కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 6/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1997
g97 6/8 పేజీ 30

మా పాఠకుల నుండి

కంప్యూటర్‌ ఆటలు నాకు 15 ఏండ్లు. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను కంప్యూటర్‌ లేక వీడియో ఆటలు ఆడాలా?” (సెప్టెంబర్‌ 8, 1996) అనే శీర్షికకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఆటల వల్ల కలిగే హానిని అది నిజంగా చూపించింది. వాటిని ఆడడంలోని అనుకూల, ప్రతికూల కారకాలను మదింపు చేసుకునేందుకు అది క్రైస్తవులకు సహాయపడుతుంది.

ఎఫ్‌. ఆర్‌., ఇండోనేషియా

నాకు 17 ఏండ్లు. నేను హింసాత్మక కంప్యూటర్‌ ఆటలను ఇష్టపడేవాడ్ని. అవి నాపై ప్రభావం చూపలేదని నేను అనుకున్నాను. కానీ నేను ఈ ఆటలకు—ముఖ్యంగా మీరు వర్ణించినటువంటి హింసాత్మకమైన ఆటలకు మరీ దాసుడనయ్యాను. హింసా మరియు రక్తపాతమూ ఉన్న నా కంప్యూటర్‌ డిస్కులనన్నింటినీ ఇప్పుడు నేను నాశనం చేసేశాను. దాని ఫలితమేమిటి? నాకు చాలా హాయిగా ఉంది, యెహోవా దేవుని గురించి పఠించేందుకు, నేర్చుకునేందుకు, ఇతరులతో మాట్లాడేందుకు నాకు చాలా సమయం ఉంది.

ఎస్‌. ఎ., గ్రీస్‌

శరణార్థి సంక్షోభం నేను బురుండీ నుండి వచ్చిన శరణార్థిని. “శరణార్థి సంక్షోభం—అది ఎన్నటికైనా అంతమౌతుందా?” (సెప్టెంబరు 8, 1996) అనే పరంపర ఎడల నా మెప్పును వ్యక్తం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ విషయంలో యెహోవా దృష్టికోణాన్ని, ప్రాచీన కాలాల్లో శరణార్థులతో ఆయన తన ప్రజలు స్నేహపూర్వకంగా దయతో వ్యవహరించేలా చేశాడన్న విషయాన్నీ తెలుసుకోవడం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఈ శీర్షికల కొరకు మీకు కృతజ్ఞతలు; అవి నాకు నిజంగా ఊరట కలిగించాయి.

డి. ఎమ్‌., కెన్యా

బస్సు దుర్ఘటన “యెహోవా బలంతో దుర్ఘటనను ఎదుర్కొనడం” (సెప్టెంబరు 8, 1996) శీర్షికను చదివేటప్పుడు, నేను ఏడుపును ఆపుకోలేకపోయాను. ఎందుకంటే అది నాపై వ్యక్తిగతంగా ప్రభావం చూపింది. మా సన్నిహిత స్నేహితురాలితో పాటు నేను కూడా ఒక ప్రమాదంలో చిక్కుకున్నాను. తీవ్రమైన గాయాల మూలంగా కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయింది. నేను తప్పించుకోగా ఆమె చనిపోయినందు వల్ల కలిగిన బాధ మరియు అపరాధాల తీవ్రమైన భావాలను తరువాతి ఐదు సంవత్సరాలలో అదుపులో పెట్టుకోగలిగాను. నా ప్రియ స్నేహితురాలిని యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడని ఆయనయందు నమ్ముతున్నాను. స్పెయిన్‌లో జరిగిన ఆ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన వారి ఎడల కూడా నాకు సానుభూతిగా ఉంది.

జె. టి., అమెరికా

నత్తి “నత్తివారి నాలుక కూడా మాట్లాడును” (సెప్టెంబరు 8, 1996) అనే శీర్షికకు కృతజ్ఞతలు. పీటర్‌ కూన్స్‌ అనుభవం నన్ను చాలా బలపరచింది. నాకూ నత్తివుంది. నేను స్పష్టంగా చెప్పగల్గేందుకు సహాయపడమని బైబిలు ప్రసంగాన్ని ఇవ్వడానికి ముందు నేను యెహోవాను ఎల్లప్పుడూ కోరుకుంటాను.

ఎమ్‌. ఎమ్‌., ఇటలీ

నాకు 20 ఏండ్లు వచ్చినప్పుడు, ఇతరులతో మాట్లాడడమూ, యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో ప్లాట్‌ఫారమ్‌ నుండి మాట్లాడడమూ కష్టంగా ఉందని కనుగొన్నాను. ఒక నియామకం ముగించే సరికి, నాకు విపరీతంగా చెమటలు పట్టేస్తాయి, నాకు అసాధారణంగా అలసట అనిపిస్తుంది. ఒక తోటి క్రైస్తవుడు తనకు ఇదే సమస్య ఉన్నప్పటికీ యెహోవాను సేవించడాన్ని గూర్చిన అనుభవాన్ని చదవడం నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విషయాలను గురించి అనుకూల దృక్కోణాన్ని కలిగి ఉండేందుకు అది నాకు సహాయపడింది.

ఎమ్‌. ఎస్‌., జపాన్‌

ఈ అనుభవాన్ని ప్రచురించినందుకు కృతజ్ఞతలను తెలిపేందుకు పురికొల్పబడ్డాను. బాల్యం నుండీ నాకూ అదే సమస్య ఉంది. పీటర్‌లాగే, నేనూ సంఘంలో పెద్దగా సేవచేస్తున్నాను. నా నియామకాలను పూర్తిచేసే సామర్థ్యం కొరకు నేను యెహోవాపై ఆధారపడాలి. నేను ఇప్పుడు దైవపరిపాలనా పాఠశాలను నిర్వహిస్తూ ఎలా మాట్లాడాలనే విషయంలో ఇతరులకు సహాయపడుతున్నాను.

ఎన్‌. ఓ. ఎన్‌., నైజీరియా

పోంపే “పోంపే—సమయం నిశ్చలంగా నిలిచిన చోటు” అనే మీ శీర్షికను (అక్టోబరు 8, 1996) నేను ఇటీవల చదివి చాలా ఆనందించాను. నేను అక్కడే ఉన్నానా అన్నట్లుగా అనిపించింది! ఒక విషయం స్పష్టంగా చెబితే సంతోషిస్తాను. పోంపేను సందర్శించే ఎవరైనా “జొన్నలను విసరడానికి తిరుగటి రాళ్లను . . . ఇప్పటికీ చూడవచ్చు” అని ఆ శీర్షిక చెబుతుంది. కానీ అమెరికా ఖండంలో జన్మించిన జొన్నలు క్రిస్టఫర్‌ కొలంబస్‌ కాలం వరకూ యూరప్‌లోని వారికి తెలియని ధాన్యం కదా? ఒకవేళ నేననుకున్నది తప్పయితే సరిదిద్దండి.

ఆర్‌. డి., అమెరికా

ఈ విషయంలో మేము తికమకపెట్టినట్లయితే క్షమించండి. “ధాన్యాలను” విసరడానికి తిరుగటి రాళ్లను ఇప్పటికీ చూడవచ్చు అని అనుంటే బాగుండేది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గోధుమలు లేదా యవలు వంటి “తృణధాన్య విత్తనాలు” అన్నదే “కార్న్‌” అనే ఆంగ్ల పద భావం.—ఎడిటర్‌

చిన్నప్పటి నుండే ప్రాచీన చరిత్ర అంటే నాకు చాలా ఆసక్తి. ముఖ్యంగా పోంపే చరిత్ర నాకెల్లప్పుడూ చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. నేను ఆ శీర్షికను చదివినప్పుడు, ఆ నగరం గుండా ప్రయాణిస్తున్నానా అన్నట్లు అనిపించింది. అద్భుతంగా ఉంది! నాకు తెలియని అనేక క్రొత్త విషయాలను తెలుసుకున్నాను. మనం జీవిస్తున్న అంత్య దినాలతో చేసిన తారతమ్యం కూడా నాకు చాలా నచ్చింది. నేను దర్శించలేని స్థలాలను గూర్చి తెలుసుకునేందుకు సహాయపడినందుకు కృతజ్ఞతలు.

జె. ఎస్‌. ఎ., బ్రెజీల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి