కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 9/8 పేజీలు 5-7
  • ఒత్తిడిలో తలిదండ్రులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిలో తలిదండ్రులు
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అపాయకరమైన కాలములు”
  • “అనురాగరహితులు”
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి మాదిరిగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 9/8 పేజీలు 5-7

ఒత్తిడిలో తలిదండ్రులు

బిడ్డ పుట్టినప్పుడు ఉత్తేజంతో నిండిపోయే తలిదండ్రుల ఆనందానికి అవధులుండవు. తమ బిడ్డను గురించిన దాదాపు ప్రతి విషయమూ వారిని పులకరింపజేస్తున్నట్లుగా ఉంటుంది. బిడ్డ తొలి చిరునవ్వు, తొలి పలుకులు, తొలి అడుగులు వంటివి ఆనందభరిత సందర్భాలు. స్నేహితులకూ బంధువులకూ వాటి గురించి కథలు చెబుతూ, ఫోటోల్నీ చూపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. అందులో సందేహమే లేదు, వారు తమ బిడ్డను ప్రేమిస్తున్నారు.

అయితే, కొన్ని కుటుంబాల్లో సంవత్సరాలు గడిచే కొలది విషాదం చోటుచేసుకోవడం ఆరంభమౌతుంది. తలిదండ్రులు పిల్లల్తో ఆటలాడుతూ ప్రేమపూర్వకంగా మాట్లాడడం స్థానంలో నెమ్మదినెమ్మదిగా కఠినమైన నీచమైన మాటలు చోటుచేసుకుంటాయి; అనురాగంతో హత్తుకోవడాల స్థానంలో కోపంతో కొట్టే దెబ్బలు వస్తాయి లేకపోతే అసలు స్పర్శ అనేదే పూర్తిగా లేకుండా పోతుంది; తలిదండ్రులుగా ఉన్నందుకు గర్వంగా భావించడంపోయి దానిస్థానంలో చేదైన అనుభవాల్ని ఎదుర్కోవల్సివస్తుంది. “నేనసలు పిల్లల్ని కనకుండా ఉండాల్సింది” అంటారు చాలామంది. ఇతర కుటుంబాల్లో సమస్య ఇంకా ఘోరంగా ఉంది—పిల్లవాడు ఇంకా శిశువుగానే ఉన్నప్పుడు కూడా తలిదండ్రులు ప్రేమను ప్రదర్శించడంలో విఫలమయ్యారు! ఈ రెండు సందర్భాల్లో ఏమి జరిగింది? ప్రేమ ఏమైంది?

అటువంటి ప్రశ్నలకు జవాబుల్ని కనుగొనడంలో పిల్లలు అంత సమర్థులు కారు. కానీ ఇది, వారు తమకై తాము తమ స్వంత నిర్ధారణలకు చేరుకోవడాన్ని ఆపదు. తన హృదయాంతర్భాగంలో ఒక పిల్లవాడు, ‘అమ్మ లేదా నాన్న నన్ను ప్రేమించడం లేదంటే దానికి కారణం నాలో ఏదో లోపం ఉందన్నమాట. నేను చాలా చెడ్డవాడినైయుండవచ్చు’ అన్న ముగింపుకు చేరుకోవచ్చు. ఇది ఎంతో దృఢంగా పాతుకుపోయిన నమ్మకంగా తయారు కావచ్చు—జీవితాంతం అన్ని రకాల నష్టాల్నీ తెచ్చేదిగా తయారవ్వవచ్చు.

అయితే, అసలు కారణం ఏమిటంటే తలిదండ్రులు విస్తారమైన ఎన్నెన్నో రకాల కారణాలనుబట్టి తమ పిల్లలకు అవసరమైన ప్రేమను ప్రదర్శించడంలో విఫలమౌతున్నారు. నేడు తలిదండ్రులు గొప్ప ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నది ఒప్పుకోవల్సిందే, కొన్ని ఒత్తిళ్లు ఇంతకుమునుపు ఎన్నడూ లేనంత గొప్ప పరిమాణంలో ఉన్నాయి. వాటితో సరైన విధంగా వ్యవహరించడానికి సిద్ధంగా లేని తలిదండ్రులకు, ఈ ఒత్తిళ్లు తలిదండ్రులుగా వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యంపై చాలా నష్టకరమైన ప్రభావం చూపగలవు. జ్ఞానయుక్తమైన ఒక ప్రాచీన సామెత ఇలా అంటుంది: “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు.”—ప్రసంగి 7:7.

“అపాయకరమైన కాలములు”

ఒక ఉటోపియా యుగం. ఈ శతాబ్దంలో చాలామంది ప్రజలు సంభవిస్తుందని ఎదురుచూసింది దానికొరకే. ఊహించుకోండి—ఆర్థిక ఒత్తిళ్లు ఇక లేవు, కరవుకాటకాలు ఇక లేవు, అనావృష్టి ఇక లేదు, యుద్ధాలు ఇక లేవు! కానీ అటువంటి నిరీక్షణలు నిజమవ్వకుండా పోయాయి. దానికి బదులుగా, నేటి ప్రపంచం సా.శ. మొదటి శతాబ్దంలో ఒక బైబిలు రచయిత ప్రవచించిన విధంగానే మారింది. మన దినాల్లో మనం “అపాయకరమైన కాలములు” ఎదుర్కొంటామని ఆయన వ్రాశాడు. (2 తిమోతి 3:1-5) చాలామంది తలిదండ్రులు ఈ మాటల్తో వెంటనే ఏకీభవిస్తారు.

బిడ్డ పుట్టినప్పుడే నేటి లోకంలో పిల్లల్ని పెంచడానికయ్యే గొప్ప ఖర్చును బట్టి చాలామంది తలిదండ్రులు దిగ్భ్రమచెందుతారు. తరచూ, ప్రాథమిక అవసరతలు తీరాలంటే తలిదండ్రులు ఇద్దరూ బయటికెళ్లి ఉద్యోగం చేయాల్సివస్తుంది. వైద్య ఖర్చులు, బట్టలకయ్యే ఖర్చులు, స్కూలు ఫీజులు, దైనందిన ఖర్చులు, చివరికి కూడూ నీడా వంటివాటికయ్యే ఖర్చులు కూడా ప్రతినెలా తడిసిమోపెడు అవుతున్నట్లు తలిదండ్రులు కనుగొంటారు. ఈ ఆర్థికస్థితి, కేవలం ఒక్క దినానికి మాత్రమే సరిపడేవి కొనుక్కోవడానికి ఒక పూర్తి దినభత్యాన్ని ఖర్చుపెట్టే సమయం వస్తుందని ముందేచెప్పిన ప్రకటనలోని ప్రవచనాన్ని బైబిలు విద్యార్థులకు గుర్తుచేస్తుంది!—ప్రకటన 6:6.

తమ తలిదండ్రులు ఎదుర్కొనే ఈ ఒత్తిళ్లన్నీ పిల్లలు అర్థం చేసుకోవాలని మనం అపేక్షించలేము. లేదు, పిల్లలెప్పుడూ అక్కరలో ఉంటారు, ప్రేమానురాగాల కొరకు దప్పికతో ఉంటారు, వారి స్వభావమే అంత. అంతేగాక వారు వార్తామాధ్యమాల నుండీ, తోటి విద్యార్థుల నుండీ క్రొత్త క్రొత్త బొమ్మలూ, సరిక్రొత్త బట్టలూ, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలూ కొనుక్కోమనే ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాధారణంగా ఎన్నటికీ తరగని ఆ కోరికలను తీర్చడానికి తలిదండ్రులు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవలసివస్తుంది.

ఈ రోజుల్లో తలిదండ్రులు ఎదుర్కొంటున్న మరీ ఘోరంగా పెరిగిపోతున్నట్లుగా కన్పిస్తున్న మరొక ఒత్తిడి ఏమిటంటే—తిరుగుబాటుతనం. ఆసక్తికరంగా, మన కల్లోలిత కాలాలకు మరో సూచనగా పిల్లలు తలిదండ్రులకు అవిధేయత చూపడం విస్తృతమౌతుందని బైబిలు ప్రవచించింది. (2 తిమోతి 3:2) నిజమే, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడంలోని సమస్యలు క్రొత్తవేమీ కాదు. మరి పిల్లవానిపట్ల దురుసుగా ప్రవర్తించడానికి వాడి దుష్ప్రవర్తనే కారణమని ఏ తల్లీతండ్రీ న్యాయసమ్మతంగా అనలేరు. కానీ సంస్కృతి మొత్తమంతా తిరుగుబాటుతనంతో నిండిపోయినప్పుడు వారిని పెంచడానికి తలిదండ్రులు ఎంతో పోరాడాల్సి వస్తుందని మీరు అంగీకరించరా? క్రోధాన్నీ, విప్లవాన్నీ, నిరాశనీ పెంపొందిస్తున్న పాపులర్‌ సంగీతమూ; తలిదండ్రులను అమాయకులుగానూ పిల్లలను వారికన్నా శ్రేష్ఠమైన చురుకైన ఘనులుగానూ చిత్రించే టీవీ కార్యక్రమాలూ; ముందు వెనుకలు ఆలోచించకుండా హింసాత్మకంగా ప్రవర్తించడాన్ని మహిమపర్చే సినిమాలూ—ఇటువంటి ప్రభావాలన్నీ కూడా పిల్లల్ని గుండ్లవర్షంలా తాకుతున్నాయి. ఈ తిరుగుబాటు ప్రవృత్తిని తమలోకి తీసుకుని దాన్ని అనుకరించే పిల్లలు తమ తలిదండ్రులపై భయంకరమైన ఒత్తిడిని కలుగజేయగలరు.

“అనురాగరహితులు”

అయితే, నేటి కుటుంబంలో ఇంకా ఎక్కువ కలతలుంటాయని సూచించే మరో కోణం ఇదే ప్రాచీన ప్రవచనానికి ఉంది. చాలామంది ప్రజలు “అనురాగరహితులు”గా ఉంటారని అది సూచిస్తుంది. (2 తిమోతి 3:3) కుటుంబాన్ని కలిపికట్టుగా ఉంచేది అనురాగమే. బైబిలు ప్రవచనం విషయంలో ఎంతో సంశయంతో ఉండే ప్రజలు సహితం కుటుంబ జీవితం దిగ్భ్రాంతిని కల్గించే రీతిలో విచ్ఛిన్నమవ్వడాన్ని మన కాలాలు చూశాయని అంగీకరించక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేట్లు ఆకాశాన్నంటాయి. చాలా సమాజాల్లో సాంప్రదాయిక కుటుంబాలకన్నా తలిదండ్రుల్లో ఏ ఒక్కరో మాత్రమే ఉన్న కుటుంబాలు, మారుటి తల్లి లేక తండ్రి ఉన్న కుటుంబాలు చాలా సాధారణమైపోయాయి. తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లోనూ, మారుటి తల్లి లేక మారుటి తండ్రి ఉన్న కుటుంబాల్లోనూ పిల్లలకు ఆవశ్యకమైన ప్రేమను చూపించడాన్ని కష్టతరం చేసే ప్రత్యేక సవాళ్లను ఒత్తిళ్లను తలిదండ్రులు కొన్నిసార్లు ఎదుర్కొంటారు.

అయితే ఇంకా గట్టి ప్రభావం ఒకటుంది. నేటి తలిదండ్రుల్లో చాలామంది ‘అనురాగం’ కాస్తంతనో లేకపోతే అసలేమాత్రం లేకుండానో ఉన్న ఇళ్లల్లో పెరిగారు—వ్యభిచారము విడాకులతో విచ్ఛిన్నమైన కుటుంబాలు; ఉదాసీనతతోనూ, ద్వేషంతోనూ విధ్వంసమైన ఇళ్లు; బహుశ మౌఖిక, భావోద్రేక, శారీరక, లేక లైంగిక దురాచారాలు సర్వసాధారణమై ఉన్న ఇళ్లల్లో పెరిగారు. అటువంటి ఇళ్లల్లో పెరగడం పిల్లలకు చెరుపు చేయడం మాత్రమే గాక వారు పెద్దవారైనప్పుడు ఎలా ఉంటారన్నదాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. గణాంకాలు నిరాశాపూరితమైన చిత్రాన్ని అందిస్తున్నాయి—తాము పిల్లలుగా ఉన్నప్పుడు దుర్వ్యవహారానికి గురైన తలిదండ్రులు తమ స్వంత పిల్లల్ని దుర్వ్యవహారానికి గురిచేసే సాధ్యత ఎక్కువగా ఉంది. బైబిలు కాలాల్లో యూదులకు ఒక సామెత ఉంది: “తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసె[ను].”—యెహెజ్కేలు 18:2.

అయితే, పరిస్థితులు ఇక ఏమాత్రమూ అలా ఉండనవసరం లేదని దేవుడు తన ప్రజలకు చెప్పాడు. (యెహెజ్కేలు 18:3) ఇక్కడొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. తలిదండ్రులపైని ఈ ఒత్తిళ్లన్నిటి అర్థం, వారు తమ పిల్లల్ని దుర్వ్యవహారానికి గురిచేస్తూపోవడం తప్పించి మరేమీ చేయలేరనా? ఎంతమాత్రం కాదు! మీరు తల్లిగానీ తండ్రిగానీ అయివుండి, మునుపు పేర్కొనబడిన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, మీరెప్పటికైనా ఒక మంచి తల్లిగా గానీ తండ్రిగా గానీ ఉండగలనా అని వ్యథచెందుతుంటే, ధైర్యం కూడగట్టుకోండి! మీరు కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. మీ గతం దానంతటదే మీ భవిష్యత్తును నిర్ధారించదు.

మెరుగుపర్చుకోవడం సాధ్యమన్న లేఖనాధార హామీకి అనుగుణ్యంగా, హెల్దీ పేరెంటింగ్‌ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తుంది: “[మీరు] సావధానంగా ఆలోచించి మీ తలిదండ్రులకు భిన్నంగా ప్రవర్తించడానికి చర్యలను తీసుకోనట్లైతే మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా మీ చిన్నతనపు సంఘటనల నమూనా తిరిగి పునరావృతమౌతుంది. ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మీరు కొనసాగేలా చేస్తున్న అనారోగ్యకరమైన విధానాల గురించి తెల్సుకునివుండి వాటిని ఎలా మార్చాలో నేర్చుకోవాలి.”

అవును, అవసరమైతే, మీరు మీ పిల్లల్ని దుర్వ్యవహారానికి గురిచేసే తలిదండ్రులుగా ఉండడం, ఆ తర్వాత ఆ పిల్లలు పెద్దయ్యాక మీలాంటి తలిదండ్రులుగానే తయారు కావడం అనే ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయగలరు! పిల్లల్ని పెంచడాన్ని ఎంతో కష్టతరం చేసే ఒత్తిళ్లతో మీరు వ్యవహరించవచ్చు. కానీ ఎలా? మీరు ఆరోగ్యకరమైన రీతిలో పిల్లల్ని పెంచడంలో అత్యంత శ్రేష్ఠమైన, అత్యంత విశ్వసనీయమైన ప్రమాణాలను ఎక్కడ కనుగొనవచ్చు? మా తర్వాతి శీర్షిక ఈ విషయాన్ని పరిశీలిస్తుంది.

[6వ పేజీలోని చిత్రం]

ఒత్తిడినెదుర్కొంటున్నప్పుడు కొంతమంది తలిదండ్రులు తమ పిల్లలపట్ల ప్రేమను వ్యక్తం చేయడంలో విఫలులౌతారు

[7వ పేజీలోని చిత్రం]

తలిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన ప్రేమను వ్యక్తం చేయాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి