కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 8/8 పేజీలు 3-4
  • ఓ భౌగోళిక గ్రామమైనప్పటికీ విభజింపబడి ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓ భౌగోళిక గ్రామమైనప్పటికీ విభజింపబడి ఉంది
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజలు ఒకరినొకరు కలుసుకోవడం
  • ప్రజలు విభజింపబడి ఉండేందుకుగల కారణాలు
  • జాతి విద్వేషం సమర్థనీయమా?
    తేజరిల్లు!—2003
  • జాతివివక్షకు పరిష్కారం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • వంతెనలను కట్టేందుకు గోడలను పడగొట్టడం
    తేజరిల్లు!—1996
  • సంభాషణను అడ్డగించే అడ్డుగోడలు
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 8/8 పేజీలు 3-4

ఓ భౌగోళిక గ్రామమైనప్పటికీ విభజింపబడి ఉంది

నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

ఓ జాతి ప్రజలకు నోరు ఉండేది కాదు గనుక వారు తినలేరు, త్రాగలేరని చెప్పబడిన కథలు మీరు ఎప్పుడైనా విన్నారా? వారు వాసన పీల్చుకోవడం ద్వారా, చాలా మట్టుకు ఆపిళ్ల వాసన పీల్చుకోవడం ద్వారా బ్రతికే వారని చెప్పబడేది. ఏదైనా చెడువాసన వారిని చంపగలదు.

బంగారంతో వ్యాపారం చేసే పశ్చిమాఫ్రికా ప్రజలను గురించిన కథలు కూడా ఉండేవి. ఆ కాలంలోని, పోర్చుగల్‌కు చెందిన ఓడ నాయకుడు ఇలా నివేదిస్తున్నాడు: “[మాలి] రాజ్యానికి అవతల రెండు వందల లీగుల (ఒక లీగు సుమారు మూడు మైళ్ల దూరం) దూరాన ఓ దేశం ఉంది, అందులోని నివాసులకు కుక్క తలలు, కుక్క దంతాలూ ఉంటాయి, వారికి కుక్కల్లా తోకలు ఉంటాయి. నల్లజాతీయులైన వీరు సంభాషించేందుకు నిరాకరిస్తారు, ఎందుకంటే వారు ఇతర పురుషులను చూడడాన్ని ఇష్టపడరు.” అనేక సంవత్సరాల క్రితం, ప్రయాణ మరియు ఆవిష్కరణ యుగానికి ముందు ప్రజలు కలిగి ఉండిన కొన్ని విచిత్ర ఆలోచనలు అవి.

ప్రజలు ఒకరినొకరు కలుసుకోవడం

శతాబ్దాలుగా ప్రజలు అలాంటి కథలు నిజమని నమ్మేవారు. అయితే అన్వేషకులు గ్రహాన్ని అన్వేషించిన తర్వాత, ఆపిళ్లను వాసన చూసే నోరు లేని వారిని, కుక్క తల ఉన్న ప్రజలనూ వారు కనుగొనలేదు. మన పొలిమేరలకు అవతల జీవించే వారి విషయాలు నేడు మనకు అంత గుప్తంగా లేవు. ప్రపంచం ఓ భౌగోళిక గ్రామమైంది. దూరదర్శిని విదేశీ ప్రాంతాలను, ప్రజలను మన ఇళ్లల్లోకి తెస్తుంది. ఆ ప్రాంతాలను కొన్ని గంటల్లో చేరడానికి విహంగ యానం వీలు కలిగిస్తుంది; ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ప్రజలు అలా ప్రయాణిస్తున్నారు. ఇతరులు ఆర్థిక లేక రాజకీయ కారణాల వలన వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యొక్క నివేదిక ఒకటి ఇలా పేర్కొంటుంది: “చరిత్రలో పూర్వం తెలియని సంఖ్యల్లో—ఆ సంఖ్య తప్పక పెరగవచ్చు—ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మేలైన జీవితం కొరకు వెదుకుతూ తమ స్వస్థలాల నుండి వేరే స్థలాలకు వెళ్తున్నారు.” దాదాపు పది కోట్లమంది తాము జన్మించిన దేశానికి వెలుపల జీవిస్తున్నారు.

దేశాలు ఆర్థికపరంగా పరస్పరం ఆధారపడటం అధికమౌతోంది. ఒక భౌగోళిక సంభాషణా సంసక్తిజాలం, ఓ అతి పెద్ద కేంద్ర నాడీ మండలంవలె భూమిపైనున్న ప్రతి దేశాన్నీ జోడిస్తుంది. ఆలోచనలను, సమాచారాన్ని మరియు సాంకేతికతను ఇచ్చిపుచ్చుకుంటుండగా, ఒకరి సంస్కృతితో మరొకరి సంస్కృతి కలిసిపోతాయి, ఒకదానిలోని అంశాలను మరొకటి స్వీకరిస్తుంది. మరెన్నటికంటే నేడు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకేలా దుస్తులు ధరిస్తున్నారు. ప్రపంచంలోని నగరాలన్నీ, పోలీసులు, ఆధునాతన హోటళ్లు, ట్రాఫిక్‌, దుకాణాలు, బ్యాంకులు, కాలుష్యం వంటి ఒకే విధమైన విశేషతలను కలిగి ఉన్నాయి. అలా, ప్రపంచ ప్రజలు ఒకరికొకరు దగ్గరౌతుండగా, ప్రపంచ సంస్కృతి అని కొందరు వర్ణించే దాన్ని మనం చూస్తాం.

ప్రజలు విభజింపబడి ఉండేందుకుగల కారణాలు

ప్రజలు, సంస్కృతులు పరస్పరం కలగలిసిపోయినప్పటికీ, అందరూ ఒకరినొకరు సహోదరులుగా పరిగణించరన్నది స్పష్టమౌతుంది. “ప్రతి ఒక్కరూ పరదేశిని నిందించడానికి సిద్ధంగా ఉంటారు” అని ఒక గ్రీకు నాటక రచయిత 2,000 సంవత్సరాల పూర్వం వ్రాశాడు. నేడు కూడా అదే వాస్తవమన్నది దుఃఖకరమైన విషయం. మూఢ దురభిమానం, విదేశీయులను ద్వేషించడం, “జాతిప్రక్షాళన,” తెగల మధ్య కలహాలు, మతపరమైన గొడవలు, పౌరుల ఊచకోత, చంపుకునే ప్రాంతాలు, మానభంగ శిబిరాలు, పీడించడం లేక జాతి సంహారాల వంటివాటిని గురించిన వార్తాపత్రికల నివేదికల్లో దానికి రుజువును సులభంగా కనుగొనవచ్చు.

జాతుల మధ్య గొడవలను రూపుమాపేందుకు మనలో అత్యధికులం చాలా తక్కువ చేయగలమన్నది నిజమే. మనం దానికి సూటిగా కూడా గురై ఉండకపోవచ్చు. అయితే మనలో చాలామందికి మనం కలుసుకునే మన పొరుగువారు, మన తోటి ఉద్యోగస్థులు లేక తోటి విద్యార్థులు అయిన విదేశీయులతో సంభాషించే విషయంలో సమస్యలు వస్తాయి.

భిన్నమైన జాతులకు చెందిన ప్రజలు ఒకరినొకరు నమ్మడం, ఇష్టపడటం చాలా తరచూ కష్టమైన విషయంగా భావిస్తారన్నది విచిత్రంగా లేదా? ఎంతైనా మన గ్రహం అపరిమితమైన భిన్నతలు, అంతంలేని విశేషాలుగలది. మనలో అత్యధికులం వివిధ రకాలైన మంచి ఆహారాన్ని, సంగీతాన్ని, రంగులను అలాగే అనేక రకాల చెట్లు, పక్షులు మరియు జంతువులను ఇష్టపడతాం. అయితే ఎందుకోగానీ విభిన్నతను మనం ఇష్టపడిన విధంగానే, మనవలె ఆలోచించని మరియు ప్రవర్తించని ప్రజలను మనం అన్ని వేళలా ఇష్టపడము.

ప్రజలలోని భిన్నత్వం యొక్క అనుకూల అంశాల వైపు చూసే బదులు, అనేకులు ఆ తేడాలపై ధ్యానముంచేందుకు మొగ్గుచూపుతారు, ఆ తేడాలవలన విభజన ఏర్పడేలా చేస్తారు. ఎందుకలా? వేరే సంస్కృతికి చెందిన వారితో సంభాషించేందుకు ప్రయత్నించడంలో ఏ ప్రయోజనం ఉంది? సంభాషణకుగల అడ్డుగోడలను పడగొట్టి వాటి స్థానంలో వంతెనలను మనం ఎలా కట్టగలం? ఈ తదుపరి శీర్షికలు ఆ ప్రశ్నలకు జవాబులిస్తాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి