కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 10/8 పేజీలు 8-10
  • మీ జీవితంపై ఇప్పుడే నియంత్రణను సాధించండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితంపై ఇప్పుడే నియంత్రణను సాధించండి!
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు దృష్టి ఏమిటి?
  • అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన సహాయం
  • “దేవుని వాక్యము సజీవమును బలము గలదైయున్నది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఎవరు నిందార్హులు మీరా మీ జన్యువులా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?
    శ్రద్ధ కనపర్చే దేవుడు ఉన్నాడా?
  • నీవేమైయున్నావో నీవెలా మార్చుకోగలవు?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 10/8 పేజీలు 8-10

మీ జీవితంపై ఇప్పుడే నియంత్రణను సాధించండి!

మానవ ప్రవర్తనలో, ఉద్దేశంలో శాస్త్రీయ పరిశోధన మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను తెచ్చింది. దాని గురించిన మరింత లోతైన అవగాహన కలిగివుండడం ద్వారా అస్వస్థతను ఎదుర్కోవడానికి మనం బహుశ సహాయంపొంది ఉండివుండవచ్చు. అదే సమయంలో, సంచలనాత్మక సిద్ధాంతాలు, ప్రత్యేకంగా బాగా స్థిరపరచబడిన నియమాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపించే సిద్ధాంతాల విషయానికొచ్చే సరికి జాగ్రత్తగా ఉండడం వివేకవంతమైన పని.

జన్యుశాస్త్రం, ప్రవర్తన విషయాలపై ఉత్పన్నమయ్యే ప్రశ్నలు: మన బాధ్యతలను పరిత్యజించి, మన చర్యలకు ఏమాత్రం నిందను స్వీకరించకుండా ఉండగలమా? ఏదైనా వివేకరాహిత్యానికి లేక తప్పిదానికి బాధ్యత వహించకుండా వైదొలగి లేక చివరికి వేరొకరిని లేక వేరే దేనినైనా నిందించడం ద్వారా అసంఖ్యాకంగా పెరిగిపోతున్న “నేను కాదు” అనే తరంలో చేరగలమా? ఎన్నటికీ అలా చేయలేము? అనేకమంది ప్రజలు జీవితంలోని ఏ విజయానికైనా ఘనతను ఇష్టాపూర్వకంగా స్వీకరిస్తారు, అలాగే తమ తప్పులకు బాధ్యతను స్వీకరించడానికి వారెందుకు సుముఖంగా ఉండకూడదు?

అందువల్ల మనమిలా అడగవచ్చు: మన జీవితాలను ఎవరు నియంత్రిస్తున్నారు లేక ఏమి నియంత్రిస్తుందన్న దానిగురించి దేవుని వాక్యమైన బైబిలు ఏమి చెబుతుంది?

బైబిలు దృష్టి ఏమిటి?

మన ఆది తలిదండ్రులైన ఆదాము హవ్వల నుండి వారసత్వంగా పొందిన పాపంలో మనమందరం జన్మించామన్నది మనం గుర్తించాల్సిన వాటిలో మొదటి విషయం. (కీర్తన 51:5) దానికి తోడు, ప్రజలు “అపాయకరమైన కాలములు” అనుభవించే “అంత్యదినము”లు అని పిలువబడే ప్రత్యేక సమయంలో మనం జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1) సాధారణంగా మన పూర్వికుల కంటే మనం మన జీవితాలపై ఆరోగ్యకరమైన నియంత్రణను ఉంచడంలో ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటాము అని ఇది సూచిస్తుంది.

అయినప్పటికీ, మానవులందరూ తమ వ్యక్తిగత ఎంపికలు చేసుకోగలిగే స్వతంత్ర నైతిక ప్రతినిధులై ఉన్నారు. అంతమట్టుకు వారు తమ జీవితాలపై నియంత్రణ కలిగివున్నారు. తొలి కాలాల నుండి కూడా ఇది అలాగే ఉంది, మరి ఇది “మీరు ఎవని సేవించెదరో . . . నేడు మీరు కోరుకొనుడి” అని యెహోషువ ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన మాటల్లో కనబడుతుంది.—యెహోషువ 24:15.

అపవాదియైన సాతాను పరలోకం నుండి త్రోసివేయబడ్డాడని, క్రితమెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మానవజాతి అంతటిపై బలమైన చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాడని బైబిలు గుర్తిస్తుంది. అపొస్తలుడైన యోహాను దినాలలో కూడా లోకమంతా దుష్టుని శక్తి క్రింద పడియుందని అది మనకు చెబుతుంది. (1 యోహాను 5:19; ప్రకటన 12:9, 12) అయినప్పటికీ, మనం చేసే ప్రతి చర్యను సర్వశక్తిగల దేవుడు ఎలాగైతే నియంత్రించడో లేక కేవలం తాను మాత్రమే ఎరిగిన ముగింపుకు మనలను ఎలాగైతే పూర్వనిర్ణీతం చేయడో, అలాగే మనం చేసే ప్రతి పొరపాటుకు లేక వైఫల్యానికి నేరుగా సాతానుపై నిందను మోపకూడదు. సమతౌల్యమైన లేఖనాధార సత్యం ఏమంటే, ‘ప్రతివాడును తన స్వకీయమైన దురాశచే ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును.’ (యాకోబు 1:14, 15) అపొస్తలుడైన పౌలు ఈ ప్రేరేపిత మాటలను వ్రాస్తున్నాడు: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.”—గలతీయులు 6:7.

కనుక యెహోవా దేవుడు మన చర్యలకు మనలను వ్యక్తిగతంగా జవాబుదారులనుగా చేస్తాడు. మన జన్యు నిర్మాణం మూలాన మరియు వారసత్వంగా పొందిన అపరిపూర్ణతల మూలాన మనలను మనం సమర్థించుకోవడానికి ప్రయత్నించకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రాచీన సొదొమ గొమొఱ్ఱాల హింసాయుత, సలింగ సంయోగ సమాజాన్ని వారి భ్రష్ట చర్యలకు జవాబుదారులను చేశాడు. స్పష్టంగా, ఏదో ఊహాత్మక జన్యు దోషం వలన దుష్టులుగా ఉండక తప్పని జాలిపడవలసిన వారని లేక అభాగ్య జీవులని ఆ నివాసులను ఆయన పరిగణించలేదు. అదే రీతిలో, నోవహు దినాలలో జీవిస్తున్న ప్రజలు తమ చుట్టూ ఎన్నో దుష్ట ప్రభావాలు కలిగివున్నారు; అయినప్పటికీ, వారు త్వరలోనే సంభవించనున్న జల ప్రళయాన్ని తప్పించుకోవాలంటే వారొక ఎంపిక చేయవలసి ఉండిరి, ఒక వ్యక్తిగత నిర్ణయం. కొంతమంది సరైన ఎంపిక చేశారు. అనేకమంది చేయలేదు.

మనం దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే వ్యక్తిగత నియంత్రణ అవసరమని హెబ్రీ ప్రవక్త యెహెజ్కేలు దృఢపరుస్తున్నాడు: “అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.”—యెహెజ్కేలు 3:19.

అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన సహాయం

నిజమే, మన అనుదిన జీవితంలో వ్యక్తిగత నియంత్రణను ఉంచడంలో మనందరికీ సహాయం అవసరం, మరి మనలో చాలామందికి ఇది నిశ్చయంగా ఒక సవాలే. కానీ మనం నిరాశ చెందనక్కరలేదు. వారసత్వంగా వచ్చిన మన పాపపు స్వభావాలు దేవునికి అనంగీకృతమైనప్పటికీ, మనం మన ప్రవర్తనను సరిదిద్దుకోగోరితే అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన సహాయాన్ని—ఆయన పరిశుద్ధాత్మను మరియు ప్రేరేపిత సత్యాన్ని ఆయన మనకు దయ చేస్తాడు. మనకు ఏదైనా జన్యు సంబంధ ఉన్ముఖత ఉన్నప్పటికీ మరియు ప్రభావితం చేయగల బాహ్య ప్రాబల్యాలు ఉన్నప్పటికీ, “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ [మనం] పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించు[కోగలము].”—కొలొస్సయులు 3:9, 10.

కొరింథు సంఘంలో చాలామంది క్రైస్తవులు తమ ప్రవర్తనలో నాటకీయమైన మార్పులను చేసుకున్నారు. ప్రేరేపిత నివేదిక ఇలా చెబుతుంది: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.”—1 కొరింథీయులు 6:9-11.

కాబట్టి మనం మన అపరిపూర్ణతలతో పోరాడుతున్నట్లైతే, మనం వాటికి లొంగిపోకుండా ఉందాము. యెహోవా సహాయంతో ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు తమ మనస్సులు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందగలిగారని’ చాలామంది ఆధునిక దిన క్రైస్తవులు రుజువుచేశారు. వారు సత్యమైనవాటిని, న్యాయమైనవాటిని, పవిత్రమైనవాటిని, రమ్యమైనవాటిని, యోగ్యతగలవాటిని, మెప్పైనవాటిని తమ మనస్సులలో నింపుకుంటారు; మరి వారు ‘వాటిమీద ధ్యానముంచుకొంటారు.’ వారు చక్కని ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటారు, తద్వారా దాన్ని ఉపయోగించడం ద్వారా వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కల్గియుంటారు.—రోమీయులు 12:2; ఫిలిప్పీయులు 4:8; హెబ్రీయులు 5:14.

వారి పెనుగులాటలు, వారి తాత్కాలిక వైఫల్యాలు, మరి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో వారు తుదకు పొందే సాఫల్యాల గురించి తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మన ప్రవర్తనను మార్చుకోవడంలో తరచూ హృదయమూ దాని కోరిక ఇమిడి ఉంటాయని దేవుడు మనకు హామీనిస్తున్నాడు: “జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.”—సామెతలు 2:10-12.

అందువలన, నిరంతర జీవితాన్ని—దుష్ట లోకంలోని కష్టాలు లేని జీవితాన్ని, నిస్సత్తువను కలుగజేసే అపరిపూర్ణతల నుండి స్వేచ్ఛను—మీ జీవితపు గురిగా చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీ జీవితంపై నియంత్రణను సాధించడానికి ‘పోరాడండి,’ పరలోకపు జ్ఞానంచే నడిపింపును పొందండి. (లూకా 13:24) ఆశానిగ్రహ ఫలాన్ని ఫలించగల్గేలా మీరు యెహోవా పరిశుద్ధాత్మ సహాయాన్ని ఉపయోగించుకోండి. దేవుని నియమాలకు అనుగుణ్యంగా మీ జీవితాన్ని మార్చుకోవడాన్ని మీ హృదయాభిలాషగా చేసుకుని, ఈ సలహాను పాటించండి: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.” (సామెతలు 4:23) ఈ లోకంలో మీ జీవితాన్ని నియంత్రించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నింటికీ, యేసుక్రీస్తు విమోచన క్రయధన బల్యర్పణపై విశ్వాసం ఆధారంగా యెహోవా దేవుడు జన్యు సంబంధమైన లోపాలను సరిదిద్దే దేవుని నూతన లోకంలో “వాస్తవ జీవమును” అందిపుచ్చుకోవడం విలువైనదే!—1 తిమోతి 6:19; యోహాను 3:16.

[9వ పేజీలోని చిత్రం]

బైబిలు పఠించడం లోతుగా పాతుకుపోయిన బలహీనతలను అధిగమించడానికి

మనకు శక్తిని ఇవ్వగలదు

[9వ పేజీలోని చిత్రం]

బైబిలు పఠనం దేవుని నైతిక ప్రమాణాలకు నమ్మకంగా ఉన్నట్లు రుజువు చేసుకోవడానికి సహాయపడగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి