కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 4/8 పేజీలు 6-8
  • నిరుద్యోగం ఎందుకు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిరుద్యోగం ఎందుకు?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్యకు కారణాలు
  • సామాజిక మహామారి
  • ఏవైనా పరిష్కారాలు కనుచూపుమేరలో ఉన్నాయా?
  • నిరుద్యోగ మహామారి
    తేజరిల్లు!—1996
  • నిరుద్యోగం నుండి స్వాతంత్ర్యం ఎప్పుడు మరియు ఎలా?
    తేజరిల్లు!—1996
  • యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
తేజరిల్లు!—1996
g96 4/8 పేజీలు 6-8

నిరుద్యోగం ఎందుకు?

కొన్ని దేశాల్లో అనేకమంది ప్రజలు అలుపు కలిగించే విధంగా ఎన్నో గంటలపాటు కష్టభరితమైన శారీరక కష్టం ద్వారా జీవనోపాధి సంపాదించుకొనేందుకు, తక్కువ మొత్తం కొరకు బహుశా ప్రమాదకరమైన ఉద్యోగాన్ని చేయడానికి కూడా ఒత్తిడి చేయబడుతున్నారు. ఇటీవల వరకు ఇతర దేశాల్లోని అనేకులు, ఒకసారి ఒక పెద్ద కంపెనీలో లేక ప్రభుత్వ నిర్వహణ క్రిందనున్న విభాగంలో ఉద్యోగం లభిస్తే, పదవీ విరమణ వరకు తమకు సురక్షితమైన ఉద్యోగం ఉంటుందనే నిశ్చయత కలిగివుండేవారు. కాని నేడు, ఏ స్థాయిలోను కోరుకొనదగిన ఉద్యోగాన్ని, భద్రతను అందజేయగల వ్యాపారాలు లేక సంస్థలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకు?

సమస్యకు కారణాలు

తమకు కళాశాల పట్టా ఉన్నా లేకపోయినా, వేలాదిమంది యౌవనస్థులు తమ మొదటి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఉదాహరణకు, ఇటలీలో నిరుద్యోగులలోని మూడొంతుల కంటే ఎక్కువమంది 15 నుండి 24 ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లే. ఇప్పటికే పనిచేస్తూ, తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నవారి సగటు వయస్సు పెరుగుతూ ఉంటుంది, కాబట్టి యౌవనస్థులు తమ మొదటి ఉద్యోగాన్ని కనుగొనడం ఎంతో కష్టమౌతుంది. కార్మిక విపణిలో అత్యధిక సంఖ్యలోవున్న స్త్రీలలో కూడా, నిరుద్యోగం అధిక రేటులో ఉంది. గనుక, క్రొత్త పనివారితో కూడిన ఉత్తుంగ తరంగం ఇప్పుడు కార్మిక విపణిలో చేరడానికి పోరాడుతోంది.

మొదటి పారిశ్రామిక యంత్రాల కాలంనాటి నుండి, సాంకేతిక నూత్నకల్పన పనివారి అవసరతను తగ్గించివేసింది. సుదీర్ఘమైన, కష్టభరితమైన వంతువారీ పద్ధతుల్లో పనిచేయవలసి రావడం మూలంగా, యంత్రాలు తమ పనిని తగ్గించగలవని లేక తమకు పనేలేకుండా చేస్తాయనీ కార్మికులు నిరీక్షించారు. స్వయంచాలనం (ఆటోమేషన్‌) ఉత్పత్తిని పెంచి అనేక ప్రమాదాలను నిర్మూలించింది, కాని అది ఉద్యోగాలను కూడా తగ్గించింది. పనికి రాకుండా తయారయ్యేవారు క్రొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోతే, దీర్ఘకాల నిరుద్యోగానికి గురికావలసి ఉంటుంది.

వాణిజ్య ఉత్పాదనల పుష్కలతతో ముంచెత్తబడే ప్రమాదంలో మనం ఉన్నాము. మనం ఇప్పటికే అభివృద్ధి పరిధులను చేరామని కొందరు భావిస్తారు. అంతేగాక, తక్కువమంది ఉద్యోగస్థులుంటే తక్కువమంది కొనుగోలుదారులుంటారు. కాబట్టి మార్కెట్టు, వినియోగింపబడగలదానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తిలో ఉండగల పెరుగుదలను తట్టుకొనేందుకు నిర్మింపబడిన పెద్ద కర్మాగారాలు ఆర్థికపరంగా ఇక సామర్థ్యతలేక మూసివేయబడుతున్నాయి లేక మార్పుచేయబడుతున్నాయి. ఇలాంటి ధోరణులు నిరుద్యోగులుగా తయారయ్యేవారిని ఉత్పన్నం చేస్తాయి. ఆర్థిక క్షీణతలో, పనివారి కొరకైన అవసరం తగ్గిపోతుంది, ఆర్థిక క్షీణత కాలంలో కోల్పోవడం జరిగిన ఉద్యోగాలు వాణిజ్య విస్తరణ సమయాల్లో పునఃసృష్టించబడడం అరుదు. స్పష్టంగా, నిరుద్యోగానికి ఒకటికంటే ఎక్కువ కారణాలున్నాయి.

సామాజిక మహామారి

నిరుద్యోగం ఎవరిపైనైనా దెబ్బతీయగలదు గనుక అది ఒక సామాజిక మహామారి. ఇంకా పని చేస్తున్నవారి భద్రత కొరకు కొన్ని దేశాలు వివిధ యంత్రాంగాలను ఏర్పాటు చేస్తాయి ఉదాహరణకు, తక్కువ జీతంతో వారంలో తక్కువ గంటలు పనిచేయడం. అయితే ఇది, పని కొరకు చూస్తున్న ఇతరుల ఉత్తరాపేక్షలను పాడుచేస్తుంది.

ఉద్యోగ సంబంధిత సమస్యల గురించి ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతో తరచుగా నిరసనలు జరుపుతారు. నిరుద్యోగులు క్రొత్త ఉద్యోగాలను కోరితే, ఉద్యోగాలు ఉన్నవారు తమ స్వంత భద్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇవి ఎప్పుడూ అనురూపత కలిగివుండని రెండు ఉద్దేశాలే. “ఉద్యోగం గలవారు తరచూ అదనపు గంటలు పనిచేయడానికి ఆహ్వానింపబడుతున్నారు. ఉద్యోగం లేనివారు ఉద్యోగం లేకుండానే ఉండిపోతున్నారు. సమాజం రెండుగా విడిపోతుందేమోనన్న ప్రమాదం ఉంది. . . . ఒకవైపున అదనపు గంటలు పని చేసేవారుంటే, మరో వైపున దాదాపు పూర్తిగా ఇతరుల దయపై ఆధారపడివున్న నిరాకరింపబడిన నిరుద్యోగులున్నారు” అని ఇటలీ పత్రిక పనోరమ చెబుతుంది. యూరప్‌లో, ఆర్థికాభివృద్ధి ఫలాలను నిరుద్యోగుల కంటే, ఇప్పటికే పనిచేస్తున్నవారు ప్రాముఖ్యంగా అనుభవిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

అంతేగాక, నిరుద్యోగం స్థానిక ఆర్థిక స్థితితో సంబంధం కలిగివుంటుంది, కాబట్టి జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ వంటి కొన్ని దేశాల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య పెద్ద తేడాలుంటాయి. పనివారు క్రొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా లేక మరో ప్రాంతానికి లేక మరో దేశానికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారా? తరచూ ఇదొక నిర్ణయాత్మక అంశం కాగలదు.

ఏవైనా పరిష్కారాలు కనుచూపుమేరలో ఉన్నాయా?

ఎక్కువమేరకు, ఆర్థికాభివృద్ధిపై ఆశలు పెట్టుకోవడం జరుగుతుంది. కాని కొంతమంది ప్రజలు సంశయస్థులుగా ఉండి, అలాంటి అభివృద్ధి దాదాపు 2000వ సంవత్సరం వరకు రాదని తలస్తారు. ఇతరుల ఉద్దేశం ప్రకారం, పునరుద్ధరణ ఇప్పటికే ప్రారంభమయ్యింది, కాని ఇటలీలో ఉద్యోగాల విషయంలో ఇటీవల ఏర్పడిన క్షీణత స్పష్టం చేస్తున్నట్లుగా, ఫలితాలను తేవడంలో అది మందగిస్తోంది. ఆర్థికంగా కోలుకోవడమంటే నిరుద్యోగంలో తగ్గుదలనే కానవసరం లేదు. అభివృద్ధి పరిమితమై ఉన్నప్పుడు, వ్యాపారస్థులు ఇతర ప్రజలను చేర్చుకునే బదులు తమ వద్ద ఇప్పటికే ఉన్న ఉద్యోగస్థులను మరింతగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడతారు, అంటే “ఉద్యోగంలేని పెరుగుదల” ఉంటుంది. అంతేగాక, నూతన ఉద్యోగాలు సృష్టించబడడంకంటే త్వరగా నిరుద్యోగుల సంఖ్య తరచూ పెరుగుతుంది.

నేడు జాతీయ ఆర్థిక వ్యవస్థలు విశ్వవ్యాప్తీకరణకు గురౌతున్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వర్తక ఒప్పందం (ఎన్‌.ఏ.ఎఫ్‌.టి.ఏ.) మరియు ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకారం (ఏ.పి.ఇ.సి.) వంటి గొప్ప, నూతనమైన, జాతీయాతీత వర్తక ప్రాంతాలవంటివాటిని సృష్టించడం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నివ్వగలదని కొంతమంది ఆర్థికశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ధోరణి, ఎక్కడైతే పనివారి వేతనం తక్కువగా ఉంటుందో అక్కడే పెద్ద సంస్థలను స్థాపించుకోవడానికి వాటికి పురికొల్పునిస్తుంది, ఫలితంగా పారిశ్రామిక దేశాలు ఉద్యోగాలను కోల్పోతాయి. అదే సమయంలో, ఎక్కువ సంపాదనలేని పనివారు ఇప్పటికే తక్కువగా ఉన్న తమ రాబడి ఇంకా తగ్గిపోతున్నట్లు తెలుసుకుంటారు. అనేకదేశాల్లో, ఎంతోమంది ఈ వర్తక ఒప్పందాలకు వ్యతిరేకంగా చివరికి హింసాత్మకంగా ప్రదర్శనలు జరపడం కాకతాళీయమేమి కాదు.

నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి నిపుణులు అనేక ఉపాయాలు సూచిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, లేక పనివారే, ఇలా ఎవరు సూచించారనేదాని ఆధారంగా, కొన్ని పరస్పరం విరుద్ధంగా కూడా ఉంటాయి. పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా పనివారిని పెంచేందుకు కంపెనీలకు ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రతిపాదించేవారూ ఉన్నారు. ప్రభుత్వం అధికంగా జోక్యం చేసుకోవాలని కొందరు సలహా ఇస్తారు. వేరు వేరుగా పని విభజన చేసి, పని వేళలను తగ్గించాలని ఇతరులు సూచిస్తారు. కొన్ని పెద్ద కంపెనీలలో ఇది ఇప్పటికే జరుగుతోంది, పారిశ్రామిక దేశాలన్నింటిలో గత శతాబ్దంలో పనిచేసే గంటలను క్రమబద్ధంగా తగ్గించినప్పటికీ, నిరుద్యోగంలో ఏ విధమైన తగ్గుదల ఏర్పడలేదు. “ప్రయోజనాల కంటే ఖరీదులు ఎక్కువ కావడంతో, చివరికి ప్రతి పథకం ప్రభావం లేనిదౌతుంది” అని ఆర్థికశాస్త్రవేత్త రేనాటో బ్రూనెట్టా స్థిరంగా తెలియజేస్తున్నాడు.

“మనల్ని మనం మోసగించుకోకూడదు, సమస్య కష్టతరమైనది” అని ల’ఎస్‌ప్రెస్సో పత్రిక నిర్ధారిస్తుంది. పరిష్కరించలేనంత కష్టతరమైనదా? నిరుద్యోగ సమస్యకు పరిష్కారమేదైనా ఉందా?

[8వ పేజీలోని బాక్సు]

ఒక ప్రాచీన సమస్య

నిరుద్యోగం ఒక ప్రాచీన సమస్య. శతాబ్దాలుగా ప్రజలు అప్పుడప్పుడు అనైచ్ఛికంగా పనిలేకుండా ఉండేవారు. పెద్ద నిర్మాణ పనుల్లో ఉపయోగించుకొనబడిన వేలాదిమంది పనివాళ్లు ఒకసారి ఆ పని ముగిసిన తర్వాత, కనీసం మరో స్థలంలో వారికి పని దొరికే వరకు నిరుద్యోగులయ్యేవారు. వాస్తవంగా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో వాళ్లు అభద్రతాభావంతో ఉండేవారు.

మధ్యయుగాల్లో, “ఆధునిక భావంలోని నిరుద్యోగ సమస్య అప్పటికింకా ఉనికిలో లేకపోయినప్పటికీ,” నిరుద్యోగులుండేవారు. (లా డిసొక్కుపాజోనె నెల్లా స్టోర్యా [చరిత్రలో నిరుద్యోగం]) అయితే ఆ రోజుల్లో, పనిచేయని ఎవరైనా ప్రాముఖ్యంగా పనికిరానివారిగా లేక తిరుగుబోతులుగా పరిగణింపబడేవారు. 19వ శతాబ్దం వరకు కూడా అనేకమంది బ్రిటీషు విశ్లేషకులు, “నిరుద్యోగులను ప్రాముఖ్యంగా ‘రౌడీలతో,’ రాత్రుల్లో వీధులలో నిద్రించే లేక సంచరించే తిరుగుబోతులతో జతచేసేవారు” అని ప్రొఫెసర్‌ జాన్‌ బర్నెట్‌ వివరిస్తున్నాడు.—పనిలేని చేతులు.

19వ శతాబ్దాంతానికి లేక 20వ శతాబ్దారంభానికి “నిరుద్యోగాన్ని కనుగొనడం” జరిగింది. 1895లో, సమస్యను పరిశోధించి పరిష్కరించడానికి “ఉద్యోగ కొరత మూలంగా వచ్చిన దుఃఖం”పై ఏర్పర్చబడిన సెలెక్ట్‌ కమిటీ ఆఫ్‌ ది బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ వంటి ప్రత్యేక ప్రభుత్వ సంఘాలు స్థాపించబడ్డాయి. ఉద్యోగం లేకపోవడం సాంఘిక మహామారిగా తయారయ్యింది.

ఈ క్రొత్త జాగృతి ప్రాముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నాటకీయంగా పెరిగింది. వెర్రెత్తిన ఆయుధ ఉత్పత్తితో ఆ పోరాటం నిరుద్యోగాన్ని ఆచరణాత్మకంగా నిర్మూలించింది. కాని 1920వ దశాబ్దంతో ఆరంభమై, ప్రపంచంలోని పారిశ్రామికీకరింపబడిన అన్ని ఆర్థిక వ్యవస్థలపై దెబ్బతీసిన, 1929లో మొదలైన గొప్ప ఆర్థిక మాంద్యంతో పెరిగిపోయిన ఆర్థిక క్షీణతల పరంపరను పాశ్చాత్య ప్రపంచం ఎదుర్కొంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అనేక దేశాలు ఒక క్రొత్త ఆర్థిక విజృంభణను అనుభవించాయి, నిరుద్యోగం తగ్గిపోయింది. కాని, “నేటి నిరుద్యోగ సమస్య ఆరంభాలను 1960వ దశాబ్ద మధ్య భాగంలో కనుగొనవచ్చు” అని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చెబుతుంది. 1970వ దశాబ్దంలోని చమురు సంక్షోభం వలన మరియు కంప్యూటర్ల ఉపయోగం విస్తృతమవ్వడం మూలంగా ఏర్పడిన తాత్కాలిక మూసివేత వలన కార్మిక విపణికి క్రొత్త దెబ్బ తగిలింది. ఒకప్పుడు సురక్షితమైనవిగా పరిగణింపబడిన కార్యాలయ, కార్యనిర్వాహక రంగాలలోకి కూడా ప్రవేశిస్తూ నిరుద్యోగం నిర్విరామ పెరుగుదలను ఆరంభించింది.

[7వ పేజీలోని చిత్రం]

ఎక్కువ ఉద్యోగాలను కోరడం నిరుద్యోగ సమస్యను పరిష్కరించదు

[క్రెడిట్‌ లైను]

Reuters/Bettmann

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి