబాష్పాలు రాల్చాను, నా గొంతులో ఏదో అడ్డంపడినట్లుగా అన్పించింది. ఈ కారాగారానికి యెహోవాసాక్షులు చేసే సందర్శనాల కోసం నేనెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాను. ఆ సందర్శనాలు ఎంతో సేదదీర్పుగా ఉన్నాయి.
జె. కె., అమెరికా
ఏదైనా ఒక శీర్షికను గూర్చి నేనింతకు మునుపు ఎప్పుడూ మీకు వ్రాయలేదు, కానీ హోస్టేజ్‌ల గురించిన శీర్షిక విశ్వాసాన్ని దృఢపర్చేదిగా ఉంది. తన ప్రజలు దుర్దశలో ఉన్నప్పుడు యెహోవా వారిని బలపరుస్తాడన్న హామీని అది పునర్నూతనం చేసింది.
కె. డి., అమెరికా