కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 5/8 పేజీలు 8-11
  • త్వరలోనే యుద్ధంలేని లోకం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • త్వరలోనే యుద్ధంలేని లోకం
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శాంతిని ప్రేమించే వారికి ఆహ్వానం
  • “అంత్యదినములలో”
  • యుద్ధంలేని లోకం
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • భూమ్మీద శాంతి సాధ్యమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు
    తేజరిల్లు!—1999
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 5/8 పేజీలు 8-11

త్వరలోనే యుద్ధంలేని లోకం

యెషయాలోని బైబిలు ప్రవచనాన్ని మరలా ఒకసారి చూడండి: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” ఆ సందర్భాన్నిబట్టి అలా తమ కత్తులను నాగటి నక్కులుగా సాగగొట్టేవారు దేవుని త్రోవలో నడిచే “అనేకమంది ప్రజలు” అని గమనించండి. (యెషయా 2:2-4, కింగ్‌ జేమ్స్‌వర్షన్‌) దీనర్థం ప్రజలు యెహోవా దేవున్ని ఆరాధించి ఆయన నియమాలకు విధేయులౌతారు. వారెవరు?

వారు కేవలం యుద్ధాయుధాలను నిరాకరించిన వారు మాత్రమే కాదుగానీ వారు తమ మనస్సుల్లోనుండి హృదయాల్లోనుండి, విరోధం కొట్లాటలకు నడిపించగల దృక్పథాలను వైఖరులను వారి మనస్సులనుండి తీసివేసేందుకు ప్రయత్నించే బహుళజాతి ప్రజలు. (రోమీయులు 12:2) వారు తమ పొరుగువారిని చంపే బదులు వారిని ప్రేమిస్తారు. (మత్తయి 22:36-39) అలాంటి ప్రజలను గూర్చి మీరెప్పుడైనా విన్నారా?

బహుశ యెహోవాసాక్షులు అంతర్జాతీయ సహోదరత్వాన్ని అనుభవిస్తున్నారని, ఇతరులను చంపేందుకు ఆయుధాలను చేపట్టడాన్ని నిరాకరించారని మీరు విని ఉండవచ్చు. దీనిగూర్చి ఆలోచించండి: ఈ భూమ్మీద ఉన్న వారందరూ ఈ దృక్పథాన్ని కల్గివుంటే ఈ గ్రహం ఇప్పటికే శాంతి భద్రతల నిలయమై ఉండేదికాదా?

నిస్సందేహంగా, అందరికీ ఆ దృక్పథం లేదు. ఇది 3,000 సంవత్సరాల క్రితం రాజైన సొలొమోను వ్రాసినట్లుగా ఉంది: “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయక్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.”—ప్రసంగి 4:1.

శాంతిని ప్రేమించే వారికి ఆహ్వానం

యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? ఉంటుంది. అది మానవుల ప్రయత్నాలవల్ల వస్తుందా? రాదు. ప్రజలను సత్యారాధనలోకి గుంపులు గుంపులుగా మతమార్పిడి చేయడం వల్ల వస్తుందా? రాదు. బైబిలు పుస్తకమైన కీర్తన ఇలా జవాబిస్తోంది: “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. . . . ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—(ఇటాలిక్కులు మావి.) కీర్తన 46:8, 9.

యెహోవా దాన్నెలా చేస్తాడు? సామెతల పుస్తకం ఇలా జవాబు చెబుతోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు [దేవుని నియమాలను అలక్ష్యంచేసేవారు] దేశములో ఉండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికి వేయబడుదురు.”—సామెతలు 2:21, 22.

దేవుడు ఇంతకుముందు చర్యతీసుకోకపోయేందుకు కారణముంది: వారు ఆయన త్రోవలో నడిపించేట్లుగా తన మార్గాలను గూర్చి ప్రజలు నేర్చకునే అవకాశాన్ని ఆయన వారికిచ్చాడు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడైయున్నాడు.” (2 పేతురు 3:9) ఆ విధంగా, దేవుని ప్రజలు యెహోవాను గూర్చి తెలుసుకునేందుకు ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేస్తారు. యెషయా దాన్ని వ్యక్తపర్చినట్లుగా, వారు ఇలా ఎలుగెత్తి పిలుస్తారు: “యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును.”—యెషయా 2:3.

“అంత్యదినములలో”

“అంత్యదినములలో” శాంతి మార్గములో ప్రజలకు బోధించే పని జరుగుతుందని కూడా యెషయాలోని లేఖనం ప్రవచించింది. (యెషయా 2:2) మనం ఇప్పుడు ఆ కాలంలోనే జీవిస్తున్నాము. ఈ శతాబ్దంలోని యుద్ధాలు మనం ఆ కాలంలో ఉన్నామని సూచిస్తున్నాయి.

ఈ విధానాంతాన్ని సూచించే విషయాలేవని యేసు శిష్యులు ఆయనను అడిగినప్పుడు, “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును” అని ముందుగా చెప్పాడు. (లూకా 21:11; మత్తయి 24:3) ఆయన, “మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను—జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.”—లూకా 21:9, 10.

కొన్ని వేల సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నప్పటికీ, ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు, కొందరి లెక్కల ప్రకారం అక్షరార్థంగా వేలకొలది చిన్న యుద్ధాలు జరిగాయి. ఈ శతాబ్దంలో కోట్లమంది ప్రజలు చంపబడ్డారన్న వాస్తవం భయభ్రాంతులను చేస్తుంది. వరల్డ్‌ వాచ్‌ పత్రిక ప్రకారం, 20వ శతాబ్దానికి ముందు 2,000 సంవత్సరాలకు పూర్వం యుద్ధాల్లో పది లక్షలమంది ప్రజలు మరణించేందుకు సగటున యాభై సంవత్సరాలు పట్టింది. ఈ శతాబ్దంలో, పది లక్షలమంది ప్రజలు యుద్ధాల్లో మరణించేందుకు సగటున ఒక్క సంవత్సరమే పట్టింది.

యుద్ధంలేని లోకం

బైబిలు ప్రవచనంలో చెప్పబడిన అనేక ఇతర సంఘటనలతో సహా ఘోరమైన యుద్ధాలు మన శతాబ్దంలో సంభవించడం, మనం దేవుడు చేసే నూతన లోకపు వాకిటనే ఉన్నామని కనుపరుస్తున్నాయి. ప్రాచీన లోకపు అల్లకల్లోల స్థితి తీసివేయబడి దాని స్థానే శాంతి ఉండే “నూతన భూమి” చోటుచేసుకుంటుంది. (2 పేతురు 3:13) దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.”—కీర్తన 37:9, 11.

భూవ్యాప్తంగా నేడు కోట్లాదిమంది యుద్ధంలేని లోకం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి ఓ నూతన లోకాన్ని సృష్టిస్తానని చేసిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తానని చూపేందుకు, దేవుని ప్రవక్తలలో ఒకరు చాలాకాలం క్రితం ఇలా వ్రాశారు: “ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.

కనుక, జ్ఞానయుక్తంగా దేవునియందు ఆయన చేసిన వాగ్దానమందు మీ విశ్వాసం ఉంచండి, అదిలా ఉంది: ‘దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయెను.’—ప్రకటన 21:3, 4.

[9, 10వ పేజీలోని బాక్సు]

బైబిలు ఆ నూతన లోకమును గూర్చి ఇలా వాగ్దానం చేస్తోంది:

నేరము, దౌర్జన్యము లేదా దుష్టత్వం ఉండవు

“[దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.

“కీడు చేయువారు నిర్మూలమగుదురు . . . ఇక కొంత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు.”—కీర్తన 37:9, 10.

మానవజాతియంతా శాంతితో ఉంటుంది

‘మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముమీద రాజ్యభారముండును. . . . సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును.’—యెషయా 9:6, 7.

భూమియంతా పరదైసుగా మారుతుంది

యేసు ఇలా అన్నాడు: ‘నీవు నాతోకూడా పరదైసులో ఉందువు.’—లూకా 23:43.

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

ప్రపంచ వ్యాప్తంగా ప్రేమగల సహోదరత్వం

“దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

మరణించిన మన ప్రియమైన వారి పునరుత్థానము

“ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.

రోగము, వృద్ధాప్యము లేదా మరణము ఉండవు

‘ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించి పోయెను.’—ప్రకటన 21:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి