కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 1/8 పేజీలు 8-11
  • మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీతియుక్తమైన నూతన లోకంలో జీవితం
  • నిరంతర జీవితానికి అర్హత పొందడం
  • శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
    శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
  • “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
    “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 1/8 పేజీలు 8-11

మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు

యేసుక్రీస్తు ప్రజలందరూ ఒకరినొకరు ప్రేమించే కాలాన్ని గురించి తన కొండమీద ప్రసంగములో చెప్పాడు. తను మాట్లాడడానికి ముందు 37వ కీర్తనను ఎత్తిచెబుతూ, ఈ విధంగా చెప్పాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” ఈ అద్భుతకరమైన పరిస్థితి ఎలా నెరవేరుతుందో కూడా బైబిలులోని కీర్తన వివరిస్తుంది: “కీడు చేయవారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5; కీర్తన 37:9.

ఎంతటి అసాధారణమైన మార్పో కదా అది—కీడుచేయువారందరూ భూమిపై నుండి తీసివేయబడి ఒకరినొకరు ప్రేమించే ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు! ఇదసలు ఎలా జరుగగలదు? ఎలాగో, ప్రఖ్యాతిగాంచిన కొండమీది తన ప్రసంగంలో యేసు మనకు నేర్పించిన ప్రార్థనలో చూపించాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని నేర్పించాడు. (మత్తయి 6:9, 10) దేవుని చిత్తం ఎక్కడ నెరవేరాలనే దానిని గమనించండి. కేవలం పరలోకమందే కాదు. “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదనూ నెరవేరుగాక అని మనం ప్రార్థన చేస్తామని,” క్రిస్టియన్‌ సెంచరీ నొక్కిచెప్పింది.

అలాగైతే, యేసు మనకు నేర్పించిన ప్రార్థనలోని దేవుని రాజ్యం ఏమిటి? ఖచ్చితంగా, అది పరలోకం నుంచి పరిపాలించే నిజమైన ప్రభుత్వమై ఉంది. అందుకే అది “పరలోకరాజ్యము” అని పిలువబడింది. (మత్తయి 10:7) ఈ రాజ్యానికి లేక ప్రభుత్వానికి నియమిత రాజు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు.

దేవుని ప్రవక్తయైన యెషయా యేసు మరియకు జన్మించకపూర్వమే, జరగబోయే అద్భుతకరమైన సంఘటన గురించి ముందుగనే చెప్పి, చివరికి ఏమి జరుగుతుందో కూడా చెప్పాడు: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. అశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును.” (యెషయా 9:6, 7) మరణ పునరుత్థానాల తర్వాత, యేసు పరలోకంలో తన తండ్రితోపాటు సింహాసనంపై కూర్చుని రాజుగా పరిపాలన చెయ్యమనే ఆజ్ఞను పొందేంతవరకు వేచి ఉన్నాడు.—కీర్తన 110:1, 2; హెబ్రీయులు 10:12, 13; ప్రకటన 11:15.

అయితే చివరికి ద్వేషభరితమైన ఈ లోకానికి ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నకి బైబిలు ఏమి సమాధానమిస్తుందో గమనించండి. దేవుని ప్రవక్తయైన దానియేలు ఇలా ప్రవచించాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

మానవ వ్యవహారాల్లో జరుగబోతున్న గొప్ప మార్పును బైబిలు ప్రవచనం స్పష్టంగా సూచిస్తుంది. ఎవరైతే దేవుని పరిపాలనకు లోబడకుండా మొండిగా నిరాకరిస్తారో వారితో సహా ఈ లోక విధానమంతా భూమిపై నుండి నిర్మూలించబడుతుంది ! దాని స్థానంలోకి ఏమి వస్తుందో చూడండి.

నీతియుక్తమైన నూతన లోకంలో జీవితం

పాత లోకం గతించేటప్పుడు, తప్పించబడేవాళ్ళు ఉంటారు. బైబిలు ఈ విధంగా వివరిస్తుంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:17) అవును, ఎలాగైతే నోవహు అతని కుటుంబము వారి కాలములో వచ్చిన అంతాన్నుంచి తప్పించబడ్డారో అలాగే ఇప్పుడు కూడా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వారు నూతన లోకములోకి తప్పించబడతారు. అపొస్తలుడైన పేతురు ఈ విధంగా వ్రాస్తున్నాడు: “అయినను మనమాయన [దేవుని] వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (ఇటాలిక్కులు మావి.)—2 పేతురు 3:5-7, 11-13.

కేవలం దేవుని రాజ్యం మాత్రమే పరిపాలనను కొనసాగించే కాలాన్ని గురించి బైబిలు ఈ విధంగా వాగ్దానం చేస్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) పరిశుభ్రపరచబడిన భూమిమీద నీతిమంతులు జీవితాన్ని సంతోషంతో అనుభవిస్తారు. అది ఎంత సంతోషకరమైన సమయమై ఉంటుందోకదా! దీనిని మీరు ఇప్పటివరకు గుర్తించకపోతే, ముందటి పేజీలలోని చిత్రాల్లో ఉన్న, బైబిల్లో వర్ణించబడిన ఆశీర్వాదాలను దయచేసి పరిశీలించండి.

మన సృష్టికర్త తన ఆరాధకుల ప్రయోజనార్థమై వాగ్దానం చేసిన అద్భుతకరమైన విషయాలను తెలుసుకుని మన హృదయాలు ఉప్పొంగవా? ఖచ్చితంగా, మొదటి మానవ జంటని సృష్టించి వారిని భూపరదైసులో ఉంచినప్పుడు దేవుని సంకల్పం ఇదే! దేవుడు వారితో ఏమి చెప్పాడో చూడండి: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.”—ఆదికాండము 1:27, 28.

ఆదాము హవ్వలు పిల్లల్ని కని, వారు పెద్దయ్యేకొలది భూమిని పరదైసుగా మార్చే పనిలో సంతోషకరమైన భాగాన్ని కల్గివుండేవారు. మానవ కుటుంబము సంఖ్యాపరంగా పెరిగే కొలది ఏదెను తోట యొక్క సరిహద్దులను పెంచడంలో ఉన్న ఆనందాన్ని గురించి ఆలోచించండి! ఖచ్చితంగా, భూమి అంతా పరదైసుగా మారాలనేదే దేవుని సంకల్పం. ఆయన సంకల్పం ఎప్పటికైనా నెరవేరుతుందా? ఆయన వాగ్దానం నెరవేరుతుందనే నిశ్చయతను మనం కల్గి ఉండవచ్చు, దేవుని సొంత వాక్యము మనకి ఆధారం ఇస్తుంది! “నేను చెప్పియున్నాను. . . దాని నెరవేర్చెదను” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.—యెషయా 46:11; 55:11.

ముందటి పేజీలలో ఉన్న లేఖనాల్లోని వివరణలను బట్టి భూపరదైసులో నిరంతర జీవితాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారా? అక్కడ నిరంతరం జీవించడానికి అందరూ అనుమతించబడరు. దానికి అర్హతలు అవసరం. అవి ఏమిటి?

నిరంతర జీవితానికి అర్హత పొందడం

మొట్టమొదటిగా, దేవుని నూతనలోకంలో జీవించాలనుకొనేవాళ్ళు తప్పక దేవుడు మనకు చేయమని నేర్పించిన విధంగా ఒకరినొకరు ప్రేమించడాన్ని నేర్చుకోవాలి. బైబిలు ఇలా చెబుతుంది: “మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.” (1 థెస్సలొనీకయులు 4:9) మనం ఈ విధంగా దేవుని చేత ఎలా నేర్పించబడ్డాము?

ప్రాముఖ్యంగా, ఆయన లిఖితవాక్యమైన బైబిలు ద్వారా నేర్పబడ్డాము. నిరంతరం జీవించాలంటే, బైబిలులో ఉన్న దేవుని బోధలను అంగీకరించాలని దీనర్థం. “బైబిలు వాగ్దానం చేస్తున్నట్లు మానవులందరూ ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకొని ఉండే సమయం కోసం ఎదురు చూస్తున్నాను” అని ఒక తూర్పు దేశంలోని బైబిలు విద్యార్థి అన్నాడు.

తన తండ్రికి చేసిన ప్రార్థనలో, ఒక ప్రాముఖ్యమైన అవసరాన్ని యేసు నొక్కి చెప్పాడు. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషూర్‌ ఈ జ్ఞానము పొందడానికి మీకు సహాయపడుతుంది. 32వ పేజీలో ఇవ్వబడిన కూపన్‌ను పూరించి 5వ పేజీలో ఇవ్వబడిన మీకు సమీపంలో ఉండే చిరునామాకుగానీ, Watch Tower, H-58, Old Khandala Road, Lonavla, Mah., India అనే చిరునామాకు గానీ పంపించి ఆ ప్రతిని పొందండి.

[8-10వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుడు వాగ్దానం చేస్తున్నవి

ప్రేమతో కూడిన ప్రపంచవ్యాప్త సహోదరత్వం

“దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

నేరము, యుద్ధము ఇక ఉండవు

“భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.”—సామెతలు 2:22.

“[దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.

తినడానికి చక్కని సమృద్ధియైన ఆహారం

“దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.

మానవులు, మృగాల మధ్య సమాధానం

“తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.”—యెషయా 11:6.

అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం తీసివేయబడతాయి

“[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:4.

మరణించిన మన ప్రియమైన వారికి భూ పునరుత్థానము

“ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని బయటికి వచ్చెదరు.” —యోహాను 5:28, 29.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి