కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 12/8 పేజీలు 17-19
  • యెహోవాసాక్షుల గురించిన అపోహలను తొలగించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షుల గురించిన అపోహలను తొలగించడం
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీరు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?”
  • ‘మీరు మీ కుమారున్ని చనిపోనిస్తారనా మీ భావం?’
  • కైసరువి కైసరుకి చెల్లించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఎవరి మాట వినాలనేది ఎలా తెలుసుకోవచ్చు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దేవుడు, కైసరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
తేజరిల్లు!—1996
g96 12/8 పేజీలు 17-19

యెహోవాసాక్షుల గురించిన అపోహలను తొలగించడం

తమ ఇంటింటి ప్రకటనా పనిలో ఉన్నప్పుడు ఇద్దరు యెహోవాసాక్షులు ఒక వ్యక్తిని కలిశారు, ఆయన తనకు ఆసక్తి లేదని అన్నాడు. సాక్షులు నెమ్మదిగా వచ్చేశారు, కానీ వారు కాలిబాట వెంబడి వెళ్తుండగా, వారు ఆ వ్యక్తి తమను అనుసరిస్తున్నాడని గమనించారు. “దయచేసి ఆగండి!” ఆ వ్యక్తి పిలిచాడు. “నేను క్షమాపణ కోరాలనుకుంటున్నాను. నాకు సాక్షుల గురించి ఏమీ తెలియదు, అనేకమందికి మీ గురించి తప్పుడు అభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నాను.”

తరువాత ఆ వ్యక్తి తాను రెనాన్‌ డోమింగెస్‌ అని చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. ఆయన కాలిఫోర్నియాలోని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ శాన్‌ ఫ్రాన్సిస్కోకు ప్రోగ్రామ్‌ ఛైర్మన్‌. యెహోవాసాక్షుల నమ్మకాలు, కార్యకలాపాల గురించి ఒక ప్రసంగం ఇవ్వడానికి ఒక సాక్షి ఆ క్లబ్బుకు రాగలడేమోనని ఆయన అడిగాడు. ఒక ఎజెండా తయారు చేయబడింది. సాక్షులు 30 నిమిషాలు మాట్లాడిన తరువాత సభికుల నుండి వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో అనేక సంవత్సరాలు పని చేసిన అర్నెస్ట్‌ గరెట్‌ అనే సాక్షిని 1995, ఆగస్టు 17న రోటరీ క్లబ్‌లో ప్రసంగాన్నివ్వాలని అడిగారు. ఆయన ఈ క్రిందనున్న దానిని పంచుకుంటున్నాడు:

“బ్యాంకర్లు, న్యాయవాదులు, వైద్యులు వంటి వ్యాపారవేత్తలు మరియు సమాజ నాయకులు అయిన రోటరీ క్లబ్‌ సభ్యులకు నేను ఏమి చెప్పగలనా అని నేను అబ్బురపడి, ప్రార్థన చేశాను. నేను కొంత పరిశోధన చేసి, రోటరీ క్లబ్‌ యొక్క ప్రకటిత లక్ష్యం సమాజాన్ని బలపరచడం అని తెలుసుకున్నాను. అందుకని నేను ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు బ్రోషూరులోని 23వ పేజీలో ‘మీ సమాజానికి సువార్త యొక్క ఆచరణాత్మక విలువ’ అనే పేరుతోగల శీర్షికలోని సమాచారాన్ని అందించాను.”a

“ఈ విషయంలో యెహోవాసాక్షులు మంచి ప్రభావం కల్గివుంటారు అని నేను వివరించాను. వారంలోని ప్రతిదినం యెహోవాసాక్షులు తమ సమాజంలోనివారి తలుపులు తట్టడానికి బయటికి వస్తారు. పటిష్ఠమైన కుటుంబాన్ని కలిగివుండాలని వారు తమ పొరుగువారిని ప్రభావితం చేయాలన్నదే వారి కోరిక—ఒక పటిష్ఠమైన కుటుంబ వ్యవస్థ ఒక పటిష్ఠమైన సమాజాన్ని నిర్మిస్తుంది. యెహోవాసాక్షులు ఎంత ఎక్కువ మంది వ్యక్తులను మరియు కుటుంబాలను క్రైస్తవ నియమాలకు అనుగుణ్యంగా జీవించేలా ప్రభావితం చేస్తారో సమాజంలో అపరాధము, అనైతికత, నేరము అంత తక్కువగా ఉంటుంది. ఈ సమాచారాన్ని సభ్యులు ఎంతో చక్కగా స్వీకరించారు ఎందుకంటే అది రోటరీ క్లబ్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.”

“మీరు రాజకీయాల్లో ఎందుకు తలదూర్చరు?”

“సమావేశంలో ప్రశ్నలు అడిగే సమయమాసన్నమైనప్పుడు, ఎదురైన మొట్టమొదటి ప్రశ్నలలో ఒకటి ఏమిటంటే, ‘మీరు రాజకీయాల్లోను, ప్రభుత్వంలోను ఎందుకు తలదూర్చరు?’ ఈ ప్రశ్న అడిగిన పెద్దమనిషి తరువాత ఇంకా ఇలా అన్నాడు: ‘బైబిలు “కైసరువి కైసరునకు చెల్లించండి” అని చెబుతుందని మీకు తెలుసు కదా.’ ఆ మాటను మేము పూర్తిగా అంగీకరిస్తామని, దానికి సమ్మతిస్తామని నేను ఆయనతో చెప్పాను. ఆ లేఖనాన్ని ప్రస్తావించిన అనేకమంది దాని మిగతా భాగాన్ని, ‘దేవునివి దేవునికి చెల్లించండి’ అన్న మాటలను ప్రస్తావించడం నేనెప్పుడూ వినలేదని నేను ఎత్తి చూపించాను. (మత్తయి 22:21) మరి అప్పుడు, అన్నీ కైసరుకే చెందినవి కావు అని మనం నిర్ధారించాలి. దేవునికి చెందినవి కొన్ని ఉన్నాయి. కైసరుకి చెందినవేవో, దేవునికి చెందినవి ఏవో కనుగొనవలసిన విషయం మన ముందు ఉన్నది.

“‘కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?’ అని యేసును ప్రశ్నించినప్పుడు ఆయన అవునని గాని కాదని గాని జవాబివ్వలేదని నేను ఆయనకు చూపించాను. ఆయన, రోమీయుల దేనారమైన ‘పన్నురూక ఒకటి నాకు చూపించండి’ అని అన్నాడు. ఆయనిలా అడిగాడు: ‘ఈ రూపము, పైవ్రాత ఎవరివి?’ వారు ‘కైసరువి’ అన్నారు. తరువాత ఆయన ఇలా అన్నాడు: ‘ఆలాగైతే కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి చెల్లించండి.’ (మత్తయి 22:17-21) మరో మాటలో చెప్పాలంటే, కైసరుకు పన్ను చెల్లించాలి ఎందుకంటే మనం కైసరు నుండి కొన్ని సేవలు పొందుతాము, మరి మనం వీటి కొరకు సరిగ్గా పన్నులు చెల్లిస్తాము. యెహోవాసాక్షులు తమ పన్నులను చెల్లిస్తారని, సరైన విధంగానే ప్రభుత్వానికి చెందవలసిన దానిని ప్రభుత్వానికి ఇవ్వకుండా దానిని మోసగించరని నేను వివరించాను.

“తమ జీవితాలను కైసరుకు ఋణపడివుంటారని యెహోవాసాక్షులు విశ్వసించరని తరువాత నేను పేర్కొన్నాను. వారు తమ ఆరాధనను దేవునికి చెల్లించవలసి ఉన్నారని విశ్వసిస్తారు, మరి దీనిని వారు ఆయనకు సరిగ్గానే తిరిగి చెల్లిస్తారు. కాబట్టి మేము ఈ స్థానాన్ని వహించినప్పుడు, కైసరుకు అగౌరవాన్ని చూపాలన్నది మా ఉద్దేశం ఏమాత్రం కాదు. మేము కైసరు చట్టాలన్నింటికీ విధేయత చూపుతాము, కానీ అవి భిన్నంగా ఉంటే మేము మా పరిపాలకునిగా మనుష్యులకు కాదు గాని దేవునికే విధేయత చూపాలని గౌరవపూర్వకంగా ఎంచుకుంటాము. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి సమాజమంతటి ఎదుట ఇలా అన్నాడు: ‘నేను దానికి సమ్మతించకుండా ఉండలేను!’

“మన ప్రకటనా కార్యకలాపాల గురించి మేము అనేకమైన ప్రశ్నలకు జవాబివ్వగలిగాము. సభ్యులలో అనేకమంది సమావేశం తరువాత దగ్గరికి వచ్చి కరచాలనం చేసి, వారు మాతో పూర్తిగా ఏకీభవిస్తున్నారని—ఒక పటిష్ఠమైన సమాజానికి కుటుంబమే వెన్నెముక అని చెప్పారు. తరువాత మేము ప్రతి సభ్యునికి ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు బ్రోషూరును ఇచ్చాము.

“ఈ సమావేశం తరువాత ప్రోగ్రామ్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ డోమింగెస్‌ నాకు ఫోను చేసి తన కార్యలయానికి రాగలనేమోనని అడిగాడు, ఎందుకంటే ఆయనకి మన నమ్మకాల గురించి అడగడానికి మరిన్ని ప్రశ్నలున్నాయి. అనేక లేఖనాలపై మేము చక్కగా చర్చించాము. ఆయన ప్రత్యేకంగా రక్తం విషయంలో మన స్థానాన్ని నేను వివరించాలని కోరాడు. తనకై తాను రక్త మార్పిడిని అంగీకరించడని ఆయన స్వయంగా చెప్పాడు, అంతేగాక రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు అనే బ్రోషూరులో నుండి నేను ఆయనకు ఇచ్చిన సమాచారాన్నిబట్టి ఎంతగా ముగ్ధుడయ్యాడంటే ఆయన రక్తం విషయంలో మన స్థానం విషయమై క్లబ్‌ సభ్యులతో మాట్లాడడానికి మరల రమ్మని నన్ను ఆహ్వానించాడు. ఈ కార్యక్రమంలో నాతో రమ్మని డాన్‌ డాల్‌ అనే మరొక సాక్షిని నేను ఆహ్వానించాను. సాక్షులకు శస్త్ర చికిత్స చేయాల్సివచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని గూర్చి వైద్యులతో చర్చించడానికి ఆసుపత్రులకు వెళ్తాడు. వైద్యులతో, ఆసుపత్రి నిర్వహణ విభాగంతో మన లేఖనాధార స్థానాన్ని స్పష్టం చేయడానికి, రక్త మార్పిడికి ఫలవంతమైన ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి ఎలా కలిసి పని చేస్తామో మేమిద్దరం చక్కగా వివరించాము.”—లేవీయకాండము 17:10-12; అపొస్తలుల కార్యములు 15:19-21, 28, 29.

‘మీరు మీ కుమారున్ని చనిపోనిస్తారనా మీ భావం?’

“సమావేశం తరువాత ఒక పెద్దమనిషి దగ్గరికి వచ్చి ఏకాంతంగా ఇలా అడిగాడు: ‘ఒకవేళ ప్రమాదం జరిగి విపరీతంగా రక్తం కారుతూ ఎమర్జెన్సీ రూమ్‌కి తీసుకురాబడితే మీరు మీ కుమారున్ని చనిపోనిస్తారనా మీ భావం?’ నాకు ఒక కొడుకు ఉండేవాడు, ఆయన 1988లో స్కాట్లండ్‌లోని లాకర్‌బీ మీదుగా విమానంలో వెళ్తున్నప్పుడు అది విస్ఫోటనం చెందగా నేను ఆయన్ని పోగొట్టుకున్నాను. ఆయన ప్రశ్నకు జవాబుగా నా కుమారుడు చనిపోవాలని నేను కోరుకోనని నేను మొదట చెప్పాను.

“మేము వైద్యుల వ్యతిరేకులమో, వైద్య వ్యతిరేకులమో, లేక ఆసుపత్రి వ్యతిరేకులమో కాము. మేము విశ్వాస స్వస్థతలు చేసేవారము కాము. వైద్య వృత్తి యొక్క సేవలు మాకు అవసరము. మేము మా నమ్మకాన్ని దేవునియందు ఉంచాము, ఈ రక్తం విషయంలో ఆయన నిర్దేశాలు మా శాశ్వత ప్రయోజనం కొరకేనని విశ్వసిస్తాము. దేవుడు బైబిలులో ‘నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ఉపదేశము చేయువానిగా, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించు’వానిగా వర్ణించబడ్డాడు. (యెషయా 48:17) ఆయన తన కుమారునికి మృతులను పునరుత్థానం చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు. యేసు ఇలా అన్నాడు: ‘పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా?’—యోహాను 11:25, 26.

“వైద్యులను అర్థం చేసుకోమని మేము కోరేదల్లా మేము స్వీకరించే స్థానం మనస్సాక్షికి సంబంధించిన విషయం అని అది సంప్రదింపులకు కుదరనిదని మాత్రమే. వ్యభిచారంపై దేవుని చట్టం విషయంలో ఎలాగైతే సంప్రదింపులు చేయలేమో, ఈ విషయంలోనూ మేము సంప్రదింపులు చేయలేము. ‘దేవా, నేను వ్యభిచారం చేయగల్గే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?’ అని చెప్పి మేము దేవునితో సంప్రదింపులు చేయలేము. నేను తరువాత ఈ వ్యక్తితో ఇలా అన్నాను: ‘రక్త మార్పిడిని తిరస్కరిస్తూ నేను నా కుమారున్ని మరణించనిస్తానా అని మీరు నన్ను అడిగారు. క్షమించండి, ఏదైనా దేశం నిమిత్తం సైనిక సేవలో మీ కుమారుడు చనిపోయేందుకు మీరు అనుమతిస్తారా అని నేను అడగాలనుకుంటున్నాను.’ ‘తప్పకుండా! ఎందుకంటే అది ఆయన కర్తవ్యం!’ అని ఆయన వెంటనే మరియు స్థిరంగా సమాధానమిచ్చాడు. నేనన్నాను: ‘మీరు మీ కుమారున్ని చనిపోవడానికి అనుమతిస్తారు. ఎందుకంటే మీరు విశ్వసించే ఒక కారణం నిమిత్తం మీరలా చేస్తారు. నా కుమారుని విషయంలో కూడా అదే విశేషాధికారాన్ని నన్నూ పొందనివ్వండి.’

“దీనికంతటికీ ఒక ఆసక్తికరమైన పరిణామంగా ప్రోగ్రామ్‌ ఛైర్మన్‌ మిస్టర్‌ డోమింగెస్‌ తనతోను, తన భార్యతోను కలిసి భోజనం చేయడానికి నన్నూ, నా భార్యను ఆహ్వానించాడు. తన భార్య యెహోవాసాక్షుల గురించి తప్పుడు అభిప్రాయంతోను, అపోహలతోను ఉన్న ఒక బాధితురాలని ఆయన తలంచాడు. అది నిజమే. ఆమె తప్పుడు అభిప్రాయాన్ని కలిగివుంది. మేమా సాయంకాలం ఎంతో ఆనందించాము, ఆయన భార్య మన గురించి, మన పని గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి, వాటికి వివరంగా జవాబిచ్చేందుకు మమ్మల్ని అనుమతించింది. మరుసటి రోజు ఆయన ఫోను చేసి తన భార్య నన్ను, నా భార్యను కలిసినందుకు చాలా సంతోషించిందని, మేము చాలా మంచి వ్యక్తులమని ఆమె అనుకుంటుందని చెప్పాడు.

“నేను మిస్టర్‌ డోమింగెస్‌ వద్దకు క్రమమైన సందర్శనాలు చేయడాన్ని కొనసాగించాను, మరి ఆయన బైబిలునందు లోతైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఆయన నాతో ఇలా అన్నాడు: ‘గ్రేటర్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం నందలి అన్ని రోటరీ క్లబ్బుల ప్రోగ్రామ్‌ ఛైర్మెన్‌లను కలసి, మా క్లబ్బులో ఇచ్చినటువంటి ప్రసంగాన్నే వారి క్లబ్బులలో ఇచ్చేందుకు ప్రతిపాదించమని మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను వెనుకాడను. మీరు నా పేరును అక్కడ ఉపయోగించవచ్చును, వారు నన్ను సంప్రదించినప్పుడు మీరు గెస్ట్‌ స్పీకర్‌గా ఆహ్వానించబడేందుకు నేను మీ గురించి మంచి సిఫారసు చేయడానికి చాలా సంతోషిస్తాను.’

“రోటరీ క్లబ్బులు అంతర్జాతీయమైనవి. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగాను ఉన్న ఇతర క్లబ్బులు యెహోవాసాక్షులు తమ ప్రసంగాలను ఇచ్చేందుకు తమ ద్వారాలను తెరిచి ఉంచడం సాధ్యమేనా?”

[అధస్సూచి]

a 1989లో వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[17వ పేజీలోని చిత్రం]

మిస్టర్‌ డోమింగెస్‌, ఎడమ, మరియు సహోదరుడు అర్నెస్ట్‌ గరెట్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి