కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 8/8 పేజీలు 7-8
  • వంతెనలను కట్టేందుకు గోడలను పడగొట్టడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వంతెనలను కట్టేందుకు గోడలను పడగొట్టడం
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షుల్లో సాంస్కృతిక భిన్నత
  • సంభాషణను అడ్డగించే అడ్డుగోడలు
    తేజరిల్లు!—1996
  • ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • స్థానిక సంస్కృతి, క్రైస్తవ సూత్రాలు ఈ రెండూ పొసుగుతాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఓ భౌగోళిక గ్రామమైనప్పటికీ విభజింపబడి ఉంది
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 8/8 పేజీలు 7-8

వంతెనలను కట్టేందుకు గోడలను పడగొట్టడం

మనం ఏ కుటుంబంలో లేక ఏ దేశంలో పుట్టాలనేది మనం ఎంపిక చేసుకోలేదు, మన ఆలోచనా విధానాన్ని ఏ సంస్కృతి రూపుదిద్దాలో కూడా మనం నిర్ణయించుకోలేదు. అలాంటి విషయాలను మనం అదుపు చేయలేదు. మనందరం కూడా సమయానికి, పరిస్థితులకు లోబడి ఉన్నాం. కాని మనం ఇతరులను ఎలా దృష్టిస్తాం మరియు మనం వారితో ఎలా ప్రవర్తిస్తాం అనే విషయాలను మాత్రం మనం అదుపు చేయవచ్చు.

మనం దాన్నెలా చేయగలమో బైబిలు వివరిస్తుంది. మన పూర్వచరిత్రకు భిన్నంగా ఉండేదానికి చెందినవారితో సంభాషణా వంతెనలను నిర్మించేందుకు సహాయం చేసే కొన్ని సూత్రాలను పరిశీలించండి.

‘జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు . . . యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించెను.’ (అపొస్తలుల కార్యములు 17:24, 26) మనందరం కూడా ఒకే మానవకుటుంబానికి చెందిన వాళ్లం, కాబట్టి మనకు ఒకే విధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఒకే విధంగా ఉన్న విషయాలను చూడటం సంభాషణను సులభతరం చేస్తుంది. మనందరికీ మంచి స్నేహితులు కావాలి, ప్రేమింపబడినట్లు మరియు గౌరవింపబడినట్లు భావించాల్సిన అవసరముంది. ప్రతి ఒక్కరూ భౌతిక మరియు భావోద్రేక బాధను నివారించాలని కోరుకుంటారు. అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలూ సంగీతాన్ని మరియు కళను ప్రేమిస్తారు, హాస్యోక్తులు చెబుతారు, ఒకరి ఎడల ఒకరు మర్యాదపూర్వకంగా ఉండటంలో విశ్వాసముంచుతారు మరియు సంతోషంగా ఉండేందుకు మార్గాలను వెదుకుతారు.

‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచునుండవలెను.’ (ఫిలిప్పీయులు 2:3) ఇతరులు ప్రతి విషయంలోనూ మనకంటే ఉన్నతులని భావించాలని చెప్పడంలేదు. బదులుగా, జీవితంలోని కొన్ని ప్రాంతాల్లో ఇతరులు మనకంటే ఉన్నతంగా ఉంటారని మనం గుర్తించాలి. కేవలం మనం లేక మన సంస్కృతి అన్ని విషయాల్లో మంచి అని మనం ఎన్నడూ తలంచకూడదు.

“కాబట్టి మనకు సమయము దొరికినకొలది అందరియెడల . . . మేలు చేయుదము.” (గలతీయులు 6:10, ఇటాలిక్కులు మావి.) ఇతరుల సాంస్కృతిక పూర్వచరిత్ర ఏదైనప్పటికీ వారితో స్నేహపూర్వకంగా మరియు వారికి సహాయం చేసే వారిగా ఉండేందుకు చొరవ తీసుకోవడం, సంభాషణకుగల అగాధాన్ని అధిగమించేందుకు ఎంతో చేయగలదు.

“నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:19, ఇటాలిక్కులు మావి.) మంచి సంభాషకులు మాట్లాడటం కంటే ఎక్కువే చేయాలి; వారు తదనుభూతితో వినేవారై ఉండాలి.

“నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” (సామెతలు 20:5, ఇటాలిక్కులు మావి.) ఒక వ్యక్తి యొక్క పైపైన కనబడే ప్రవర్తన క్రిందనున్న భావాలను మరియు వివాదాలను గ్రహించేందుకు చురుకుగా ఉండండి. ప్రజల గురించి ఎక్కువగా తెలుసుకోండి.

“మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” (ఫిలిప్పీయులు 2:4, ఇటాలిక్కులు మావి.) ఎదుటి వ్యక్తి దృక్కోణం నుండి విషయాలను చూడటం ద్వారా తదనుభూతి చూపే వారిగా ఉండండి. నిస్వార్థంగా ఉండండి.

యెహోవాసాక్షుల్లో సాంస్కృతిక భిన్నత

ఈ సూత్రాలు వాస్తవంగా పని చేస్తాయనే విషయం, భూమ్మీది 232 దేశాల్లో క్రియాశీలులైవున్న యెహోవాసాక్షుల విశేషమైన ఐక్యతలో గోచరమౌతోంది. వీరు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన ప్రజలు, మరియు అన్ని విషయాల్లోనూ యెహోవా యొక్క ప్రేమపూర్వక నడిపింపుకు అనుగుణంగా ఉండాలని వారు తీర్మానించుకున్నారు.—ప్రకటన 7:9; 1 కొరింథీయులు 10:31-33.

వ్యక్తులుగా సాక్షులు ఇతరుల సంస్కృతిని ఉపేక్షించరు. సాక్షులైన వారు తాము ఏ సంస్కృతిలో పెంచబడ్డారో అది బైబిలులోని సూత్రాలతో ఏకీభవించినంత వరకూ దాన్ని తృణీకరించరు. అలా ఏకీభవించని సందర్భాల్లో వారు తమ జీవితాల్లో మార్పులు చేసుకుంటారు. ప్రతి సంస్కృతిలోనూ మెచ్చుకోదగిన విషయాలు ఉన్నాయని మరియు సత్యారాధనను అంగీకరించిన వారిలో అవి మరింత శ్రేష్ఠమయ్యాయని కూడా వారు గుర్తిస్తారు.

మన గ్రహం తేజోవంతంగా, నీలి రంగులో మెరుస్తూ అంతరిక్షంలో అందంగా పరిభ్రమిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగానే తామూ దాన్ని చూడాలని వారు ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన వైవిధ్యంగల ప్రజలు మరియు సంస్కృతులుగల గ్రహమిది. భూమిపై ఉన్న వారందరూ వాస్తవంగా ఐక్య కుటుంబంగా జీవాన్ని ఆనందించగల సమయం కొరకు యెహోవాసాక్షులు ఎదురుచూస్తున్నారు.

[8వ పేజీలోని చిత్రం]

సాంస్కృతిక అడ్డంకులను ఎలా పడగొట్టాలో యెహోవాసాక్షులు నేర్చుకున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి